CBI raids
-
అక్రమ కాల్ సెంటర్లపై సీబీఐ దాడులు
-
Vizag: అక్రమ కాల్ సెంటర్లపై సీబీఐ దాడులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విదేశీయులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ అక్రమ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న సంస్థలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖ సాగర్ నగర్ ప్రాంతంలో పలు సంస్థల్లో తనిఖీలు చేశారు. మురళీనగర్‌లో ఉంటున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. భారత్‌లో పలు రాష్ట్రాల నుంచి రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డుల పేరుతో అమెరికా, ఇతర దేశాలకు చెందిన వారిని ఆకర్షిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు ఎఫ్‌బీఐ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు ఆయా సంస్థలపై నిఘా పెట్టారు.తొలుత థానేలోని కాల్ సెంటర్ నుంచి 140 మందిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ అక్రమ ఆపరేషన్‌కు సంబంధించిన సర్వర్‌ను అహ్మదాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కొంత మందిని అరెస్టు చేయగా.. హైరదరాబాద్, కోల్‌కతా, విశాఖలలోనూ ఈ సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు.దీంతో నగరంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. సాగర్‌నగర్ ప్రాంతంలోని దేవీ ప్యారౖడెజ్లో నివాసం ఏర్పరచుకున్న అక్షయ్ పాత్వాల్, ధీరజ్ జోషి, హిమాన్షు శర్మ, పార్థ్‌బాలి, ప్రితేష్ నవీన్ చంద్రపటేల్‌లను మురళీనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
Satya Pal Malik: మాజీ గవర్నర్ ఇంట సీబీఐ సోదాలు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను దర్యాప్తు సంస్థలు వదలడం లేదు. తాజాగా గురవారం ఆయన ఇంటితో పాటు 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరిగాయి. ఆయన జమ్ము గవర్నర్‌గా ఉన్న సమయంలో.. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అవినీతి జరగడం.. దానిపై కేసు నమోదు కావడమే ఇందుకు కారణం. జమ్ములో రూ. 2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ (హెచ్ఇపి)లో పనులు కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏప్రిల్ 2022లో మాలిక్‌తో సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం 100 మంది అధికారులు పలు నగరాల్లో ఈ సోదాలు ప్రారంభించారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలపై సత్యపాల్ మాలిక్ ట్విటర్ ద్వారా స్పందిస్తున్నారు. ‘నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా డ్రైవర్, సహాయకుడిని వేధిస్తున్నాయి. ఇలాంటి వాటికి నేను భయపడను. నేను రైతులకు అండగా నిలుస్తాను’ అని వెల్లడించారు. మరో ట్వీట్లో.. అవినీతికి పాల్పడిన వారిపై నేను ఫిర్యాదు చేస్తే.. ఆ వ్యక్తుల్ని విచారించకుండా నా నివాసంపై సీబీఐ దాడులు చేస్తోంది. ఇంట్లో నాలుగైదు కుర్తాలు, పైజామాలు తప్ప మరేమీ వాళ్లకు దొరకలేదు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఆ నియంత నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. నేను రైతు బిడ్డను. ఎవరికీ భయపడను.. తలవంచను అంటూ పోస్ట్ చేశారాయన. मैंने भ्रष्टाचार में शामिल जिन व्यक्तियों की शिकायत की थी की उन व्यक्तियों की जांच ना करके मेरे आवास पर CBI द्वारा छापेमारी की गई है। मेरे पास 4-5 कुर्ते पायजामे के सिवा कुछ नहीं मिलेगा। तानाशाह सरकारी एजेंसियों का ग़लत दुरुपयोग करके मुझे डराने की कोशिश कर रहा है। मैं किसान का… — Satyapal Malik 🇮🇳 (@SatyapalmalikG) February 22, 2024 మాలిక్.. 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, వాటిపై సంతకం చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పినట్లు గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక దస్త్రం హైడ్రో ప్రాజెక్టుదని తెలిపారు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మాలిక్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి పైన చెప్పుకున్న కిరూ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించింది కాగా.. , రెండోది ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించిన ఆరోపణలు. ఇన్సూరెన్స్ ఒప్పందం నేపథ్యం.. 2018లో సదరు కంపెనీ కాంట్రాక్ట్‌ను ఆ సమయంలో జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆ ఫైల్స్‌ను స్వయంగా పర్యవేక్షించానని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించి స్కాం ఇది. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు 2018 సెప్టెంబర్‌లో ఇందులో చేరారు. అయితే.. అవకతవకలు ఉన్నాయంటూ నెలకే ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ సంచలనానికి తెర తీశారు అప్పుడు గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్. ఈ బీమా పథకం ఒప్పందానికి సంబంధించిన అవినీతి కేసులో మాలిక్‌ను సీబీఐ సాక్షిగా చేర్చింది. గతంలో ఐదు గంటలపాటు విచారించింది కూడా. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్ బ్రోకర్స్‌ను నిందితులుగా చేర్చింది సీబీఐ. ఇందులో మోసం జరిగిందని మాలిక్ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే ఆయన్ని ప్రశ్నించినట్లు సీబీఐ ప్రకటించింది. సంచలనంగా సత్యపాల్ మాలిక్ చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్ మాలిక్. ఆ తర్వాత భారతీయ లోక్‌దల్ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు కూడా. ఆపై బీహార్, జమ్ము కశ్మీర్, గోవా, మేఘాలయాకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో ఈయనే గవర్నర్‌గా ఉన్నారు. రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్ 14వ తేదీన) కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గవర్నర్‌గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్ పాక్ నుంచి రావడం, జమ్ము కశ్మీర్లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
బైడెన్ బెంబేలు.. ఇలాంటి సన్నివేశాన్ని ఇండియాలో ఊహించగలమా?
అమెరికాలో ఏకంగా ఆ దేశ అద్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదికారులు సోదాలు జరిపినట్లు వచ్చిన వార్త సంచలనాత్మకమైనదే. ప్రజాస్వామ్యంలో ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా, తప్పు చేస్తే తత్పరిణామాలను ఎదుర్కోవలసిందేనని అమెరికా అనుభవం చెబుతుంది. బైడెన్ ఇంటిలో సోదాలు ఏకంగా 13 గంటల పాటు జరిగాయి. అందులో ఆరు రహస్య ఫైళ్లు దొరికాయట. గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఉంచుకున్న ఆ ఫైళ్లు పదవి పోయిన వెంటనే ఆర్కివ్స్ కు పంపించవలసి ఉండగా, ఇంటిలోనే ఉంచుకోవడం వివాదాస్పదం అయింది. అది ఆయన అధ్యక్ష స్థానంలోకి వచ్చాక వెలుగులోకి రావడం విశేషం. మరో వైపు ఆయన కుమారుడి వ్యాపార లావాదేవీలపై కూడా విమర్శలు వస్తున్నాయి. అది వేరే సంగతి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే మన భారత దేశం అమెరికాకన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం. కాని ఇక్కడ మాత్రం అధికారంలో ఉన్నవారి జోలికి తప్పనిసరి అయితే తప్ప సంబంధిత దర్యాప్తు సంస్థలు వెళ్లవు. ఒకవేళ వెళ్లినా అది మొక్కుబడిగానే ఉంటుందని చెప్పనవసరం లేదు. అదే ప్రతిపక్షానికి చెందినవారైతే దర్యాప్తు సంస్థలు జోరుగా విచారణకు వెళతాయన్న అభిప్రాయం ఉంది. అందుకే కేంద్రంలో అదికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీలకు చెందినవారు చేరుతుంటారు. అలాకాకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో యుపీఏ టైమ్‌లో శక్తిమంతమైన నేతగా ఉన్న సోనియాగాంధీని ఆ పార్టీ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ఎదిరించారు. సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. అంతే! సోనియాగాంధీకి కోపం వచ్చింది. ఏపిలో ప్రతిపక్షపార్టీ అయిన తెలుగుదేశంతో కుమ్మక్కై మరీ జగన్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అదే టైమ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చిన అభియోగాలపై విచారణ జరపడానికి న్యాయ వ్యవస్థ కూడా ముందుకు రాకపోవడం గమనించవలసిన అంశం. 2014లో చంద్రబాబు అదికారంలోకి వచ్చాక తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఆయనను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెలంగాణ సీఎం కేసీఆర్ అనేవారు. కాని కేంద్రంలోని ఎన్.డి.ఎ.లో భాగస్వామిగా టీడీపీ ఉండడంతో చంద్రబాబుకు కేంద్రంలోని కొందరు పెద్దలు రక్షణగా నిలబడ్డారు. అదే సమయంలో కొన్ని వ్యవస్థలలోని వారిని కూడా మేనేజ్ చేయగలిగారని చెబుతారు. ఏదైతేనేమీ ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు బీజేపీకి దూరం అయ్యారు. ఆ తరుణంలో సీబీఐపై ఆయన ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిందే. బీజేపీ వారు తనపై కేసు పెట్టబోతున్నారని, ప్రజలంతా వచ్చి తనకు అండగా ఉండాలని కోరేవారు. అసలు సీబీఐని ఏపీలోకి రాకుండా ఆంక్షలు పెట్టారు. తర్వాత 2019లో ఆయన అధికారం కోల్పోయారు. తదుపరి ఆదాయపన్ను శాఖ చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడి ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల విలువైన అక్రమాలకు ఆధారాలు దొరికాయని ప్రకటించింది. కానీ చంద్రబాబు తన వైఖరి మార్చుకుని బీజేపీని ఒక్క మాట అనకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎవరూ తన జోలికి రాకుండా కేంద్రాన్ని మేనేజ్ చేసుకోగలిగారని చాలామంది భావిస్తుంటారు. అంతేకాదు. రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారిలో ఇద్దరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఐటీ, ఈడీ వంటి సంస్థలు దాడులు చేశాయి. ఒకాయన అయితే ఏకంగా ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు బకాయిపడ్డారు. అయినా ఆయన బీజేపీలో చేరాక దర్యాప్తు సంస్థలు మరీ అంత సీరియస్‌గా వ్యవహరించలేదన్న అభిప్రాయం ఉంది. మరో వైపు బీజేపీ అంటే పడని పార్టీల నేతలపై సీబీఐ పలుమార్లు దాడులు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఏకంగా జైలుకు వెళ్లవలసి వచ్చింది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై సీబీఐ అధికారులు జరిపిన దాడులు సంచలనమే. పశ్చిమబెంగాల్ లో ఒక మంత్రి వద్ద రూ.45 కోట్లు పట్టుబడ్డాయి. ఆ తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ బీజేపీపై మరీ అంత గట్టిగా ఉండకుండా జాగ్రత్తపడుతున్నారు. తెలంగాణలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెపైనే ఈడి ఆరోపణలు చేయడం, దానిని బీఆర్ఎస్ నేతలు ఖండించడం జరిగింది. ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ఊబిలో దిగబడుతున్నాయన్న భావన ఉంది. మరి అమెరికాలో అధ్యక్ష స్థానంలో ఉన్న నేత ఇంటిలోనే ఎఫ్‌బీఐ సోదాలు జరిపితే మన దేశంలో మాత్రం ఒక్కొక్కరిపట్ల ఒక్కో రకంగా ప్రమాణాలు పాటిస్తున్నాయన్న అభిప్రాయం ఉండడంలో తప్పులేదేమో! -హితైషి -
మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు..
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ మరోమారు దాడులు చేసింది . లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ సెక్రటేరియట్లో తన కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు చేసినట్లు మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. आज फिर CBI मेरे दफ़्तर पहुँची है. उनका स्वागत है. इन्होंने मेरे घर पर रेड कराई, दफ़्तर में छापा मारा, लॉकर तलशे, मेरे गाँव तक में छानबीन करा ली.मेरे ख़िलाफ़ न कुछ मिला हैं न मिलेगा क्योंकि मैंने कुछ ग़लत किया ही नहीं है. ईमानदारी से दिल्ली के बच्चों की शिक्षा के लिए काम किया है. — Manish Sisodia (@msisodia) January 14, 2023 ' సీబీఐ అధికారులు ఇవాళ మరోమారు నా కార్యాలయానికి వచ్చారు. వాళ్లకు స్వాగతం పలుకుతున్నా. వాళ్లు నా ఇంట్లో, ఆపీస్లో, బ్యాంకు లాకర్లో ఇదివరకే తనిఖీలు చేశారు. నా సొంత ఊరికి వెళ్లి కూడా విచారణ జరిపారు. కానీ వాళ్లకు ఏమీ దొరకలేదు. భవిష్యత్తులో కూడా ఏమీ దొరకదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు' అని సిసోడియా ట్విట్టర్లో రాసుకొచ్చారు. చదవండి: 900 కిమీ దూరం.. గంటల వ్యవధిలోనే చనిపోయిన కవల సోదరులు.. -
హైదరాబాద్ లో సీబీఐ సోదాలు
-
Karnataka: పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు
సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రామనగర జిల్లాలోని ఆయన స్వగ్రామంతోపాటు కనకపుర, దొడ్డనహళ్లి, సంతే కొడిహళ్లిలో ఈ సోదాలు జరిగాయి. శివకుమార్‌కు చెందిన ఆస్తులు, భూములు, వాటికి సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. కనకపుర తహసిల్దార్‌ను కలుసుకున్నారు. శివకుమార్ ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. 2017లో శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. అనంతరం ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), తర్వాత సీబీఐ పరిధిలోకి వచ్చింది. శివకుమార్‌పై దర్యాప్తు కొనసాగించేందుకు 2019 సెప్టెంబర్ 25న కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. మానసికంగా వేధిస్తున్నారు సీబీఐ దాడులపై డీకే శివకుమార్ స్పందించారు. దాడుల పేరుతో తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. వాళ్లు అడిగిన పత్రాలు ఇప్పటికే ఇచ్చాను. అయినప్పటికీ వారు నా ఆస్తులను తనిఖీ చేశారు. ఎంతోమంది ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నా కేసులో మాత్రమే సీబీఐకి అనుమతి లభించింది. సీబీఐ నాపై మాత్రమే ఎందుకు దర్యాప్తు చేస్తోంది?’ అని శివకుమార్ ప్రశ్నించారు. చదవండి: అక్టోబర్‌లో అమిత్ షా పర్యటన.. జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్ల కలకలం -
వేధింపులాపి.. మంచి పనులు చేయండి
న్యూఢిల్లీ: బీజేపీ నేతలు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం ఏమిటో తనకు ఇప్పటివరకు అర్థం కాలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ, ఈడీలతో అందరినీ వేధించడం మానేసి, ఇకనైనా దేశం హితం కోసం మంచి పనులు చేయాలని కేంద్రానికి హితవు పలికారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంలో అవకతవకల కేసులో భాగంగా ఈడీ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేసింది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ‘మద్యం పాలసీలో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ నేత ఒకరన్నారు. ఢిల్లీ బడ్జెట్ అంతా కలిపి రూ.70 వేల కోట్లు. మరిక రూ.1.5 లక్షల కోట్ల స్కాం ఎలా సాధ్యం? మరో బీజేపీ నేత రూ.8 వేల కోట్ల కుంభకోణమని, ఇంకొకరు రూ. 1,100 కోట్లని అంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నరేమో రూ.144 కోట్లని ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం విలువ రూ.1 కోటి మాత్రమేనని సీబీఐ అంటోంది’’ అని ఆయన మీడియాతో అన్నారు. ‘‘మా మంత్రి మనీశ్ సిసోడియా సొంతూరులోని నివాసం, బ్యాంకు ఖాతాల సోదాల్లోనూ సీబీఐకి ఏమీ దొరకలేదు. మరి స్కాం ఎక్కడ జరిగినట్టు?’’ అని ప్రశ్నించారు. అనవసర అంశాలపై దృష్టి పెడితే దేశం వెనుకబడిపోతుందని కేంద్రానికి హితవు పలికారు. తెలంగాణ, ఏపీల్లోనూ దాడులు సాక్షి, న్యూఢిల్లీ/నెల్లూరు క్రైం: ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 40 చోట్ల ఈడీ శుక్రవారం సోదాలు చేసింది. సోదా బృందాలకు పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరు, ఢిల్లీ నివాసాల్లో తనిఖీలు జరిగాాయి. నెల్లూరు రాయాజీవీధిలోని మాగుంట శ్రీనివాసులరెడ్డి పాత నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. బీరువాలను తెరిపించి, అందులోని ఫైళ్లను పరిశీలించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో నివాసముంటున్న ఎంపీ బంధువు (భార్య చెల్లెలి భర్త) శివరామకృష్ణారెడ్డి ఇంటిలోను ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇదే కేసులో ఈ నెల 6న కూడా ఇలాగే దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. -
సిసోడియా అరెస్ట్ అయితే మరీ మంచిది: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకల ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసాలు, బ్యాంకు లాకర్లపై దాడులు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీబీఐ దాడులను సూచిస్తూ మరోమారు బీజేపీపై విమర్శలు గుప్పించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికతో వారికే ఎదురుదెబ్బ తగలనుందన్నారు. ‘మనీశ్ సిసోడియాపై దాడులు జరిగిన తర్వాత గుజరాత్లో ఆప్ ఓటు షేర్ 4 శాతం పెరిగింది. ఆయన అరెస్ట్ అయితే అది 6 శాతానికి చేరుతుంది.ఆపరేషన్ లోటస్ విఫలమవుతుందని చెప్పేందుకే ఈ రోజు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారటం లేదు. నా పిల్లలిద్దరు ఐఐటీలో చదువుతున్నారు. భారత్‌లోని ప్రతి పిల్లాడికి అలాంటి విద్య అందించాలనుకుంటున్నాను. అవినీతి పార్టీలో విద్యావంతులు లేరు. కానీ, నిజాయితీతో పని చేసే పార్టీలో మంచి విద్య, నిజమైన ఐఐటీ పట్టభద్రులు ఉన్నారు.’ అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అసెంబ్లీలో జరిగిన విశ్వాస ఓటింగ్‌లో 62 మంది ఆప్ ఎమ్మెల్యేలకు గానూ 58 మంది అనుకూలంగా ఓటు వేశారు. ముగ్గురు గైర్హాజరవగా.. అందులో ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. మరో నేత సత్యేంద్ర జైన్ జైలులో ఉన్నారు. ఒకరు స్పీకర్. ఇదీ చదవండి: ఢిల్లీ: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్ -
ఆ విషయం బీజేపీ ఎంపీకి ముందే ఎలా తెలుసు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడిని మంత్రి హరీష్‌రావు ఖండించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఎంఓటీ, మోడ్రన్ కిచెన్, దోబీఘాట్లను ప్రారంభించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీకి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పాలనను వదిలేసి ప్రతిపక్షాలను వేధిస్తోంది. 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టారు. రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయనే అనుమానం కలుగుతోందన్నారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా? కర్ణాటకలో కాంట్రాక్టు పనులకు 40 శాతం కమిషన్ ఇవ్వాలని అక్కడ కాంట్రాక్టర్ అసోసియేషన్ అంటుంది. అక్కడ ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు అని హరీష్‌రావు ప్రశ్నించారు. మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీతో పాటు నిన్న జార్ఖండ్‌లో బీజేపీ చేసిన నిర్వాకాన్ని అందరూ చూశారన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ధోరణిలో బీజేపీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఆ పార్టీని ఎవరు ప్రశ్నించినా వారిని టార్గెట్ చేస్తోందని, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని హరీష్‌రావు ధ్వజమెత్తారు. -
సీబీఐ దాడుల ఎఫెక్ట్?.. భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఢిల్లీ: ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఇతరులపై సీబీఐ దాడుల నేపథ్యంలో.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఆరోపణలపై.. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంపై శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించింది. సిసోడియాతో పాటు మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, మద్యం వ్యాపారులు తదితరుల నివాసాల్లో.. మొత్తం దేశవ్యాప్తంగా 31 చోట్ల సోదాలు చేసింది. సుమారు 14 గంటల తనిఖీల తర్వాత మనీశ్ సిసోడియా ఫోన్, కంప్యూటర్లను సీబీఐ సీజ్ చేసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జంకే ప్రసక్తే లేదని, ఉచిత విద్య-ఆరోగ్యం అందించి తీరతామంటూ ప్రకటన చేశారు. మరోవైపు ఆప్ జాతీయ కన్వీనర్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇది బీజేపీ ప్రతీకార రాజకీయమంటూ మండిపడ్డారు. దర్యాప్తు ఏజెన్సీలతో ప్రతీకార దాడులకు పాల్పడుతోందంటూ విమర్శించారు. క్లిక్: సిసోడియాపై దాడులు, కేసు ఏంటంటే.. ఇదిలా ఉంటే.. ఒకవైపు సీబీఐ తనిఖీలు కొనసాగుతున్న వేళ మరోవైపు ఎల్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీగా ఐఏఎస్‌లను బదలీలు చేశారు. బదిలీ అయిన వాళ్లలో ఆరోగ్య-కుటుంబ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి ఉదిత్ ప్రకాశ్ రాయ్ సైతం ఉండడం గమనార్హం. ఆయన్ని పరిపాలన సంస్కరణల విభాగానికి బదిలీ చేసింది ఢిల్లీ సర్కార్. అరుణాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఉదిత్ ప్రకాశ్‌రాయ్‌పై ఈ మధ్యే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. రెండు అవినీతి కేసులతో పాటు ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి రూ. 50 లక్షల లంచం తీసుకున్నాడని, వెంటనే తప్పించాలని కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖకు ఎల్జీ సిఫార్సు చేశారు. వీళ్లతో పాటు మనీశ్ సిసోడియాకు దగ్గరగా ఉండే.. విజేంద్ర సింగ్ రావత్, జితేంద్ర నారాయిన్, వివేక్ పాండేలు, శుభిర్ సింగ్, గరిమా గుప్తా సైతం ట్రాన్స్‌ఫర్డ్ లిస్ట్‌లో ఉండడం గమనార్హం. మొత్తం పన్నెండు మందిని ఆఘమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు ఎల్జీ వినయ్ కుమార్. ఇదీ చదవండి: బీజేపీ ఆరోపణలపై న్యూయార్క్ టైమ్స్ రియాక్షన్ -
సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తాం : సీఎం కేజ్రీవల్ ట్వీట్
-
డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ తనిఖీలు
-
ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కరరామన్ అరెస్ట్
చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వీసా కన్సల్టెన్సీ స్కాంలో కీలక మలుపు చోటుచేసుకుంది. చిదంబరం కుమారుడు కార్తీ అనుచరులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నైలో కార్తీ సన్నిహితుడు ఎన్ భాస్కర్ రామన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా విదేశీ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల కిందట యూపీఏ హయాంలో తన తండ్రి చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో పవర్ కంపెనీ పనుల నిమిత్తం భారత్ వచ్చిన 250 మంది చైనా పౌరులకు వీసాలు ఇచ్చేందుకు కార్తీ రూ. 50 లక్షల లంచం తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మంగళవారం కార్తి, ఆయన సన్నిహితుడు భాస్కరరామన్ సహా పలువురి నివాసాలు, అధికారిక కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, ఒడిశా, శివగంగైలో ఈ సోదాలు జరిగాయి. తాజా కేసులో కార్తీతోపాటు ఆయన సన్నిహితుడు ఎన్ భాస్కర రామన్, తలవండీ, పవర్ ప్రాజెక్ట్ ప్రతినిధి వికాస్ మఖరియా, ముంబైకు చెందిన బెల్‌టూల్స్ తదితరుల పేర్లను కూడా చేర్చారు. భాస్కరరామన్ వద్ద చిక్కిన కొన్ని పత్రాలు ఈ కేసులో కీలకంగా సీబీఐ భావిస్తోంది. చదవండి: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ -
కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరంపై మరో కేసు నమోదైంది. పదకొండేళ్ల క్రితం చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండగా రూ.50 లక్షల లంచం తీసుకొని ఒక విద్యుత్ కంపెనీ కోసం 263 మంది చైనీయులకు వీసాల మంజూరుకు సహకరించారంటూ కార్తీపై సీబీఐ కేసు నమోదు చేసింది. కార్తీతో పాటు ఆయన సన్నిహితుడు ఎస్.భాస్కరరామన్, నాటి తల్వాండి సాబో పవర్ ప్రాజెక్టు అధ్యక్షుడు వికాస్ మఖారియా తదితరులపై ఏపీసీ 120బీ, 477ఏ, అవినీతి నిరోధక చట్టంలోని 8, 9 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, చెన్నైలోని చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై, ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, ఒడిశా, పంజాబ్ సహా 10 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. సోదాల సమయంలో చిదంబరం ఢిల్లీలో, కార్తీ లండన్‌లో ఉన్నారు. వీటిపై కార్తీ, ‘‘ఇప్పటివరకు నాపై ఎన్నిసార్లు ఇలా దాడులు చేశారో గుర్తు లేదు. ఇది కచ్చితంగా ఒక రికార్డే’’ అని ట్వీట్ చేశారు. ఎఫ్ఐఆర్లో నాపేరే లేదు: చిదంబరం మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిదంబరం కొడుకు కార్తీపై నమోదైన కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీబీఐ దాడులపై చిదంబరం స్పందించారు. This morning, a CBI team searched my residence at Chennai and my official residence at Delhi. The team showed me a FIR in which I am not named as an accused. The search team found nothing and seized nothing. I may point out that the timing of the search is interesting. — P. Chidambaram (@PChidambaram_IN) May 17, 2022 ‘ఈ రోజు(మంగళవారం) ఉదయం చెన్నై, ఢిల్లీలోని నా నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. అధికారులు ఎఫ్ఐఆర్ కాపీ చూపించారు. కానీ అందులో నిందితుడిగా నా పేరే లేదు. అంతేగాక సోదాల్లో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి అధికారులు ఎలాంటి పత్రాలనూ స్వాధీనం చేసుకోలేదు. ఇక అధికారులు సెర్చింగ్ చేసే సమయం ఆసక్తికరంగా సాగింది’ అంటూ చిదంబరం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చదవండి: ‘ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్‌దే’ I have lost count, how many times has it been? Must be a record. — Karti P Chidambaram (@KartiPC) May 17, 2022 -
మోదీ సూచనలతోనే అక్రమ కేసులు, సోదాలు
న్యూఢిల్లీ: అక్రమ కేసులు, దాడులు చేపట్టి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతో ప్రధాని మోదీ 15 మంది పేర్లను ఢిల్లీ పోలీసులు, ఈడీ, సీబీఐలకు అందజేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ 15 మందిలో ఆప్ నేతలే ఎక్కువమంది ఉన్నారన్నారు. శనివారం ఆయన వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ 15 మంది పేర్ల జాబితాను సీబీఐ, ఈడీ, ఢిల్లీ పోలీసులకు అందజేసినట్లు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఎన్నికల సమయా నికి రాజకీయంగా దెబ్బతీసేందుకు వారిపై అక్రమ కేసులు నమోదు చేయాలని, దాడులు జరపాలని కోరారు’అని సిసోడియా ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా మోదీజీకి బ్రహ్మాస్త్రం వంటి వారు. ఏదేమైనా ఈ పనిని నెరవేరుస్తానని ఆయన ప్రధానికి హామీ ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ‘సీబీఐ, ఈడీలను మీరు పంపించండి. వారికి మేం ఆహ్వానం పలుకుతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఆప్ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు పెట్టినా కేంద్రం ఏమీ సాధించలేక పోయిందని చెప్పారు. ‘గతంలో చేపట్టిన తనిఖీలతో మీరు ఏం సాధించారు? మా నేత సత్యేందర్ జైన్‌పై 12 కేసులున్నాయి. సీఎం కేజ్రీవాల్ కార్యాలయంపై, నా నివాసంపై సీబీఐ దాడులు చేసింది. ఆప్ 21 మంది ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. కానీ, ఏం సాధించారు?’అని సిసోడియా ప్రశ్నించారు. ‘గతంలో దాడులు, అక్రమ కేసులతో ఏం సాధించారు? ఓట్ల రాజకీ యాలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోండి’అని శనివారం ట్విట్టర్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఖండించారు. మరికొద్ది నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే ఆప్ నేతలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. -
ఐఆర్ఎస్ అధికారి సాదు సుందర్‌సింగ్‌పై సీబీఐ కేసు నమోదు
సాక్షి, విశాఖ: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్ఎస్ అధికారి సాదు సుందర్‌సింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ, ఏపీల్లో అతని నివాసాలపై దాడులు నిర్వహించింది. ఇప్పటివరకు రూ.3 కోట్ల ఆస్తులను గుర్తించిన సీబీఐ.. కుటుంబసభ్యులతో పాటు సుందర్‌సింగ్ పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. సోదాల్లో రూ.3.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. కాగా, సాదు సుందర్‌సింగ్ ప్రస్తుతం ఐటీ అప్లిలేటివ్ ట్రిబ్యునల్ అకౌంటెంట్ మెంబర్‌గా పనిచేస్తున్నారు. -
కలకలం : పేరుకే గుమస్తా, ఇంట్లో ఎటు చూసినా బంగారమే
భోపాల్ : ఆయన ఓ ప్రభుత్వ శాఖలో గుమస్తాయే కానీ ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో భయటపడుతున్న డబ్బు, నగలు విస్మయానికి గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్ భోపాల్ లో సీబీఐ అధికారులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి చెందిన అధికారుల నివాసాల్లో ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.3 కోట్లకు పైగా నగదుతో పాటు కరెన్సీ కౌంటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్ కు చెందిన కెప్టెన్ కపూర్ అండ్ సన్స్ అనే సెక్యూరిటీ సంస్థ ఈఏడాది జనవరి నెలలో నెలకు రూ.11.30 లక్షలకు ఎఫ్సీఐకు సెక్యూరిటీ గార్డ్ లను అందించేందుకు టెండర్ వేసింది. ఆ టెండర్ కు సంబంధించి నిధులు చెల్లించే విషయంలో తమకు 10శాతం కమిషన్ ఇవ్వాలని ఎఫ్‌సీఐ అకౌంట్స్ మేనేజర్ సంబంధింత సెక్యూరిటీ సంస్థను డిమాండ్ చేశాడు. దీంతో కెప్టెన్ కపూర్ అండ్ సన్స్ సెక్యూరిటీ యాజమాన్యం ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ఎఫ్‌సీఐ డివిజనల్ మేనేజర్ హరీష్ హినోనియా, మేనేజర్ అరుణ్ శ్రీవాస్తవ,గుమస్తాలు కిషోర్ మీనా,మోహన్ పరాటే ఇళ్లలో దాడులు జరిపారు.ఈ దాడుల్లో గుమస్తా కిషోర్ మీనా ఇంట్లో భయటపడ్డ నగదు, బంగారంతో అధికారులు షాక్ తిన్నారు. చెక్క పెట్టల్లో భద్రపరిచిన 8 కిలోల బంగారం, రూ. 2.17 కోట్ల నగదను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించే కొద్ది భారీ ఎత్తున నగదు వెలుగులోకి వస్తుండడంతో అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో గుమస్తా కిషోర్ మీనా ఆస్తుల వ్యవహారంలో అధికారుల హస్తం ఉందా అన్న కోణంలో సీబీఐ అధికారులు విచారణకు సిద్ధమయ్యారు. చదవండి : Viral : మీ ఛాయ్ సల్లంగుండా.. యుద్ధం వచ్చినా మీరు టీ తాగడం ఆపరా -
రాయపాటి.. చంద్రబాబు.. ఆర్థిక సంబంధాలపై కన్ను!
సాక్షి, అమరావతి/పట్నంబజార్/నగరంపాలెం (గుంటూరు): బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఆ నిధులు మళ్లించిన కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థపై సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. 2013లోనే తమ వద్ద రూ.300 కోట్ల రుణం తీసుకుని ట్రాన్స్ట్రాయ్ ఎగ్గొట్టిందంటూ కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదుపై సీబీఐ అధికారులు కూపీలాగుతున్నారు. అంతేకాక.. రాయపాటి సంస్థ మొత్తం రూ.8,836.45 కోట్ల రుణం తీసుకుని, ఎగ్గొట్టిందంటూ 18 బ్యాంకుల కన్సార్టియం చేసిన ఫిర్యాదుపై డిసెంబర్ 30, 2018న సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. ఆ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా శుక్రవారం రాయపాటి, ట్రాన్స్ట్రాయ్ ఎండీ శ్రీధర్, డైరెక్టర్లను సీబీఐ అధికారులు విచారించి.. వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు రుణాల వసూలుకు సహకరించాలని బ్యాంకర్ల విజ్ఞప్తికి స్పందించకపోవడం.. ఎస్క్రో అకౌంట్ హామీ ఇచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.300 కోట్ల రుణం ఇప్పించడం.. అంతటితో ఆగకుండా ఖజానా నుంచి రూ.144 కోట్లను స్పెషల్ ఇంప్రెస్ట్ అమౌంట్ రూపంలో దోచిపెట్టడం.. ఈ వ్యవహారంలో రాయపాటి, చంద్రబాబుకు ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా సీబీఐ ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది. (చదవండి: ఇదేమి నీచ రాజకీయం! ) విదేశాలకు నిధుల మళ్లింపు నిబంధనల ప్రకారం కన్సార్టియం బ్యాంకుల నుంచే ఏ సంస్థ అయినా రుణం తీసుకోవాలి. కానీ.. ట్రాన్స్ట్రాయ్ మాత్రం కన్సార్టియం బ్యాంకుల కళ్లుగప్పి ఇతర బ్యాంకుల నుంచి రూ.2,267.22 కోట్ల రుణం తీసుకుంది. కన్సార్టియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.8,836.45 కోట్లు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2,267.22 కోట్లలో సంబంధిత పనులకు కాకుండా ఇతర కార్యకలాపాలకు రూ.3,822 కోట్లను ట్రాన్స్ట్రాయ్ దారిమళి్లంచినట్లు ఈడీ ఇప్పటికే నిర్ధారించి కేసులు నమోదు చేసింది. సింగపూర్, రష్యా, ఉక్రెయిన్, మలేసియాల్లోని సంస్థలకు ఈ నిధులను మళ్లించినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. దీంతో ట్రాన్స్ట్రాయ్ నుంచి నిధులు మళ్లించిన సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లపై ఇటు సీబీఐ.. అటు ఈడీ దృష్టిసారించాయి. ‘పోలవరం’తో బ్యాంకులకు టోకరా పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌ను దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్.. వాటిని చూపి 2013 నుంచి 2018 వరకూ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌కి 18 బ్యాంకుల కన్సార్టియం రూ.8,836.45 కోట్ల రుణం ఇచ్చింది. నిజానికి దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ పోలవరం పనులు చేయలేదని.. దాన్ని తొలగించాలని 2014 నుంచి 2016 వరకూ అనేకమార్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సూచించినా నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. అంతేకాక.. ట్రాన్స్ట్రాయ్ తీసుకున్న రుణాలు చెల్లించడంలేదని.. పోలవరం బిల్లులు చెల్లించే సమయంలో అప్పుల వసూలుకు సహకరించాలంటూ జూలై 31, 2015న బ్యాంకుల కన్సార్టియం విజ్ఞప్తినీ సీఎం హోదాలో చంద్రబాబు తోసిపుచ్చారు. దాంతో ట్రాన్స్ట్రాయ్ ఆ రుణాలను ఎగ్గొట్టింది. ‘ఎస్క్రో’ అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని అప్పటి టీడీపీ సర్కార్ హామీ ఇస్తేనే రూ.300 కోట్ల రుణం 2017లో ఇచ్చామని.. కానీ బిల్లులను ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించకపోవడంతో తమ వద్ద తీసుకున్న రుణాన్ని ట్రాన్స్ట్రాయ్ ఎగ్గొట్టిందని సీబీఐకి 2018లోనే బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై సీబీఐ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. (చదవండి: టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు) -
టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్ /పట్నంబజార్/నగరంపాలెం: (గుంటూరు): తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు శుక్రవారం ఉదయం హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. గుంటూరు నగరం లక్ష్మీపురంలో ఉన్న ఆయన నివాసంలో ఉ.8 నుంచి మ.2.30 గంటల వరకు ఇవి కొనసాగాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నారు. పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, పన్నుల ఎగవేతకు సంబంధించిన నోటీసులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం తొమ్మిది మంది అధికార బృందం ఈ సోదాల్లో పాల్గొనగా అందులో ఐదుగురు సీబీఐ అధికారులు కాగా, నలుగురు కెనరా బ్యాంకు అధికారులున్నట్లు తెలిసింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ రూ.7,926.01 కోట్లు మోసానికి సంబంధించి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అసలేం జరిగిందంటే..? తాము చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు రుణాలు కావాలని ట్రాన్స్‌టాయ్ కంపెనీ పలు బ్యాంకులను సంప్రదించింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకు కెనరా బ్యాంకు నేతృత్వం వహించింది. అనంతరం.. వీరి నుంచి తీసుకున్న నిధులను తప్పుడు పత్రాలు, నకిలీ బ్యాలెన్స్ షీట్లు, మోసపూరిత స్టేట్మెంట్లు, తప్పుడు లెక్కల పుస్తకాలు, పత్రాలు చూపించి బ్యాంకు నిధులను తప్పుడు మార్గంలో మళ్లించారని.. ఫలితంగా తమకు రూ.7,926.01 కోట్లు నష్టం వాటిల్లినట్లు కెనరా బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. గతేడాది కూడా ఓ కేసు అలాగే.. వివిధ క్రెడిట్ లిమిట్స్ నుంచి రూ.264 కోట్లను పలు దఫాల్లో వేరే ఖాతాలకు ట్రాన్స్‌టాయ్ మళ్లించిందని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా వేరే ఖాతాలకు మళ్లించారంటూ హైదరాబాద్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు సీబీఐ 2019 డిసెంబరు 30న కేసు నమోదు చేసింది. అందులో చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, ఇదే కంపెనీకి చెందిన ఇండిపెండెంట్ నాన్–ఎగ్జిక్యూటివ్ అడిషనల్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, గుర్తుతెలియని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగులనూ ఎఫ్ఐఆర్లో చేర్చింది. నిందితులు వీరే.. ఈ కేసుతో సంబంధమున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి చెందిన కార్యాలయాలు, పలువురు డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈ సోదాలు జరిగాయి. ఈ కేసులో ఏ1గా ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్‌ను సీబీఐ పేర్కొంది. ట్రాన్స్ట్రాయ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ రాయపాటి సాంబశివరావు, అడిషనల్ డైరెక్టర్ అక్కినేని సతీష్, గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులను కూడా సీబీఐ నిందితులుగా చూపించింది. -
మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో సీబీఐ రైడ్
-
మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో సీబీఐ రైడ్
సాక్షి, గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే రాయపాటి ఇంట్లో సీబీఐ తనిఖీలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి సంబంధించిన పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాయపాటి కుటుంబ సభ్యుల్ని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. -
డీకే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు
-
డీకే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై సోమవారం ఉదయం ఆకస్మిక దాడులు చేసిన అధికారులు, కర్ణాటకలోని దొడ్డనహళ్లి, కనకాపుర, సదాశివ నగర్‌తో పాటు ముంబై తదితర 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. సుమారు 60 మంది అధికారులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. డీకే శివ కుమార్‌తో పాటు ఆయన సోదరుడు డీకే సురేష్‌కు సంబంధించిన నివాసాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి.(చదవండి: డీకే రవి భార్యకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్) కాగా రాజరాజేశ్వర నగర్, సిరా అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెష్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ తమను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కేంద్రం కక్షపూరిత చర్యలకు దిగిందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా.. ప్రధాని మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప చేతిలో తోలుబొమ్మగా మారిన సీబీఐ డీకే శివకుమార్ నివాసంలో సోదాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు తమను ఏమీ చేయలేవన్నారు. కర్ణాటకలో బీజేపీ సర్కారు అవినీతిని సీబీఐ తొలుత బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సైతం సీబీఐ దాడులను ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పూనుకుందంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతేడాది సెప్టెంబరులో డీకే శివకుమార్‌ను ఢిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 50 రోజుల పాటు ఆయన జైలులోనే ఉన్నారు. అనేక అభ్యర్థనల అనంతరం బెయిలు మంజూరైన తర్వాత తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. -
గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ సోదాలు
సాక్షి, వైఎస్సార్ కడప: ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రాథమిక సహకార సంఘం) మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీబీసీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు నిర్వహించారు. ఇంటితో పాటు ఆయన సొసైటీకి సంబంధించిన గోడౌన్లపై ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో జరిగిన దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వెండితో పాటు పలు కీలక డ్యాక్యుమెంట్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే ప్రొద్దుటూరులో చేనేత సొసైటీలో జరిగిన అక్రమాల పరంపరలో సొసైటీల అకౌంటెంట్లు శ్రీరాములు, కొండయ్య ఇళ్లపై సీఐడీ అధికారుల దాడులు చేసిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్‌లో సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎస్బీఐ బ్యాంక్‌కు చెందిన ఆరుగురు అధికారుల ఇళ్లలో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించింది. సినీఫక్కీలో తప్పుడు పత్రాలతో పాటు, లేని మనుషులను ఉన్నట్లుగా చూపి బ్యాంక్ నుంచి రుణాలు పొందిన భారీ మోసం వెలుగు చూసింది. రీన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొందరు ఎస్బీఐ ఉన్నత ఉద్యోగులు ముఠాగా ఏర్పడి రూ.16 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారనే అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు అధికారులు కలిసి డబ్బులు డ్రా చేసినట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్,మైసూర్,బెంగుళూరులో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. పలు ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
బంగారు చీర కానుకపై సీబీఐ ఆరా!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆర్థిక లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ సంస్థ ఖాతాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇతర ఖాతాలకు నిధులు మళ్లించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2013 నుంచి 2015 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నమయ్యారు. ఎంత డబ్బు రుణాల రూపంలో వచ్చింది.. వాటిని ఎలా ఖర్చు పెట్టారు? ఏయే ఖాతాలకు ఎంతెంత మళ్లించారు? అలా మళ్లించిన వాటిలో విదేశీ ఖాతాలు కూడా ఉన్నాయా? తదితర విషయాల గురించి ఆరా తీస్తున్నారని సమాచారం. ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇలాంటి సంస్థకు పోలవరం పనులు కట్టబెట్టడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. 2015లో ఖాతాను స్తంభింపజేసినా.. ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని, 2015లోనే బ్యాంకుల కన్సార్షియం సదరు సంస్థ ఖాతాను ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ – నిరర్థక ఖాతా)గా ప్రకటించింది. దీంతో ఇతర ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణ లున్నాయి. దేశీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. ఇతర ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లించారని సీబీఐ అనుమానిస్తోంది. రూ.264 కోట్ల నిధుల మళ్లింపుపై యూనియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న క్రమంలో ఈ విషయాలన్నీ వెలుగు చూస్తున్నట్లు తెలిసింది. అంత బంగారం ఎక్కడిది.? ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ పలుమార్లు ఇచ్చిన విరాళాలపైనా సీబీఐ దృష్టి సారించినట్లు సమాచారం. 2012 నవంబర్ 17న తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన బంగారు చీరను కానుకగా సమర్పించారు. ఆ బంగారు చీర తయారీకి ఎనిమిది కిలోల బంగారం (8086.97 గ్రాములు), 879.438 గ్రాముల వజ్రాలు, పగడాలు ఉపయోగించడం గమనార్హం. 2013 డిసెంబర్ 5న తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.3.42 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ నిధులు వారికి ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. కాగా, 2013కు ముందు ఈ సంస్థ ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులు, బ్యాలెన్స్ షీట్లను కూడా పరిశీలించనున్నారని సమాచారం. -
నగరంలో పలుచోట్ల సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ జాతీయ బ్యాంక్‌కు చెందిన అధికారులతోపాటు ప్రైవేటు మెడికల్ ల్యాబ్ ఉద్యోగుల ఇళ్లలో సీబీఐ గురువారం సోదాలు నిర్వహించింది. కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు బ్యాంకులో కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారనే అ భియోగాలపై ఇటీవల సీబీఐలో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆ బ్యాంకు ఉన్నతాధికారులు, ల్యాబ్ ఉద్యోగుల ఇళ్ల పై దాడులు చేసి ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
ఆమ్నెస్టీ కార్యాలయంపై సీబీఐ దాడులు
సాక్షి, బెంగళూరు: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బెంగళూరు, ఢిల్లీలోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యాలయాలపై శుక్రవారం దాడులు నిర్వహించింది. దాడులపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ సీబీఐ అధికారులు ఆరుగురు ఇవాళ ఉదయం 8.30 గంటలకు బెంగళూరు ఆమ్నెస్టీ కార్యాలయానికి చేరుకున్నారని, సాయంత్రం అయిదు గంటల వరకు సోదాలు కొనసాగించారని తెలిపారు. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిసారీ వేధింపులకు గురవుతున్నామని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ సంస్థ భారతీయ, అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొంది. గత ఏడాది కూడా విదేశీ మారకద్రవ్యాల ఉల్లంఘన (ఫెరా) కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. 2010లో ఫారన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ రద్దు కేసుతో ముడిపడి ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. -
ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో బుధవారం బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో దాదాపు నాలుగు గంటలకుపైగా సీబీఐ అధికారులతో పాటు బ్యాంకు అధికారులూ సోదాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఆర్థిక నేరారోపణల నేపథ్యంలో ఆయనను సీబీఐ అధికారులు గతేడాది జనవరి 21న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బెంగళూరు జైలులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు. కర్ణాటక హైకోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలుచేయగా.. బెయిల్ మంజూరుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున బెంగళూరు సీబీఐ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు నెల్లూరుకు చేరుకున్నారు. వాకాటి పీఏ రామకృష్ణకు ఫోన్ చేయగా.. తాను తిరుపతిలో ఉన్నానని చెప్పడంతో అధికారులు ఇద్దరు బ్యాంకు ప్రతినిధులను వెంటబెట్టుకుని వాకాటి గృహానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు. వివరాలు చెప్పేందుకు వారు నిరాకరించారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన వాకాటì.. వీఎన్ఆర్ ఇన్ఫ్రా, వీఎన్ఆర్ రైల్, లాజిస్టిక్స్ తదితర కంపెనీలు నిర్వహిస్తున్నారు. 2014లో హైదరాబాద్ షామీర్పేటలోని రూ.12 కోట్ల విలువైన భవనానికి నకిలీ డాక్యుమెంట్ల ద్వారా విలువ పెంచి రూ.250 కోట్ల రుణం కోరుతూ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్సీఐ)కు దరఖాస్తు చేసుకోగా.. రూ.190 కోట్ల రుణం మంజూరు చేసింది. అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో వాకాటి ఆస్తుల జప్తుపై ఫైనాన్స్ కార్పొరేషన్ దృష్టి సారించిన క్రమంలో డాక్యుమెంట్లు నకిలీవని తేలింది. దీంతో 2017 మే 5న కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. 2017 మే 12న నెల్లూరు నగరంతో పాటు హైదరాబాద్, బెంగళూరులోని ఆయన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించి 99 కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఇందిరా జైసింగ్ నివాసంలో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ : విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్‌లపై సీబీఐ గురువారం దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ నివాసం, ఎన్జీవో ఆఫీస్, ముంబయిలోని మరో ఆఫీసులో గురువారం ఉదయం 5గంటలకు దాడులు నిర్వహించినట్లు సీబీఐ పేర్కొంది. లాయర్స్ కలెక్టివ్ పేరిట ఎన్జీవోను స్థాపించి విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఎ) ఉల్లఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఆనంద్‌గ్రోవర్ పై కేసు నమోదైనట్లు వెల్లడించింది. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ 'లాయర్ కలెక్టివ్' ఎన్జీవో సంస్థ ద్వారా దాదాపు రూ.32 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఫిర్యాదులో ఇందిరా జైసింగ్‌ను నిందితురాలిగా పేర్కొనలేదని, కానీ లాయర్స్ కలెక్టివ్ నుంచి ఆమెకు రూ.96.60లక్షలు ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ స్పష్టం చేసింది. మరోవైపు ఇందిరా జైసింగ్ 2009 నుంచి 2014 వరకు అదనపు సొలిసిటర్గా భాద్యతలు నిర్వహించిన సమయంలో తన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులను హోంశాఖ అనుమతి లేకుండానే ఎన్జీవో సంస్థ నుంచి పొందినట్లు సీబీఐ తెలిపింది. సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ పై సీబీఐ నిర్వహించిన దాడులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ' రాజ్యాంగ విలువలను కాపాడడానికి వాళ్ల జీవితం మొత్తాన్ని అంకితం చేశారని, అటువంటి వారిపై అభియోగం మోపడం చాలా భాదాకరమని' కేజ్రీవాల్ ట్విటర్లో పేర్కొన్నారు. -
హర్యానా మాజీ సీఎం నివాసంలో సీబీఐ దాడులు
రోహ్తక్ : భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా నివాసంపై సీబీఐ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని దాదాపు 30కి పైగా ప్రదేశాల్లో సీబీఐ దాడులు చేపట్టింది. 2005లో హర్యానాలోని పంచ్కులలో ఏజేఎల్‌కు ప్లాట్‌ను రీ అలాట్ చేయడంపై గత ఏడాది డిసెంబర్లో హుడాపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. హుడా హర్యానా సీఎంగా పనిచేసిన సమయంలో పంచ్కులలో 14 పారిశ్రామిక ప్లాట్లను నామమాత్రపు ధరకు కట్టబెట్టారని ఆయనపై దర్యాప్తు ఏజెన్సీ ఆరోపిస్తోంది. ఇండస్ర్టియల్ ప్లాట్ల కేటాయింపునకు చివరి తేదీ 2012 జనవరి 6 కాగా, జనవరి 24న దరఖాస్తు చేసుకున్న 14 మందికి భూమిని కేటాయించారని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ప్రత్యేక న్యాయస్ధానంలో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పంచ్కులలో సీ-17 ప్లాట్‌ను రీ అలాట్ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ 67 లక్షల నష్టం వాటిల్లందని ఆరోపించింది. -
టార్గెట్ ఎవరు?
విశాఖ సిటీ: నిన్న మొన్నటి వరకు తెలంగాణలో దాడులు నిర్వహించి దుమ్ము రేపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. ఇప్పుడు విశాఖలో దాడులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రం నగరానికి భారీగా ఐటీ బృందాలు చేరుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఒడిశా, బెంగళూరు, చెన్నై నుంచి బృందాలు నగరానికి వచ్చినట్లు సమాచారం. గురువారం భారీగా ఐటీ దాడులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఐటీ ఉన్నతాధికారులు విశాఖలో మకాం వేశారని తెలుసుకున్న కొంతమంది రాజకీయ ప్రముఖుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఇప్పటికే.. అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన బడా నేతలు ఐటీ అధికారులు వచ్చినట్లు తెలుసుకొని తదుపరి ప్రణాళికపై సన్నిహిత వర్గాలతో చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
మరోసారి సీబీఐ
తణుకు: ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (వెస్ట్ మీరట్)గా పనిచేసిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాద్‌రావు వ్యవహారంలో సీబీఐ మరోసారి సోదాలు చేపట్టింది. ఈ వ్యవహారంలో వారం రోజులుగా తణుకు పరిసర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన బినామీలు, ఆస్తులు విక్రయించిన వారిపై దృష్టి సారించి వారిని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తణుకుకు చెందిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాదరావు ఇంటిలో గతేడాది అక్టోబరులో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయనతోపాటు ఆయన భార్య ఆకుల కనకదుర్గపైనా కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ ఏడాది మార్చిలో తణుకుకు చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు బినామీలు, ఆస్తులు విక్రయించిన వారికి నోటీసులు జారీ చేసి వారినీ విశాఖలోని సీబీఐ కార్యాలయంలో విచారించారు. చాలాకాలం తర్వాత మరోసారి సీబీఐ అధికారులు ఇటుగా దృష్టి సా రించారు. తాజాగా రాంప్రసాదరావు నివాసముంటున్న రెండు ఇళ్లతోపాటు బినామీలుగా వ్యవహరించిన పలువురి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమాస్తుల వ్యవహారంలో ఆస్తులు విక్రయించిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన, బినామీలుగా ఉన్న వ్య క్తులకు సైతం ఇటీవల నోటీసులు జారీ చేసిన అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. వారం రోజులుగా చేస్తున్న సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. గతేడాది కేసు నమోదు కేంద్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎ ఫ్ఎస్ అధికారిగా ముత్యాల రాంప్రసాదరావు పనిచేస్తున్న సమయంలోనే సీబీఐ అధికారులు తణుకులోని ఆయన నివా సంపై దాడి చేసి గతేడాది అక్టోబర్ 11న కేసు నమోదు చేశారు. ఆయన గతంలో ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తణుకు, విశాఖ, న్యూఢిల్లీ, మీరట్‌లో ఏ కకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.10.72 కోట్ల విలువైన చర, స్థిరాస్తి డాక్యుమెంట్లతోపాటు రూ. 37.25 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. రాంప్రసాదరావు భార్య ఆకుల కనకదుర్గ తణుకు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన సమాచారంతో రాంప్రసాదరావు, కనకదుర్గపై అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ప్రధాని పేషీకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దాడులు చేశారు. కనకదుర్గ భారీస్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెకు బినామీలుగా ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారులపైనా దృష్టి సారిం చిన అధికారులు మరోసారి సోదాలు ని ర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మా రింది. అధికారులు రాజమండ్రి సీబీఐ కార్యాలయంలో వీరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తణుకు రాష్ట్రపతి రోడ్డులో రాంప్రసాదరావు నివాసముంటున్న అ పార్ట్మెంట్లోని అన్ని ఫ్లాట్లలో సోదాలు జరిపినట్టు తెలిసింది. -
చెన్నై: గుట్కా స్కాంపై ఆరా తీస్తున్న సీబీఐ
-
గుట్కా మాఫియాపై సీబీఐ పంజా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మూడేళ్లుగా రహస్యంగా సాగుతున్న గుట్కా అక్రమ అమ్మకాలపై సీబీఐ పంజా విసిరింది. గుట్కా తయారీదారుల నుంచి రూ.40 కోట్ల ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై నగర మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ ఇళ్లపై బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తమిళనాడులో మొత్తం 40 చోట్ల, బెంగళూరు, ముంబైలో రెండు చోట్ల దాడులు జరిగినట్లు తెలిసింది. రూ.250 కోట్ల ఆదాయ పన్నును ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గుట్కా వ్యాపారి గిడ్డంగులపై అధికారులు సోదాలు నిర్వహించడంతో గతేడాది జూలై 8న ఈ స్కాం వెలుగుచూసింది. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణలపై విజయభాస్కర్ నివాసంలో గతంలో ఐటీ అధికారులు కూడా సోదాలు జరిపారు. పదవిలో ఉండగా సీబీఐ దాడులు ఎదుర్కొన్న తొలి డీజీపీ రాజేంద్రనే కావడం గమనార్హం. మాజీ మంత్రి, ఐఆర్ఎస్ నివాసాల్లోనూ గుట్కా మాఫియాపై ఆధారాలు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే అనుమాని తుల నివాసాలపై సీబీఐ దాడులు ప్రారంభమయ్యాయి. చెన్నై గ్రీన్‌వేస్‌రోడ్డులోని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ నివాసంలో ఐదుగురు, ముగప్పేరీలోని డీజీపీ రాజేంద్రన్ ఇంట్లో పది మంది అధికారులు సోదాలు జరిపారు. నొళంబూరులో నివసిస్తున్న మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ ఇంట్లో ఐదుగురు అధికారులు తనిఖీలు చేశారు. వీరుగాక విజయభాస్కర్ అనుచరులు, సహాయకులు, తిరువళ్లూరులో నివసిస్తున్న మాజీ మంత్రి రమణ, 2009 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి గుల్జార్ బేగం తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అన్ని చోట్ల నుంచి కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయభాస్కర్, రాజేంద్రన్‌ను వారివారి పదవుల నుంచి తొలగించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. నిషేధాన్ని నీరుగార్చిన మంత్రి గుట్కా, పాన్ మసాలా తదితర మత్తుపదార్థాల అమ్మకాలపై 2013లో తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా రాష్ట్రవ్యాప్తంగా గుట్కా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుట్కా హోల్‌సేల్ వ్యాపారి మాధవరావుకు చెందిన గిడ్డంగిపై ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ ఎత్తున సరుకును, ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు.ఆ డైరీలో కార్పొరేషన్‌లోని కిందిస్థాయి అధికారి మొదలుకుని ఐపీఎస్ అధికారులు, ఒక మంత్రి వరకు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు, ఏయే తేదీల్లో ముట్టజెప్పిన వివరాలు ఉన్నాయి. గుట్కాపై నిషేధాన్ని మంత్రి, అధికారులే నీరుగార్చేశారని తెలుసుకుని ఐటీ అధికారులు విస్తుపోయారు. డైరీలో ఉన్న లెక్కల ప్రకారం మంత్రి, 23 మంది అధికారులకు సగటున రూ.60 లక్షల చొప్పున మొత్తం రూ.40 కోట్ల వరకు ముడుపులు చెల్లించినట్లు తేలింది. శశికళకూ సంబంధాలు? జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే గుట్కా అక్రమాలపై ఆదాయ పన్ను శాఖ రాసిన లేఖ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, డీజీపీ అశోక్‌కుమార్‌లకు చేరింది. అయితే వారు ఈ విషయాన్ని జయలలిత దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఆమె చనిపోయిన తరువాత గుట్కా కేసు దాదాపుగా అటకెక్కింది. ఆ తరువాత జయలలిత నివాసంలో సోదాలు జరిపినప్పుడు శశికళ గదిలో ఐటీ శాఖ రాసిన ఉత్తరం దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. గుట్కా అమ్మకాలు గుట్టుగా సాగడంలో శశికళ ప్రమేయం ఉందన్న అనుమానంతో, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధకశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డీఎంకే ఎమ్మెల్యే, సీనియర్ నేత దురైమురుగన్ విజ్ఞప్తి మేరకు గత ఏప్రిల్ నెలలో మద్రాస్ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. చెన్నైలో రాజేంద్రన్ ఇల్లు -
డీజీపీ, ఆరోగ్యశాఖ మంత్రి ఇళ్లలో సీబీఐ సోదాలు
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన గుట్కా స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు బుధవారం దాదాపు 40 ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ దాడుల్లో 150 మంది అధికారులు పాల్గొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్‌తోపాటు, డీజీపీ రాజేంద్రన్, మాజీ డీజీపీ జార్జ్ ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా పలువురు పోలీసు అధికారులు, వ్యాపార వేత్తలు నివాసాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. కాగా 2017లో తమిళనాడు ఆదాయపన్ను శాఖ అధికారులు నిషేధిత గుట్కా తయారీ కేంద్రాలపై వరుస దాడులు నిర్వహించడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గుట్కా వ్యాపారుల నుంచి మంత్రి విజయభాస్కర్‌తో పాటు డీజీపీ ర్యాంకు అధికారులకు, కిందిస్థాయిలో పనిచేస్తున్న పలుశాఖలకు చెందిన అధికారులకు దాదాపు 40 కోట్ల వరకు ముడుపులు అందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు 2018 మే 30వ తేదీన తమిళనాడు ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ అధికారులు, రాష్ట్ర ఫుడ్ సెప్టీ అధికారులతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 2013 నుంచి తమిళనాడులో క్యాన్సర్ కారకాలైన గుట్కా, పొగాకు ఉత్పత్తులపై నిషేధం కొనసాగుతోంది. -
సీబీఐ వలలో ఐటీ ఆఫిసర్ శశికూమార్
-
ప్రధాని కార్యాలయం నుంచే అవినీతి..
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం అవినీతి రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రధాని కార్యాలయం నుంచే ఈ అవినీతి నడుస్తోందని ఆయన అన్నారు. విజయవాడ దాసరి భవన్లో శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టాలను తమకు అనుకూలంగా మార్చేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీని వ్యతిరేకించేవారిపై సీబీఐతో దాడులు చేయిస్తున్నారన్నారు. ప్రధాని కార్యాలయానికి ముడుపులు ఇవ్వలేక అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని నారాయణ విమర్శించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లపై ఒత్తిడి తీసుకురావడం అప్రజాస్వామికం అన్నారు. సీబీఐ స్పెషల్ జడ్జి లోయా మరణంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మెడికల్ కుంభకోణంపై ప్రధానమంత్రి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ...రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుందో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వివరించాలన్నారు. ఏపీపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న ఆయన.. పోలవరం ప్రాజెక్ట్ కు ఇచ్చే నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి.. ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఎంతవరకూ సాధించారని రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు ఇప్పిస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టేందుకు భవిష్యత్‌లో ఉద్యమాలు చేస్తామన్నారు. -
‘అంటే.. అసలు దర్యాప్తే జరగొద్దనా అర్ధం’
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఇంటిపై సీబీఐ దాడులకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తనకు నిర్దేశించిన చట్టానికి లోబడి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బాధ్యతలు నిర్వర్తిస్తోందని తెలిపారు. ‘రాజకీయ కక్ష సాధింపు అంటే ఏమిటి? ఇందులో బీజేపీ ఎక్కడ ఉంది? అసలు ఈ విషయం నాకు అర్థం కావడం లేదు. ఎవరూ ఏ తప్పు చేసినా వారిపై విచారణ చేయకూడదని చెప్పడమేనే మీరు చెప్పేదాని అర్ధం.. మొత్తానికి దర్యాప్తే జరగొద్దని అంటారా? అని వెంకయ్యనాయుడు విలేకరులను ప్రశ్నించారు. ‘సీబీఐ తన విధుల్ని తాను నిర్వర్తిస్తోంది. ఇప్పడు తనకు సరిగ్గా పనిచేసే అవకాశం ఉంది. గతంలో అలాంటి పరిస్థితి లేదు.. మా ప్రభుత్వం వచ్చాకే సీబీఐ చేస్తున్న పనుల్లో జోక్యం చేసుకోవడం లేదు. అందుకే సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది.. చట్టం ప్రకారం తనకు నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తిస్తోంది’ అని అన్నారు. శుక్రవారం ఉదయం 7గంటల ప్రాంతంలోనే లాలూ కుటుంబం, ఆయనకు చెందిన 12 ప్రాంతాలపై సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ఉందని పలువురు ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇలా స్పందించారు. -
సీబీఐ దాడులపై స్పందించిన లాలూ
బిహార్ : తన నివాసాల్లో సీబీఐ నిర్వహించిన దాడులపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదంతా బీజేపీ చేపడుతున్న రాజకీయ కుట్రగా ఆయన అభివర్ణించారు. అసలు సీబీఐ తన నివాసాల్లో ఎందుకు దాడులు నిర్వహించిందో కూడా తెలియలేదన్నారు. తానైతే ఏ తప్పుచేయలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ చేపడుతున్న ఈ రాజకీయ కుట్రలకు తాను కానీ, తన పార్టీ కానీ భయపడేది లేదని స్పష్టంచేశారు. సీబీఐ దాడులకు తన భార్య, పిల్లలు సహకరించాల్సిందిగా చెప్పానని, ఇది వారి తప్పుకాదని వెనకుండి మోడీ నిర్వహిస్తున్న తతంగమని చెప్పినట్టు తెలిపారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు హోటళ్ల టెండర్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఉదయ ఉదయాన్నే లాలూ ప్రసాద్ ఇంటిపై సీబీఐ కొరడా ఝళిపించింది.. ఆయన నివాసంతో పాటు మరో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కూడా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. మరోవైపు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ అవకతవకలకు పాల్పడినట్టు సీబీఐ కూడా వెల్లడించింది. ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని, హోటళ్ల టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని సీబీఐ ధృవీకరించింది. ఈ అక్రమాలకు పాల్పడినందుకు అప్పటి రైల్వే మంత్రి లాలూ, ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వి యాదవ్, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్‌పై కేసు కూడా నమోదుచేసినట్టు సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు సీబీఐ దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత పార్టీ జేడీయూ నేతలతో కూడా మరికాసేపట్లో సమావేశం కాబోతున్నారు. లాలూ కుటుంబ సభ్యులపై సీబీఐ కేసులు, తాజా పరిణామాలపై చర్చించడానికి ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. సీబీఐ తనిఖీలు, తేజస్వీ యాదవ్‌పై చర్యల విషయాన్ని ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. నితీష్ కేబినెట్లో లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ మంత్రిగా ఉన్నారు. -
డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి అపవాదు ఎదురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల కిందట సిసోడియా నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాలపైన ఏకకాలంలో దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. ఢిల్లీ ప్రజలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మమేకమయ్యే కార్యక్రమం అయిన ‘టాక్ టు ఏకే’ అనే పేరిట అక్రమాలకు పాల్పడ్డారని, పెద్ద మొత్తంలో డబ్బు పోగేసుకొని అవినీతి చర్యలకు దిగారని సీబీఐకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో గత జనవరిలోనే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ తాజాగా డిప్యూటీ సీఎం ఇంటిపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాము నిర్వహించింది దాడులు కాదని, నిబంధనల అతిక్రమణల వివరాలు తెలుసుకునేందుకు వచ్చామంటూ ఓ సీబీఐ అధికారి చివరిగా మీడియాకు చెప్పడం గమనార్హం. -
ప్రణయ్‌రాయ్ ఇంటిపై సీబీఐ దాడులు
ఓ ప్రైవేటు బ్యాంకుకు నష్టం చేకూర్చారని అభియోగం న్యూఢిల్లీ: రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించ కుండా ఓ ప్రైవేటు బ్యాంక్‌కు నష్టం చేకూర్చారన్న అభియోగంపై ప్రముఖ వార్తా చానల్ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. సంస్థకు చెందిన ఇతర కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించింది. ప్రణయ్‌రాయ్, ఆయన భార్య రాధిక, వారికి చెందిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్, కొందరు ఐసీఐసీఐ బ్యాంకు అధికారులపై నేరపూరిత కుట్ర, అవినీతి, మోసం కింద కేసులు నమోదు చేసిన సీబీఐ సోమవారం ఈ దాడులు జరిపింది.ఢిల్లీలోని రెండు ప్రాంతాలు, డెహ్రాడూన్, ముస్సోరీల్లో తమ బృందాలు సోదాలు చేసినట్టు సీబీఐ ఎస్పీ సుజిత్‌కుమార్ తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలతో ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.48 కోట్లు నష్టం వాటిల్లగా.. పర్యవసానంగా ఆర్ఆర్పీఆర్ లాభం పొందిందని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇది రాజకీయ దాడి: మీడియా స్వేచ్ఛను హరించి, దాని గొంతు నొక్కడానికి ప్రభుత్వం చేయించిన రాజకీయ దాడి ఇదని ఎన్డీటీవీ వెల్లడించింది. ఇలాంటి చర్యలతో అధికార పార్టీ నాయకులు తమను భయపెట్టలేరంది. ఐసీఐసీఐ నుంచి తీసుకున్న రూ.375 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేదని సీబీఐ ఆరోపిస్తోందని, కానీ ఏడేళ్ల కిందటే ఆ మొత్తాన్నీ బ్యాంక్‌కు జమచేశామంది. ఇందు లో రాజకీయ జోక్యం లేదని, మీడియాకు చెందిన వారైనంతమాత్రాన తప్పు చేస్తున్నా ప్రభుత్వం చూస్తూ కూర్చోదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. -
మీడియా అధిపతికి సీబీఐ ఝలక్!
న్యూఢిల్లీ: అనూహ్యరీతిలో సీబీఐ సోమవారం ఉదయం జాతీయ న్యూస్ చానెల్ ఎన్టీటీవీ సహ యాజమానులైన ప్రణవ్ రాయ్, రాధికా రాయ్ ఇళ్లలో దాడులు నిర్వహించింది. ఓ బ్యాంకును మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ ధ్రువీకరించింది. అయితే, ఎన్టీటీవీ కార్యాలయంలో ఈ సోదాలు జరగలేదు. ఎన్టీటీవీ ప్రమోటర్ కంపెనీ అయిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయంలో సీబీఐ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ ఇలా మొత్తం నాలుగుచోట్ల సీబీఐ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. 2008లో ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన గతవారం సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ప్రణయ్‌రాయ్ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 366 కోట్లు రుణంగా తీసుకొని.. రూ. 50 కోట్లు తక్కువ చెల్లించినట్టు సీబీఐ వర్గాలు చెప్తున్నాయి. -
నాటకం ఇక ముగిసింది: కార్తీ చిదంబరం
చెన్నై : కేంద్ర మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఎట్టకేలకు సీఐబీ దాడులపై స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ డ్రామా ఇక ముగిసిందని, తాను ఏ తప్పు చేయలేదని, సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపులో చర్యలేనని అన్నారు. కాగా ఒక మీడియా సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో కార్తీ చిదంబరం నివాసాలు, కార్యాలయాల్లో మంగళవారం సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఐఎన్ఎక్స్ మీడియాపై ఐటీ దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ఆర్థిక శాఖ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎఫ్ఐపీబీ)అధికారుల్ని కార్తీ ప్రభావితం చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఉదయం నుంచి పొద్దుపోయేవరకూ చెన్నై, ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌ల్లో 14 చోట్ల కార్తీ ఆస్తులపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు సీబీఐ దాడులను చిదంబరం కూడా తీవ్రంగా ఖండించారు. తన కుమారుడే లక్ష్యంగా సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. -
కార్తీ చిదంబరంపై సీబీ‘ఐ’
-
కార్తీ చిదంబరంపై సీబీ‘ఐ’
4 నగరాల్లో కార్తీ నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు ఐఎన్ఎక్స్ మీడియా నుంచి ముడుపులు స్వీకరించారని ఎఫ్ఐఆర్ - ఎఫ్ఐఆర్లో ‘ఐఎన్ఎక్స్’ యజమానులు ఇంద్రాణీ, పీటర్ ముఖర్జియా పేర్లు - ఇది రాజకీయ కక్ష సాధింపే: కార్తీ - నా గొంతు నొక్కేందుకే: పి.చిదంబరం న్యూఢిల్లీ/ సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మెడకు మరో సీబీఐ కేసు చుట్టుకుంది. ఒకవైపు ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసు విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు ఒక మీడియా సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై మంగళవారం సీబీఐ ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఐఎన్ఎక్స్ మీడియాపై ఐటీ దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ఆర్థిక శాఖ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎఫ్ఐపీబీ)అధికారుల్ని కార్తీ ప్రభావితం చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఆ మేరకు నేరపూరిత కుట్ర, మోసం, అక్రమంగా ప్రతిఫలం పొందడం, ప్రభుత్వాధికారుల్ని ప్రభావితం చేయడం, నేరపూరిత ప్రవర్తన నేరాలపై సోమవారమే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం మంగళవారం ఉదయం నుంచి పొద్దుపోయేవరకూ చెన్నై, ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌ల్లో 14 చోట్ల కార్తీ ఆస్తులపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఏముంది? ఎఫ్ఐఆర్లో కార్తీపై సీబీఐ పలు అభియోగాలు మోపింది. ఐఎన్ఎక్స్ మీడియాపై పన్ను దర్యాప్తు కేసును ప్రభావితం చేసేందుకు కార్తీ చిదంబరం డబ్బులు అందుకున్నారని ఆరోపించింది. ‘కార్తీ పరోక్ష భాగస్వామిగా ఉన్న అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ లిమిటెడ్‌కు రూ.10 లక్షలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఐఎన్ఎక్స్ మీడియా స్పష్టంగా పేర్కొంది. ఎఫ్ఐపీబీతో మధ్యవర్తిత్వం కోసం ఫీజుగా ఈ మొత్తం చెల్లించారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా కార్తీకి సంబంధమున్న కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా ఐఎన్ఎక్స్ గ్రూపు రూ.3.5 కోట్ల మేర ఇన్వాయిస్లు జారీచేసింద’ని సీబీఐ పేర్కొంది. కార్తీతో పాటు అతని కంపెనీ చెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఐఎన్ఎక్స్ మీడియా యజమానులు పీటర్, ఇంద్రాణీ ముఖర్జియాలు (ప్రస్తుతం ఇంద్రాణీ కుమార్తె షీనాబోరా హత్య కేసులో జైల్లో ఉన్నారు), ఐఎన్ఎక్స్ మీడియా, అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ సర్వీసెస్, ఆ కంపెనీ డైరెక్టర్ పద్మా విశ్వనాథన్‌ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. తమకందిన విశ్వసనీయ సమాచారం మేరకు అన్నీ నిర్ధారించుకుని కేసులు నమోదు చేశామంది. ఆర్థిక శాఖ, ఎఫ్ఐపీబీ అధికారులపై కార్తీ ఒత్తిడి తెచ్చారని సీబీఐ పేర్కొన్నా.. ఆ అధికారుల పేర్లను మాత్రం ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఏ తప్పూ చేయలేదు: కార్తీ ‘నేనెలాంటి తప్పూ చేయలేదు. సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేన’ని కార్తీ చిదంబరం ఆరోపించారు. తన కార్యాలయాలు, నివాసాల నుంచి సీబీఐ ఎలాంటి పత్రాల్ని స్వాధీనం చేసుకోలేదని, తనపై ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని పేర్కొన్నారు. గొంతు నొక్కేందుకే..: చిదంబరం తన కుమారుడే లక్ష్యంగా సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పి.చిదంబరం ఆరోపిం చారు. ‘ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, కాలమిస్టులు, ఎన్జీవోలు, పౌర సంస్థల విషయంలో చేసినట్లే నా గొంతు నొక్కడం, రాయకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. వెనక్కి తగ్గేది లేదు. పత్రికల్లో రాయడం కొనసాగిస్తా’ నని చిదంబరం స్పష్టం చేశారు. ఈ కేసులో ఎఫ్ఐపీబీలోని ఏ ఒక్క అధికారిపైనా సీబీఐ ఎందుకు ఆరోపణలు చేయలేదని ప్రశ్నించారు. ‘సన్’స్ట్రోక్‌కు మూల్యం తప్పదు: బీజేపీ కేంద్రం తనను లక్ష్యంగా చేసుకుందన్న చిదంబరం ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. చిదంబరం తనయుడి కంపెనీకి ఎఫ్ఐపీబీ నిధులు ఎందుకిచ్చిందన్నది ఇక్కడ విషయమని, దానిపై స్పందించాలన్నారు. ‘సన్’స్ట్రోక్‌కు చిదంబరం మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇవి ప్రతీకార దాడులన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై స్పం దిస్తూ... బీజేపీ ఎప్పటికీ చట్టం, స్వయంప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకోదన్నారు. అక్రమంగా రూ.305 కోట్ల సేకరణ విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎఫ్ఐపీబీ) నిబంధనల్ని ఉల్లంఘిస్తూ మారిషస్ నుంచి ఐఎన్ఎక్స్ భారీగా పెట్టుబడులు సేకరించింది. కేవలం రూ. 4.62 కోట్లు మాత్రమే సేకరించాలని ఎఫ్ఐపీబీ, ఆర్థిక శాఖ షరతులు విధించినా.. వాటిని లెక్కచేయకుండా రూ. 305 కోట్లను విదేశీ పెట్టుబడుల రూపంలో అందుకుంది. విదేశీ పెట్టుబడుదారులకు ఒక్కోటి రూ.800ల విలువైన షేర్లను జారీ చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆరోపణలపై ఐఎన్ఎక్స్ స్పందిస్తూ.. ఎఫ్ఐపీబీ షరతుల మేరకే పెట్టుబడులు సేకరించామని తెలిపింది. -
కావాలనే నన్ను టార్గెట్ చేశారు: చిదంబరం
చెన్నై: రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తమపై సీబీఐ దాడులు చేయించిందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఎయిర్టెల్-మ్యాక్సిస్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం నివాసాలపై సీబీఐ దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడులపై చిదంబరం స్పందిస్తూ తానేప్పుడు చట్టాన్ని ఉల్లంఘించలేదని, వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కావాలనే తనను టార్గెట్ చేశారని చిదంబరం వ్యాఖ్యానించారు. తమ గొంతు నొక్కేందుకు కేంద్రం దర్యాప్తుల పేరుతో సీబీఐతో దాడులు చేయించి కుట్రలు చేస్తోందన్నారు. తన కుమారుడితో పాటు అతడి స్నేహితులను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. దాడులకు భయపడేది లేదని చిదంబంరం స్పష్టం చేశారు. మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్... చిదంబరం నివాసంపై సీబీఐ దాడులను ఖండించారు. రాజకీయ కక్షతోనే దాడులు నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే చిదంబరంను కేంద్రం టార్గెట్ చేసిందని, కేవలం సంచలనం రేపాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి టామ్ వడక్కన్ ఆరోపించారు. -
చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు
-
చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు
చెన్నై : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నివాసంలో మంగళవారం సీబీఐ సోదాలు చేసింది. చెన్నైలో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే తమిళనాడు వ్యాప్తంగా 14 ప్రాంతాలతో పాటు ఢిల్లీ, నోయిడాలోనూ సీఐబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. విదేశీ పెట్టుబడులు తీసుకునేందుకు ఓ మీడియా గ్రూపునకు లంచం తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు కార్తి చిదంబరం సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంద్రాణి ముఖర్జియాకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియాకు 2008లో దొడ్డిదారిలో అనుమతులు మంజూరుచేయించినట్టు కార్తిపై ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు అయిన నేపథ్యంలో దాడులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఎయిర్ సెల్ , మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారం కేసులో కార్తీ చిదంబరంపై ఆదాయపన్ను శాఖ, ఈడీ వర్గాలు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్ సేవల్లో చోటుచేసుకున్న అవినీతిలో కార్తీ చిదంబరానికి వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. -
టీడీపీ నుంచి వాకాటి సస్పెన్షన్
-
టీడీపీ నుంచి వాకాటి సస్పెన్షన్
ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టి గెలిచిన నారాయణరెడ్డి ఇంటి మీద శుక్రవారం నాడు సీబీఐ అధికారులు దాడులు జరపడంతో.. ఆయనతో తమకు సంబంధం లేదని చెప్పుకోడానికి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వివిధ బ్యాంకులకు రూ. 450 కోట్ల మేర బకాయిలు ఉన్న వాకాటి నారాయణరెడ్డి విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా అనే విషయం గురించి దర్యాప్తు చేసేందుకే సీబీఐ ఈ సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీబీఐ సోదాలు చేయడం, బ్యాంకులకు భారీగా బకాయిలు ఉన్న విషయం మరోసారి బయటకు రావడంతో... ఆ గుట్టు రట్టు కావడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు రాగానే ఈ నిర్ణయం వచ్చింది. ఇంతకుముందు కూడా చాలామంది టీడీపీ నేతలపై ఈ తరహా ఆరోపణలు వచ్చినా వారెవ్వరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం తొలిసారిగా సస్పెన్షన్ వేటు వేయడం విశేషం. పార్టీలో ఎవరు తప్పుచేసినా కరెక్ట్ కాదని, అందుకే ఆయనను సస్పెండ్ చేస్తున్నామని బాబు ప్రకటించారు. -
టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు
-
టీడీపీ ఎమ్మెల్సీ ఇళ్లలో సీబీఐ సోదాలు
-
టీడీపీ ఎమ్మెల్సీ ఇళ్లలో సీబీఐ సోదాలు
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరులలో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. ఇటీవలే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత ఏడాది వాకాటి నారాయణరెడ్డిపై చీటింగ్ కేసు సహా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. వీఎన్ఆర్ ఇన్ఫ్రా తదితర కంపెనీల పేరుతో ఆయన సుమారు రూ. 450 కోట్ల వరకు రుణాలు తీసుకుని, డీఫాల్టర్‌గా మారడంతో బ్యాంకులు నోటీసులు పంపాయి. అవి తిరిగి రావడంతో మారిన చిరునామాకు కూడా నోటీసులు పంపాయి. ఆస్తులు వేలం వేయనున్నట్లు పత్రికల్లో భారీగా ప్రకటనలు ఇచ్చాయి. తాజాగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతోనే సీబీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఆదాయపన్ను శాఖ అధికారులు మే 3వ తేదీన వాకాటి ఇళ్లపై దాడులు చేసి, ఆయన విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా లేక మరేమైనా ఉందా అనే విషయాన్ని దర్యాప్తు చేశారు. అప్పట్లో నెల్లూరు, తడ, సూళ్లూరుపేటలలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామునే నెల్లూరు చేరుకుని వేదాయపాళెంలో ఉన్న ఇంట్లో సోదాలు చేసి, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి నెల్లూరులో ఉన్నది కేవలం అతిథిగృహం మాత్రమే. అందులో పది బెడ్రూంలు ఉన్నాయి. సీబీఐ అధికారులు అన్ని గదుల్లోకీ వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే అక్కడ ఏం గమనించామన్న విషయాన్ని మాత్రం వాళ్లు వెల్లడించడం లేదు. వాకాటి స్వగ్రామానికి కూడా సీబీఐ మరో బృందం చేరుకున్నట్లు తెలిసింది. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఓబీ తదితర బ్యాంకులకు వాకాటి భారీగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. -
పింఛన్‌కూ లంచం..
► నిజామాబాద్ జిల్లాలో సీబీఐకి చిక్కిన పోస్టుమాస్టర్ బాసిత్ ► పింఛన్‌దారుల నుంచి వెయ్యి లంచం డిమాండ్ ► సీబీఐకి ఫిర్యాదు చేసిన బీడీ కార్మికురాలు ► కొండూరు పోస్టాఫీసుపై సీబీఐ దాడి ► లంచం తీసుకుంటూ పట్టుబడిన పోస్టుమాస్టర్ సాక్షి, హైదరాబాద్/సిరికొండ (నిజామాబాద్ రూరల్) : ఆమె ఒక బీడీ కార్మికురాలు.. ప్రతీ నెల ప్రభుత్వం నుంచి ఆమెకు వచ్చేది రూ.1000 పింఛన్ మాత్రమే. ఆ పైసలే ఆధారంగా జీవిస్తున్న ఆమెకు రెండు నెలలుగా పింఛన్ అందడం లేదు. దీంతో తనకు పింఛన్ రావడం లేదని పోస్టుమాస్టర్‌ను అడిగింది. దీనికి అతను తనకు రూ.వెయ్యి లంచం ఇస్తే నీకు పింఛన్ వస్తుందని చెప్పాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఆ కార్మికురాలు సీబీఐని ఆశ్ర యించింది. రంగంలోకి దిగిన సీబీఐ సదరు పోస్ట్‌మాస్టర్‌ను అదుపులోకి తీసుకుంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామానికి చెందిన గర్గుల భారతి బీడీ కార్మికురాలు. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా వచ్చే పింఛన్ 2 నెలల నుంచి ఆమెకు రావడం లేదు. పింఛన్ కోసం కొండూర్ గ్రామ పోస్టుఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసింది. చివరికి బ్రాంచ్ పోస్టుమాస్టర్(బీపీఎం) బాసిత్‌ను తనకు రావాల్సిన పింఛన్ ఎందుకు రావడం లేదని అడిగింది. తనకు రూ.వెయ్యి లంచం ఇస్తే రెండు నెలల పింఛన్ ఇస్తానని అతను చెప్పాడు. గ్రామపంచాయతీ దగ్గర కానీ, తన ఇంటి వద్దకు గానీ రూ.వెయ్యి తెచ్చి ఇస్తే రూ. రెండు వేల పింఛన్ ఇస్తానని చెప్పాడు. రూ. వెయ్యి లంచం ఇవ్వకపోతే పింఛన్ఎప్పటికీ రాదని బెదిరించాడు. సీబీఐ అధికారులకు సమాచారం.. దీంతో భారతి భర్త రాములు తొలుత ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. పోస్టాఫీసు కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక వాటిపై దాడిచేసే అధికారం తమకు లేదని వారు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని సీబీఐ అధికారులకు వారు సమాచారం ఇచ్చారు. బాసిత్ ఫోన్లో డబ్బులు డిమాండ్ చేసిన విషయాన్ని రికార్డు చేశారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా సీబీఐ అధికారులను రాములు సంప్రదిస్తూ ఉన్నాడు. బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు తన ఇంట్లో భారతి నుంచి బాసిత్ రూ.వెయ్యి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడే విచారణ చేపట్టారు. సీబీఐ సర్కిల్ ఇన్స్పెక్టర్లు నరేష్, నందం ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల తర్వాత తపాలాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం ఆరు గంటల వరకు.. బాసిత్ ఇంట్లోనే ఉండి అధికారులు విచారణ చేశారు. అనంతరం బాసిత్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించారు. గతంలోనూ డబ్బులు తీసుకున్నాడు: భారతి బాసిత్ నాలుగు రోజుల నుంచి ఫోన్ చేసి లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని, గతంలోనూ పలుమార్లు ఫించన్ ఇచ్చేప్పుడు డబ్బులు తీసుకున్నాడని భారతి ఆరోపించారు. తన వద్దే కాకుండా గ్రామంలో పలువురి వద్ద నుంచీ డబ్బులు తీసుకునే వాడన్నారు. -
బ్యాంకులో సీబీఐ రైడ్స్.. భారీగా నగదు లభ్యం
-
బ్యాంకులో సీబీఐ రైడ్స్.. భారీగా నగదు లభ్యం
మల్లాపురం: పాత నోట్ల రద్దయిన దగ్గర్నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న సీబీఐ, ఐటీ, ఈడీ రైడ్స్‌లో కోట్లకు కోట్ల బ్లాక్‌మనీ, కొత్త కరెన్సీ నోట్లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కేవలం వ్యక్తుల వద్ద, ఎయిర్‌పోర్టులోనే కాదు, బ్యాంకులోనూ భారీగానే నగదు పట్టుబడుతోంది. బ్యాంకులో నగదు పట్టుబడటం ఏమిటా అనుకుంటున్నారా? ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా డిపాజిట్ చేసుకున్న మొత్తమే ఈ నగదు. కనీస ఆధారాలు లేకుండా నగదు డిపాజిట్ చేసుకుంటున్నారని గుర్తించిన సీబీఐ, మల్లాపురం కోపరేటివ్ బ్యాంకుల్లో దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం రూ.266 కోట్ల నగదు పట్టుబడింది. వీటికి సరిపడ ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం గమనార్హం. నవంబర్ 10 నుంచి 14 వరకు భారీ మొత్తంలో ఈ నగదు బ్యాంకుకు చేరినట్టు రైడ్స్‌లో అధికారులు గుర్తించారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే ఈ నగదును బ్యాంకు వారు డిపాజిట్ చేసుకున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఇవి బ్లాక్మనీనా కాదా అనేది తేలాల్సి ఉంది. ఈ అకౌంట్ హోల్డర్స్ వివరాలను వెంటనే తమకు అందించాలని బ్యాంకు అధికారులను సీబీఐ ఆదేశించింది. అదేవిధంగా పాత నోట్లు రద్దయిన తర్వాత ఆర్బీఐ విధించిన నిబంధనలను ఈ బ్యాంకు ఉల్లంఘించినట్టు కూడా అధికారులు గుర్తించారు. కస్టమర్ల డబ్బులను డిపాజిట్ చేసుకోవడానికి వారు ఎలాంటి నిబంధనలు పాటించలేదని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు సహకార బ్యాంకుల్లో ఉన్న లొసుగులను ఆశ్రయంగా తీసుకుని కొంతమంది రాజకీయవేత్తలు, బడాబాబులు భారీ మొత్తంలో నగదును డిపాజిట్ చేస్తున్నారని అంతకమున్నుపే పలు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. -
గోల్కొండ పోస్టాఫీసులో సిబిఐ సోదాలు
-
ఐటీ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు
కొండాపూర్ (రేంజ్-3) అధికారిగా పనిచేస్తున్న బీవీ రావు కూకట్పల్లి నివాసంలో సోదాలు... కేసు నమోదు సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖలో కొండాపూర్ (రేంజ్-3) అధికారి బొద్దు వెంకటేశ్వరరావు ఇంటిపై సీబీఐ గురువారం దాడులు చేసింది. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డ్ కాలనీ ఫేజ్-9లో ఉన్న ఆయన ఇంట్లో సీబీఐ ప్రత్యేక బృందం సోదాలు నిర్వహించి, కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగం, లంచాలతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ దీన్ని రిజిస్టర్ చేసింది. బీవీ రావుగా పిలిచే వెంకటేశ్వరరావుకు సంబంధించి 2010 ఏప్రిల్ 1- 2016 అక్టోబర్ 31 మధ్య ప్రకటిత ఆదాయం దాదాపు రూ.97.02 లక్షలుగా సీబీఐ తేల్చింది. ఈ కాలంలో ఆయన ఖర్చులు రూ.28,63,495గా నిర్ధారించింది. ఇవిపోగా ఆయన వద్ద నగదు, స్థిరచరాస్తుల రూపంలో రూ.68,38,505 మాత్రమే ఉండాల్సి ఉండగా... ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న వాటి విలువ రూ. 2,78,68,000గా అధికారులు లెక్కగట్టారు. ఎలాంటి ఆదాయం లేని రావు పెద్ద కుమారుడు ‘సప్తవర్ణ క్రియేషన్స’పేరుతో ఓ సినీ నిర్మాణ సంస్థను కలిగి ఉన్నాడని, 2014లో ఆయన చిన్న కుమారుడు హీరోగా ‘ఐయామ్ ఇన్ లవ్’చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నిర్మిం చారని సీబీఐ పేర్కొంది. దీనికి రూ.1.8 కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. మొత్తమ్మీద బీవీ రావు 212.64 శాతం ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు లెక్కకట్టింది. కేపీ హెచ్‌బీలో 637.37 చ.అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, కొండాపూర్‌లో ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించింది. రావుపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఆదాయ పన్ను అధికారి ఇంటిపై సీబీఐ దాడులు
హైదరాబాద్ : ఆదాయ పన్ను శాఖాధికారి ఇంటిపై సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులకు దిగారు. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఆదాయ పన్ను అధికారి బొడ్డు వెంకటేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు ఏకకాలంగా తనిఖీలు చేపట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. వెంకటేశ్వరరావు కుమారుల పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహారించి భారీగా డబ్బులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. సప్త వర్ణ క్రియేషన్స్ పేరుతో ఆయన కుమారుడిని హీరోగా చిత్రం నిర్శిస్తున్నట్లు సమాచారం. నగరంతో సహా 15 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల విలువ దాదాపు 40 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోస్టాఫీసుల్లో సీబీఐ మెరుపు దాడులు
-
పోస్టాఫీసులపై సీబీఐ ఆకస్మిక దాడులు
హిమాయత్‌నగర్‌లో రూ.40 లక్షలు అధీనంలోకి కొన్ని సేవింగ్స ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్లపై కన్ను ఈ నెల 8 నుంచి జరిగిన లావాదేవీల పరిశీలన బ్లాక్ మనీ మార్పిడి జరిగినట్లు అనుమానాలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల మార్పిడి నేపథ్యంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్‌లోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరవ్యాప్తంగా దాదాపు ఆరు చోట్ల ఏకకాలంలో ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. హిమాయత్‌నగర్ పోస్టాఫీస్‌లో ఉన్న రూ.40 లక్షల్ని తమ అధీనంలోకి తీసుకున్న సీబీఐ అధికారులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. పోస్టాఫీసులపై దాడుల నేపథ్యంలో పోలీసుల సహకారం సైతం తీసుకున్న సీబీఐ అధికారులు కార్యాలయాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. తనిఖీల్లో పోస్టల్ విజిలెన్స అధికారులు సైతం పాల్గొన్నారని సమాచారం. ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు ఈ నెల 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ పాత నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. దీంతో నగరవాసులు రూ.కోట్లలో పాత కరెన్సీని మార్పిడి చేసుకున్నారు. అరుుతే ప్రతి మార్పిడితోనూ కొన్ని ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలనే నిబంధన ఉంది. కొన్ని పోస్టాఫీసులకు చెందిన అధికారులు సిబ్బంది దీన్ని అతిక్రమించారని, కొందరికి ‘వెసులుబాటు’ కల్పిస్తూ పాత నోట్ల మార్పిడికి సహకరించారని సీబీఐకి వరుస ఫిర్యాదులు అందాయి. వీటికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సైతం సేకరించిన అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గురువారం ఏకకాలంలో దాడులు చేశారు. పోస్టాఫీసులకు సంబంధించి నోట్ల మార్పిడితో అవకతవకలతో పాటు డిపాజిట్లు, సేవింగ్స ఖాతాల్లో జమల్లోనూ భారీ అవకతవకలు జరిగినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రికార్డుల్ని పూర్తి స్థాయిలో పరిశీలించడంతో పాటు ఈ నెల 10 తర్వాత జరిగిన అన్ని ఫిక్సిడ్ డిపాజిట్లు, సేవింగ్స ఖాతాల్లో జమలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవకతవకలు నిర్ధారణ కాలేదు పోస్టాఫీసుల్లో సీబీఐ తనిఖీలు సాధారణమని, తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు నిర్ధారణ కాలేదని పోస్టాఫీసు హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ కె.సుధీర్‌బాబు తెలిపారు. సీబీఐ బృందం సాధారణ ప్రక్రియలో భాగంగానే తనిఖీలు నిర్వహించి కరెన్సీ మార్పిడి విధానాన్ని పరిశీలించిందని, కరెన్సీ మార్పిడిలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు బహిర్గతం కాలేదని పేర్కొన్నారు. అనుమానిత పార్సిల్స్‌పైనా దృష్టి కొందరు ‘నల్లబాబులు’ పోస్టాఫీసుల్నే ఆధారంగా చేసుకుని అధికారులు, సిబ్బంది సహకారంతో అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అనుమానిస్తోంది. సరైన ధ్రువీకరణ లేకుండానే, ఒకే ధ్రువీకరణపై పలు లావాదేవీలు అనుమతిస్తూ పాత నోట్లను మార్చుకునే అవకాశం ఇచ్చారన్నది సీబీఐ అనుమానం. ఇలా సాధ్యం కాని సందర్భాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఫిక్సిడ్ డిపాజిట్లు చేయించుకుని, కొన్ని రోజులకే వాటిని రద్దు చేయిస్తూ కొత్త నోట్లు ఇచ్చినట్లు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. కొన్ని అనుమానాస్పద పార్శిల్స్ పైనా దృిష్టిపెట్టినట్లు సమాచారం. ఈ నెల 8 తర్వాత నగరంలోని వాణిజ్య ప్రాంతాల నుంచి ఉత్తరాదితో పాటు ఇతర చోట్లకు వెళ్లిన కొన్ని పార్శిల్స్ వ్యవహారాలను సీబీఐ ఆరా తీసినట్లు తెలిసింది. -
పోస్టాఫీసుల్లో సీబీఐ మెరుపు దాడులు
హైదరాబాద్ : నగరంలోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులకు దిగారు. పెద్ద నోట్ల మార్పిడితో పోస్టాఫీసులలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో నారాయణగూడ పోస్టాఫీసులో రూ.40లక్షలు పట్టుబడ్డాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 8 నుంచి పోస్టాఫీసులలో జరిగిన లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లో భారీగా బ్లాక్‌మనీ డిపాజిట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం పది పోస్టాఫీసుల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
మాజీ సీఎం ఇళ్లపై సీబీఐ దాడులు
హర్యానా: హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా నివాసంపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఏకకాలంలో ఆయనకు సంబంధించిన 20 నివాసాలు, కార్యాలయాలపై దాడులు కొనసాగించింది. దీంతోపాటు ఆయనతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోన్న ఇద్దరు ఐపీఎస్‌ల నివాసాలపై కూడా సీబీఐ సోదాలు ప్రారంభించింది. మానెసర్‌లోని ఓ భూకేటాయింపులకు సంబంధించి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న హుడా భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఒక కేటాయింపునకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కూడా సంబంధాలున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు శనివారం దాడులు నిర్వహించింది. ఢిల్లీ, గుర్గావ్, చండీగఢ్‌లోని బంధువుల ఇళ్లల్లో కూడా సీబీఐ తనిఖీలు చేస్తోంది. -
అవినీతి భాండాగారంపై సీబీ‘ఐ’
కేంద్రీయ భాండార్‌పై మెరుపు దాడి రికార్డుల పరిశీలన.. అధికారులపై ప్రశ్నల వర్షం సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలోనూ తనిఖీలు తప్పుడు బిల్లులు.. దిద్దుబాట్ల నిలదీత సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు సాక్షి కథనం ఆధారంగా విచారణ కేంద్రీయ భాండార్‌లో జరుగుతున్న అవినీతి బాగోతాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సారించింది. కేజీబీవీలకు సరుకులు సరఫరా చేసే ఈ భాండార్‌లో తప్పుడు బిల్లులు, దిద్దుబాట్లు.. వంటి మాయాజాలాలను ‘సాక్షి’ వారం క్రితమే బట్టబయలు చేసిన నేపథ్యంలో.. ఆ కథనం ఆధారంగా సీబీఐ భాండార్‌పై మెరుపుదాడి చేసింది. సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలోనూ సోదాలు చేసింది. ప్రశ్నల వర్షంతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. వాటికి సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం కేంద్రీయ భాండార్ కార్యాలయంపై సీబీఐ అధికారులు బుధవారం మెరుపుదాడి చేశారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)లçకు సరుకులు సరఫరా చేసే భాండార్ అవకతవకలపై ‘అవినీతి భాండాగారం’ శీర్షికన గత నెల 27వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. పక్కా ఆధారాలతో ప్రచురించిన ఈ కథనంపై సీబీఐ అధికారులు స్పందించారు. నగరంలోని నీలమ్మ వేపచెట్టు సమీపంలో ఉన్న కేంద్రీయ భాండార్ కార్యాలయంలో బుధవారం సోదాలు చేపట్టారు. రికార్డులు, బిల్లులును తనిఖీ చేశారు. సాక్షి కథనంలో పేర్కొన్నట్టు.. బిల్లుల్లో తేడా ఎందుకొచ్చిందని అక్కడి అధికారులను ప్రశ్నించారు. బిల్లు నెంబర్లలో మాయాజాలంతో పాటు బిల్లుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. పొరపాటున(బై మిస్టేక్) అలా జరిగిందని భాండార్ వర్గాలు వివరణ ఇవ్వబోగా వారు అసహనం వ్యక్తం చేశారు. బిల్లుల్లో అన్ని కరెక్షన్లు ఎందుకున్నాయని నిలదీశారు. దీంతో సరైన సమాధానం చెప్పలేక భాండార్ అధికారులు నీళ్లు నమిలారు. అనంతరం సీబీఐ అధికారులు నేరుగా సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఎ) కార్యాలయానికి వెళ్లారు. కేంద్రీయ భాండార్ సరఫరా చేస్తున్న సరుకుల వివరాలు, వాటికి సంబంధించిన బిల్లులు, రికార్డులను పరిశీలించారు. సాక్షి కథనంలో ప్రస్తావించిన బిల్లుల గురించి ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారి శివరామ్‌ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ వ్యవహారమంతా ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్లు చూస్తారని శివరామ్‌ప్రసాద్ చెప్పడంతో తేదీల్లో తేడా ఎందుకొచ్చిందని ఫైనాన్స్ అండ్ ఆడిటింగ్ అధికారి (ఎఫ్ఏఓ) నీలకంఠేశ్వర్రావును ప్రశ్నించారు. అలాగే ‘సాక్షి’ కథనంలో పేర్కొన్న ఆనందపురం కేజీబీవీకి సంబంధించిన బిల్లుపై సూటిగా ప్రశ్నించారు. అక్కడి స్పెషల్ ఆఫీసర్‌ను పిలిపించాలని సీబీఐ అధికారులు ఎఫ్‌ఏవోను ఆదేశించారు. అయితే యాదృచ్ఛికంగా బుధవారం ఓ సమావేశానికి వచ్చిన ఆనందపురం ఎస్వో అక్కడే ఉండటంతో ఆ బిల్లుపై ఆమె వివరణ ఇచ్చారు. కొన్ని సరుకులు మిగిలిపోయిన సందర్భాల్లో వాటిని తిరిగి డీలర్లకే ఇచ్చేసి.. వాటికి బదులు అవసరమైన ఇతర సరుకులు తీసుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు. అటువంటి సందర్భాల్లోనే బిల్లుల్లో కొట్టివేతలు చోటుచేసుకున్నాయని వివరించారు. దీనికి సీబీఐ అధికారులు స్పందిస్తూ దిద్దుబాటు బిల్లులను ఆడిటింగ్‌కు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. మొత్తంగా సీబీఐ అధికారుల విచారణ అటు కేంద్రీయ భాండార్, ఇటు సర్వశిక్ష అభియాన్ వర్గాల్లో కలకలం రేపింది. -
చిట్‌ఫండ్ స్కాంపై ఐదు రాష్ట్రాల్లో సోదాలు
న్యూఢిల్లీ: విశాఖజిల్లాకు చెందిన ఓ చిట్‌ఫండ్ సంస్థ అధినేత ఆస్తులపై సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో ఆయనకు సంబంధించిన 82 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఆయన ఇంట్లో దాదాపు రూ.50 లక్షల నగదును, ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో రూ.16.80 లక్షల నగదును స్వాధీనం చేసకున్నట్లు వారు వెల్లడించారు. జార్ఖండ్, బిహార్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ఇళ్లు, కార్యాలయాలు, ఎస్టేట్స్, ఇతర ఆస్తులపై ఆరోపణలు రావడంతో తాము సోదాలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది భారీ చిట్ ఫండ్ కుంభకోణమని, ఇందుకు సంబంధించి రెండు కేసులు కూడా నమోదైనట్లు వివరించారు. -
'సీఎం ఆఫీస్' ఫైళ్ల అప్పగింతపై సందిగ్ధత
- దస్త్రాలు తిరిగిచ్చేలా సీబీఐని ఆదేశించాలని వాదించిన ఢిల్లీ సర్కార్ - లోతైన విచారణ అవసరమన్న హైకోర్టు న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 'ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంపై సీబీఐ దాడులు' కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రటరీ) రాజేంద్ర కుమార్ కార్యాలయం నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫైళ్లను తిరిగి ప్రభుత్వానికి అప్పగించే విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొంది. 'సీఎం ఆఫీస్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్లను సీబీఐ తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలా లేక విచారణ ముగిసేవరకు తనవద్దే ఉంచుకోవాలా? అనే ప్రశ్నకు జవాబు వెతకాల్సిఉంది' అని సోమవారం హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చేందుకు వీలుగా స్వాధీనం చేసుకున్న ఫైళ్ల కాపీలను తనకు అందించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 29కి వాయిదావేసింది. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయంపై సీబీఐ దాడులు నిర్వహించడం దేశవ్యాప్తంగా రాజకీయప్రకంపనలు సృస్టించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫైళ్లలో కీలక సమాచారం ఉందని, వెంటనే వాటిని తమకు అప్పగించాలని ఢిల్లీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించిన దరిమిలా విచారణ కొనసాగుతున్నది. -
జైట్లీపై కేజ్రీ‘వార్’
పరస్పర ఆరోపణలు విమర్శలతో ముదురుతున్న రగడ జైట్లీ తప్పుకోవాలి.. లేదా తప్పించాలి: కేజ్రీవాల్ డిమాండ్ * జైట్లీ హయాంలో డీడీసీఏలో భారీ ఆర్థిక అవకతవకలు: ఆప్ * దృష్టి మరల్చేందుకు కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం: జైట్లీ * యూపీఏ హయాంలోనే జైట్లీకి ఎస్ఎఫ్ఐఓ క్లీన్చిట్: బీజేపీ న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాల నేపథ్యంలో ఢిల్లీ సర్కారుకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య రాజుకున్న రగడ ముదురుతోంది. కేంద్రమంత్రి జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్నపుడు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని, అందుకు సంబంధించిన ఫైలు కోసమే సీబీఐ దాడులు జరిపిందని ఆరోపించిన కేజ్రీవాల్.. జైట్లీపై తన దాడిని ఉధృతం చేశారు. డీడీసీఏ అవినీతిపై నిష్పాక్షిక దర్యాప్తు జరగటానికి కేంద్ర మంత్రివర్గం నుంచి జైట్లీ తప్పుకోవాలని.. లేదంటే ప్రభుత్వమే ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఆరోపణలపై జైట్లీ ఎదురుదాడికి దిగారు. ఆయన అవినీతి అధికారిని రక్షిస్తున్నారని.. దృష్టి మరల్చేందుకు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ గళం పెంచగా, జైట్లీకి బీజేపీ వెన్నుదన్నుగా నిలిచింది. దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారు?: కేజ్రీవాల్ జైట్లీని ఉచ్చులో బిగించే డీడీసీఏ ఫైలు కోసమే సీబీఐ తన కార్యాలయంపై దాడులు నిర్వహించిందని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ‘‘తనపై ఆప్ చేసిన ఆరోపణలు నిరాధారమని, నిర్దిష్టమైనవి కావని జైట్లీ ఉద్ఘాటించటాన్ని పరమసత్యంగా పరిగణించరాదు.. ఆయనపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. భారీ మొత్తాలు ఉన్నాయి. ఆయన దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారు? జైట్లీ ఏమీ లేదని నిరాకరిస్తున్నారన్న ప్రాతిపదికతో ఆయనపై దర్యాప్తు జరపకుండా వదిలిపెట్టేట్లయితే.. బొగ్గు, 2జీ కేసుల్లో నిందులను కూడా అలాగే వదిలిపెట్టాలా? స్వతంత్ర దర్యాప్తుకు వీలు కలిగించేందుకు ఆయన పదవికి రాజీనామా చేయాలి.. లేదా ఆయన్ను తొలగించాలి’’ అని కేజ్రీవాల్ గురువారం వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు. భారీ మొత్తాలు దారిమళ్లించారు: ఆప్ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న 13 ఏళ్ల కాలంలో ఆ సంఘంలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. భారీ స్థాయిలో నిధులను నకిలీ సంస్థల ద్వారా దారి మళ్లించారని.. క్రికెట్ టీమ్ ఎంపికలు సహా ఇతర అక్రమాలు కూడా జరిగాయని పేర్కొంది. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్చద్దా, పార్టీ ఇతర నేతలతో కలిసి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ డీడీసీఏ అంతర్గత దర్యాప్తు సంఘమైన ఎస్ఎఫ్ఐఓ నివేదిక, ఢిల్లీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదికలను ఉటంకిస్తూ జైట్లీపై ఆరోపణలు గుప్పించారు. ‘‘ఢిల్లీ క్రికెట్ సంఘానికి జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఆ సంఘంలో భారీ అవినీతికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సమ్మతి తెలిపారని ధ్వజమెత్తింది. ఈ కేసులో దర్యాప్తు చేసే అధికారం గల కొన్ని దర్యాప్తు సంస్థలు ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నందున.. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగటం కోసం జైట్లీ రాజీనామా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరాలి’’ అని డిమాండ్ చేశారు. జైట్లీది మచ్చలేని రాజకీయ చరిత్ర: బీజేపీ జైట్లీది నిష్కళంకమైన రాజకీయ చరిత్ర అని, ఆయనపై ఆరోపణలు దురుద్దేశంతో కూడుకున్నవని బీజేపీ ఖండించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అరుణ్జైట్లీది నిష్కళంకమైన రాజకీయ చరిత్ర. ఆయనపై ఆరోపణలు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పనిచేస్తున్న ఒక అవినీతి అధికారిపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజకీయ చిత్తచాంచల్యం వంటి దూషణాత్మకమైన అసంబద్ధ ప్రచారం. యూపీఏ హయాంలో డీడీసీఏ వ్యవహారాలపై దర్యాప్తు జరిపిన ఎస్ఎఫ్ఐఓ జైట్లీకి క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయటం ఆ పార్టీ రాజకీయ కపటత్వాన్ని బహిర్గతం చేస్తోంది. జైట్లీపై ఆరోపణల ద్వారా ప్రజా దృష్టిని మరల్చాలన్న ఆప్ దురుద్దేశాన్ని బీజేపీ బహిరంగంగా ఖండిస్తోంది. జైట్లీకి మద్దతుగా పార్టీ దృఢంగా నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు. జైట్లీపై ఆరోపణలు నిరాధారం: డీడీసీఏ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నపుడు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆప్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీడీసీఏ ఖండించింది. జైట్లీ క్రికెట్ క్రీడను మెరుగుపరచటం కోసం కృషిచేశారని, ఫిరోజ్‌షా కోట్లా స్టేడియాన్ని ప్రపంచ స్థాయికి పెంచారని.. ఆయనను ఈ వివాదంలోకి లాగటం అనుచితమని పేర్కొంది. ఈ సందర్భంగా.. స్టేడియం పునరుద్ధరణకు అయిన వ్యయానికి సంబంధించిన వివరాలను చదివి వినిపించారు. దృష్టి మరల్చేందుకు తప్పుడు ప్రచారం: జైట్లీ కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జైట్లీ ఎదురుదాడికి దిగారు. ఆయన గురువారం ఇంటర్నెట్ బ్లాగ్‌లో రాయటంతో పాటు, ఢిల్లీలో మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. ‘‘ఈ ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదు. అసత్యాలు చెప్పటం, అపనిందలు వేయటాన్ని ఆయన విశ్వసిస్తున్నట్లు.. అపస్మారక స్థితికి దగ్గరైన భాషను ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. డీడీసీఏ ఉదంతం.. స్వయంగా తానే బోనులో ఉన్నపుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసే ప్రచార ఎత్తుగడలో భాగం. అవినీతి కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్న ఒక అధికారిని రక్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నేను క్రికెట్ పర్యవేక్షణను 2013 లో వదిలిపెట్టాను. గతంలో ఢిల్లీ క్రికెట్ వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)కు యూపీఏ సర్కారు అప్పగించింది. అది 2013 మార్చి 21న నివేదిక ఇచ్చింది. ఎటువంటి మోసం కనిపించలేదని స్పష్టంచేసింది. డీడీసీఏ అధ్యక్షుడిగా నా పాత్ర ఒక కంపెనీలో రోజు వారీ వ్యవహారాలకు సంబంధం లేని నాన్-ఎగ్జిక్యూటివ్ (నిర్వహణాధికారం లేని) చైర్మన్ పాత్ర వంటిది’’ అని పేర్కొన్నారు. ఆప్ ‘విరాళాల’పై సీబీఐ దర్యాప్తుకు ఢిల్లీ హైకోర్టు నో ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో విరాళాల సేకరణలో విదేశీ మాదకద్రవ్య నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న వినతిని ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన ఒక ఫిర్యాదును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేసిందని పేర్కొంది. -
'అందుకే నా మీద బురద చల్లుతున్నారు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై పరుష పదజాలంతో విమర్శలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైఖరిని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గర్హించారు. కేజ్రీవాల్ హిస్టిరియా వచ్చినట్టుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్యాలు, అపవాదులను ఆయన నమ్ముకుంటున్నారని తన బ్లాగ్ లో పేర్కొన్నారు. ప్రధానిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్ ను ఇద్దరు ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, మమతా బెనర్జీ సమర్ధించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేజ్రీవాల్ కు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించాలని వారికి సూచించారు. ప్రధానికి వ్యతిరేకంగా చేసిన సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీయవా అని ప్రశ్నించారు. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అయినా ఇలాంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. సీబీఐ దర్యాప్తు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిని కాపాడేందుకు ఢిల్లీ సీఎం తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన గదిలో సీబీఐ సోదాలు జరగలేదన్న విషయం నిర్ధారణయిందని జైట్లీ అన్నారు. -
14 లిక్కర్ బాటిళ్లు.. 26 లక్షల నగదు!
న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్‌కు కేజ్రీవాల్ ప్రభుత్వానికి మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపిన రాజేంద్రకుమార్ కేసులో సీబీఐ మరిన్ని అనూహ్య విషయాలు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కార్యదర్శి అయిన రాజేంద్రకుమార్ ఇంట్లో 14 మద్యం బాటిళ్లు లభించాయని తెలిపింది. అదేవిధంగా ఆయన బ్యాంకులో రూ. 28 లక్షల నగదు లభించిందని, దానిని స్వాధీనం చేసుకున్నామని సీబీఐ వివరించింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లోని రాజేంద్రకుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరుపడం రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ చర్యకు పాల్పడ్డారని, ఆయనో పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఈ కేసుతో తమకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీబీఐ కూడా సోదాలపై వివరణ ఇచ్చింది. కేజ్రీవాల్ ప్రభుత్వం రాకముందే రాజేంద్రకుమార్ అవినీతి చర్యలకు పాల్పడ్డారని, ఆయన వివిధ కంపెనీలకు టెండర్లు నిర్వహించకుండా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని, అందుకే ఆయన ఇల్లు, కార్యాలయంపై దాడులు జరిపినట్టు సీబీఐ తెలిపింది. ఆయన బ్యాంకులో 28 లక్షల నగదు దొరికిందని, అదేవిధంగా పరిమితికి మించి 14 మద్యం బాటిళ్లు ఆయన నివాసంలో లభించాయని, వీటిని స్వాధీనం చేసుకున్నామని సీబీఐ తెలిపింది. అయితే రాజేంద్రకుమార్‌కు వ్యతిరేకంగా సీబీఐ వద్ద తగినంత సాక్ష్యాధారాలు లేవని కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నాయి. -
దీదీకి షాకుల మీద షాకులు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా వెళ్దామని అనుకున్నందుకు మమతా బెనర్జీకి అనుకోని షాక్ తగిలింది. ఒక్కసారిగా ట్విట్టర్ జనాలు మమత మీద తమకున్న కసి అంతటినీ తీర్చేసుకున్నారు. ఆమె ఒక్క ట్వీట్ చేశారో లేదో.. వందలాది ట్వీట్లతో ఒకరకంగా కుమ్మేశారు. కేజ్రీవాల్ కార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంపై సీబీఐ దాడులు చేయగానే మమతా బెనర్జీ.. 'సీఎం కార్యాలయాన్ని సీల్ చేయడం ఎప్పుడూ లేదు. నేను షాకయ్యాను' అని ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ సరిగ్గా ఉదయం 11.18 నిమిషాలకు వచ్చింది. కొద్ది సేపటికే కేజ్రీవాల్ ఆమెకు సమాధానం ఇస్తూ, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని వ్యాఖ్యానించారు. సాయంత్రానికి చూస్తే, వేలాది మంది మమత ట్వీట్ల మీద స్పందించారు. అందులో ఎక్కువ మంది శారదా స్కాంను ప్రస్తావిస్తూ.. ఇక తర్వాత మీ వంతేనని చెప్పారు. మరికొందరేమో 'అది బెంగాల్ పోలీసు కాదు.. సీబీఐ' అని ఎద్దేవా చేశారు. సత్యాన్వేషి అనే ఐడీతో ఉన్న వ్యక్తి అయితే, 'అసలు వాళ్లు శారదా స్కాం విషయం పట్టించుకోకుండా ఢిల్లీ కేసును ఎలా విచారిస్తారు.. నేను కూడా షాకయ్యాను. అరవింద్ కేజ్రీవాల్ కంటే మీరే ముందుండాల్సింది.. మీకు నా సానుభూతి' అని ట్వీట్ చేశాడు. కోల్‌కతాలో మమతాబెనర్జీ కార్యాలయం ఉన్న రాష్ట్ర సచివాలయం పేరు నబన్నా. శారదా స్కాంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి శంకు పాండాను సీబీఐ వర్గాలు ప్రశ్నించడంతో ఆయనను పార్టీ పదవి నుంచి తొలగించారు. ఈ స్కాంలో చాలా మంది పార్టీ నాయకులు లబ్ధిదారులుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ జనాల్లో ఎక్కువ మంది శారదా స్కాంను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీని ఉతికి ఆరేశారు. -
పార్లమెంటులో విపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంఓ కార్యాలయంపై సీబీఐ దాడులు చేయటం.. సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన దాడి అంటూ ప్రతిపక్ష పార్టీలు మంగళవారం పార్లమెంటులో మండిపడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ దాడుల అంశాన్ని ప్రస్తావించింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించారంటూ విపక్షాలు సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటంతో ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది. రాజ్యసభలో విపక్షాల ఆగ్రహం, ఆందోళనలతో సభ మూడుసార్లు వాయిదా పడింది. ‘‘ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. దేశంలో సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన అంశం’’ అని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రైన్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్ ఆయనతో గళం కలుపుతూ.. ప్రభుత్వం రాజ్యాంగాన్ని హత్య చేస్తోందని ధ్వజమెత్తారు. వామపక్ష పార్టీలు, జేడీయూ సభ్యులు కూడా తమ స్థానాల్లో నిల్చుని సర్కారుపై నిరసన వ్యక్తంచేశారు. విపక్షాల ఆందోళనకు ఉభయసభల్లోనూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇచ్చారు. ఢిల్లీ సీఎం కార్యాలయంపై సీబీఐ దాడులు చేయలేదన్నారు. ఓ సీనియర్ అధికారి అవినీతి కేసులో ఉన్నారని.. ఆయన కార్యాలయంలో మాత్రమే దాడులు జరుగుతున్నాయన్నారు. -
సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు రాజేంద్ర కుమార్
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్‌ను సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. సీబీఐ అధికారులు అతడిని ప్రశ్నించనున్నారు. కాగా రాజేంద్ర కుమార్ నివాసంలో దాడులు జరిపిన సీబీఐ ...ఫారెన్ కరెన్సీతో పాటు, నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తనపై కక్షతోనే ఈ దాడులు చేయించారని, సీబీఐ దాడులకు భయపడేది లేదని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానిస్తే...కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు 'రబ్బిష్' అంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. మరోవైపు ఆప్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ రాజకీయ ఎజెండా కోసం పాకులాడుతున్నాయని, అయితే ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
నా కొడుకునైనా జైలుకు పంపిస్తా: కేజ్రీవాల్
-
ఆ వ్యాఖ్యలు క్షమార్హం కాదు: కిరణ్ బేడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై పరుష పదజాలంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడడాన్ని బీజేపీ నాయకురాలు కిరణ్ బేడి తప్పుబట్టారు. ప్రపంచంలో అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లోని మొదటి 10 మందిలో ప్రధాని మోదీ ఒకరని అన్నారు. అలాంటి వ్యక్తిని పిరికివాడు, మానసిక దౌర్బల్యం కలిగిన వారిగా విమర్శించడం సరికాదని ఉద్బోధించారు. ఈ వ్యాఖ్యలు క్షమార్హం కాదన్నారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేయాలని సూచించారు. ప్రజలను దిగ్భ్రాంతి, బాధకు గురిచేసేవిగా కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. జాతికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన కార్యాలయంలో సీబీఐ సోదాలు చేయడంతో ప్రధాని మోదీపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకునే ఈ సోదాలు జరిపారని ఆరోపించారు. మంగళవారం ఉదయం నుంచి తన కార్యాలయంతో పాటు పలుచోట్ల సీబీఐ దాడులు చేసిందని తెలిపారు. విద్యా శాఖ కార్యాలయంలోనే సోదాలు జరిపామని సీబీఐ ఇచ్చిన వివరణలో వాస్తవంలేదని ఆయన స్పష్టం చేశారు. -
నా కొడుకునైనా జైలుకు పంపిస్తా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ : సీబీఐ దాడులు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని సీబీఐ టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, అవినీతిలో ప్రమేయం ఉంటే తన కొడుకునైనా జైలుకు పంపిస్తానని కేజ్రీవాల్ అన్నారు. వాళ్లకు తానే టార్గెట్ అని, తన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కాదని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సంబంధం ఉన్న డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్) ఫైళ్ల కోసమే సోదాలు నిర్వహించారని ఆయన విమర్శించారు. తన కార్యాలయంలోని ప్రతి ఫైల్‌ను సీబీఐ సోదాలు చేసిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటానని ఆయన అన్నారు. కాగా సీబీఐ దాడులపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేసే దాడులు జరిపారన్నారు. దీనిపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్థమేనని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ దాడులు జరపటాన్ని పశ్చిమ బెంగాల్, బిహార్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ తప్పుబట్టారు. అలాగే అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నప్పుడు సీఎం కార్యదర్శి సహా ఎవరిపైన అయినా సీబీఐ దాడులు చేయొచ్చని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా సీఎంవో కార్యాలయంపై సీబీఐ దాడుల ఘటనకు సంబంధించి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐ దాడులకు ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని కేజ్రీవాల్ సమర్థించడం సరికాదన్నారు. అవినీతి ఆరోపణలు ఉంటేనే సీబీఐ దాడులు చేస్తుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ దాడులు చేయలేదని, తప్పుడు విమర్శలు చేస్తున్న కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. మరోవైపు కేజ్రీవాల్ కార్యాలయంలో దాడులు జరిపినట్లు వచ్చిన వార్తలను సీబీఐ ఖండించింది. దాడులు జరపినట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవంటూ సీబీఐ అధికారులు కొట్టిపారేశారు. -
సీఎంఓ నివాసంలో 3లక్షల ఫారెన్ కరెన్సీ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్ నివాసంలో మూడు లక్షల విలువైన విదేశీ కరెన్సీతో పాటు రూ.2.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా దాడులపై సీబీఐ మరికాసేపట్లో మీడియా ముందుకు రానుంది. మరోవైపు దాడులను ఖండిస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకుని, ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా ఢిల్లీ సచివాలయంలోని అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం సీబీఐ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. సీఎంఓలోని రాజేంద్రకుమార్ అనే అధికారి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే కేసులో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. -
మోదీ పిరికిపంద.. సైకో: కేజ్రీవాల్
అవినీతి ఆరోపణలతో ఢిల్లీ సచివాలయంలో సీబీఐ సోదాలు చేయడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిరికిపంద, సైకో అంటూ అభివర్ణించారు. సీబీఐ అబద్ధాలు ఆడుతోందని, తన సొంత కార్యాలయంలోనే దాడులు జరిగాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సీఎం కార్యాలయంలోని ఫైళ్లను వాళ్లు తనిఖీ చేస్తున్నారని, మోదీకి ఏ ఫైలు కావాలో చెప్పాలని అన్నారు. రాజేంద్రకుమార్ వంక పెట్టుకుని తన కార్యాలయంలోని మొత్తం అన్ని ఫైళ్లను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. అవినీతి ఆరోపణలు రాగానే ఒక మంత్రిని, మరో సీనియర్ అధికారిని తనంతట గానుగా డిస్మిస్ చేసిన ఏకైక ముఖ్యమంత్రిని తానేనని, వాళ్ల కేసులను సీబీఐకే అప్పగించానని గుర్తు చేశారు. సీబీఐకి రాజేంద్ర కుమార్ మీద ఏవైనా సాక్ష్యాలు లభిస్తే వాళ్లు ఆ విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని.. అలా చెబితే వాళ్లపై తానే చర్యలు తీసుకునేవాడిని కదా అని కేజ్రీవాల్ అన్నారు. Modi is a coward and a psycopath — Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 CBI lying. My own office raided. Files of CM office are being looked into. Let Modi say which file he wants? — Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 राजेंद्र के बहाने मेरे दफ़्तर की सारी फ़ाइल देखी जा रही हैं। — Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 I am the only CM who dismissed, on my own, a minister n a senior officer on charges of corruption and handed their cases to CBI(1/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 If CBI had any evidence against Rajender, why didn't they share it wid me? I wud hv acted against him(2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 -
కొట్లాడటం ఆ సీఎంకు ఫ్యాషనైపోయింది
పదే పదే కేంద్రప్రభుత్వంతో కొట్లాడటం, ప్రతి విషయానికీ ప్రధానమంత్రి పేరు ప్రస్తావించడం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఫ్యాషనైపోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఢిల్లీ సచివాలయంలో ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరగడం.. దానిపై ప్రధానిని విమర్శిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేయడంతో వెంకయ్యనాయుడు స్పందించారు. సీబీఐ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడంలేదని, అలా పనిచేసే రోజులు కాంగ్రెస్‌తోనే పోయాయని ఆయన అన్నారు. ఇప్పుడు సీబీఐ ఒక స్వతంత్ర సంస్థ అని, ప్రభుత్వం అందులో ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ఎలా విమర్శిస్తారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో ప్రధానికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. అధికారాన్ని దుర్వినియోగం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ మీద తాము కేసు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు వివరించాయి. గత కొన్నేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వ శాఖలకు చెందిన టెండర్లన్నింటినీ ఒకే సంస్థకు కేటాయించడం ద్వారా వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తున్నారని, దీనిపై తాము వారంట్లు తీసుకుని ఆయన కార్యాలయం, ఇళ్లపై సోదాలు చేస్తున్నామని సీబీఐ తెలిపింది. -
సీఎం కార్యాలయంలో సీబీఐ సోదాలు
-
సీఎం కార్యాలయంలో సీబీఐ సోదాలు
ఢిల్లీ సచివాలయంలోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం సీబీఐ సోదాలు జరిగాయి. సీఎంఓలోని రాజేంద్రకుమార్ అనే అధికారి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే కేసులో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. సీఎం కార్యాలయం ఉన్న ఫ్లోర్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కేంద్రం ఎన్ని రకాలుగా బెదిరించినా తాను మాత్రం భయపడేది లేదని ఆయన అన్నారు. తన కార్యాలయంలో సీబీఐ దాడులు జరిగాయని, అయితే తనను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆయన మరో ట్వీట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాము కేజ్రీవాల్ కార్యాలయంలో ఎలాంటి సోదాలు చేయలేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి. కేవలం సెక్రటరీ రాజేంద్రకుమార్ కార్యాలయంలో మాత్రమే సోదాలు చేస్తున్నట్లు వివరించాయి. సీఎంఓలోని ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ మీద, మరికొందరు ప్రైవేటు వ్యక్తుల మీద 'నేరపూరిత దుష్ప్రవర్తన'కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వంలోని కొందరు అధికారులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. చాలా కాలంగా వాళ్లకు రాజేంద్ర కుమార్ సాయం చేస్తూ, కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాజేంద్రకుమార్ కార్యాలయంతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో కూడా మంగళవారం ఉదయం సీబీఐ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సోదాలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ''దేశంలో తొలిసారి ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాలు జరిగాయి. ప్రధానమంత్రి ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టిస్తున్నారు. ప్రధాని సూచనల మేరకే సీబీఐ పనిచేస్తోందని అందరికీ తెలుసు. సోదాలు చేయడానికి ముందు అసలు ముఖ్యమంత్రికి విషయం చెప్పారా" అని పార్టీ ప్రతినిధి ప్రశ్నించారు. CBI raids my office — Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 When Modi cudn't handle me politically, he resorts to this cowardice — Arvind Kejriwal (@ArvindKejriwal) December 15, 2015 -
విజయ్ మాల్యాపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇళ్లు, ఆయనకు చెందిన దివాళా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం దాడులు జరిపింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు నెగెటివ్ క్రెడిట్ రేటింగ్స్ ఉన్నా.. ఆ సంస్థకు ఐడీబీఐ బ్యాంకు నుంచి భారీమొత్తం రూ. 950 కోట్ల రుణం ఇచ్చిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్నది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ ఎన్పీఏ మోసంపై సీబీఐ విచారణ జరుపుతున్నది. పలు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ రంగం బ్యాంకులు భారీమొత్తంలో రుణాలు ఇవ్వడంలో అవకతవకలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్న సీబీఐ బృందాలు ఇందులో భాగంగానే మాల్యా నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. రుణమోసం వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సీబీఐ త్వరలోనే విజయ్ మాల్యాను కూడా ప్రశ్నించే అవకాశముందని తెలుస్తున్నది. -
హిమాచల్ సీఎంపై అవినీతి కేసు నమోదు!
-
హిమాచల్ సీఎంపై అవినీతి కేసు నమోదు!
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌పై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు న్యూఢిల్లీలోని 11 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, అవినీతికి పాల్పడ్డారని వీరభద్ర సింగ్‌పై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. వీరభద్రసింగ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదయ్యాయి. 2009 నుంచి 2011 వరకు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన ఆదాయం కంటే రూ. 6.1 కోట్ల మేర అధికంగా ఆస్తులు సమకూర్చుకున్నారన్నది సీబీఐ ఆరోపణ. ఆయన భార్య ప్రతిభాసింగ్, కొడుకు విక్రమాదిత్య, కూతురు అపరాజితలపై కూడా కేసులు నమోదయ్యాయి. 80 ఏళ్ల వయసున్న వీరభద్రసింగ్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన భార్య, పిల్లలు కొన్ని ప్రైవేటు బ్యాంకుల నుంచి ఎలాంటి సెక్యూరిటీలు లేకుండా రుణాలు తీసుకున్నారని, దానికి బదులుగా ఆయా కంపెనీలకు సీఎంగా ఆయన మేలు చేశారని ఆరోపణలున్నాయి. లంచాలు, మనీ లాండరింగ్, ఫోర్జరీ తదితర ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కేంద్ర మాజీమంత్రి శంకర్ సింగ్ వాఘేలా ఇంట్లో కూడా సీబీఐ వర్గాలు అవినీతి కేసులో సోదాలు చేశాయి. -
కస్టమ్స్ ఆఫీసర్ లాకర్లో రూ. 85 లక్షల నగదు!
కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్నారంటే కష్టాలు తీరినట్లే అంటారు. అది నిజమనిపించేలా.. ఓ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ బ్యాంకు లాకర్లో భారీ మొత్తం నగదు బయటపడింది. సీబీఐ సోదాలు చేస్తే, అంతా ఇంతా కాదు.. ఏకంగా 85 లక్షలు దొరికాయి. ఆయనపై అవినీతి ఆరోపణలతో పాటు.. భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ లాకర్లు చూస్తే, వాటిలో 85 లక్షల నగదుతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి. దాంతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. సహదేవ్ గుప్తా అనే వ్యాపారి 8 వేల కోట్ల లావాదేవీలు చేసి, వాటి విషయంలో తప్పించుకోడానికి ఈ అధికారి సాయం తీసుకున్నట్లు సీబీఐ చెబుతోంది. ఆయన సాయం చేయడం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 75 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు అందడంతో కస్టమ్స్ కమిషనర్ అతుల్ దీక్షిత్, డిప్యూటీ కమిషనర్ నళిన్ కుమార్ ఇద్దరి లాకర్లను తనిఖీ చేశారు. దీక్షిత్ లాకర్లలో 85 లక్షల నగదుతో పాటు గుర్గావ్, గ్రేటర్ నోయిడా, లక్నో తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు పత్రాల్లో గుర్తించారు. -
తీస్తాపై మోదీకి ఎందుకంత కక్ష ?
ముంబై: తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం, నేడు ఎన్జీవో సంస్థల ద్వారా ప్రజా సేవ చేస్తున్న ఓ మహిళ వెంట పడుతోంది. ఆవిడను వేధింపులకు గురిచేస్తోంది. ఆమెను రాజీ దారిలోకి రప్పించేందుకు లేదా కటకటాల వెనక్కి నెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆమెపై భారతీయ శిక్షా స్మృతిలోని 120 బీ సెక్షన్ కింద నేరపూరిత కుట్ర, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం-1976, 2010లలోని వివిధ సెక్షన్ల కింద జూలై ఎనిమిదవ తేదీన కేసు నమోదు చేసింది. దర్యాప్తు పేరిట వేధింపులు ప్రారంభించింది. అందులో భాగంగానే సీబీఐ అధికారులు మంగళవారం నాడు ముంబై నగరంలోని ఆమె నివాసం, ఆమె నిర్వహిస్తున్న ఎన్జీవో సంస్థల కార్యాలయాలపైన ఏకకాలంలో నాలుగుచోట్ల దాడులు జరిపింది. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు గుజరాత్ ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళ పేరు తీస్తా సెతల్వాద్. ఆమె అంటే మోదీ ప్రభుత్వానికి ఎందుకంత ఆగ్రహమో, కక్షో సులభంగానే అర్థం చే సుకోవచ్చు. ప్రజలు ఎప్పుడో మరచిపోయిన 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసును ఆమె మరచిపోకపోవడమే. దానిపై ఇప్పటికీ పోరాటం కొనసాగిస్తుండడమే. తీస్తా సెతల్వాద్ తన భర్త జావెద్ ఆనంద్‌తో కలసి సబ్రాంగ్ కమ్యూనికేషన్స్, సబ్రాంగ్ ట్రస్ట్, సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థలను స్థాపించి ప్రజల తరపున సామాజిక న్యాయం కోసం పోరాటం జరుపుతున్నారు. మొదటిసారి 2006లో గుజరాత్ పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. అప్పుడు నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అప్పుడు సరైన సాక్ష్యాధారాలు దొరక్కనో, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లనో కేసు ముందుకు సాగలేదు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అంటే.. 2015, జూలై 8వ తేదీన ఆమెపై సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కేంద్ర హోం శాఖ ముందస్తు అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి 2.90 లక్షల రూపాయలను ఆమె నడుపుతున్న ట్రస్ట్ విరాళంగా తీసుకుందని ప్రధాన అభియోగం. 2002 గుజరాత్ అల్లర్ల నాటి నుంచే ప్రజల తరఫున సెతల్వాద్ పోరాటం ప్రారంభం కాలేదు. ఆమె ఓ సామాజిక కార్యకర్తగా 1993 నుంచే పోరాటం ప్రారంభించారు. తొలుత జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించిన సెతల్వాద్ 1992-93లో జరిగిన ముంబై హిందూ-ముస్లిం అల్లర్లకు చలించి పోయారు. ‘కమ్యూనలిజం కొంబాట్’ పేరిట ఓ మాగజైన్‌ను ఏర్పాటు చేసి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేపట్టారు. ఆమె తన భర్త ఆనంద్‌తో కలసి 1995లో సబ్రాంగ్ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. అప్పుడు వారి కార్యకలాపాలను ఎవరూ ప్రశ్నించలేదు. పైగా వారు చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు అంతర్జాతీయంగా ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. 2002లో ‘సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ సంస్థను ప్రారంభించడంతో వారికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అల్లర్ల సందర్భంగా బాధితుల తరఫున పోరాడడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. బాధితుల నుంచి పిటిషన్లు వేయించడం, వారికి న్యాయనిపుణులను సమకూర్చడం, సాక్షులను సమీకరించడం, వారికి న్యాయం జరిగేలా చూడడం అ లక్ష్యంలో భాగం. ఈ సంస్థ పాత్ర కారణంగా నాటి 2002 గుజరాత్ అల్లర్ల కేసుల్లో 120 మంది దోషులకు శిక్ష పడింది. అయినప్పటికీ బడా రాజకీయవేత్తలు మాత్రం శిక్ష నుంచే కాకుండా కేసుల నుంచి కూడా తప్పించుకుతిరుగుతున్నారు. గుజరాత్ అల్లర్లలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ హత్యకు గురయ్యారు. ఈ అల్లర్లకు ప్రధాన కారకుడు నరేంద్ర మోదీ అని ఆరోపిస్తూ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీతో కోర్టులో కేసు దాఖలు చేయించి అప్పటి నుంచి ఆమె తరపునే సెతల్వాద్ న్యాయపోరాటం చేస్తున్నారు. అహ్మదాబాద్ నుంచి సుప్రీంకోర్టు వరకు పలు కేసుల్లో వారు పోరాటం చేస్తున్నారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోదీపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన ఆ బృందం సరైన ఆధారాలు లేవంటూ మోదీ, ఆయన సన్నిహితులకు క్లీన్చిట్ ఇచ్చింది. దీనిపై జాఫ్రీ, సెతల్వాద్లు ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కూడా అడ్మిషన్ దశలో దిగువస్థాయి కోర్టు కొట్టివేసింది. అంతటితో పోరాటం ఆపని సెతల్వాద్ మళ్లీ పైకోర్టులో జాఫ్రీతోని ప్రొటెస్ట్ పిటిషన్ రివ్యూ పిటిషన్ 2014, మార్చి15న దాఖలు చేయించారు. దీనిపై అహ్మదాబాద్ కోర్టులో ఈ నెల 27వ తేదీన విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు పాత కేసును తిరగదోడారు. ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ విరాళాలను స్వీకరించడంలో సెతల్వాద్ ముందస్తుగా కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి తీసుకున్నారా, లేదా అన్న అంశంలో వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ గుజరాత్ పోలీసులు కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోం శాఖ వెంటనే నేరుగా సీబీఐని రంగంలోకి దింపి సెతల్వాద్ తదితరులపైన ఎప్ఐఆర్ దాఖలు చేయించింది. ఈ కేసు పర్యావసానమే మంగళవారం సెతల్వాద్ ఇంటిపై, కార్యాలయాలపై సీబీఐ దాడులు జరగడం. -
లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డి రైల్వే ఇంజినీర్
ఒంగోలు : ఉన్నతస్థాయిలో ఉన్న ఓ అధికారి అయిదు వేలకు కక్కుర్తి పడి సీబీఐకి అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్లో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ బుధవారం తెల్లవారుజామున గ్యాంగ్‌మెన్ బాషా నుంచి అయిదువేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా సీబీఐ అధికారులకు చిక్కారు. ఆయనను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ నివాసంలో కూడా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. రైల్వే అధికారి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లక్ష్మీనారాయణను సీబీఐ అధికారులు విశాఖ కోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం. -
తిరుపతి ఇంకమ్‌టాక్స్ కార్యాలయంపై సిబిఐ దాడులు
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సీబీఐ సోదాలు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మార్కెటింగ్ విభాగంపై సీబీఐ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. విభాగంలోని పలు కీలక ఫైళ్లు, పత్రాలను సీబీఐ అధికారులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే మార్కెటింగ్ విభాగం డీజీఏం నివాసంలో కూడా తనిఖీలు చేపట్టారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ మార్కెటింగ్ విభాగంలో ఇటీవల పలు కొనుగోళ్లు జరిగాయి. ఈ సందర్బంగా సదరు కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విశాఖ స్టీల్ ప్లాంట్‌పై దాడులు చేశారు.