
సాక్షి, రామచంద్రపురం రూరల్: ఇటీవల ప్రకటించిన నంది అవార్డులతో చిత్ర పరిశ్రమను, నంది అవార్డులను ‘ఎల్లో’(పచ్చ)గా మార్చేశారని సినీ నటుడు జీవీ సుధాకర్ నాయుడు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. విజయవాడలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంపై స్పందిస్తూ... బోటు యజమాని రాష్ట్ర మంత్రి అయినందువల్లే ఆ విషయాన్ని మీడియాపరంగా తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్ర పరిశ్రమకు తాను కావాలని రాలేదని, బంధువైన దాసరి నారాయణరావు నటించాలని కోరడంతో కాదనలేకే నటించానన్నారు. అంతఃపురం చిత్రంతో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. తనకు చిరంజీవిపై ఉన్న అభిమానం తెలిసిన దాసరి.. చిరంజీవి పేరులోని చివరి రెండు అక్షరాలు అయిన ‘జీవి’ని తన పేరు ముందు కలిపారని, అదే స్థిరపడిపోయిందని చెప్పారు. హైదరాబాద్‌లో 100 మంది పేద ముస్లిం పిల్లలను స్నేహితులతో కలసి పదేళ్లుగా చదివిస్తున్నానని, దీనిపై ఏనాడూ ప్రచారం చేసుకోలేదన్నారు. స్వీయ దర్శకత్వంలో తానే నిర్మాతగా వంగవీటి సినిమా తీస్తానని సుధాకర్‌నాయుడు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment