వంగవీటి కథతో మరో సినిమా | Gv Sudhakar Naidu Movie on Vangaveeti | Sakshi
Sakshi News home page

వంగవీటి కథతో మరో సినిమా

Published Tue, Dec 27 2016 4:52 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

వంగవీటి కథతో మరో సినిమా

వంగవీటి కథతో మరో సినిమా

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కిన వంగవీటి సినిమా ఎన్నో వివాదాలకు కేంద్రబిందువయ్యింది. వంగవీటి అభిమానులు కుంటుంబ సభ్యుల విమర్శలు వర్మ ప్రతి విమర్శలతో పరిస్థితి మరింత వేడెక్కుతోంది. తాజాగా నేను తీసిన సినిమా తప్పయితే అసలైన వంగవీటి కథను సినిమాగా చూపించండి అంటూ ప్రకటించాడు వర్మ.

వర్మ విసిరిన సవాలుకు వంగవీటి ఫ్యామిలీ, ఫ్యాన్స్ స్పందించకపోయినా.. ఓ ఫిలిం టెక్నీషియన్ మాత్రం స్పందించాడు. గతంలో శ్రీకాంత్ హీరోగా రంగ ది దొంగ, నితిన్ హీరోగా హీరో లాంటి సినిమాలను తెరకెక్కించిన ఫైట్ మాస్టర్ జీవీ.. వంగవీటి కథతో సినిమా చేస్తానంటూ ప్రకటించాడు. వచ్చే ఏడాది ఇదే సమయానికి వంగవీటికి సంబంధించిన అసలైన చరిత్రతో ఆయన గొప్పదనాన్ని తెలియజేసేలా సినిమా వస్తుందని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement