బ్యాంకులో సీబీఐ రైడ్స్.. భారీగా నగదు లభ్యం | CBI raids Malappuram district co-op bank, Rs 266 crore seized | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 22 2016 12:18 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

పాత నోట్ల రద్దయిన దగ్గర్నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న సీబీఐ, ఐటీ, ఈడీ రైడ్స్లో కోట్లకు కోట్ల బ్లాక్మనీ, కొత్త కరెన్సీ నోట్లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కేవలం వ్యక్తుల వద్ద, ఎయిర్పోర్టులోనే కాదు, బ్యాంకులోనూ భారీగానే నగదు పట్టుబడుతోంది. బ్యాంకులో నగదు పట్టుబడటం ఏమిటా అనుకుంటున్నారా? ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా డిపాజిట్ చేసుకున్న మొత్తమే ఈ నగదు. కనీస ఆధారాలు లేకుండా నగదు డిపాజిట్ చేసుకుంటున్నారని గుర్తించిన సీబీఐ, మల్లాపురం కోపరేటివ్ బ్యాంకుల్లో దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం రూ.266 కోట్ల నగదు పట్టుబడింది. వీటికి సరిపడ ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం గమనార్హం.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement