Vangaveeti
-
టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరుగార్చిన దద్దమ్మ..
-
‘వంగవీటి త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్, వంగవీటి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని, కానీ వంగవీటి రాధా టీడీపీలో చేరి సీఎం జగన్‌ని విమర్శించటం సరికాదని రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘2014లో సీటు ఇస్తే రాధా ఓడిపోయారు. 2019లో వేరే సీటు ఇస్తానని సీఎం జగన్ చెప్తే కాదని పార్టీ మారారు. అంతకుముందు వరకు నా తండ్రిని చంపినది టీడీపీ వారే అని చెప్పారు. ఇప్పుడేమో మాట మార్చి మాట్లాడుతున్నారు. వంగవీటి రంగా త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు. రంగా ఆశయం టీడీపీ పతనం. కానీ రాధా మాత్రం అదే టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరు గార్చారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజధాని అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు ఓట్లు వేయిస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయం ఉంటుందా?. .. వైఎస్సార్సీపీకి చెందిన కాపు మహిళలపై కమ్మ నేతలు దాడి చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదు?. తెనాలిలో గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?. జనసేనలోని వీర మహిళలకు ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు?. వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయాలి. జనసేనను చంద్రబాబుకు తాకట్టు పెట్టిన పవన్ కల్యాణ్‌ను గట్టిగా ప్రశ్నించాలి. .. ధవళేశ్వరం బ్యారేజి కట్టించిన కాటన్ దొరని ప్రజలు ఇప్పటికీ పూజలు చేస్తున్నారు. మరి హైదరాబాద్‌ని కట్టించానని చెప్పుకునే చంద్రబాబును ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు?. ఎందుకంటే.. చంద్రబాబు పచ్చి మోసగాడు, అబద్దాల కోరు అని తెలుసు కాబట్టే. సీఎం జగన్ ప్రజలకు మేలు చేసినందునే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు’’ అని వంగవీటీ నరేంద్ర అన్నారు. -
YSRCPలోకి చేరికలు
-
వైఎస్సార్సీపీలో చేరిన వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రోజురోజుకీ పార్టీలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్ పాల్గొన్నారు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లడం ఏంటి? పార్టీలో చేరిన అనంతరం వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికమంటూ మండిపడ్డారు. కూటమి ఏర్పడింది ప్రజలు కోసం కాదు.. వారి స్వార్థం కోసం. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ఏనాడూ ఆలోచించలేదు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లడం ఏంటి?. పవన్ వెంట కాపులెవరూ ఉండరు’’ అంటూ వంగవీటి నరేంద్ర తేల్చిచెప్పారు. -
రాధాకృష్ణ టీడీపీలో చేరడం బాధాకరం: వగవీటి నరేంద్ర
-
మరో రియల్ లైఫ్ క్యారెక్టర్లో...
‘వంగవీటి’ సినిమాలో వంగవీటి రంగా, వంగవీటి రాధా... రెండు పాత్రల్లో ఆకట్టుకున్న సాండీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాం. 1962 నుంచి 1972లలో విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఓయూ పరిణామాలు, జార్జ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రీ–ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. భారీ బడ్జెట్‌తో తెలుగు సినిమాల్లోనే ఒక డిఫరెంట్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తెలుగు నటులతో పాటు హిందీ, తమిళ, మలయాళ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తారు. తెలుగు, హిందీ భాషల్లో రానున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను త్వరలో విడుదల చేస్తాం. మరాఠీ సినిమా ‘సైరాట్’ కెమెరామన్ సుధాకర్ ఎక్కంటి మా చిత్రానికి పని చేయనున్నారు’’ అన్నారు. -
డైరెక్టర్ వర్మ, నిర్మాతపై పిటిషన్ దాఖలు
-
డైరెక్టర్ వర్మ, నిర్మాతపై పిటిషన్ దాఖలు
వంగవీటి రాధాకృష్ణ విజయవాడ లీగల్: దర్శకుడు రామ్‌గోపా ల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, సహ నిర్మాత పి.సుధీర్‌చంద్ర ‘వంగవీటి’ సినిమా ద్వారా తమ కుటుంబానికి పరువు నష్టం కలిగించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం ఒకటవ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జి.వెంకటేశ్వర్లు గతంలో పోలీసులకు ఫిర్యా దు చేసిన కాపీ ప్రతిని దాఖలు చేయాలని కోరుతూ వాయిదా వేశారు. వంగవీటి సోదరులైన రాధా, మోహనరంగారావులపై అసత్య, అబద్ధ కథనాలతో సినిమాను తీసి లక్షలాది వం గవీటి అభిమానుల మనోభా వాలను దెబ్బతీశారని పిటి షన్లో పేర్కొన్నారు. రంగా 1981 నుంచి జాతి, కుల, మత రహితంగా అనేక ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలిపారు. మేమేమన్నా రౌడీలమా? అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి తన పెదనాన్న, తండ్రిలను రౌడీలుగా చూపించారని మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ... సినిమా విడుదలకు ముందే తాము అభ్యంతరం తెలిపామన్నారు. -
వంగవీటి కథతో మరో సినిమా
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కిన వంగవీటి సినిమా ఎన్నో వివాదాలకు కేంద్రబిందువయ్యింది. వంగవీటి అభిమానులు కుంటుంబ సభ్యుల విమర్శలు వర్మ ప్రతి విమర్శలతో పరిస్థితి మరింత వేడెక్కుతోంది. తాజాగా నేను తీసిన సినిమా తప్పయితే అసలైన వంగవీటి కథను సినిమాగా చూపించండి అంటూ ప్రకటించాడు వర్మ. వర్మ విసిరిన సవాలుకు వంగవీటి ఫ్యామిలీ, ఫ్యాన్స్ స్పందించకపోయినా.. ఓ ఫిలిం టెక్నీషియన్ మాత్రం స్పందించాడు. గతంలో శ్రీకాంత్ హీరోగా రంగ ది దొంగ, నితిన్ హీరోగా హీరో లాంటి సినిమాలను తెరకెక్కించిన ఫైట్ మాస్టర్ జీవీ.. వంగవీటి కథతో సినిమా చేస్తానంటూ ప్రకటించాడు. వచ్చే ఏడాది ఇదే సమయానికి వంగవీటికి సంబంధించిన అసలైన చరిత్రతో ఆయన గొప్పదనాన్ని తెలియజేసేలా సినిమా వస్తుందని వెల్లడించాడు. -
‘వంగవీటి’ సినిమాను నిషేధించాలి
కాపు నేతల డిమాండ్ కొత్తపేటలో థియేటర్ వద్ద ధర్నా కొత్తపేట : కాపు కులస్తులను ప్రదానంగా దివంగత కాపు నాయకుడు వంగవీటి రాధా, మోహనరంగా సోదరులను రౌడీలుగా చిత్రీకరించిన వంగవీటి సినిమాను వెంటనే నిషేధించాలని రాష్ట్ర బీజేపీ కిసా¯ŒS మోర్చా కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, జిల్లా కాపు యువత సభ్యుడు పెదపూడి బాపిరాజు, మండల కాపు యువత నాయకులు డిమాండ్ చేశారు. సినిమాకు వంగవీటి పేరు పెట్టి వంగవీటి వంశాన్ని రౌడీలుగా చిత్రీకరించి, వారి ప్రత్యర్థి వర్గాన్ని హీరోలుగా చూపించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కృష్ణా జిల్లా, విజయవాడలో గతంలో జరిగిన వాస్తవ సంఘటనలకు విరుద్ధంగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఒక వర్గానికి కొమ్ముకాసి వారు చెప్పినట్టు సినిమా తీశారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో సెన్సార్ బోర్డును, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాపు యువత సభ్యులు నాగిరెడ్డి మణికంఠ, బండారు నరేష్ తదితరులు నాయకత్వం వహించారు. -
మరో వివాదంలో 'వంగవీటి'
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వంగవీటి సినిమాను తెరకెక్కించిన వర్మ, ఎన్నో వివాదాలు బెందిరింపుల నడుమ ఈ సినిమాను శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే కాదు రిలీజ్ తరువాత కూడా వివాదాలను కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ వంగవీటి కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆరోపిస్తుంటే.., తాజాగా ఆ సినిమాకు పనిచేసిన ఓ సాంకేతిక నిపుణుడు కూడా వర్మ మీద విమర్శలకు దిగాడు. ఈ సినిమాలో వంగవీటి టైటిల్ సాంగ్‌కు సంగీతం అందించి, పాడిన పన్నాల రాజశేఖర్ అనే వ్యక్తి టైటిల్ కార్డ్స్‌లో తన పేరు లేకపోవటంపై ఫైర్ అయ్యాడు. అంతేకాదు తనకు ఎవరి మీద కంప్లయింట్ చేసే ఉద్దేశ్యం లేదని, కేవలం తన పాటను సినిమాలో నుంచి తీసేయాలని డిమాండ్ చేశాడు. ఈ వివాదంపై వర్మ కూడా ఘాటుగానే స్పందించాడు. అసలు ఎవరికీ తెలియని పన్నాల రాజశేఖర్‌కు అవకాశం ఇచ్చింది తానే అని, ఆడియో వేడుకలో స్టేజ్ మీద పాట పాడించటంతో పాటు అందరికీ పరిచయం చేసానని చెప్పాడు. సాంకేతికంగా జరిగిన పొరపాటుకు ఇంత గొడవ చేయటం కరెక్ట్ కాదంటూ తన మార్క్ చురకలంటించాడు. -
వంగవీటి సినిమాలో ఆ డైలాగ్ కట్ చేశారు
విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వంగవీటి. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. ముందునుంచి ఉన్న హైప్ కారణంగా మంచి వసూళ్లను సాధిస్తోంది. అయితే రిలీజ్‌కు ముందు నుంచే ఎన్నో వివాదాలను సృష్టించిన వంగవీటి సినిమాపై రిలీజ్ తరువాత కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వంగవీటి కుటుంబ సభ్యులు సినిమాలో పలు అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్‌లు ఉన్నాయంటూ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఏ సినిమా విషయంలో కూడా వెనక్కి తగ్గని వర్మ, వంగవీటి విషయంలో మాత్రం కాస్త తగ్గేందుకు ఓకే చెప్పాడు. సినిమా రిలీజ్‌కు ముందే కమ్మ.. కాపు అనే పాటను తీసేసిన వర్మ.. తాజాగా సినిమాలో వంగవీటి రత్నకుమారి చెప్పే 'చంపేయ్ రంగా' అనే డైలాగ్‌ను కట్ చేసేందుకు అంగీకరించాడు. ఆదివారం నుంచి థియేటర్లలో ఈ డైలాగ్ వినిపించదు. ప్రస్తుతానికి ప్రశాంతంగానే కనిపిస్తున్నా.., వర్మ సృష్టించిన వంగవీటి వివాదం ఎటు దారి తీస్తుందో అని సినీ, రాజకీయా వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
‘ఆ సన్నివేశాలు తొలగించాలంటూ ఫిర్యాదు’
విజయవాడ: వంగవీటి రంగా అభిమానుల సంఘం శనివారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘వంగవీటి’ చిత్రంలోని పలు సన్నివేశాలు కాపుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ ఈ సందర్భంగా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని రంగా అభిమానుల సంఘం కోరింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సీ....జనవరి 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డును ఆదేశించింది. కాగా ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిన్న ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిశారు. తాము చెప్పిన అభ్యంతరాలను రాంగోపాల్‌వర్మ పరిగణనలోకి తీసుకోలేదని, సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. 'వంగవీటి' చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. -
'వంగవీటి' మూవీ రివ్యూ
టైటిల్ : వంగవీటి జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : సందీప్ కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి, నైనా గంగూలి, కౌటిల్యా, శ్రీతేజ్ సంగీతం : రవి శంకర్ దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ నిర్మాత : దాసరి కిరణ్ కుమార్ చాలా కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ.., ఇదే తెలుగులో నా ఆఖరి సినిమా.. ఈ సారి తప్పకుండా మెప్పిస్తానని చెప్పి మరీ తీసిన సినిమా వంగవీటి. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో రక్తచరిత్ర తీసిన వర్మ, పాత్రలను నిజజీవిత పేర్లతో కాకుండా ఆ భావం వచ్చేలా చూపించాడు. కానీ వంగవీటి విషయంలో మాత్రం మరో అడుగు ముందుకు వేసి.. నిజజీవితంలోని పేర్లతో యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన వంగవీటి వర్మ స్థాయిని ప్రూవ్ చేసిందా..? కథ : విజయవాడ రౌడీయిజం.. అందరికీ తెలిసిందే అయినా వర్మ తన మార్క్ సినిమాటిక్ టచ్‌తో ఆ కథను మరింత ఎఫెక్టివ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎర్రపార్టీ నాయకుడు చలసాని వెంకటరత్నం విజయవాడ సిటీలో పేదలకు అండగా ఉంటూ లీడర్‌గా ఎదుగుతాడు. అదే సమయంలో బస్టాండ్‌లో చిన్న రౌడీగా ఉన్న వంగవీటి రాధ. వెంకటరత్నం దగ్గర పనిలో చేరి అతన్ని మించిపోయే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. రాధ ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం ఇంటికి పిలిచి రాధను అవమానిస్తాడు. తనకు జరిగిన అవమాన్ని జీర్ణించుకోలేని రాధ వెంకటరత్నాన్ని పక్కా ప్లాన్‌తో దారుణంగా నరికి నరికి చంపుతాడు. అప్పటి వరకు ఓ లీడర్ వెనుక అనుచరిడిగా ఉన్న రాధ, వెంకటరత్నం మరణంతో విజయవాడను శాసించే నాయకుడిగా మారతాడు. తనకు ఎదురొచ్చిన వారందరిని అడ్డుతప్పించుకుంటూ ఎవరూ ఎదిరించలేని స్థాయికి చేరుకుంటాడు. ఆ సమయంలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే దేవినేని గాంధీ, దేవినేని నెహ్రులు కాలేజీ గొడవలో పార్టీ ప్రమేయాన్ని ఆపాలంటూ రాధను కలుస్తారు. రాధ మంచితనం నచ్చి అతనితో కలిసి ఓ పార్టీని ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి రాధకు అండగా నిలుస్తారు. రాధ ఎదుగుదలతో విజయవాడ నగరంలో ఎర్ర పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతాయన్న భయంతో ఆ పార్టీ పెద్దలు రాధ హత్యకు పథకం వేస్తారు. ఓ సెటిల్మెంట్ కోసం పిలిపించి ఒంటరిని చేసి చంపేస్తారు. అప్పటి వరకు రాజకీయం, రౌడీయిజం తెలియని రాధ తమ్ముడు రంగా., తప్పనిసరి పరిస్థితుల్లో అన్న బాటలోకి అడుగుపెడతాడు. అప్పటి వరకు అన్నకు అండగా ఉన్న దేవినేని సోదరులతో అభిప్రాయ భేదాలు రావటంతో వారు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. దేవినేని సోదరుల నుంచి రంగా ప్రాణానికి ముప్పు ఉందని భావించి ఆయన అనుచరులు గాందీని చంపేస్తారు. అన్న మరణంతో దేవినేని మురళి రగలిపోతాడు. ఎలాగైన రంగా మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. (శివ టు వంగవీటి.. ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి) అప్పటి వరకు రౌడీగా ఉన్న రంగా ఓ జాతీయ పార్టీ నుంచి టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అదే సమయంలో ఆంధ్రరాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఓ ప్రాంతీయ పార్టీలో చేరిన నెహ్రు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. నెహ్రు ఎమ్మెల్యే కావటంతో అతని తమ్ముడు మురళీకి పగ తీర్చుకునేందుకు కావాల్సిన అన్ని వనరులు అందుతాయి. దీంతో గాంధీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక్కొక్కరిని వెతికి వెతికి చంపుతాడు. అంతేకాదు ఏకంగా రంగా.. ఇంటికే ఫోన్ చేసి ఆయన భార్య రత్న కుమారికి వార్నింగ్ ఇస్తాడు. మరోసారి మురళీ వల్ల రంగాకు ప్రమాదం ఉందని భావించి అతన్ని కూడా రంగా అనుచరులు చంపేస్తారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ విజయవాడలో పెరిగిపోతున్న రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రజా సమస్యల కోసం తన ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తున్న రంగాను నల్ల బట్టల్లో వచ్చిన దుండగులు దీక్షా వేదిక మీద నరికి చంపేస్తారు. రంగ మరణంతో రగిలిపోయినా విజయవాడ కొద్ది రోజులకు సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే రంగా మరణం వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం వర్మ కూడా ప్రేక్షకులకు ప్రశ్నగానే వదిలేశాడు. నటీనటులు : కేవలం పాత్రలే కనిపించాలనే ఉద్దేశ్యంతో దాదాపు అంతా కొత్త వారితోనే వంగవీటి సినిమాను తెరకెక్కించాడు వర్మ. కీలకమైన వంగవీటి రాధ, వంగవీటి రంగా పాత్రల్లో కనిపించిన సందీప్ కుమార్, ఆవేశపరుడైన రౌడీగా.. ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడిగా బాగా నటించాడు. రంగా భార్య పాత్రలో నైనా గంగూలీ ఆకట్టుకుంది. పెళ్లికి ముందు అల్లరి అమ్మాయిగా.. తరువాత హుందాగా కనిపించే రంగా భార్యగా మంచి వేరియేషన్స్ చూపించింది. హ్యాపిడేస్ సినిమాలో స్టూడెంట్‌గా ఆకట్టుకున్న వంశీ చాగంటి ఈ సినిమాలో దేవినేని మురళీ పాత్రలో మెప్పించాడు. అన్న మరణంతో రగిలిపోయే పాత్రలో వంశీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇతర పాత్రల్లో వంశీ నక్కంటి, కౌటిల్య, శ్రీ తేజ్‌లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : యాధార్థ ఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించటంలో వర్మకు తిరుగులేదు. అయితే గతంలో పక్కా కథాకథనాలతో పాటు తన మార్క్ టేకింగ్‌తో ఆకట్టుకున్న వర్మ, ఈ మధ్య తీస్తున్న సినిమాల్లో ఆ క్వాలిటీ చూపించటంలేదు. హడావిడిగా చుట్టేస్తూ కేవలం తన బ్రాండ్ వాల్యూ మీదే సినిమాను నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. వంగవీటి విషయంలోనే అదే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా భాగం సినిమాను తన వాయిస్ ఓవర్‌తో నడిపించి.. అసలు కథ కన్నా ఎక్కువగా సీన్స్నే ఎలివేట్ చేశాడు. వర్మ మార్క్ సినిమాటోగ్రఫి, నేపథ్య సంగీతం మరోసారి ఆకట్టుకోగా మితిమీరిన రక్తపాతం అక్కడక్కడ ఇబ్బంది పెడుతుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : వర్మ మార్క్ టేకింగ్ సందీప్ ద్విపాత్రాభినయం యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : డైలాగ్స్ మితిమీరిన రక్తపాతం - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
రాజమౌళి, నాగార్జునలపై ఒట్టేసి చెబుతున్నా!
- దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘‘నాతో పాటు తెలుగు సినిమా లైఫ్ ఛేంజింగ్ మూమెంట్ ‘శివ’ సినిమా. అరుదుగా అలాంటి సంఘటనలు జరుగుతాయి. ‘బాహుబలి’తో మళ్లీ జరిగింది. రాము (ఆర్జీవీ)కి నేను బ్రేక్ ఇచ్చాననడం నాకు నచ్చదు. ఇద్దరూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నాం. ‘శివ’ సీక్వెల్ చేద్దామని నా దగ్గరకు ఎందరో వచ్చారు. రాము తీస్తానంటేనే ‘శివ–2’ చేస్తా. లేకపోతే చేయను’’ అన్నారు నాగార్జున. రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘వంగవీటి’. దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా 23న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ‘శివ టు వంగవీటి : ద జర్నీ ఆఫ్ ఆర్జీవీ’ పేరుతో హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకి రాలేకపోయినందుకు బాధగా ఉందని అమితాబ్‌బచ్చన్ వీడియో ద్వారా తెలిపారు. వెంకటేశ్ మాట్లాడుతూ – ‘‘అప్పట్లో హీరోలందరం ‘మనం ఎన్ని ఫైట్స్ చేసినా నాగ్గాడు ఒక్క చైన్ లాగి మొత్తం కొట్టేశాడు’ అనుకునేవాళ్లం. ‘శివ’కు ముందు ఫైట్స్‌లో హీరోలం అరిచేవాళ్లం. ‘శివ’ తర్వాత ఒక్క లుక్ అంతే. అన్నీ మారాయి’’ అన్నారు. ‘‘నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినా, డిప్రెషన్లోకి వెళ్లినా.. రాము ట్విట్టర్ అకౌంట్ చూస్తా. మనసులో అనుకున్నది చెప్తాడు. రామూ.. నువ్ ఎలా బతుకుతున్నావో అలాగే బతుకు. మారకు’’ అన్నారు నాగార్జున. వర్మ మాట్లాడుతూ – ‘‘ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు. పోయాడు అనుకుంటే మళ్లీ వస్తావు. మనిషివా? దెయ్యానివా? అని ట్విట్టర్లో కామెంట్ చేశాడొకడు. నాకా అర్హత ఉంది. నేనీ స్థాయికి వచ్చానంటే నాగార్జునే కారణం. ఇకపై నా సినిమాలన్నీ సూపర్‌హిట్స్ అవుతాయని చెప్పను. కానీ, గర్వంగా చెప్పుకునే సినిమాలు తీస్తానని రాజమౌళి, నాగార్జునలపై ఒట్టేస్తున్నా’’ అన్నారు. ‘‘కొన్నేళ్ల తర్వాత రాముగారు ప్రేమించి ఓ సినిమా (వంగవీటి) తీసి, ప్రమోట్ చేస్తున్నారు. చాలాసార్లు ట్రైలర్లతో ఆశపెట్టి నిరాశపరిచా రాయన. ఈసారి ‘మరణం..’ సాంగ్ చూశాక సినిమా పెద్ద హిట్ అనిపించింది. ఆర్జీవీ ఈజ్ బ్యాక్’’ అన్నారు రాజమౌళి. ‘‘వర్మగారితో నేను పాతికేళ్లుగా కాపురం చేస్తున్నాను. ఏరోజూ ఆయన మీద ప్రేమ తగ్గలేదు. ‘వంగవీటి’లో 40 నిమిషాలు చూశా. అద్భుతమైన సినిమా’’ అన్నారు పూరి జగన్నాథ్. ‘‘ఆర్జీవీ అనేది చలనచిత్ర చరిత్రలో ఓ శాస్వతమైన స్టాంప్. ‘శివ’, ‘వంగవీటి’లను కలిపితే ‘శివంగి’. అంటే.. పులుల్లో కూడా వర్మ ఆడపులినే ప్రేమిస్తాడు’’ అన్నారు తనికెళ్ల భరణి. చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకులు బి.గోపాల్, గుణశేఖర్, వైవీయస్ చౌదరి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, రాజకీయ నాయకుడు రేవంత్‌రెడ్డి, పారిశ్రామికవేత్తలు రఘురామరాజు, కోనేరు సత్యనారాయణ, నిర్మాతలు పీవీపీ, హీరో రాజశేఖర్, ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ('శివ టు వంగవీటి' ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వంగవీటి వేడుకలో బాహుబలి టీం
ప్రస్తుతం టాలీవుడ్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న చిత్రాల్లో అత్యంత వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకున్న సినిమా వంగవీటి. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు టాలీవుడ్ బాలీవుడ్ అతిరథమహారథులు హాజరవుతున్నారు. చాలా రోజుల క్రితమే నాగార్జున, అమితాబ్‌లు హాజరవుతారని ప్రకటించగా.. తాజాగా బాహుబలి టీం కూడా ఈ వేదిక మీద కనిపించనుందని తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న వంగవీటి సినిమాఈవెంట్కు దర్శకుడు రాజమౌళితో పాటు హీరో ప్రభాస్ కూడా హాజరవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా తన చివరి తెలుగు చిత్రం అంటూ ప్రకటించాడు వర్మ. అంతేకాదు ప్రచారం విషయంలో కూడా నిజంగా ఇది చివరి చిత్రమే అనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించలేదు. ఆడియో రిలీజ్ లాంటి కార్యక్రమాలు చేసిన పెద్దగా ఫిలిం సెలబ్రిటీలు కనిపించరు. కానీ వంగవీటి చిత్రానికి ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేసిన వర్మ టీం.. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులను ఆహ్వానించింది. -
అప్పటి నుంచే క్రేజ్ మొదలైంది!
‘వంగవీటి’ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 20న హైదరాబాద్‌లో భారీ వేడుక నిర్వహించనున్నాం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి ఈ చిత్రం నైజాం హక్కులను సొంతం చేసుకుని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విస్సు, సహ నిర్మాత: సుధీర్ చంద్ర పడిరి. -
తెర పైకి చిన్నమ్మ
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘రక్త చరిత్ర’కు రాయలసీమ ఫ్యాక్షన్, ఈ నెల 23న విడుదల కానున్న ‘వంగవీటి’కి విజయవాడ రౌడీ రాజకీయ చరిత్రలు కథావస్తువులు అయ్యాయి. ఇప్పుడీయన కన్ను తమిళ రాజకీయాలపై పడింది. అమ్మ (జయలలిత) మరణం తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, చిన్నమ్మ శశికళకు ప్రాధాన్యం పెరగడం తెలిసిందే. ఇప్పుడు వర్మ సినిమాకు శశికళ కథావస్తువు అయ్యారు. ఓ రాజకీయ నాయకురాలికి సన్నిహిత స్నేహితురాలి కథతో ‘శశికళ’ అనే సినిమా తీస్తున్నట్టు వర్మ ప్రకటించారు. టైటిల్ కూడా రిజిస్టర్ చేయించానని చెప్పారు. వాస్తవ సంఘటనలతో వర్మ తీసిన ‘రక్త చరిత్ర’, ‘ద ఎటాక్స్ ఆఫ్ 26/11’ సినిమాలు ప్రకంపనలు సృష్టించాయి. తాజా ‘వంగవీటి’ కూడా సంచలనంగా మారింది. బహుశా.. అవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టున్నారు. అందుకే కల్పిత కథతో ‘శశికళ’ తీయనున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘జయలలిత తన కళ్లతో కన్నా శశికళ కళ్లతోనే ఈ లోకాన్ని కవితాత్మకంగా చూశారు. ఈ లోకంలో అందరి కంటే ఎక్కువగా శశికళను గౌరవించారు. రాజకీయాలతో సంబంధం లేని శశికళ కల్పిత కథే ఈ సినిమా’’ అని వర్మ సోషల్ మీడియాలో తెలిపారు. జయలలిత, శశికళల మధ్య సన్నిహిత సంబంధానికి చిహ్నమంటూ పైన ఇన్సెట్లో కనిపిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. మరి, వర్మ సినిమాలో అంతా మంచే చూపిస్తారో? లేదా శశికళపై వస్తోన్న విమర్శలను కూడా ప్రస్తావిస్తారో? వెయిట్ అండ్ సీ!! -
సర్కార్... శివలతో వంగవీటి
దర్శకుడిగా రామ్‌గోపాల్ వర్మ ప్రయాణం ‘శివ’ చిత్రంతో ప్రారంభమైంది. బలమైన పునాది పడడంతో వెనుదిరిగి చూసుకోలేదు. ‘రంగీలా’, ‘సత్య’, ‘సర్కార్’ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో హిందీలోనూ హిట్స్ అందుకున్నారాయన. దర్శక–నిర్మాతగా ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్ని చిత్రాలు తీసినా... దర్శకత్వం వైపు అడుగులు పడడానికి కారణమైన విజయవాడ సంఘటన నేపథ్యంలో ఓ చిత్రం తీయాలనే ఆకాంక్ష వర్మలో ఎప్పటి నుంచో ఉంది. ‘వంగవీటి’తో అది తీరింది. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 20న ‘శివ టు వంగవీటి’ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కి అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ‘‘ఇటీవల విజయవాడలో రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అమితాబ్ ఓ తెలుగు సినిమా వేడుకకు రావడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు వర్మ తొలి చిత్ర కథానాయకుడు నాగార్జున రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విస్సు, సహ నిర్మాత: సుధీర్ చంద్ర పడిరి. -
వంగవీటి వేడుకకు నాగ్, అమితాబ్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ సినిమా వంగవీటి విషయంలో పట్టు వీడటం లేదు. విజయవాడ హత్యారాజకీయాల నేపథ్యంలో వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమాను ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిలీజ్ చేస్తానంటూ చెపుతున్నాడు. ఇప్పటికే సినిమాలో ప్రధాన పాత్రలైన వంగవీటి, దేవినేని కుంటుంబాలను కలిసిన వర్మ, విజయవాడ వేదికగా ఆడియో వేడుకను ఘనం నిర్వహించాడు. అయితే అదే సమయంలో కొంత మంది పెద్ద మనుషుల నుంచి సినిమా విడుదలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శలు చేశాడు. ఈ నెల 23న రిలీజ్ కు రెడీ అవుతున్న వంగవీటి సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ప్లాన్ చేస్తున్నాడు వర్మ. డిసెంబర్ 20న హైదరాబాద్ వేదికగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతేకాదు ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఇంత వివాదాస్పదమైన సినిమా ఫంక్షన్లో ఈ స్టార్ హీరోలు పాల్గొంటారా..? ఒకవేళ పాల్గొన్నా సినిమాకు సంబంధించి ఏం మాట్లాడతారు..? అన్నది ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది. -
‘వంగవీటి’ సినిమాపై రాజీపడం
- వంగవీటి రాధాకృష్ణ స్పష్టీకరణ - రాధాకృష్ణ, రత్నకుమారితో రామ్‌గోపాల్‌వర్మ చర్చలు - దేవినేని నెహ్రూతోనూ వర్మ భేటీ విజయవాడ: ‘వంగవీటి’ సినిమాపై తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలకు కట్టుబడి ఉన్నామని, అందులో రాజీపడే ప్రసక్తి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వంగవీటి’ సినిమాపై రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రరుుంచిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌గోపా ల్‌వర్మ, దాసరి కిరణ్‌కుమార్ శనివారం విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారితో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. వివాద పరిష్కారంపై దాదాపు గంట పాటు జరిపిన ఈ సంప్రదింపుల్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కూడా పాల్గొన్నా రు. చర్చల సారాంశం మాత్రం స్పష్టం కాలేదు. అనంతరం వంగవీటి రాధాకృష్ణ, రామ్‌గోపాల్ వర్మ, ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. ‘వంగవీటి’ సినిమాపై తమ అభ్యంతరాలపై రాజీ పడేది లేదని వంగవీటి రాధాకృష్ణ చెప్పారు. కోర్టు నిర్ణయానికే కట్టుబడి ఉంటా.. వంగవీటి మోహన్‌రంగా కుటుంబసభ్యులతో తాము జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. సినిమా విషయంలో కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. రాధాకృష్ణ, రత్నకుమారితో చర్చల అనంతరం రామ్‌గోపాల్‌వర్మ విజయవాడ గుణదలలోని దేవినేని రాజశేఖర్ ( నెహ్రూ) నివాసానికి వెళ్లారు. వంగవీటి సినిమా ట్రైలర్‌ను ఆయనకు చూపించారు. అనంతరం నెహ్రూ మీడియాతో మాటాడుతూ ఆ సినిమాలో తనను విలన్‌గా చూపించినా వద్దనే హక్కు తనకు లేదన్నారు. -
నా కెరీర్లో ఇదే బెస్ట్ ఫిల్మ్ - రామ్‌గోపాల్ వర్మ
‘‘వంగవీటితో పరిచయం ఉన్న వ్యక్తులకు ఆయన గురించి ఓ అవగాహన ఉంటుంది. దూరం నుంచి గమనిస్తూ, వింటున్న నాలాంటోళ్ల అవగాహన మరో విధంగా ఉంటుంది. రెండిటిలో ఏది నిజం అనేది ప్రశ్న కాదు. నాకు అర్థమైన, నా అవగాహన దృష్టితో ఈ సినిమా తీశా’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. విజయవాడ రాజకీయాలు, రౌడీయిజం నేపథ్యంలో ఆయన తీసిన సినిమా ‘వంగవీటి’. వంగవీటి మోహనరంగా, రాధా పాత్రల్లో సందీప్‌కుమార్, రత్నకుమారిగా నైనా గంగూలీ, దేవినేని మురళిగా ‘హ్యాపీడేస్’ ఫేమ్ వంశీ, దేవినేని గాంధీగా కౌటిల్య, దేవినేని నెహ్రూగా శ్రీతేజ, దేవినేని లక్ష్మిగా ప్రజ్ఞ నటించారు. దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక శనివారం రాత్రి విజయవాడలో జరిగింది. కేయల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ ఆడియో సీడీలను ఆవిష్కరించి, వర్మకు అందజేశారు. వర్మ మాట్లాడుతూ - ‘‘వంగవీటి మోహన రంగా ర్యాలీ జరుగుతున్నప్పుడు ఓ సారి నేనూ పాల్గొన్నాను. నేను దర్శకుణ్ణి కాక ముందు నుంచీ ఈ కథ నాకు తెలుసు. అప్పుడు విజయవాడలో జరిగిన పరిస్థితులు, వాతావరణాన్ని స్టడీ చేసి ఆ అవగాహనతో నేనో దర్శకుణ్ణి అయ్యాను. ఈ సినిమాతో నాకున్న ఎమోషనల్ బాండింగ్ మరే సినిమాతోనూ లేదు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఫ్యాక్షన్ కావొచ్చు.. గ్యాంగ్‌స్టర్ కావొచ్చు లేదా హైదరాబాద్ గూండాయిజమ్ మీద తీసినవి కావొచ్చు. ఇరవై ఏడేళ్ల నా కెరీర్లో ‘వంగవీటి’ నా బెస్ట్ ఫిల్మ్. నేనే దర్శకుణ్ణి కాబట్టి, ఈ మాట చెప్పడం సరి కాదేమో కానీ చెబుతున్నా! వివాదాస్పదఅంశంతో నిజజీవిత పాత్రల ఆధారంగా ఈ సినిమా తీయడం వల్ల ఎంతోమందికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా ముందుకొచ్చిన నిర్మాతకు థ్యాంక్స్’’ అన్నారు. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘క్రియేటివిటీతో పాటు దమ్ము, ధైర్యం, పౌరుషం ఉన్న దర్శకులు వర్మగారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మంచి ఆలోచనతో, స్పోర్టివ్‌గా చూస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. సంగీత దర్శకుడు రవిశంకర్ మాట్లాడుతూ - ‘‘వాస్తవిక కథతో తెరకెక్కిన ఇటువంటి చిత్రాలకు సంగీతం అందించడం చాలా ఇష్టం’’ అన్నారు. మరో సంగీత దర్శకుడు రాజశేఖర్ పన్నాల, పాటల రచయితలు సిరాశ్రీ, చైతన్య ప్రసాద్, హీరో హవీష్, వేదా సీడ్స్ ఎండీ తులసీధరమ్ చరణ్, పారిశ్రామికవేత్త తోటకూర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
సినిమాలు చూసి కొట్టుకునేంత మూర్ఖులు లేరు: వర్మ
ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ శనివారం ఉదయం వంగవీటి రాధ, రత్నకుమారిలను కలిసిన అనంతరం మధ్యాహ్నం దేవినేని నెహ్రుతో చర్చలు జరిపారు. నెహ్రుతో సమావేశం తరువాత మీడియా ముందుకు వచ్చిన వర్మ... వంగవీటి రాధతో జరిగిన చర్చలపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే రాధ ‘వంగవీటి’ సినిమా విడుదలపై అభ్యంతరాలు తెలిపారని, ఓ ఫిలిం మేకర్‌గా తనకు స్వేచ్ఛ ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వంగవీటి రంగ మరణించిన రోజుకు కేవలం మూడు రోజుల ముందే సినిమా రిలీజ్ నిర్ణయం కేవలం యాధృచ్చికమే అన్నారు. వంగవీటి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న వర్మ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సినిమాపై తన ఆలోచనను మార్చుకోనన్నారు. కేవలం సినిమాలో సన్నివేశాల కారణంగా వివాదాలు పెంచుకునేంత మూర్ఖులెవరు లేరని ఆయన అన్నారు. (చదవండి....నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు: వర్మ) ఈ సమావేశంపై మీడియాతో మాట్లాడిన దేవినేని నెహ్రు... వర్మ తనకు కేవలం ఒకటిన్నర నిమిషం ట్రైలర్ మాత్రమే చూపించారని, మురళి, నెహ్రుల లుక్ ఎలా ఉందన్న విషయం మాత్రమే తాను అడిగారని తెలిపారు. అలాగే ఫిలిం మేకర్స్‌కు ఏదైనా తీసే హక్కు ఉందన్న నెహ్రు, వర్మ సినిమా ఎలా తీసినా ఎవరు చేయగలిగేది ఏం లేదన్నారు. గతంలో వర్మను కలిసినపుడు కమ్మ కాపు పాట తీసేయటం మంచిదని చెప్పానన్నారు. వంగవీటి సినిమా తరువాత విజయవాడలో మరోసారి గొడవలు జరిగే పరిస్థితి లేదని, ప్రస్తుతం సినిమాలు చూసి కొట్టుకు చచ్చే పరిస్థితిలో సమాజం లేదన్నారు. -
సినిమాలు చూసి కొట్టు కునేంత మూర్ఖులు లేరు
-
నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు: వర్మ
తాను జీవితంలో ఇప్పటివరకు చాలా సీరియస్ వార్నింగులు చూశాను గానీ.. మొట్టమొదటిసారి నవ్వుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశానని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు. వంగవీటి సినిమా నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారిలను విజయవాడలో కలిసి వచ్చిన తర్వాత నేరుగా మీడియాతో అయితే మాట్లాడలేదుగానీ, ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు. 'మీటింగ్ అంత ఆశాజనకంగా సాగలేదు. సినిమాకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నేను మాత్రం వెనక్కి తగ్గను.. ఏం జరుగుతుందో చూడాలి. నేను సీరియస్ వార్నింగ్‌లు చాలా చూశాను. కానీ తొలిసారిగా నవ్వుతూనే వార్నింగ్ ఇవ్వటం చూశాను. డేంజరస్. అయినా వంగవీటి సినిమా విషయంలో నా ఆలోచనలపై వెనక్కి తగ్గను. ఏమవుతుందో చూడాలి. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు. కానీ రాధ రంగా మిత్రమండలి సభ్యులు చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లను నేను ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించాను' అంటూ కామెంట్ చేశారు. సంతృప్తి చెందలేదు: రాధా సినిమా విషయంలో తమకు అభ్యంతరాలున్నాయని ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన వంగవీటి రాధాకృష్ణ మాత్రం ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఇచ్చిన వివరణతో సంతృఫ్తి చెందలేదు. 'మా అభ్యంతరాలను వర్మకు తెలియజేశాం.. అదే విషయాలపై కోర్టుకు వెళ్లాం, సినిమా అభ్యంతరకరంగా ఉంటే అంగీకరించం. ఇక ఆయన ఇష్టం' అన్నారు. ఎవరూ వెనక్కి తగ్గలేదు: కొడాలి నాని ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు అంత సంతృప్తికరంగా సాగలేదని ఈ చర్చల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. 'వర్మ, రాధ ఎవరూ వెనక్కి తగ్గేవారు కాదు. కానీ అభ్యంతరకర సన్నివేశాల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది వర్మే' అని ఆయన అన్నారు. Just met Radha and his Mother ..Meeting did not go half well....Problems..I will not compromise..Have to see what happens — Ram Gopal Varma (@RGVzoomin) 3 December 2016 I saw many serious warnings .1st time I saw very smilingly serious warnings .Dangerous .But I will not compromise on my vision of Vangaveeti — Ram Gopal Varma (@RGVzoomin) 3 December 2016 Two important people are troubling..But many Radha Ranga Mitra Mandali people supporting us and I invited them to Vangaveeti audio event — Ram Gopal Varma (@RGVzoomin) 3 December 2016 -
వంగవీటి రాధను కలిసిన రాంగోపాల్ వర్మ
-
వంగవీటి రాధను కలిసిన రాంగోపాల్ వర్మ
వంగవీటి సినిమా నిర్మాణంపై మొదటి నుంచి అభ్యంతరం తెలుపుతున్న వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిలతో దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం ఉదయం భేటీ అయ్యారు. సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలో కూడా రత్నకుమారితో భేటీ అయ్యేందుకు వర్మ ప్రయత్నించినా.., రత్నకుమారి అందుకు అంగకీరించలేదు. ఇప్పుడు జరిగిన ఈ భేటీలో వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వారిని కలిసి, సినిమాలో ఉండే అంశాలను వివరించినట్లు తెలుస్తోంది. సినిమా రూపొందించడానికి ముందే వంగవీటి ప్రత్యర్థులైన దేవినేని కుటుంబ సభ్యులను కలిసిన వర్మ.. ఇప్పుడు దాదాపు సినిమా నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిలను కలిశారు. సినిమాలో దివంగత రంగా, రాధాల పాత్రలను ఎలా చూపిస్తారన్న విషయమై వాళ్ల అనుమానాలను నివృత్తి చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ రాజకీయాల నేపథ్యంలో వంగవీటి సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ, ప్రస్తుతం సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారాడు. వర్మ వంగవీటి సినిమాను ప్రకటించిన దగ్గర నుంచే అనేక వివాదాలు సినిమాను చుట్టుముట్టాయి. ఈ గొడవల మధ్యే షూటింగ్ పూర్తి చేసిన వర్మ ప్రస్తుతం సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్మ స్వయంగా పాడి రిలీజ్ చేసిన కమ్మ కాపు పాటతో వివాదం తారస్థాయికి చేరింది. ఈ పాట కుల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని, పాటతో పాటు సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి వంగవీటి అభిమానులు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై స్పందించిన కోర్టు పాటతో పాటు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించే వరకు సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వవద్దని ఆదేశించింది. దీంతో దిగి వచ్చిన వంగవీటి చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఆ పాట, సన్నివేశాలను తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు. -
ఆ పాట, సన్నివేశాలను తొలగిస్తాం
⇒ వంగవీటి సినిమాపై హైకోర్టుకు నిర్మాత కిరణ్ హామీ సాక్షి, హైదరాబాద్: రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న వంగవీటి సినిమా ట్రయిలర్, టీజర్‌లోని పాట, కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో వాటిని తొలగిస్తామని చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. అప్పటి వరకు ట్రయిలర్, టీజర్ల ప్రదర్శనను నిలిపివేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అభ్యంతరకర దృశ్యాలను తొలగిస్తాం
హైదరాబాద్: ఇంటర్నెట్లో ఉంచిన ట్రైలర్, టీజర్లనుంచి అభ్యంతరాలున్న దృశ్యాలను తొలగిస్తామని వంగవీటి చిత్రం దర్శక, నిర్మాతలు హైకోర్టుకు తెలిపారు. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన వంగవీటి అనే సినిమా వాస్తవాలకు విరుద్ధంగా ఉందని, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఆమోదం లేకుండా ట్రైలర్, టీజర్లను ఇంటర్నెట్, యూట్యూబ్, ట్విట్టర్లలో ప్రదర్శిస్తున్నారంటూ దివంగత వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి రాజా ఇలంగో గత మంగళవారంవిచారణ జరపగా వంగవీటి రంగా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నామని చెబుతున్నా ట్రైలర్‌ను చూస్తే వాస్తవాలను వక్రీకరించేలా ఉందని రాధాకృష్ణ తరపు న్యాయవాది బండి వీరాంజనేయులు కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విజయవాడ పోలీసు కమిషనర్, సీబీఎఫ్సీ, రాంగోపాల్‌వర్మ, దాసరి కిరణ్‌కుమార్ తదితరులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా, శుక్రవారం విచారణ సందర్భంగా పిటిషనర్ అభ్యంతరాలను పరిశీలించి ఆ దృశ్యాలను తొలగిస్తామని దర్శక, నిర్మాతలు కోర్టుకు తెలిపారు. -
వర్మ వెనక్కి తగ్గాడు
ఎవరేం అనుకున్నా తను అనుకున్నది చేసుకుంటూ పోయే రాంగోపాల్ వర్మ, వంగవీటి సినిమా విషయంలో వెనక్కి తగ్గక తప్పలేదు. విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా వంగవీటి. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తున్నారు. అంతే కాదు సినిమా మొదలైన సమయంలోనే కమ్మ కాపు అంటూ రిలీజ్ చేసిన సాంగ్ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో విజయవాడ చరిత్రను వక్రీకరించారంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. విజయవాడలో ముఖ్యంగా కుల విద్వేశాలను రెచ్చగొట్టేవిధంగా ఉన్న కమ్మ కాపు పాటను సినిమాను నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు చిత్ర దర్శకుడు రాం గోపాల్ వర్మ తో పాటు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వరాదని సెన్సార్ బోర్డ్ ను ఆదేశించింది. డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్న చిత్రయూనిట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వివాదాన్ని మరింత పెంచుకోవటం కరెక్ట్ కాదని భావించి వెనక్కు తగ్గింది. వివాదానికి కారణమైన పాటను సినిమా నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో అనుకున్నట్టుగా రాంగోపాల్ వర్మ వంగవీటి డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ శనివారం ఈ చిత్ర ఆడియోను విజయవాడలోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు వర్మ. -
బెజవాడలోనే..‘వంగవీటి’ పాట
‘నువ్వు లోకల్ స్థాయి నుంచి స్టేట్ లెవల్‌కి ఎదగాలి.. అంటే రాజకీయాల్లోకి రావాలి’, ‘ఎంతపెద్ద రౌడీ అయితే ఏం?కత్తితో పొడిస్తే వాడికీ రక్తం వస్తుంది’... ఇవి ‘వంగవీటి’ చిత్రంలోని మచ్చుకు కొన్ని డైలాగులు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో స్వర్గీయ వంగవీటి రాధా, రంగా లాంటి నిజజీవిత పాత్రల జీవితాల నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవిశంకర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 3న విజయవాడలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ -‘‘విజయవాడలో గతంలో జరిగిన పలు సంఘర్షణలను ప్రత్యక్షంగా చూశా. అక్కడి రౌడీయిజంపై తీసిన ‘వంగవీటి’ నాకు చాలా ప్రత్యేకం. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 23న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విస్సు. -
విజయవాడలో `వంగవీటి` ఆడియో
విజయవాడ నగరంలో ఒకప్పుడు సంచలనం రేపిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమా చేయబోతున్నాడని అనౌన్స్ చేయగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ ఈ సినిమా తీస్తున్నాడు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేసిన వంగవీటి ట్రైలర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలో గ్రాండ్‌గా చేయనున్నారు. చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ .. ‘విజయవాడ రౌడీయిజంపై నా దర్శకత్వంలో రూపొందుతోన్న వంగవీటి నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. అప్పట్లో అక్కడ జరిగిన చాలా సంఘర్షణలకు నేను ప్రత్యక్షసాక్షిని. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రవి శంకర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. డిసెంబర్ 3న వంగవీటి ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురు ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నాం. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పాడు. -
'వంగవీటి' సినిమా షూటింగ్ సందడి
నార్పల: మండల కేంద్రం సమీపంలోని మడుగుపల్లి కనుమపై సోమవారం 'వంగవీటి' సినిమా షూటింగ్ సందడి నెలకొంది. సోమవారం మడుగుపల్లి కనుమలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అసిస్టెంట్ల పర్యవేక్షణలో షూటింగ్ సాగింది. అనంతరం గాలిమరల షెడ్్లలోను, క్యాంప్ ఆఫీసులో కొన్ని కీలకమైన సీన్స్‌ను చిత్రీకరించారు. షూటింగ్ చూడడానికి పుట్లూరు, నార్పల మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
వంగవీటిలో శాంతి గురించి చెప్పాడా..?
కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలకు, సంచలనాలకు దూరంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ మళ్లీ మొదలెట్టాడు. ముఖ్యంగా టాలీవుడ్ తన సినిమాలతో కన్నా ట్విట్టర్ కామెంట్లతోనే ఎక్కువగా వార్తల్లో కనిపించిన వర్మ, ముంబై వెళ్లిపోయాక, సోషల్ మీడియాలో జోరు తగ్గించాడు. కానీ గత కొద్ది రోజులుగా తిరిగి తన మార్క్ స్టేట్మెంట్ లతో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లను తెగ పొగిడేస్తూ వరుస ట్వీట్ లు చేసిన వర్మ, శనివారం తన సినిమా ప్రచారానికి తెర తీశాడు. ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వంగవీటి సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన వర్మ. ఆ ప్రకటనలో కూడా తన మార్క్ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త పడ్డాడు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ.. ఇది శాంతియుత అందుకే ట్రైలర్ రిలీజ్ కు ఆ రోజును ఎంచుకున్నట్టుగా తెలిపాడు. రౌడీయిజం నేపథ్యంలో శాంతియుత చిత్రాన్ని ఎలా తీశాడో వర్మకే తెలియాలి. Since its a peaceful film pic.twitter.com/I7kmrBCIMf— Ram Gopal Varma (@RGVzoomin) 3 September 2016 -
ఆఖరి షెడ్యూల్లో ఆర్జీవీ వంగవీటి
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో కాంట్రవర్షియల్ మూవీ వంగవీటి. విజయవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో.. ప్రత్యేకంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు వర్మ. టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా ఎనౌన్స్ చేసిన సమయంలో వరుసగా పాత్రలను పరిచయం చేస్తూ తెగ హడావిడి చేసిన వర్మ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. మకాం ముంబైకి మార్చేయటం, బాలీవుడ్లో వీరప్పన్ సినిమా ప్రమోషన్లో బిజీ కావటంతో వంగవీటి సినిమా ఆగిపోయినట్టే అని భావించారు. అయితే ఇప్పుడు వంగవీటి సినిమా షూటింగ్ పూర్తికావచ్చిందన్న వార్త టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఎనౌన్స్ మెంట్ సమయంలోనే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా రిలీజ్ టైంకి ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి. -
ఆత్రేయపురం‘వంగవీటి’ సినీ సందడి
ఆత్రేయపురం : వర్మ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న వంగవీటి సినిమా సన్నివేశాలు ఆత్రేయపురం ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. స్క్రీన్‌ప్లే, నిర్మాత, డెరైక్టర్ రామ్‌గోపాల్‌వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్యాక్షన్ రాజకీయాల కథా చిత్రంగా రూపొందిస్తున్నారు. స్థానిక మహా త్మాగాంధీ జూనియర్ కళాశాల వద్ద ఈ చిత్రంలోని హత్య సంఘటనలను చిత్రీకరించా రు. నూతన తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కో డెరైక్టర్లుగా వేగేశ్న అజయ్‌వర్మ, మంజునాథ్‌తో పాటు తారాగణం వంశీ, శాండీ, ఇం ద్రతో పాటు పలువురు నూతన తారాగణం నటిస్తున్నారు. ప్యాక్షన్ గొడవలకు సంబంధించిన చిత్రం కావడంతో హీరోయిన్ లేకుండా రూపొందిస్తున్నట్టు ఆత్రేయపురం వాసి కో డెరైక్టర్ వేగేశ్న అజయ్‌వర్మ పేర్కొన్నా రు. ఈ చిత్రం లోని విలన్ పాత్రలను ఆత్రేయపురానికి చెంది న యువకులు నటించారు. ఆత్రేయపురం విజయవాడ, పెనుగొండ ప్రాంతాల్లో ఈ చిత్ర నిర్మాణాన్ని శరవేగంగా రూపొం దించి త్వరలో విడుదల చేయనున్నట్టు అజయ్‌వర్మ తెలిపారు. -
అతడు 'హ్యాపీ డేస్' వంశీనే!
'హ్యాపీ డేస్' సినిమాలో గాళ్ ఫ్రెండ్ మాయలో పడి స్నేహితులకి హ్యాండ్ ఇచ్చే క్యారెక్టర్ గుర్తుంది కదా.. వంశీకృష్ణ చాగంటి పోషించాడు ఆ పాత్రని. ఆ తరువాత అతను ఒకటి, రెండు సినిమాల్లో కనిపించినా....ప్రేక్షకుల్ని మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ వంశీనే తనదైన స్టైల్లో మరోసారి తెరమీదకు తీసుకొస్తున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రామూ తదుపరి చిత్రం 'వంగవీటి'లో దేవినేని మురళి పాత్రలో నటించనున్నాడు వంశీ. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను వర్మ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. స్వయంగా రామూ చెప్పే వరకు ఆ గెటప్‌లో కనబడుతున్నది 'హ్యాపీ డేస్' వంశీ అని ఎవరూ పోల్చుకోలేకపోయారు. ఆ లుక్ వంశీదే అని తెలిశాక రామూని పొగడటం మొదలుపెట్టారు అభిమానులు. ఫెన్టాస్టిక్.. మైండ్ బ్లోయింగ్.. అన్ బిలీవబుల్.. అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. అయితే వర్మ మాత్రం ఆ గెటప్ క్రెడిట్ అంతా వంశీదేనంటున్నాడు. ఇంతకుముందు కూడా వీరప్పన్ పాత్రకు రంగస్థల నటుడు సందీప్ భరద్వాజ్‌ను ఎంచుకుని అభిమానులను మెప్పించాడు రామ్ గోపాల్ వర్మ. pic.twitter.com/VD4YUsQIvw — Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2016 This look is completely to the credit of Vamsee himself who did this transformation..I am as amazed as anyone else pic.twitter.com/mpFgUhYYJc — Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2016 -
వంగవీటి రత్నకుమారిగా నైనా
రామ్‌గోపాల్ వర్మ స్టోరీ సెలక్షన్‌లోనే కాదు పాత్రల ఎంపిక లోనూ తన మార్క్ ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలను తెరకెక్కించే వర్మ, వారి జీవితాలలోని భావోద్వేగాలను పలికించగలిగే నటులనే ఎంపిక చేసుకుంటారు. అందుకే అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలను రక్త చరిత్రగా తెరకెక్కించిన సమయంలో వివేక్ ఒబెరాయ్, సూర్యలను తరువాత కిల్లింగ్ వీరప్పన్ కోసం సందీప్ భరద్వాజ్‌ను తీసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో వంగవీటి సినిమాలో కీలక పాత్ర కోసం నైనా గంగూలిని ఎంపిక చేశాడు. విజయవాడ నాయకులు వద్దంటున్నా వంగవీటి సినిమా తెరకెక్కించాలనే నిర్ణయించుకున్న వర్మ, ఇప్పటికే ఓ పాటతో పాటు రాధ, రంగ పాత్రదారులను కూడా పరిచయం చేశాడు. తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయిన వంగవీటి రత్నకుమారి పాత్రధారిని కూడా ప్రకటించాడు. రంగ మరణం తరువాతే ప్రపంచానికి పరిచయం అయిన రత్నకుమారి అంతకు ముందు ఎలాంటి భావోద్వేగాలను అనుభవించిందో నైనా గంగూలి అద్భుతంగా చూపించగలదంటున్నాడు వర్మ. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వంగవీటి సినిమా, రిలీజ్ లోపు ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి. -
ఇప్పుడెందుకీ.. ప్రయోగాలు!
‘వంగవీటి’ సినిమా కోసం నగరంలో రాంగోపాల్‌వర్మ పర్యటన అప్పటి పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రయత్నం ఇప్పుడెందుకీ పనంటూ వర్మకు పలువురి సూచన విజయవాడ : తాను తీస్తున్న కొత్త సినిమా ’వంగవీటి’కి తగిన సమాచారం సేకరించేందుకు సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ నగరంలో రెండురోజులపాటు పర్యటించారు. పలువురిని కలిసి.. పలు ప్రాంతాలు తిరిగారు. అయితే ఎప్పుడో జరిగిన ఘర్షణలపై ఇప్పుడెందుకీ ప్రయోగాలు అని పలువురు ఆయనకు సూచించారు. ఇప్పుడంతా ప్రశాంతం... నగరంలో ఎప్పుడో జరిగిన ఘర్షణల వ్యవహారం పూర్తిగా సద్దుమణిగింది. నగరం ప్రశాంత వాతావరణానికి వచ్చింది. 26 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న పరిణామాలపై అప్పట్లో వంగవీటి మోహనరంగాతో ఉన్నవారు పెద్దగా మాట్లాడేందుకు అంగీకరించలేదు. పైగా రాంగోపాల్ వర్మను వారించారు. నాటి పరిస్థితులకు, నేటి పరిస్థితులకు ఎంతో తేడా ఉందని, ఇప్పుడు అప్పటి పరిణామాలు చూపాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అప్పట్లో జరిగిన పరిణామాలు ఇప్పటి జనాన్ని మేల్కొలిపేవేమీ కాదని, అలాంటప్పుడు గతాన్ని తవ్వుకోవడం దేనికనే వాదనను ఆయన ముందు వినిపించారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్, న్యాయవాది కర్నాటి రామ్మోహన్‌లు కూడా వర్మ యత్నాలు విరమించుకోవాలని సూచించారు. వర్మ బృందం నగరంలోని పలు ప్రాంతాలు తిరగటంతో పోలీసులు వారి వెన్నంటే ఉన్నారు. రాంగోపాల్ వర్మ మాత్రం తన వర్గాన్ని తనతోపాటు ఉండేలా చూసుకున్నారు. వీరంతా అభిమానులని చెప్పేందుకు వీలులేదు. అప్పట్లో మరణాలు... నగరంలో కమ్యూనిస్ట్ నేత చలసాని వెంకటరత్నం 1972లో హత్యకు గురయ్యారు. అప్పటిలో సంచలనం సృష్టించిన ఈ హత్య తరువాత 1974లో వంగవీటి మోహనరంగా సోదరుడైన రాధాృష్ణను ఆగంతకులు హతమార్చారు. ఆ తర్వాత 1979లో దేవినేని నెహ్రూ సోదరుడు గాంధీ హత్యకు గురయ్యారు. 1983లో ఎన్టీఆర్ నూతనంగా తెలుగుదేశం పార్టీని స్థాపించటంతో కొంతకాలం ఘర్షణ వాతావరణాలు చోటుచేసుకున్నా హింసాత్మక ఘటనలు అంతగా నమోదు కాలేదు. మళ్లీ 1988 ప్రారంభంలో మురళీ హత్యకు గురయ్యారు. అదే ఏడాది డిసెంబర్లో వంగవీటి రంగాను హత్య చేశారు. దీంతో పలువురు అభిమానులు విజయవాడలో విధ్వంసానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రంగా అభిమానులు అలాగే ఉన్నారు. నేటికీ ఆయన అభిమానులు రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి దేవుడిగా పూజిస్తున్నారు. రంగా పేదల మనసులో గొప్ప నాయకుడిగా నిలిచిపోయారు. నగరంలో పర్యటన ఇలా... శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్న వర్మ హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్క్‌లో బస చేశారు. శనివారం తన స్నేహితుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వద్దకు వెళ్లారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్‌ను ఇంటికి వెళ్లి కలిశారు. ఆయనతో సుమారు గంటపాటు సమావేశ మయ్యారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారితో సమావేశానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించారు. ఎప్పుడో జరిగిన పరిణామాలు ఇప్పుడు ఎందుకని, ఇప్పుడు తెరపైకి తీసుకురావడం వల్ల ఈ తరానికి చెప్పేదేమీ ఉండదని ఆమె భావించినట్లు సమాచారం. అనంతరం ఆయన గుణదలలోని మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) నివాసానికి చేరుకుని సుమారు రెండు గంటలపాటు ఆయనతో చర్చించారు. మధ్యాహ్నం నగర పశ్చిమ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వద్దకు వెళ్లి కొద్దిసేపు గడిపారు. అక్కడి నుంచి వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీకి వెళ్లారు. విద్యార్థులతో గెట్ టుగెదర్ నిర్వహించారు. ఆ తరువాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. -
'నేనే దేవుడ్ని...నేను దేవుడ్ని నమ్మను'
గుంటూరు : మహాభారతంలో హింస కన్నా బెజవాడలోనే ఎక్కువగా హింస జరిగిందని ప్రముఖ దర్శక,నిర్మాత రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. శనివారం కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులతో...వర్మ చర్చావేదిక జరిగింది. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ...'నేనే దేవుడ్ని...నేను దేవుడ్ని నమ్మను. యముడు వచ్చి గొంతుమీద కత్తి పెట్టినా భక్తి సినిమా తీయను' అని వ్యాఖ్యానించారు. మరోవైపు వంగవీటి సినిమా తీయడానికి ఆ కథకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వర్మ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)తో ఆయన ఈరోజు ఉదయం సమావేశమయ్యారు. అలాగే నగరంలోని పలువురి ప్రముఖుల నుంచి వివరాలను ఆయన సేకరిస్తున్నారు. గతరాత్రి వంగవీటి రంగా అనుచరులు, సన్నిహితులతో వర్మ భేటీ అయ్యారు. కాగా వంగవీటి రంగా సతీమణి రత్నకుమారి...వర్మన కలిసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇక తన స్నేహితుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను ఇవాళ ఆయన కలవనున్నారు. -
ఆయన పార్టీ పెడితే చేరుతా : రామ్ గోపాల్ వర్మ
విజయవాడ: తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ముద్రగడను రియల్ మెగా పవర్ స్టార్ అని అభివర్ణించాడు. స్క్రీన్ మెగా పవర్ స్టార్స్ ఫేక్ స్టార్స్ మాత్రమే అని కామెంట్ చేశాడు. తాను రాజకీయాలు, ప్రజా సంక్షేమంపై నమ్మకం లేదని... ఒకవేళ ముద్రగడ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరతానన్నాడు. తాను కాపు వర్గానికి చెందిన వాడిని కాదని... తన మిత్రులు ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పుకొచ్చాడు. వంగవీటి సినిమా తీయడానికి ఆ కథకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వర్మ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తున్నాడు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ సహా పలువురిని కలుస్తానని చెప్పాడు. జూన్ మొదటి వారంలో సినిమా విడుదల చేస్తామంటున్నాడు. రాజకీయాల్లోకి వస్తానంటూ వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు వంగవీటి సినిమా ప్రమోషన్లో భాగంగానే చేసినట్లుగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Mudragadda Padmanabham is the real mega power star and the so called screen mega power stars are just ordinary fake actors — Ram Gopal Varma (@RGVzoomin) February 26, 2016 Mudragadda Padmanabham is the real mega power star and the so called screen mega power stars are just ordinary fake actors — Ram Gopal Varma (@RGVzoomin) February 26, 2016 -
గన్నవరంలో రామ్ గోపాల్ వర్మ హంగామా
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వ్యాఖ్యలు హంగామా సృష్టించాయి. ఓ దశలో వర్మను పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ముందుగా ట్విట్టర్ లో ప్రకటించిన విధంగానే.. వంగవీటి సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు కొందరు వ్యక్తులను కలిసేందుకు ఆయన విజయవాడ పయనమయ్యారు. అయితే 'విజయవాడకు రావద్దంటూ కొందరి నుంచి బెదిరింపులు వస్తున్నాయని.. ఆనాటి రౌడీలతో తిరిగిన నేనే అసలు సిసలైన రౌడీనని, దమ్ముంటే నన్ను అడ్డుకోండంటూ' ప్రయాణం వివరాలను ట్విట్టర్ లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. దాంతో శుక్రవారం సాయంత్రం పెద్ద ఎత్తున అభిమానులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు వర్మను అదుపులోకి తీసుకుంటారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే ఊహాగానాలన్నిటికి తెరదించుతూ రామూ ఎంచక్కా కారెక్కి హోటల్ కి బయలుదేరారు. మొత్తానికి రామూ 'వంగవీటి' సినిమాకి కావలసినంత ప్రచారం పొందటంలో సఫలమయ్యారు. ఆ వాహనంలో వర్మతో పాటు దేవనేని నెహ్రు, వంగవీటి చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా ఉన్నారు. మూడు రోజులపాటు విజయవాడలోనే ఉంటానని.. రంగా, నెహ్రూ కుటుంబసభ్యులను కలవనున్నట్లు వర్మ మీడియాతో చెప్పారు. -
వంగవీటి లోగో
నిజ జీవిత కథలు, వివాదాస్పద చరిత్రలను సినిమాలుగా తెరకెక్కించడానికి ఏమాత్రం వెనుకాడని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి విజయవాడ మీద పడిన సంగతి తెలిసిందే. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో సినిమా తీయనున్న రామూ ఇప్పటికే వంగవీటి పాత్రధారి ఫొటోలతో హల్ చల్ చేశాడు. తాజాగా వంగవీటి టైటిల్ లోగోను గురువారం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశాడు. ఎర్రటి జెండా, కత్తి, గొలుసులతో ఉన్న వంగవీటి సినిమా లోగో రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ లా కనబడుతోంది. ఏదేమైనా వంగవీటి సినిమా ఎనౌన్స్ చేసి విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాడు వర్మ. వంగవీటి కంటే అద్భుతమైన కథ తనకు దొరకదని... 'శివ'తో ప్రారంభమైన తన ప్రస్థానం 'వంగవీటి'తో ఆగిపోతుందని వర్మ ఇదివరకే ప్రకటించాడు. Title logo of "Vangaveeti" pic.twitter.com/iJ2RTs8Slu — Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2016 -
ఈగ విలన్‌తో వర్మ సినిమా
హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చినా రామ్ గోపాల్ వర్మ సౌత్ ఇండస్ట్రీని మాత్రం వదిలిపెట్టడం లేదు. కొంత కాలంగా బాలీవుడ్‌ను వదిలిపెట్టి సౌత్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్న ఈ క్రియేటివ్ జీనియస్, ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టాడు. అయితే ముంబైలో ఆఫీస్ ఓపెన్ చేసిన వర్మ, వరుసగా సౌత్ సినిమాలనే ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో విజయవాడ రాజకీయాల నేపథ్యంలో వంగవీటి సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. తన మార్క్ వివాదాలతో తెర మీదకు వస్తున్న వంగవీటి సినిమా తరువాత కూడా మరో సౌత్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల వీరప్పన్ సినిమాతో శాండల్ వుడ్లో అడుగుపెట్టిన వర్మ మరో కన్నడ సినిమాకు రెడీ అవుతున్నాడు. రాయ్ పేరుతో రూపొందనున్న ఈ సినిమాతో కర్ణాటక మాఫియ నాయకుడు ముత్తప్ప రాయ్ జీవితాన్ని తెరకెక్కించనున్నాడు. కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అతడికి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. -
'ఆకు రౌడీలకు నేనిచ్చే వార్నింగ్'
రామ్‌గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్‌కు పని చెప్పాడు. కొద్ది రోజులుగా పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలేవీ చేయని వర్మ, తన సింగిల్ ఎక్స్ పోస్టర్స్ తోనే హడావిడి చేస్తూ వచ్చాడు. ఇప్పటికే విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో 'వంగవీటి' పేరుతో సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించిన వర్మ, తనకు వస్తున్న బెందిరింపులపై స్పందించాడు. 'ఈ నెల 26న వంగవీటి సినిమాకు సంబందించిన రీసెర్చ్ కోసం విజయవాడ వెళ్తున్నా. విజయవాడ రావొద్దని వార్నింగ్ ఇస్తున్న వాళ్లకు నా కౌంటర్ వార్నింగ్, నేనెప్పుడొస్తా.. ఎక్కడుంటానో చెప్తా.. మీకు దమ్ముంటే ముంబైలో అడుగుపెట్టండి. నాకు వార్నింగ్ ఇస్తున్న రౌడీలమనుకునే ఆకు రౌడీలు బావిలో కప్పలు. ఆ రౌడీలమనుకునే రౌడీలకన్నా ఎక్కువగా నేను విజయవాడను గౌరవిస్తాను. రౌడీగార్లూ.. నేను బందర్ రోడ్‌లోని ఫార్చూన్ హోటల్లో ఉంటా.. నాకు వార్నింగ్ ఇస్తున్న ఇవాల్టీ విజయవాడ రౌడీలు తెలుసుకోవాల్సింది, నేను ఆనాటి రౌడీలతో తిరిగిన అసలు సిసలైన నిజమైన రౌడీని. ఆనాటి గొప్ప రౌడీలతో తిరిగిన నాలాంటి రౌడీకి వార్నింగ్ ఇస్తున్న రౌడీలమనుకునే ఈనాటి ఆకు రౌడీలకు నేనిచ్చే వార్నింగ్'. వంగవీటి సినిమా ఎనౌన్స్ చేసి విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపిన వర్మ ఇప్పుడు విజయవాడలో అడుగుపెట్టి ఇంకెన్నీ సంచలనాలు నమోదు చేస్తాడో. అసలు వర్మ విజయవాడ పర్యటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. Going to Vijayawada on 26th to meet some people for the research on "Vangaveeti" — Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2016 Vijayawada raavaddhani warning isthunna vaallaki naa counter warning neneppudostha yekkadunta cheptha.meeku dammunte mumbailo adugu pettandi — Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2016 Naaku warning isthunna rowdylamanukune aakurowdylu baavilo kappalu..Vijayawadani nenu aa rowdylamanukune rowdylakanna yekkuva gauravistha — Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2016 Dear Guest, Your PNR: 02RDV8 for Flight: LB636 HYD-VGA Date: 26/02/2016 Dep.Time: 11:25hrs. Happy Flying! air costa — Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2016 Rowdygaarloo,I will be staying at Fortune hotel Bandar road in Vijaywada ..ex Khandari Hotel — Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2016 Aanaati goppa rowdylatho thirigina naa laanti rowdiki warning isthunna rowdylamanukune eenaati aaku rowdylaki nenichche warning -
'వర్మను అడ్డుకోండి.. 'వంగవీటి' వద్దు'
విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త వివాదంలో చిక్కుకోనున్నారు. ఆయనపై విజయవాడకు చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ కొత్తగా దర్శకత్వం వహించనున్న చిత్రం 'వంగవీటి' ఆపేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకప్పుడు విజయవాడను గడగడలాడించిన వంగవీటి రాధ కథ ఆధారంగా తాను వంగవీటి చిత్రాన్ని తీస్తున్నానని, ఇదే తెలుగులో తన ఆఖరి చిత్రం అవుతుందని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చింది. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో మరోసారి టెన్షన్ మొదలవుతుందని, వర్మ ఆ చిత్రాన్ని తెరకెక్కించడం ఆపేయాలంటూ గ్లోబల్ గాంధీ ట్రస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వంగవీటి చిత్ర నిర్మాణాన్ని నిలువరించాలని ట్రస్టు విజయవాడ ఇంఛార్జి సీపీ ఎన్వీ సురేందర్ బాబు ఫిర్యాదులో కోరారు. 'రామ్ గోపాల్ వర్మ చిత్రం వంగవీటి ద్వారా ప్రశాంతంగా ఉన్న నగరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలని అనుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆ చిత్ర నిర్మాణాన్ని ఆపేయాలి' ఆయన కోరారు. -
'వంగవీటి'పై బెజవాడ సీపీకి ఫిర్యాదు
విజయవాడ : ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'వంగవీటి' సినిమాపై గాంధీ గ్లోబల్ ట్రస్ట్ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ చిత్రం కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందంటూ వాళ్లు గురువారం విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన మళ్లీ తెర మీదకు వస్తే బెజవాడలో ప్రశాంతత దెబ్బతింటుందని అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రంపై వర్మ రోజుకో వార్తతో న్యూస్ లో ఉంటున్న విషయం తెలిసిందే. -
‘వంగవీటి’ తర్వాత తెలుగు సినిమా చేయను!
రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ళ క్రితం పరిటాల రవి కథతో ‘రక్త చరిత్ర’. నిన్న... గంధపు చెక్కల స్మగ్లర్ వీర ప్పన్పై ‘కిల్లింగ్ వీరప్పన్’... మరి ఇప్పుడు? విజయవాడకు చెందిన రాధా, రంగాల జీవి తంపై తీస్తున్న ‘వంగవీటి’! దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు! ‘‘ ‘వంగవీటి’ చిత్రం తర్వాత నేను తెలుగులో సినిమాలు తీయను’’ అని ఆయన తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. విజయవాడ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘వంగవీటి’ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ- ‘‘నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే అయినా నిజంగా పుట్టింది, పెరిగింది విజయవాడలోనే. నాకు బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు, చంపుకోవడాల గురించి తెలిసింది విజయవాడలోనే. అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ‘రక్తచరిత్ర’కి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్లో తీయబోతున్న ‘వంగవీటి’కి ఉన్న తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడానే. 30 ఏళ్ల క్రితం విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు రౌడీయిజం రూపాన్ని, ఆంతర్యాన్ని చూశాను. అక్కడి రౌడీయిజం గురించి నా కంటే ఎక్కువ తెలిసినవారు విజయవాడలో కూడా లేరు. చలసాని వెంకటరత్నాన్ని రాధా చంపడంతో ప్రారంభమైన విజయవాడ రౌడీయిజం రంగాను చంపడంతో ఎలా అంతమైందో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘శివ’తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం ‘వంగవీటి’తో ముగించాలనుకోవడానికి కారణం ఉంది. ‘వంగవీటి’ కంటే నిజమైన గొప్ప కథ మళ్లీ నాకు జీవితంలో దొరకదని కచ్చితంగా తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని తెలిపారు. -
వంగవీటి చిత్రంపై వర్మ ఇంటర్వ్యూ
హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తర్వాతి చిత్రం 'వంగవీటి' విశేషాలను వెల్లడించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సాక్షి టీవీకి వర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. వంగవీటి చిత్రం గురించి వివరాలను తెలియజేయనున్నట్టు వర్మ ట్వీట్ చేశారు. 'కిల్లింగ్ వీరప్పన్' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన రాంగోపాల్ వర్మ తన తదుపరి సినిమా పేరును ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. My interview on the details of the film "Vangaveeti" on Sakshi channel at 3.30 pm today — Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2016 -
నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి'
-
నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ
'కిల్లింగ్ వీరప్పన్' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన తదుపరి సినిమా పేరును ప్రకటించారు. 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. 'కిల్లింగ్ వీరప్పన్'తో మళ్లీ మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందగలనని రాంగోపాల్ వర్మ నిరూపించకున్నారు. ఇప్పటికే కన్నడంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుతోంది. ఈ నెల 7న 'కిల్లింగ్ వీరప్పన్' తెలుగులో విడుదల కానుంది.