Malappuram
-
బీజేపీ నుంచి ఏకైక ముస్లిం అభ్యర్థి ఈయనే..
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) ఇటీవల 195 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఇందులో ఒకే ఒక పేరు ప్రత్యేకంగా నిలుస్తోంది. అదే కేరళలోని మలప్పురం నియోజకవర్గం అభ్యర్థి 71 ఏళ్ల డాక్టర్ అబ్దుల్ సలామ్. ఎందుకంటే బీజేపీ ప్రకటించిన జాబితాలో ఏకైక ముస్లిం అభ్యర్థి ఈయనే.. విద్యావేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సలామ్ 2019లో బీజేపీలో చేరారు. ‘ది క్వింట్’ కథనం ప్రకారం.. రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి లేనప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రభావితుడై రాజకీయాల్లోకి వచ్చారు. 2022 జూలై నుంచి లోక్‌సభలో గానీ, రాజ్యసభలోగానీ బీజేపీకి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. మలప్పురం స్థానంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) అభ్యర్థి ఈటీ మహమ్మద్ బషీర్, సీపీఎం అభ్యర్థి వి.వసీఫ్లపై అబ్దుల్ సలామ్ పోటీ చేయనున్నారు. మలప్పురం నియోజకవర్గం డీలిమిటేషన్‌కు ముందు మంజేరిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)లో భాగమైన ఐయూఎంఎల్కి కంచుకోటగా ఉంది. ఎవరీ అబ్దుల్ సలామ్? మలప్పురంలో జన్మించిన అబ్దుల్ సలామ్ పీహెచ్డీ చేశారు. 2011 నుంచి 2015 వరకు కాలికట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. కేరళలో యూడీఎఫ్ అధికారంలో ఉన్న సమయంలో ఐయూఎంఎల్ ద్వారానే ఆయనకు ఈ పదవి వచ్చినట్లు సమాచారం. అబ్దుల్ సలామ్ బీజేపీలో చేరిన రెండు సంవత్సరాల తరువాత అంటే 2021లో తిరుర్ స్థానం నుండి కేరళ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఐయూఎంఎల్ అభ్యర్థి కురుక్కోలి మొయిదీన్ చేతిలో 70,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా సలాం బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు కూడా. -
పోలీస్ స్టేషన్ పైనే యువకుల ట్రెండింగ్ వీడియో.. చివరికి..
తిరువనంతపురం: సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం తెగ పరితపిస్తుంటారు. వినూత్న రీతిలో వీడియోలు పెడుతూ లైకులు, వ్యూస్ చూసుకుని సంబరపడిపోతుంటారు. ఈ మైకంలోపడి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు. ఇలాగే సోషల్ మీడియా పిచ్చి కేరళ యువకులను కటకటాలపాలు చేసింది. ఇంతకూ వారు ఏం చేశారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..? ఖాలీగా ఉన్న సమయాన్ని ఏం చేయాలో తెలియని ఐదుగురు యువకులు ట్రెండ్ అయ్యే వీడియో చేయాలనుకున్నారు. అందుకు ఏకంగా పోలీసు స్టేషన్‌నే ఎంచుకున్నారు. తమకు తెలిసిన యానిమేషన్ స్కిల్స్ ఉపయోగించి స్టేషన్లో బాంబు పేలుడు సంభవించినట్లు ఓ వీడియో తయారు చేశారు. అంతేకాకుండా సినిమాల్లోని వచ్చే పాపులర్ డైలాగ్‌లను ఉపయోగించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది కాస్త ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో అది పోలీసుల కంట పడింది. దర్యాప్తు చేపట్టిన స్థానిక మేలట్టూరు పోలీసులు.. మహ్మద్ రియాజ్(25), మహ్మద్ ఫావేజ్(22), మహ్మద్ జాష్మైన్(19), సాలిమ్ జిషాజియాన్(20), సాల్మానుల్ పారిస్(19)లను నిందితులుగా గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే ఇదంతా చేశారని పోలీసులు గుర్తించారు. ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: విరిగిపడిన కొండచరియలు.. కుప్పకూలిన ఇళ్లు.. వీడియో వైరల్.. -
కేరళ లోని మలపురంలో హౌస్ బోటు ప్రమాద ఘటన
-
కేరళ బోటు విషాదం.. ప్రమాదానికి కారణాలు అవేనా?
కేరళలో జరిగిన బోటు ప్రమాదం 22 మందిని పొట్టన పెట్టుకుంది. ఆదివారం సెలవు కావడంతో సంతోషంగా గడిపేందుకు వచ్చిన అనేక కుటుంబాల్లో తీరాన్ని విషాదాన్ని నింపింది. మలప్పురం జిల్లాలో డబుల్ డెక్కర్ హౌజ్ బోటు మునిగిపోవడంతో అందులోని టూరిస్టులంతా నీటిలో పడిపోయిన విషయం తెలిసిందే. తానూర్ ప్రాంతంలోని తువల్తీరం బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనలో బోటు యజమానిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణాలు! గా పడవ బోల్తా పడటానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాద సమయంలో బోటులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానికిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోటులో సామర్థానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ఇద్దరు మహిళలు మృతి నిబంధనల ఉల్లంఘన బోటు మునిగిపోవడం చాలా విషాదకరమైన, దురదృష్టకర సంఘటన అని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎమ్మెల్యే కున్హాలికుట్టి విచారం వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత హౌస్‌బోట్స్ రైడ్స్‌కు వెళ్లేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన హౌస్‌బోట్‌కు ఎలాంటి సేఫ్టీ సర్టిఫికేట్ కూడా లేదు. 40 మంది టికెట్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే చాలామంది టికెట్ తీసుకోకుండానే పడవ ఎక్కిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అండర్ వాటర్ కెమెరాల సాయంతో గాలింపు మలప్పురం బోటు దుర్ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు చిన్నారులు సహా 22 మంది మృత్యువాత పడ్డారు.వీరిలో 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో ఎనిమిది మందిని కాపాడి ఆసుప్రతికి తరలించారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో విహారయాత్రకు వచ్చి వీరంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారికోసం ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అండర్ వాటర్ కెమెరాల సాయం గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. చదవండి: షాకింగ్.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం.. 10 నిమిషాల పాటు.. ప్రముఖుల సంతాపం బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుంటుబాలకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రెండు లక్షల ఎక్స్‌గ్రేషియాను మోదీ ప్రకటించారు. మలప్పురంలో హౌజ్ బోటు బోల్తాపడిన వార్తతో ఆందోళన చెందానని, తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు రాహుల్ గాంధీ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రెస్క్యూ ఆపరేషన్లలో అధికారులకు సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఘటనా స్థలానికి సీఎం పినరయి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బోటు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణమే అత్యవసర సహాయక చర్యను చేపట్టాలని మలప్పురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సోమవారం ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అదే విధంగా బోటు ఘటన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా నేడు సంతాపదినం ప్రకటించారు. అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. తానూర్‌కు చెందిన స్థానికులతో పాటు పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్యశాఖ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
కేరళలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 22 మంది మృతి
తిరువనంతపురం: కేరళలోని మలప్పురంలో విషాద ఘటన జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో తానూర్‌లోని పర్యాటక ప్రాంతం తూర్వాల్ తీరమ్ వద్ద ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది బోటులో ఉన్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యల్లో ఆరుగురిని కాపాడామని యంత్రాంగం తెలిపింది. రూ.2లక్షల పరిహారం.. ఈ విషాధ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రూ.2లక్షల పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi — PMO India (@PMOIndia) May 7, 2023 సీఎం విచారం.. ఈ బోటు ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌పై జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు, సన్నిహితులకు సంతాపం తెలిపారు. Deeply saddened by the tragic loss of lives in the Tanur boat accident in Malappuram. Have directed the District administration to effectively coordinate rescue operations, which are being overseen by Cabinet Ministers. Heartfelt condolences to the grieving families & friends. — Pinarayi Vijayan (@pinarayivijayan) May 7, 2023 చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత -
సంచలన తీర్పు.. ఆ తండ్రికి మూడు యావజ్జీవ ఖైదుల శిక్ష
మలప్పురం: వావీవరుసలు లేకుండా ప్రవర్తించే మృగాల పట్ల కఠినంగా వ్యవహారించాల్సిన అవసరం ఉంటుందని కేరళలోని ఓ స్థానిక కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కన్నతండ్రి ముసుగుతో దారుణానికి పాల్పడ్డ ఓవ్యక్తికి ఏకంగా మూడు యావజ్జీవ ఖైదుల శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. కేరళ మంజేరీ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు 2021లో జరిగిన ఓ ఘోరానికి గానూ తాజాగా శిక్ష ఖరారు చేసింది. కన్నకూతురిపైనే మృగవాంఛ తీర్చుకున్న ఓ వ్యక్తికి మూడు జీవిత ఖైదుల శిక్ష విధిస్తూ.. జీవితాంతం అతను జైల్లోనే మగ్గాలని తేల్చి చెప్పింది. పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఈ శిక్షలు ఖరారు చేస్తున్నట్లు న్యాయమూర్తి రాజేష్ కే వెల్లడించారు. అంతేకాదు నిందితుడికి ఆరున్నర లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారాయన. మార్చి 2021లో తొలిసారిగా బాలికపై లైంగిక దాడి జరిగింది. కరోనా సమయంకావడంతో ఆమె ఆన్లైన్లో క్లాసులు వింటోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన ఆమె తండ్రి.. కూతురిని లాక్కెళ్లి బెడ్రూమ్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే.. తల్లిని చంపేస్తానని బెదిరించాడు. అలా ఆరు నెలలపాటు సొంత కూతురిపైనే అతను పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె గర్భవతి అనే షాకింగ్ విషయం తేలింది. దీంతో కన్నతండ్రే ఆ పాపానికి ఒడిగట్టాడని వాపోయింది బాధితురాలు. వెంటనే వాలిక్కడవు పోలీసులను ఆశ్రయించిన ఆ తల్లి.. భర్తపై ఫిర్యాదు చేసి కటకటాల వెనక్కి నెట్టింది. వైద్య పరీక్షల్లో(డీఎన్ఏ అనలైసిస్) ఆ వ్యక్తే లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఆలస్యం జరగకుండా ఉండేందుకు.. ఫాస్ట్ ట్రాక్ ద్వారా కోర్టు ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందడం గమనార్హం. -
న్యూ ఇయర్ రోజు విషాదం.. టూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా..
తిరువనంతపురం: నూతన సంవత్సరం వేళ కేరళ మలప్పురంలోని తిరూర్‌లో విషాదం జరిగింది. టూర్‌కు వెళ్లి తిరిగివస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఆదివారం ఉదయం 1:15 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో 40 మంది గాయపడ్డారు. అయితే కొండ ప్రాంతంలో బస్సు నడిపిన అనుభవం డ్రైవర్‌కు లేకపోవడం కారణంగా బస్సు నియంత్రించలేకపోయినట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణం కూడా సరైన ప్లాన్ లేకుండా జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాత్రి వేళ కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురైంది. చదవండి: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం -
కేరళలో ‘మీజిల్స్’ పంజా.. 160 మంది చిన్నారులకు వైరస్
తిరువనంతపురం: చిన్నారులకు సోకే మీజిల్స్ వ్యాధి దేశంలో మరో రాష్ట్రానికి పాకింది. ఇప్పటికే మహారాష్ట్రలో వందల కేసులు నమోదు కాగా.. తాజాగా కేరళలోనూ భారీగా కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటి వరకు 160 మంది పిల్లలకు వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులోనూ మలప్పురమ్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించకపోవటం ఊరట కలిగిస్తోందని తెలిపింది. మీజిల్స్ వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో మీజిల్స్ వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. మలప్పురమ్‌లో పర్యటన అనంతరం ఆరోగ్య శాఖ కార్యదర్సితో నిపుణులు భేటీ కానున్నారు. మరోవైపు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు ఆరోగ్య శాఖ మంత్రి మీనా జార్జ్. అయితే, తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ‘మలప్పురమ్‌లో మీజిల్స్ వైరస్‌ను గుర్తించిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశాం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో భేటీలో జయపురపైనా సమీక్షించాం. ప్రజల భాగస్వామ్యంతో వైరస్‌పై పోరాడేందుకు ప్రజాహిత చర్యలు తీసుకుంటున్నాం. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టాం.’ అని ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. జిల్లాలో అవసరమైన ఎంఆర్ వ్యాక్సిన్, విటమిన్ ఏ సిరప్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇదీ చదవండి: మహారాష్ట్రకు మరో టెన్షన్.. మీజిల్స్ వైరస్‌తో చిన్నారులు మృతి -
వారం రోజులపాటు కారులోనే దాగి ఉన్న కోబ్రా... బిత్తరపోయిన యజమాని
తిరువనంతపురం: కేరళలోని ఆర్పూకర నివాసి సుజిత్ ఆగస్టు 2న మలప్పురం వెళ్లారు. అక్కడ వజికడవు చెక్‌పోస్ట్ వద్ద తన కారు ఆగింది. ఆ సయమంలోనే ఒక విషసర్పం కారు వద్దకు వచ్చి అందులో దాగి ఉంది. ఈ విషయం తెలియని కారు యజమాని సుజిత్ ఆర్పూకర్లో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. సుజిత్ ఒక రోజు కారులో వేలాడుతున్న కుబుసం చూసి ఒక్కసారిగా హడలిపోతాడు. దీంతో ఈ విషసర్పం ఇక్కడే ఎక్కడే సంచరిస్తుందని సుజిత్ తన ఇంటి కాంపౌండ్‌ని, కారుని మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తాడు. అయినా ప్రయోజం ఉండదు. దీంతో సుజిత్ కుటుంబం ఒకింత భయబ్రాంతులకు గురైంది. ఈ విషయాన్ని తన చుట్టుపక్కల వాళ్లకు తెలియజేశాడు. ఐతే అక్కడ ఉన్న కొంతమంది స్థానికు పాము కారు వద్ద ఉండటం చూశామని చెప్పడంతో వన్యప్రాణుల సిబ్బందిని పిలిపించారు. వారు వచ్చినప్పుడూ గానీ తెలియలేదు పాము ఎక్కడ ఉందనేది. ఆ విషసర్పం ఏకంగా కారు ఇంజన్ బేస్‌లో ఉంది. బహుశా వజికడుపు చెక్ పోస్ట్ వద్ద ఆగినప్పుడే ఈ పాము వచ్చి ఉంటుందని భావించారు అంతా. అంతేకాదు ఈ పాము ఏకంగా కారు ఇంజన్ బేలోనే వారం రోజులపాటు ఉంది. అలాంటి విషసర్పం సంచరించని ప్రదేశంలోకి వస్తే ఎవరైన కలవరపాటుకి గురవ్వడం సహజమే. (చదవండి: బస్సులో నుంచుని వెళ్లడం ఇష్టం లేక...ఏం చేశాడంటే...) -
తల్లీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం
తిరువనంతపురం: ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. ఒక్కోసారి ఒకే ఇంట్లో ఇద్దరు, లేదా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. కానీ, ఒకేసారి తల్లీకొడుకులకు ఉద్యోగం రావటం చూశారా? అవునండీ.. కేరళలో ఈ సంఘటన జరిగింది. మలప్పురమ్‌కు చెందిన బిందు అనే మహిళ, ఆమె కుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. బిందు తన కుమారుడు 10వ తరగతి చదువుతున్న సమయంలో అతడిని ప్రోత్సహించేందుకు పుస్తకాలు చదవటం ప్రారంభించారు. అదే ఆమెను కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) పరీక్షలవైపు మళ్లించింది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడితో పాటు ఉద్యోగం సాధించారు. 42 ఏళ్ల బిందు.. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్(ఎల్జీఎస్) పరీక్షలో 92వ ర్యాంకు సాధించారు. 24 ఏళ్ల ఆమె కుమారుడు లోవర్ డివిజనల్ క్లర్క్(ఎల్డీసీ) పరీక్షలో 38వ ర్యాంక్ సాధించాడు. ఈ విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు బిందు. కుమారుడిని ప్రోత్సహించేందుకు చదువు మొదలు పెట్టిన బిందు.. ఆ తర్వాత కోచింగ్ సెంటర్లో చేరారు. కుమారుడి డిగ్రీ పూర్తవగానే అతడిని సైతం కోచింగ్ సెంటర్లో చేర్పించారు. రెండు సార్లు ఎల్జీఎస్, ఒకసారి ఎల్డీసీ పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. నాలుగో సారి విజయాన్ని అందుకున్నారు. అయితే.. తన లక్ష్యం ఐసీడీఎస్ సూపర్వైజర్ పరీక్ష అని... ఎల్జీఎస్ బోనస్ అని పేర్కొన్నారు బిందు. గత 10 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదీ చదవండి: Lucknow Hospital Video: బర్త్ డే పార్టీ పేరుతో ఆసుపత్రిలో విద్యార్థుల హల్చల్.. వీడియో వైరల్! -
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అపశ్రుతి.. చూస్తుండగానే కుప్పకూలింది
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగానే ఒక్కసారిగా ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలప్పురం జిల్లాలోని పూంగోడ్‌లో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి పూంగోడ్‌లోని ఎల్పీ స్కూల్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో ప్రేక్షకులు పోటెత్తారు. సామర్థ్యానికి మించి రావడంతో మైదానంలోని గ్యాలరీలు నిండిపోయాయి. అయితే ప్రేక్షకులు మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఒకవైపు ఉన్న గ్యాలరీ కుప్పకూలిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ఏకంగా 8వేల మంది హాజరైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Nicholas Pooran: 'ఒక్క సీజన్ మాత్రమే చెత్తగా ఆడాను.. నేనేంటో చూపిస్తా' బీర్ బాటిల్‌తో మ్యాచ్ రిఫరీ తల పలగొట్టాడు.. అంతటితో ఊరుకోకుండా #WATCH Temporary gallery collapsed during a football match in Poongod at Malappuram yesterday; Police say around 200 people suffered injuries including five with serious injuries#Kerala pic.twitter.com/MPlTMPFqxV — ANI (@ANI) March 20, 2022 -
Shabana: గాయం పైకి కనిపిస్తే కట్టు కట్టవచ్చు.. మరి లోపల తగిలితే?
గాయం పైకి కనిపిస్తే కట్టు కట్టవచ్చు. లోపల తగిలితే? జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వార్థక్యంలోకి వచ్చిన పెద్దలు అయినవారి నిరాదరణ వల్ల మరింత గాయపడుతున్నారు. వారి బాధను ఎవరు వినాలి? నర్సుగా పని చేసే షబానా ఈ పెద్దవాళ్ల బాధలను చూసి కరిగిపోయింది. వారికి ప్రేమను పంచుతూ సమాజానికి ట్రీట్మెంట్ ఇస్తోంది. నయమైన సమాజం ఆమెలాగా మారితే ఎంత బాగుంటుంది? ‘పెద్దవాళ్లు తమ పిల్లల నుంచి ఆశించేదేమిటి చెప్పండి’ అంటుంది షబానా. కేరళలోని మలప్పురంకు పన్నెండు మైళ్ల దూరంలో ఉండే తిరురంగడి అనే చిన్న మున్సిపాల్టీలో ఆమె ఇప్పుడు వృద్ధుల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఇద్దరు పిల్లల తల్లి... తనకూ సంసారం బాధ్యతలు ఉన్నాయి. గతంలో డెంటల్ హాస్పిటల్లో నర్సుగా చేసేది. ఇప్పుడు మానేసింది. కాని అంతకన్నా ముఖ్యమైన పని చేస్తోంది. అది– వృద్ధులను ఆదరించడం. ‘పెద్దవాళ్లు మహా అయితే ఒక పలకరింపు కోరుతారు. ముఖ్యంగా ఆడవాళ్లు తమ జుట్టును ఎవరైనా నూనె రాసి ముడి వేయాలని, తమకు స్నానం చేయించాలని, తమను ప్రేమగా ఒకసారి హత్తుకోవాలని, తాము చెప్పే మాటలు కాసేపు వినాలని, తమకు ధైర్యం చెప్పాలని, తమతో ఒక సెల్ఫీ దిగాలని, తమకు ఫలానాది ఎవరైనా వొండి పెడితే బాగుండు అని... ఇంతే వారు కోరుకునేది. దురదృష్టం ఏమిటంటే అది ఇవ్వడానికి కూడా చాలామంది సంతానం నిర్లక్ష్యం చేస్తున్నారు’ అంటుంది షబానా. లాక్‌డౌన్‌కు ముందు షబానా తన నర్సు ఉద్యోగం చేస్తూనే అప్పుడప్పుడు ఇళ్లల్లో ఉండే వృద్ధురాళ్ల వైద్య అవసరాల కోసం వృత్తిగతంగా కలిసేది. ఆ పని ఏదో ప్రొఫెషనల్‌గా మొక్కుబడిగా కాకుండా ఆత్మీయంగా చేసేది. ఆమె వారికి చాలా నచ్చేది. ఆమె రాక కోసం వారు ఎదురు చూసేవారు. ‘ఏమిటి... ఇలాంటి వారితో ఆదరంగా మాట్లాడే ఒక్క మనిషీ కరువైపోతున్నాడా?’ అని షబానాకు అనిపించింది. అప్పుడే కరోనా లాక్డౌన్ వచ్చింది. ఇక చేసిన ఉద్యోగం చాలు అని పూర్తిగా ఆ ఊళ్లోని, చుట్టుపక్కల పల్లెల్లోని వృద్ధురాళ్ల బాధ్యత తీసుకుంది. ‘నేను చూసే స్త్రీలందరూ దాదాపుగా వాళ్ల ఇళ్లల్లోనే అనాథలుగా ఉన్నవాళ్లు. కొడుకులు, కూతుళ్లు నిర్లక్ష్యం చేస్తే ఆ ఇళ్లల్లో ఏదో ఒక మూలన పడి ఉంటారు. అలాంటి వారికి నేను కేర్ టేకర్‌గా మారుతాను. రోజూ వెళ్లి వాళ్లను పలకరిస్తాను. బాగోగులు చూసి వస్తాను. రోజులో ఐదారు గంటలు ఇలాంటి స్త్రీల కోసమే వెచ్చిస్తాను’ అంటుంది షబానా. అలాగని వాళ్లూ వీళ్లూ ఫోన్లు చేసి ‘మా అమ్మను చూసుకో... మా అత్తగారిని చూసుకో’ అనంటే ఆమె చేయదు. మరీ ఏ అండా లేని స్త్రీలను, అనారోగ్యంతో బాధ పడుతున్నవారిని, కడుపున పుట్టినవాళ్లు ఇక చూడరు అని నిశ్చయమైనవారిని మాత్రమే ఆమె తన బాధ్యతగా తీసుకుంటుంది. ‘తల్లిదండ్రులు పిల్లల్ని కని తమ ఒంట్లో శక్తి ఉన్నంత కాలం చూస్తారు. పిల్లలు తమ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు వయసుడిగిన తల్లిదండ్రులను చూసుకోవడానికి ఏమిటి నొప్పి?’ అంటుంది షబానా. చాలామంది వృద్ధులతో సమస్య... వారు మంచాన పడి ఉంటే చూసేవారు లేకపోవడం. అంటే సంతానం ఉన్నా వారికి ఆ పనులు చేయడం ఇష్టం లేక ఖర్మానికి వదిలిపెట్టడం. అలాంటి వారికి కూడా షబానా సేవలు చేస్తుంది. ‘ఒక వృద్ధురాలిని చాలా ఘోరంగా మంచాన పడేసి ఉన్నారు. ఆమె ఉన్న గదిలోకి వెళ్లడానికే భయం వేసేది. ఐదేళ్లుగా ఆమెను నేను చూసుకుంటున్నాను. ఆమె ఎంతో హాయిగా ఉంది’ అంటుంది షబానా. సేవ చేసే శక్తి, హృదయం అందరికీ ఉండదు. కాని సొంత తల్లిదండ్రులకు సేవ చేసే ప్రేమ, ఓపిక తప్పక సంతానంలో ఉండాలి. అది లేని చోట షబానా లాంటి వాళ్లు కూడా లేకపోతే ఈ సమాజంలో పెద్దవాళ్లు అంతులేని వేదన అనుభవించాల్సి వస్తుంది. ‘నేను కలిసే వృద్ధులకు ఒక కిట్ ఇస్తాను. అందులో చిరుతిళ్లు, ముఖ్యమైన మందులు ఉంటాయి. దాని విలువ వేయి రూపాయలు ఉంటుంది’ అంది షబానా. అయితే ఇవన్నీ చేయడానికి ఆమెకు డబ్బు ఎక్కడిది? మనసుంటే మార్గం ఉంటుంది. వారూ వీరూ తాము చేయలేని పని షబానా చేస్తున్నదని ఆమెకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. షబానా తిరురంగడిలో సూర్యునితో పాటు నిద్ర లేస్తుంది. ఆమె వస్తే తప్ప టిఫిన్ తినని వారు, చిరునవ్వు నవ్వని వారు ఎందరో ఆ ఊళ్లో ఉన్నారు. షబానాను చూసి ప్రతి ఊరూ ఒక ఆదరాలయంగా మారితే ఎంత బాగుణ్ణు. చదవండి: Bihar: ఆర్టిస్టు అవుతావా అని హేళన.. ఇప్పుడు లక్షల్లో సంపాదించడమే గాక 25 మందికి ఉపాధి! -
ఆయుర్వేద గురువు వారియర్ కన్నుమూత
మలప్పురం: ఆయుర్వేదంలో గురుతుల్యుడు, కొట్టక్కల్ ఆర్య వైద్యశాల(కేఏఎస్) మేనేజింగ్ ట్రస్టీ అయిన డాక్టర్ పి.కె.వారియర్ కన్నుమూశారు. జూన్ 8వ తేదీన వందో జన్మదిన వేడుకలు జరుపుకున్న వారియర్ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీధరన్ నంబూద్రి, పన్నియంపిల్లి కున్హి వారియర్ దంపతులకు 1921 జూన్ 5వ తేదీన జన్మించిన పన్నియంపిల్లి కృష్ణకుట్టి వారియర్(పీకే వారియర్) విద్యాభ్యాసం కొట్టక్కల్‌లోని సాగింది. 20 ఏళ్ల వయస్సులో ఆయన కేఏఎస్‌లో చేరారు. దేశ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితుడైన ఆయన..ఆయుర్వేద అధ్యయనానికి స్వస్తి చెప్పి పోరాటబాట పట్టారు. అయితే, క్రియాశీల రాజకీయాలు తనకు సరిపోవని గ్రహించి అనంతరం ఆయుర్వేదం అధ్యయనానికే అంకితమయ్యారు. చదువు పూర్తయ్యాక 24 ఏళ్ల వయస్సులో కేఏఎస్ ట్రస్టీగా చేరారు. 119 ఏళ్ల కేఏఎస్ ట్రస్ట్‌ను ఆరు దశాబ్దాలపాటు నడిపి, అత్యుత్తమ సంస్థగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన మార్గదర్శకత్వంలో కొట్టక్కల్‌లోని ఆర్య వైద్యశాల, ఆయుర్వేద మెడికల్ కాలేజీ బాధ్యతలను చేపట్టాక ఎంతో అభివృద్ధి చెందడంతోపాటు శాస్త్రీయ, ప్రామాణిక ఆయుర్వేద వైద్య చికిత్స, విధానాలకు మారుపేరుగా మారాయి. జీవిత కాలంలో ఆయన దేశ, విదేశాలకు చెందిన పలువురు మాజీ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు సహా ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి చికిత్స అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1999లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్‌తో గౌరవించింది. ఆయన మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డాక్టర్ వారియర్ మృతిపట్ల కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ తదితరులు సంతాపం ప్రకటించారు. ‘డాక్టర్ పీకే వారియర్ మృతి విచారకరం. ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన చేసిన కృషిని ఎన్నటికీ గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’అని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
కరోనా: కేరళలో నాలుగు నెలల చిన్నారి మృతి
తిరువనంతపురం: కరోనా ధాటికి దేశంలో ముక్కుపచ్చలారని పసిప్రాయాలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నెలలు నిండని ఓ చిన్నారిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని మంజేరికి చెందిన నాలుగు నెలల చిన్నారికి అధిక జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో తల్లిదండ్రులు ఈ నెల 21న కోజికోడ్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం బుధవారం పాపకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా చికిత్స పొందుతున్న చిన్నారి దురదృష్టవశాత్తు శుక్రవారం ఉదయం మరణించింది. అయితే గత 3 నెలలుగా చిన్నారి గుండె సంబంధిత సమస్యలకు పోరాడుతోందని వైద్యులు తెలిపారు. ఇక మలప్పురం జిల్లాలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. (కరోనా : 24 గంటల్లో 1,684 కేసులు ) కేరళలో గురువారం కొత్తగా కేవలం 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 447 ఉండగా ఆక్టివ్ కేసుల సంఖ్య 129 గా ఉంది. అంతేగాక 23 వేల మంది క్వారంటైన్లో ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కొత్తగా నమోదైన కేసులలో ఇడుక్కి జల్లా నుంచి నాలుగు, కోజికోడ్, కొట్టాయం నుంచి రెండు, తిరువనంతపురం, కొల్లం నుంచి ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు సీఎం పేర్కొన్నారు. కాగా 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదవ్వకపోవడంతో మంగళవారం గ్రీన్ జోన్‌గా ప్రకటించిన కొట్టాయం గడిచిన రెండు రోజుల్లో ఒక్కొక్క కేసును నమోదు చేసింది. (కరోనా : 9నెలల చిన్నారి అద్భుతం.. ) నెల జీతం కట్..వారికి మినహాయింపు -
వైరల్ : క్షణం ఆలస్యమైతే శవమయ్యేవాడే..!
మలప్పురం : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేరళ ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. గత రెండు రోజులుగా మలప్పురం, వయనాడ్ జిల్లాల ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓ ఘటన ప్రకృతి విలయ తాండవానికి కేరళ నిలయంగా మారిందనడానికి సాక్ష్యంగా నిలిచింది. వర్షం కురుస్తుండటంతో ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని తల్లితో పాటు నడుస్తున్నాడు. ఒక్కసారిగా ఆ పరిసరాల్లో ఏదో అలజడి మొదలైంది. ప్రమాదమేదో ముంచుకొస్తోందని గ్రహించిన ఆ తల్లీకొడుకు ముందుకు పరుగెత్తే యత్నం చేశారు. ఉన్నట్టుండి భారీగా మట్టిపెళ్లల ప్రవాహం వారిని ముంచెత్తేందుకు దూసుకొచ్చింది. కొడుకు క్షణాల్లో అక్కడికి సమీపంలో ఉన్న ఓ భవనం వద్దకు చేరగా.. అతని తల్లి మాత్రం మట్టిపెళ్లల కింద కూరుకుపోయింది. వస్తూవస్తూ ఆ ప్రవాహం వారి ఇళ్లును కూడా కప్పెట్టేసింది. ఆ సమయంలో అతని భార్య, ఏడాదిన్నర కొడుకు కూడా ఇంట్లోనే ఉండటంతో మట్టిలో కూరుకుపోయినట్టు తెలిసింది. దీంతో బాధితుడు కొట్టక్కున్ను జనమైత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సహాయక చర్యలు మొదలు పెట్టారు. శుక్రవారం రాత్రి వరకు గాలించినా అతని భార్య, కుమారుడు, కొడుకు జాడ కానరాలేదు. భారీ స్థాయిలో మట్టిపెళ్లలు, చెట్లు పైనబడటంతో వారు బతికే అవకాశాలు లేవని డిప్యూటీ ఎస్పీ వెల్లడించారు. సమీపంలోని సీసీటీవీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఇక గత మూడు రోజులుగా వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ప్రాణాలువిడిచారు. ఒక్క మలప్పురం జిల్లాలోనే 9 మరణాలు సంభవించాయి. ఇక ఇదే జిల్లాలోని నీలంబూర్లో కొండ చరియలు విరిగిపడటంతో భూథతాన్-ముథప్పాన్ పర్వతాల కింద 40 మందికి చిక్కుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. -
ఆ నీచుడి గురించి అమ్మకు తెలుసు
-
ఆ నీచుడి గురించి అమ్మకు తెలుసు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన ‘థియేటర్ లైంగిక వేధింపుల కేసు’లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. స్థానిక మీడియా ఛానెళ్లలో సదరు వీడియో చక్కర్లు కొట్టడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే తల్లి ప్రొద్భలంతోనే మైనర్ బాలికపై లైంగిక చేష్టలకు సదరు వ్యక్తి దిగినట్లు తేలింది. ఈ విషయాన్ని మైనర్ బాలిక చెప్పటంతో సదరు వ్యక్తితోపాటు చిన్నారి తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... మళప్పురానికి చెందిన వ్యాపారవేత్త మొయిదీన్ కుట్టీ(60), స్థానికంగా ఉంటున్న 35 ఏళ్ల ఓ మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 18న ఎడప్పల్‌లో ఉన్న ఓ థియేటర్‌కు మహిళను, ఆమె కూతురి(10)ని తీసుకెళ్లాడు. చెరోపక్క వారిద్దరినీ కూర్చోపెట్టుకుని మైనర్ బాలికను లైంగికంగా వేధించటం ప్రారంభించాడు. అయితే పక్కనున్న కొందరు బాలిక ఏడుస్తుండటం గమనించి థియేటర్ యాజమానికి సమాచారం అందించారు. థియేటర్లో సీసీ ఫుటేజీ కెమెరాలో(నైట్ విజన్ మోడ్ ద్వారా) ఆ తతంగం అంతా రికార్డయ్యింది. దృశ్యాలను గమనించిన థియేటర్ మేనేజర్ చైల్డ్ లైన్ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తీరుపై విమర్శలు... అయితే ఈ విషయంలో ఫిర్యాదు అంది రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసుల నుంచి స్పందన లేకుండా పోయింది. నిందితుడు బడా వ్యాపారవేత కావటంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు తటపటాయించారు. చివరకు ఆ వీడియో మీడియా ఛానెళ్లలో చక్కర్లు కొట్టడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేరళ మహిళ కమిషన్చైర్పర్సన్ ఎంసీ జోసెఫిన్ దగ్గరుండి ఈ కేసును పర్యవేక్షించారు. ఏప్రిల్ 28న చైల్డ్ లైన్ సహాయక సిబ్బంది అందించిన వీడియోను కేరళ పోలీస్ శాఖకు ఆమె అందించారు. పోలీసుల నిర్లక్ష్యం నిర్ధారణ కావటంతో చంగరకులం ఎస్సైపై వేటు పడింది. కేరళ మానవహక్కుల సంఘం స్పందించి ఘటనపై పోలీస్ శాఖను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. మేజిస్ట్రేట్ ఆ బాలిక నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అమ్మకు తెలుసు... ఈ వ్యవహారంలో తల్లి ప్రొద్భలంతోనే సదరు వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ‘ఆ పెద్దాయన గురించి అమ్మకు తెలుసు. తరచూ మా ఇంటికి వస్తుండేవాడు. మమల్ని బయటకు తీసుకెళ్లి బట్టలు కొనిచ్చి, భోజనం పెట్టించేవాడు. గతంలోనూ ఆయన ఓసారి నాతో అలాగే ప్రవర్తించాడు. అప్పుడు అమ్మకు ఈ విషయం చెబితే నన్ను తిట్టింది. ఆరోజు థియేటర్లో కూడా నాపై చెయ్యి వేస్తే ఏడ్పొచ్చింది. వద్దని బతిమాలినా వినలేదు’ అని బాలిక పేర్కొంది. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం మొయిదీన్ కుట్టీని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. అటుపై అతను ఇచ్చిన సమాచారంతో ఆదివారం ఆ బాలిక తల్లిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పోక్సో యాక్ట్, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను నిర్భయ సెంటర్‌కు తరలించారు. -
కొన్ని గంటల్లో కూతురి పెళ్లి.. తండ్రి ఘాతుకం
సాక్షి, తిరువనంతపురం : కేరళలో దారుణం చోటుచేసుకుంది. మరికొన్ని గంటల్లో దళితుడిని వివాహం చేసుకోబోతుందన్న కోపంతో తన కూతురిని ఓ తండ్రి కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసి హత్య చేశాడు. మలప్పురం జిల్లా పతనపురం గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల ఆర్. అథిర అనే యువతి ఓ ఆర్మీ జవాన్‌ను ప్రేమించింది. అయితే ఆర్మీ జవాన్ దళితుడు కావడంతో ఆమె తల్లితండ్రులు తొలుత వీరి పెళ్లికి నిరాకరించారు. చివరికి ఆ ప్రేమికులు అతికష్టం మీద తల్లిదండ్రులను తమ పెళ్లికి ఒప్పించారు. అరికోడ్‌లోని ఓ దేవాలయంలో శుక్రవారం వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటవుతామని ఆ ప్రేమ జంట భావించింది. కుమార్తె దళితుడిని చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక అథిర తండ్రి ఆర్ రాజన్ మద్యం సేవించి వచ్చాడు. అతడిని పెళ్లి చేసుకోవద్దంటూ గొడవకు దిగాడు. పెళ్లికి అడ్డంకులు తొలగిపోయి అంతా ఓకే అనుకున్న సమయంలో తండ్రి రివర్స్ కావడం వధువును ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు నచ్చజెప్పాలని చూస్తున్న కూతురిని వెంట తెచ్చుకున్న కత్తితో రాజన్ విచక్షణారహితంగా పొడిచి పరారయ్యాడు. వధువును కోజికోడ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పరువు హత్యకు పాల్పడిన రాజన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. -
బ్యాంకులో సీబీఐ రైడ్స్.. భారీగా నగదు లభ్యం
-
బ్యాంకులో సీబీఐ రైడ్స్.. భారీగా నగదు లభ్యం
మల్లాపురం: పాత నోట్ల రద్దయిన దగ్గర్నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న సీబీఐ, ఐటీ, ఈడీ రైడ్స్‌లో కోట్లకు కోట్ల బ్లాక్‌మనీ, కొత్త కరెన్సీ నోట్లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కేవలం వ్యక్తుల వద్ద, ఎయిర్‌పోర్టులోనే కాదు, బ్యాంకులోనూ భారీగానే నగదు పట్టుబడుతోంది. బ్యాంకులో నగదు పట్టుబడటం ఏమిటా అనుకుంటున్నారా? ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా డిపాజిట్ చేసుకున్న మొత్తమే ఈ నగదు. కనీస ఆధారాలు లేకుండా నగదు డిపాజిట్ చేసుకుంటున్నారని గుర్తించిన సీబీఐ, మల్లాపురం కోపరేటివ్ బ్యాంకుల్లో దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం రూ.266 కోట్ల నగదు పట్టుబడింది. వీటికి సరిపడ ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం గమనార్హం. నవంబర్ 10 నుంచి 14 వరకు భారీ మొత్తంలో ఈ నగదు బ్యాంకుకు చేరినట్టు రైడ్స్‌లో అధికారులు గుర్తించారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే ఈ నగదును బ్యాంకు వారు డిపాజిట్ చేసుకున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఇవి బ్లాక్మనీనా కాదా అనేది తేలాల్సి ఉంది. ఈ అకౌంట్ హోల్డర్స్ వివరాలను వెంటనే తమకు అందించాలని బ్యాంకు అధికారులను సీబీఐ ఆదేశించింది. అదేవిధంగా పాత నోట్లు రద్దయిన తర్వాత ఆర్బీఐ విధించిన నిబంధనలను ఈ బ్యాంకు ఉల్లంఘించినట్టు కూడా అధికారులు గుర్తించారు. కస్టమర్ల డబ్బులను డిపాజిట్ చేసుకోవడానికి వారు ఎలాంటి నిబంధనలు పాటించలేదని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు సహకార బ్యాంకుల్లో ఉన్న లొసుగులను ఆశ్రయంగా తీసుకుని కొంతమంది రాజకీయవేత్తలు, బడాబాబులు భారీ మొత్తంలో నగదును డిపాజిట్ చేస్తున్నారని అంతకమున్నుపే పలు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.