
సాక్షి, విశాఖ: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్ఎస్ అధికారి సాదు సుందర్‌సింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ, ఏపీల్లో అతని నివాసాలపై దాడులు నిర్వహించింది. ఇప్పటివరకు రూ.3 కోట్ల ఆస్తులను గుర్తించిన సీబీఐ.. కుటుంబసభ్యులతో పాటు సుందర్‌సింగ్ పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. సోదాల్లో రూ.3.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. కాగా, సాదు సుందర్‌సింగ్ ప్రస్తుతం ఐటీ అప్లిలేటివ్ ట్రిబ్యునల్ అకౌంటెంట్ మెంబర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment