Gv Sudhakar Naidu
-
కూకట్పల్లి నుంచి పోటీచేస్తా : సినీనటుడు
కేపీహెచ్‌బీకాలనీ: ప్రముఖ సినీనటుడు జీవీ సుదాకర్‌నాయుడు కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. ఐ లవ్ కూకట్పల్లి పేరుతో ప్రచారం చేపట్టి నియోజకవర్గంలోని ప్రజలందరిని కలవనున్నట్లు తెలిపారు. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డుకాలనీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే పూర్తిస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నట్లు ప్రకటించారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను ఓట్ల కోసం విభజించి పాలిస్తున్న పాలకులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పాలన సాగిస్తున్న పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయన్నారు. అంతకుముందు ధర్మారెడ్డికాలనీ ఫేజ్ 1లో వినాయక మండపం వద్ద స్థానిక కాలనీవాసులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. -
150 ఎపిసోడ్లతో రంగా టెలీ సీరియల్
-
150 ఎపిసోడ్లతో రంగా టెలీ సీరియల్: జీవీ
సాక్షి, విజయవాడ: వంగవీటి రంగాపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు టెలీ సీరియల్ నిర్మించనున్నట్లు సినీ నటుడు జి.వి.సుధాకర్‌నాయుడు ప్రకటించారు. ప్రజల గుండెల్లో ఉన్న ఆయన గురించే ఈ సీరియల్ ఉంటుందన్నారు. రంగా వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలోని రాఘవయ్య పార్కులో గల ఆయన విగ్రహానికి జీవీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీరియల్లో అన్నీ వాస్తవాలే ఉంటాయన్నారు. ఇందుకు దేవినేని అనుమతి అవసరం లేదని, అభ్యంతరాలు చెబితే వారిని కూడా కలుస్తానని చెప్పారు. వర్మ తనకున్న మేథాశక్తి మేరకే వంగవీటి సినిమా తీశారని, అందులో కొన్ని తీశారు.. కొన్ని దాచారని అన్నారు. వర్మ దగ్గర మరో సినిమా ఉందంటూ అది ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. వాస్తవాలు కటువుగా ఉంటాయి.. అందరి పేర్లు పెట్టే సీరియల్ చేస్తాను.. ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేనని వ్యాఖ్యానించారు. దాసరి నారాయణరావు నా గురువు.. వంగవీటి రంగాపై సినిమా తీయాలని ఆయన చివరి దశలో నన్ను కోరారని చెప్పారు. రంగా చరిత్ర మొత్తం ఆరున్నర గంటలపాటు చిత్రీకరించాల్సి ఉందని, అందుకే సినిమాగా కాక టెలీ సీరియల్‌గా తీస్తున్నామని, 150 ఎపిసోడ్ల వరకు ఉంటుందని జీవీ వివరించారు. -
‘నంది’ వివాదంపై జీవీ ఘాటు వ్యాఖ్య
సాక్షి, రామచంద్రపురం రూరల్: ఇటీవల ప్రకటించిన నంది అవార్డులతో చిత్ర పరిశ్రమను, నంది అవార్డులను ‘ఎల్లో’(పచ్చ)గా మార్చేశారని సినీ నటుడు జీవీ సుధాకర్ నాయుడు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. విజయవాడలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంపై స్పందిస్తూ... బోటు యజమాని రాష్ట్ర మంత్రి అయినందువల్లే ఆ విషయాన్ని మీడియాపరంగా తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు తాను కావాలని రాలేదని, బంధువైన దాసరి నారాయణరావు నటించాలని కోరడంతో కాదనలేకే నటించానన్నారు. అంతఃపురం చిత్రంతో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. తనకు చిరంజీవిపై ఉన్న అభిమానం తెలిసిన దాసరి.. చిరంజీవి పేరులోని చివరి రెండు అక్షరాలు అయిన ‘జీవి’ని తన పేరు ముందు కలిపారని, అదే స్థిరపడిపోయిందని చెప్పారు. హైదరాబాద్‌లో 100 మంది పేద ముస్లిం పిల్లలను స్నేహితులతో కలసి పదేళ్లుగా చదివిస్తున్నానని, దీనిపై ఏనాడూ ప్రచారం చేసుకోలేదన్నారు. స్వీయ దర్శకత్వంలో తానే నిర్మాతగా వంగవీటి సినిమా తీస్తానని సుధాకర్‌నాయుడు చెప్పారు. -
వంగవీటి కథతో మరో సినిమా
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కిన వంగవీటి సినిమా ఎన్నో వివాదాలకు కేంద్రబిందువయ్యింది. వంగవీటి అభిమానులు కుంటుంబ సభ్యుల విమర్శలు వర్మ ప్రతి విమర్శలతో పరిస్థితి మరింత వేడెక్కుతోంది. తాజాగా నేను తీసిన సినిమా తప్పయితే అసలైన వంగవీటి కథను సినిమాగా చూపించండి అంటూ ప్రకటించాడు వర్మ. వర్మ విసిరిన సవాలుకు వంగవీటి ఫ్యామిలీ, ఫ్యాన్స్ స్పందించకపోయినా.. ఓ ఫిలిం టెక్నీషియన్ మాత్రం స్పందించాడు. గతంలో శ్రీకాంత్ హీరోగా రంగ ది దొంగ, నితిన్ హీరోగా హీరో లాంటి సినిమాలను తెరకెక్కించిన ఫైట్ మాస్టర్ జీవీ.. వంగవీటి కథతో సినిమా చేస్తానంటూ ప్రకటించాడు. వచ్చే ఏడాది ఇదే సమయానికి వంగవీటికి సంబంధించిన అసలైన చరిత్రతో ఆయన గొప్పదనాన్ని తెలియజేసేలా సినిమా వస్తుందని వెల్లడించాడు.