22 dead as tourist boat capsizes in Kerala's Malappuram - Sakshi
Sakshi News home page

కేరళలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 22 మంది మృతి

Published Mon, May 8 2023 7:21 AM | Last Updated on Mon, May 8 2023 10:44 AM

Kerala Malappuram Tanur Boat Accident Many Dead - Sakshi

తిరువనంతపురం: కేరళలోని మలప్పురంలో విషాద ఘటన జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో తానూర్‌లోని పర్యాటక ప్రాంతం తూర్వాల్‌ తీరమ్‌ వద్ద ఘటన చోటుచేసుకుంది. ప్రమాద  సమయంలో దాదాపు 40 మంది బోటులో ఉన్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యల్లో ఆరుగురిని కాపాడామని  యంత్రాంగం తెలిపింది.

రూ.2లక్షల పరిహారం..
ఈ విషాధ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రూ.2లక్షల పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

సీఎం విచారం..
ఈ బోటు ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌పై జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు, సన్నిహితులకు సంతాపం తెలిపారు.

చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement