
కైరో:ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదశాత్తు మునిగిపోయింది. ఈజిప్టు తీరానికి దగ్గరలో జరిగిన ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. మునిగిపోయినపుడు బోటులో మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 31 మంది టూరిస్టులు కాగా 13 మంది సిబ్బంది.
ప్రమాదం నుంచి 28 మందిని కాపాడినట్లు రెడ్‌సీ గవర్నరేట్ వెల్లడించింది.వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపింది.సముద్రంలో బోటును ఒక్కసారిగా అల వచ్చి బలంగా ఢీకొట్టడంతో బోటు మునిగినపోయినట్లు అధికారులు వెల్లడించారు.
అల బలంగా తాకినపుడు కొంత మంది ప్యాసింజర్లు వారి క్యాబిన్లలో ఉండడం వల్ల తప్పించుకోలేకపోయారని తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు జరుగుతోందని చెప్పారు.

Comments
Please login to add a commentAdd a comment