ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం: కరోనా ధాటికి దేశంలో ముక్కుపచ్చలారని పసిప్రాయాలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నెలలు నిండని ఓ చిన్నారిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని మంజేరికి చెందిన నాలుగు నెలల చిన్నారికి అధిక జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో తల్లిదండ్రులు ఈ నెల 21న కోజికోడ్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం బుధవారం పాపకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా చికిత్స పొందుతున్న చిన్నారి దురదృష్టవశాత్తు శుక్రవారం ఉదయం మరణించింది. అయితే గత 3 నెలలుగా చిన్నారి గుండె సంబంధిత సమస్యలకు పోరాడుతోందని వైద్యులు తెలిపారు. ఇక మలప్పురం జిల్లాలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. (కరోనా : 24 గంటల్లో 1,684 కేసులు )
కేరళలో గురువారం కొత్తగా కేవలం 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 447 ఉండగా ఆక్టివ్ కేసుల సంఖ్య 129 గా ఉంది. అంతేగాక 23 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కొత్తగా నమోదైన కేసులలో ఇడుక్కి జల్లా నుంచి నాలుగు, కోజికోడ్, కొట్టాయం నుంచి రెండు, తిరువనంతపురం, కొల్లం నుంచి ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు సీఎం పేర్కొన్నారు. కాగా 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదవ్వకపోవడంతో మంగళవారం గ్రీన్ జోన్‌గా ప్రకటించిన కొట్టాయం గడిచిన రెండు రోజుల్లో ఒక్కొక్క కేసును నమోదు చేసింది. (కరోనా : 9నెలల చిన్నారి అద్భుతం.. )
Comments
Please login to add a commentAdd a comment