IRS officer
-
కరువు పనిని ఖతర్నాక్ చేసిన IRS ఆఫీసర్
-
ఉపాధి కూలీ అవతారమెత్తిన IRS అధికారి
-
Suryapet: ఉపాధి హామీ కూలీగా ఐఆర్ఎస్ అధికారి.. ఎందుకో తెలుసా?
సాక్షి, సూర్యాపేట: కూలీల స్థితిగతులను అంచనా వేయడం కోసం ఐఆర్ఎస్ అధికారి ఉపాధి కూలీగా మారారు. ఈ ఆసక్తికర ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కూలీగా మారిన అధికారి పేరు సందీప్ బాగా.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్, బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్‌లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన సోమవారం నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూలీలతో కలిసి పనిచేశారు.ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపట్టిన స్వయం ఉపాధి కార్యక్రమాలను వారికి వివరించడంతోపాటుగా వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గురించి వివరించారు. వాటిపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఆయన కూలీలతో కలిసి భోజనం చేయడంతో పాటుగా బతుకమ్మ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. తనతో పాటు పనిలో పాల్గొన్న 152 మంది కూలీలకు తన జీతం నుంచి రూ.200 చొప్పున అందజేశారు. ఇక, ఉన్నాతాధికారి అయిన సందీప్ వారితో కలిసి ఉండటం, భోజనం చేయడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. -
క్రైమ్ కథనాలే స్ఫూర్తి!
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ‘ఫిల్మ్ ఫైనాన్షియర్’కారుమూరి వెంకట రత్నారెడ్డికి సంబంధించి మరో వ్యవహారం బయటపడింది. క్రైమ్ కథనాలే స్ఫూర్తిగా నకిలీ ఐఆర్ఎస్ అధికారం ఎత్తాడని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీ కేసులో ఇతడిని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు. ఆ తర్వాతే నిందితులు ఎందరనే అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వెన్నెముక విరగడంతో కథ అడ్డం... గుంటూరు నగరానికి చెందిన కె.వెంకట రత్నా రెడ్డి అలియాస్ రత్నారెడ్డి అలియాస్ కేవీఆర్ రెడ్డి బీఎస్సీ పూర్తి చేశాడు. ఆపై కొన్ని కంప్యూటర్ కోర్సులు కూడా చేసి బిల్డింగ్ ఎలివేషన్స్ డిజైనర్ గా స్థిరపడ్డాడు. 2007 లో ఓ బిల్డింగ్ వర్క్ చేస్తుండగా... ప్రమాద వశాత్తూ జారి పడటంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. ఈ గా యంతో చాలా కాలం పాటు మంచం పట్టిన రత్నారెడ్డి అప్పట్లో వార్తా పత్రికలు, చానళ్లలో వచ్చే క్రైమ్ కథనాలను ఆసక్తిగా చూసేవాడు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ అమాయకులను మోసం చేసి భారీగా దండుకుంటున్న వైనంపై వెలువడిన కథనాలు ఇతన్ని ఆకర్షించాయి. ఆ స్ఫూర్తితోనే తానూ అదే రకంగా మోసాలు చేసి తేలిగ్గా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కేవీఆర్ రెడ్డిగా అవతారం... అనుకున్నదే తడవుగా మోసాలు ప్రారంభించేందుకు అవసరమైన సరంజామా సిద్ధం చేసుకున్నాడు. కేవీఆర్ రెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా పేర్కొంటూ ఓ బోగస్ గుర్తింపుకార్డు తయారు చేశాడు. ఇదే పేరు, హోదాలతో కొన్ని విజిటింగ్ కార్డులు సైతం రూపొందించుకున్నాడు. తనకు తానే హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లోని కమిషనర్స్ ఫర్ డిపార్ట్మెంట్ ఎక్వయిరీస్‌లో సూపరెంటెండెంట్‌గా హోదా క్రియేట్ చేసుకున్నాడు. నగరంలోని కృష్ణనగర్ ప్రాంతానికి చెందిన నర్సింహ నుంచి రూ.6 వేలు వెచ్చించి ఓ బొమ్మ పిస్తోలు కొనుగోలు చేశాడు. గుంటూరులోని ఓ షోరూమ్‌లో ఫైనాన్స్‌పై కారు కొన్నాడు. దానిపై ప్రభుత్వ చిహ్నం ఏర్పాటు చేయడంతో పాటు నెంబర్ ప్లేట్లపై గవర్నమెంట్ వెహికిల్ అని రాయించడం ద్వారా ఉన్నతాధికారిగా ‘కలర్’ఇచ్చాడు. వీటి సాయంతో తాను ఐఆర్ఎస్ ఆఫీసర్ అని నమ్మిస్తూ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉందని, అనేక ప్రాజెక్టులు ఇప్పిస్తానని మోసాలకు తెరలేపాడు. వరుస పెట్టి నేరాలు... తాను ఐఆర్ఎస్ అధికారినంటూ నగరానికి చెందిన పి.వెంకటరామ్ అలియాస్ భీష్మాజీతో పరిచయం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆన్ లైన్’ అనే ప్రాజెక్టు ఇప్పిస్తానని, దీని విలువ రూ.5 కోట్లకుపైగా ఉంటుందని నమ్మబలికి ఆయన నుంచి రూ.11 లక్షలు వసూలు చేశాడు. వరంగల్‌కు చెందిన బాల్‌కిషోర్‌రెడ్డికి, ఆయన సంబందీకులతో ఉన్న సివిల్ వివాదాన్ని సెటిల్ చేయడానికి రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఓ ఆర్థిక వివాదంతో కూకట్‌పల్లికి చెందిన గోపి అనే వ్యక్తిని బెదిరించాడు. తాను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారినంటూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పైరవీలు చేయడం ప్రారంభించాడు. -
మాజీ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీ వెనుక భారీ కుట్ర
హైదరాబాద్: గాంధీనగర్‌లో నివసించే మాజీ ఐఆర్ఎస్ అధికారి, ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్ ప్రసాద్ సరెళ్ళ ఇంట్లో జరిగిన భారీ చోరీ వ్యవహారం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు ముషీరాబాద్ పోలీసులు తేల్చారు. దుండిగల్ పోలీసుస్టేషన్ మాజీ క్రైమ్ సబ్–ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఎస్.కృష్ణ సూత్రధారిగా సాగిన ఈ చోరీ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచిన అధికారులు కేసులో కుట్ర కోణానికి సంబంధించిన అంశాన్నీ జోడిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల సంఖ్య మూడుకు చేరింది. శామ్యూల్ ఫిర్యాదు మేరకు గత నెల 14న నమోదు చేసిన ఈ కేసులో పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 328, 380 కిందే ఆరోపణలు చేశారు. పోలీసులకు చిక్కిన నిందితుడు సురేందర్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈ చోరీలో పాత్ర ఉన్నట్లు గుర్తించి రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీశైలం, అంబర్‌పేటకు చెందిన ఆశీర్వాదంలను శుక్రవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్టు సందర్భంలోనే ఐపీసీలోని 120 (బీ) సెక్షన్‌నూ (కుట్ర) కేసులో జోడించారు. శామ్యూల్ ఇంటి నుంచి ఆస్తి పత్రాలు కోట్టేయాలనే కుట్రలో వీళ్లనీ భాగస్వాములుగా పేర్కొన్నారు. కాగా ఈ కేసులో సురేందర్ అరెస్టు అనంతరం అతడు తస్కరించిన స్థిరాస్తి పత్రాలను ముషీరాబాద్ పోలీసులు సూరారంలోని కృష్ణ ఇంటి వద్ద అతడి కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని సీజ్ చేయాలని నిర్ణయించారు. ఎస్ఐ కృష్ణ ఈ నేరం చేయించడం వెనుక కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సురేందర్ పోలీసు కస్టడీ పూర్తయింది. శ్రీశైలం, ఆశీర్వాదాలను కూడా న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని ముషీరాబాద్ పోలీసులు నిర్ణయించారు. వీళ్లని విచారించిన తర్వాతే ఈ కేసుపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపులు.. ఐఆర్ఎస్ అధికారి అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన మహిళలపై జరుగుతున్న అరాచకాలను కట్టడి చేయలేకపోతున్నారు. పాఠశాలల్లో, బస్సుల్లో, కార్యాలయాల్లో వారిపై వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ మహిళా ఐఏఎస్ అధికారికి కూడా ఈ వేధింపులు బెడద తప్పలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐఆర్ఎస్ అధికారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో మహమ్మారి సమయంలో కోవిడ్ సపోర్ట్ గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు నిందితుడు ఆమెతో టచ్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి బాధితురాలితో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించేవాడు.. అయితే ఆమె మాత్రం దానిని నిరాకరిస్తూనే వచ్చింది. అంతేకాకుండా తనను వ్యక్తిగతంగా కలవాలని ఆమెకు మెసేజ్‌లు పంపుతూ వేధించేవాడు. ఒక్కోసారి ఆమెను కలిసేందుకు మహిళ పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి ఇబ్బంది పెట్టేవాడని మహిళా అధికారి తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. చదవండి: ‘మోసం చేసింది.. నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని.. -
నకిలీ ఐఆర్ఎస్ అధికారి అరెస్టు
ముమ్మిడివరం: ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఉన్నతాధికారినంటూ పలు మోసాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి నిందితుడిని గురువారం విలేకర్ల ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. యానాం అంబేడ్కర్ నగర్‌కు చెందిన కాశి ప్రేమ్‌కుమార్ గత ఏడాది ఉగాది సమయంలో ఇక్కడ జరిగిన ఒక కవి సమ్మేళనానికి వచ్చాడు. ముమ్మిడివరం పోస్ట్‌మాస్టర్ మద్దెల వెంకటేశ్వరరావుకు ఐఆర్ఎస్ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. సౌతిండియన్ కమిషనర్‌నని, సర్వే కమిషనర్‌నని నమ్మించాడు. పోస్టల్ రీజియన్ అధికారిగా ప్రమోషన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడిని నమ్మిన వెంకటేశ్వరరావు డిసెంబర్లో ఒకసారి రూ.లక్ష, మరోసారి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షలు ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా ప్రమోషన్ రాకపోవడంతో వెంకటేశ్వరరావుకు అనుమానం వచ్చింది. తీసుకున్న రూ.4 లక్షలు తిరిగి ఇవ్వాలని ప్రేమ్‌కుమార్‌కు చెప్పాడు. ఫలితం లేకపోవడంతో జరిగిన మోసంపై ఈ నెల 2న ముమ్మిడివరం పోలీసులకు వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై కె.సురేష్‌బాబు లోతుగా విచారణ జరిపారు. నిందితుడు ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి, అతడి నుంచి రూ.40 వేల విలువైన బంగారు గొలుసు, ఉంగరం, నకిలీ డాక్యుమెంట్లు, రబ్బరు స్టాంపులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ్‌కుమార్ డిప్లమో మధ్యలో ఆపేసి, లైబ్రరీలో పుస్తకాలు చదివి ప్రభుత్వ ఉన్నతాధికారుల విధి నిర్వహణ విధానాలు తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐఆర్ఎస్ అధికారిగా నకిలీ డాక్యుమెంట్లు, రబ్బర్ స్టాంపులు, గుర్తింపు కార్డు తయారు చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. కవితలు రాసే అలవాటు ఉండటంతో పద్మశ్రీ అవార్డు అందుకున్నట్టు పలు సాహితీ సంస్థల నుంచి నకిలీ ప్రశంసా పత్రాలు సృష్టించుకున్నాడు. కారులో తిరుగుతూ ఉన్నతాధికారిగా చలామణీ అవుతూ దేవాలయాల వద్ద ప్రొటోకాల్ అంటూ నమ్మబలికి మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడిని ముమ్మిడివరం కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సై కె.సురేష్‌బాబును, సిబ్బందిని ఆయన అభినందించారు. -
ఐఆర్ఎస్ అధికారి సాదు సుందర్‌సింగ్‌పై సీబీఐ కేసు నమోదు
సాక్షి, విశాఖ: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్ఎస్ అధికారి సాదు సుందర్‌సింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ, ఏపీల్లో అతని నివాసాలపై దాడులు నిర్వహించింది. ఇప్పటివరకు రూ.3 కోట్ల ఆస్తులను గుర్తించిన సీబీఐ.. కుటుంబసభ్యులతో పాటు సుందర్‌సింగ్ పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. సోదాల్లో రూ.3.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. కాగా, సాదు సుందర్‌సింగ్ ప్రస్తుతం ఐటీ అప్లిలేటివ్ ట్రిబ్యునల్ అకౌంటెంట్ మెంబర్‌గా పనిచేస్తున్నారు. -
కరోనా భయం : ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రత్యక్షంగా పరోక్షంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తన మూలంగా కుటుంబానికి కరోనా వైరస్ సోకుతుందేమో అన్న భయంతో ఢిల్లీలో ఒక సీనియర్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన వైనం విషాదాన్ని నింపింది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ మహమ్మారి సోకుతుందేమోనని ఆందోళన అధికారి ప్రాణాలను బలిగొంది. పోలీసు ఉన్నతాధికారి అందించిన సమాచారం ప్రకారం ఆదాయపు పన్నుఅధికారి శివరాజ్ సింగ్ (56)కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. దీంతో గతవారం కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. అయితే కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు వస్తుందనే భయంతో శివరాజ్ ఆదివారం విషం (యాసిడ్ లాంటి ద్రవం) తాగి ఉసురు తీసుకున్నారు. అంతేకాదు తన కుటుంబానికి కూడా ఈ ఘోరమైన వైరస్ సోకుతుందన్న భయం ఆయనను వెంటాడింది. ఈ మేరకు ఆయన రాసిన ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా 2006 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి శివరాజ్ సింగ్ ఢిల్లీ ఆర్కె పురంలో ఆదాయపు పన్ను కమిషనర్‌గా (సీఐటిగా) పనిచేస్తున్నారు. చదవండి : మరో విషాదం : 2020.. దయచేసి ఇక చాలు! -
ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య
సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం ఢిల్లీలోని బాపుదామ్‌లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి ఆత్మహత్య చేసుకొని మరణించాడు. తన ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాం వద్ద సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ విషయంపై న్యూఢిల్లీ డీసీపీ ఈష్ సింగాల్ మాట్లాడుతూ... ‘ఈ రోజు ఒక ఐఆర్ఎస్ అధికారి బాపుదామ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో ఒక సూసైడ్ దొరికింది. ఈ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది’ అని తెలిపారు. అయితే సూసైడ్ నోట్లో ఏముందో మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఐఆర్ఎస్ అధికారి మరణంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) -
ఐఆర్ఎస్ అధికారిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం
-
ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి జె. కృష్ణకిశోర్‌తోపాటు పే అండ్ అకౌంట్స్ విభాగానికి చెందిన అకౌంట్స్ అధికారి శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ప్రజాధనం దుర్వినియోగంలో వీరిద్దరి పాత్ర ఉందని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలు సమర్పించింది. పరిశీలించిన ప్రభుత్వం.. వీరిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనావళి ప్రకారమే కృష్ణకిశోర్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. క్రమశిక్షణ ప్రక్రియ ముగిసే వరకూ ఆయన సస్పెన్షన్ కొనసాగుతుందని.. శ్రీనివాసరావు సస్పెన్షన్‌కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపింది. వీరిద్దరి మీద నమోదైన అభియోగాలపై తక్షణమే కేసు నమోదు చేసి ఆరు నెలల్లోగా దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (ఏసీబీ)ను, నేర పరిశోధన సంస్థ (సీఐడీ)ని ప్రభుత్వం ఆదేశించింది. కేసు దర్యాప్తు ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రభుత్వ అనుమతిలేనిదే వారివురూ అమరావతిని వీడరాదని తెలిపింది. -
ఈడీ డైరెక్టర్‌గా ఎస్కే మిశ్రా
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పూర్తిస్థాయి డైరెక్టర్‌గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి ఎస్కే మిశ్రా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం శనివారం రాత్రి వెలువరించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిశ్రా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా (రెంటింట్లో ఏది ముందైతే అది) పదవిలో ఉంటారు. అక్టోబర్ 27న ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్‌గా నియమితులైన మిశ్రాకు మూడు నెలల కాలానికి ఈడీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్నాల్ సింగ్ స్థానంలో ఆయన ఈడీ బాధ్యతలు చేపట్టారు. మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ఈడీ డైరెక్టర్ హోదా..కేంద్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శి పదవికి సమానం. -
‘నయవంచనకు గురయ్యాను.. అందుకే’
జైపూర్ : ఓవైపు మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలు పెట్టే భర్త... మరోవైపు భర్త ఎలాంటి వాడైనా సరే అతడితో కలిసి జీవించాల్సిందేనన్న తల్లిదండ్రుల ఆంక్షల మధ్య నైరాశ్యానికి లోనైన ఓ ఇండియన్ రెవెన్యూ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత నెలలో చోటు చేసుకున్న ఈ విషాదరకర ఘటనకు సంబంధించిన కారణాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆమె రాసిన సూసైడ్ నోట్, వ్యక్తిగత డైరీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. వివరాలు... రాజస్థాన్‌కు చెందిన బిన్ని శర్మ భారత రెవెన్యూ అధికారిణిగా పనిచేసేవారు. ఎనిమిదేళ్ల క్రితం వ్యాపారవేత్త గుర్మీత్ వాలియాతో ఆమె వివాహం జరిగింది. అయితే డబ్బు మీద వ్యామోహం ఉన్న గుర్మీత్.. బిన్నిని నిరంతరం వేధిస్తూ ఉండేవాడు. ఆర్థికంగా ఇంకా బలపడాల్సిన అవసరం ఉందంటూ మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. అంతేకాకుండా గుర్మీత్ తమ ఇంట్లో పనిచేసే అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు కూడా బిన్నీ కంటపడ్డాయి. దీంతో తాను నయవంచనకు గురయ్యానని, అన్ని విధాలుగా నష్టపోయాయని బిన్నీ బాధపడేది. ఈ క్రమంలో భర్తతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి విడాకులు తీసుకుంటానని కోరింది. కానీ అందుకు వారు ఒప్పుకోకపోవడంతో నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలోనే గత నెల 7న ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే బిన్నీ మరణించిన తర్వాత అల్లుడి గురించి నిజాలు తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిన్నీ పిల్లలకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. కాగా బిన్ని శర్మ మానసిక పరిస్థితి సరిగా ఉండేది కాదని.. ఈ కారణంగా తన క్లైంట్ ఎంతో వేదనకు గురయ్యాడని గుర్మీత్ తరపు న్యాయవాది పేర్కొన్నాడు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేక గుర్మీత్‌పై బిన్ని తల్లిదండ్రులు కేసు పెట్టారని ఆరోపించాడు. -
దుర్గగుడి ఈవోగా ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ
-
కట్నం వేధింపులు.. ఐఆర్ఎస్ అధికారి అరెస్టు
హైదరాబాద్: కట్నం వేధింపుల కేసులో ఐఆర్ఎస్ అధికారి కొత్తపాటి వంశీకృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీలో నివసించే శ్రావణి వివాహం కొత్తపాటి వంశీకృష్ణ(27)తో 2015లో జరిగింది. ఐఆర్ఎస్ టాప్‌ర్యాంకర్ అయిన వంశీకృష్ణ విజయవాడ ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. పెళ్లి సమయంలో భారీగా కట్నంతో పాటు ఆభరణాలు, ఒక ప్లాట్‌ను కూడా ఇచ్చారు. పెళ్లయిన తర్వాత ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీలో కాపురం పెట్టారు. రెండు రోజులు గడిచిన తర్వాత ఆమె అత్త పని మనిషిని తొలగించి ఇంటి పనంతా బాధితురాలితో చేయించింది. పనిమనిషిలా మార్చేసింది శ్రావణి ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేక విషయం భర్తకు తెలిపినా ఫలితం లేకపోయింది. అంతేకాక మరింత అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేశారు. ఆమెకు తెలియకుండానే ఇటీవల వంశీకృష్ణ ఢిల్లీకి బదిలీ చేయించుకున్నాడు. అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో మోసపోయానని తెలుసుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తతో పాటు మామ నర్సింహానాయుడు, అత్త పార్వతి, సోదరుడు గోపికృష్ణ, బోయల మదన్, మాధవి, పూర్ణ చందర్రావులపై కేసు పెట్టింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని వెల్లడించింది. గూండాలతో తనను హత్యచేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఏ క్షణంలో అయినా తన ప్రాణానికి హానీ ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు వంశీకృష్ణతో పాటు ఆయన తల్లిదండ్రులు, సోదరులపై ఐపీసీ సెక్షన్ 498(ఏ), 420, 406, 408, 354, 506, రెడ్‌విత్ 34, వరకట్న నిరోధక చట్టం 3, 4 కింద కేసులు నమోదు చేశారు. వంశీకృష్ణను నిబంధనల ప్రకారం మూడుసార్లు భరోసా కేంద్రానికి పంపించారు. ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మంగళవారం రిమాండ్‌కు తరలించారు. -
సీబీఐ వలలో ఐఆర్ఎస్ అధికారి
తెలంగాణవ్యాప్తంగా ప్లాట్లు సహా ఆస్తులు న్యూఢిల్లీ: అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన కేసులో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో ఆదనపు కమిషనర్‌గా పని చేస్తున్న ఎస్. మురళీమోహన్‌పై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. మురళీ మోహన్ తన ఆదాయం కంటే 295 రెట్లు అధికంగా ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ ఆరోపించింది. 1999 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన మురళీమోహన్ 2002–2014 మధ్య చెన్నై ఐటీ శాఖ అదనపు కమిషనర్‌గా పని చేసిన సమయంలో రూ. 3.28 కోట్ల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్లు సీబీఐ వెల్లడించింది. మురళీ తెలంగాణలోని హైదరాబాద్, హయత్‌నగర్, మణికొండ, ఖమ్మం జిల్లాలో ప్లాట్లు సహా ఆస్తులు కూడబెట్టారని, రూ. 3.94 కోట్ల ఆస్తుల్లో రూ. 3.28 కోట్లకు సరైన లెక్కలు లేవని పేర్కొంది. కాగా, ఖమ్మం జిల్లాలోని పెనుబల్లిలోనూ మురళీమోహన్‌కు భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. పెనుబల్లిలో ఆయన కుటుంబ సభ్యుల పేరుతో నాలుగేళ్ల క్రితం ఆర్కే లాడ్జి, ఫంక్షన్ హాల్‌ను పెద్దమొత్తం వెచ్చించి నిర్మించారు. -
మూడుముడులకు నారుమడులు
పెళ్లి వేడుకల కోసం మనసు విహంగంలా విహరించినా కాళ్లు నేలపైనే ఉండాలనే విషయాన్ని గుర్తించి నిరాడంబర వివాహాలకు మొగ్గు చూపుతోంది ఈ తరం. సాదాసీదాగా పెళ్లి చేసుకొని పొదుపు చేసిన సొమ్ముతో మరో పది కుటుంబాల్లో వెలుగులు నింపాలనే నవతరం దంపతుల ఆదర్శం ఆ పెళ్లిళ్లకే కొత్త కళను చేకూరుస్తోంది! అలా రైతుల ఇంటి సంతోషాల నారు వేసిన ఓ జంట కథ ఇది. వరుడు అభయ్. వధువు ప్రీతి కుంభారే. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో వారి మధ్య ప్రేమ మొగ్గ తొడి గింది. నాగపూర్‌లో ఐఆర్ఎస్ ఆఫీసర్‌గా అభయ్కు, ముంబై ఐడీబీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ప్రీతికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రీతి స్వస్థలం మహారాష్ట్రలోని యావత్మాల్. అభయ్ స్వస్థలం అదే రాష్ట్రంలో ఉన్న అమరావతి పరిధి లోని ఓ గ్రామం. ఈ రెండూ కూడా రైతు ఆత్మహత్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రాంతాలు. ఈ వధూవరులు తమ పెళ్లి ఖర్చుల కోసం దాచుకున్న సొమ్ముతో ఆత్మహత్యలు చేసుకున్న ఆయా గ్రామాల రైతు కుటుంబాలకు సహాయపడాలనుకున్నారు. అందుకోసం నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటామని కుటుంబ సభ్యులను కోరారు. ఇరువైపులా కుటుంబాలు సంతోషించటమే గాక రైతు కుటుంబాలను పెళ్లికి ఆహ్వానించే బాధ్యతను తీసుకున్నారు. మంత్రఘోష లేదు.. మంగళ వాద్యాలు లేవు సంప్రదాయాన్ని పక్కనబెట్టి అమరావతిలోని అభియంతా భవన్లో ఈ జంట ఒకటయ్యారు. అక్కడ పెళ్లి వాతావరణం మచ్చుకైనా కనిపించ లేదు. బాజా భజంత్రీలు లేవు. పెళ్లి తర్వాత పడవ కారులో ఊరేగింపులు, టపాసులు మోత, తీన్మార్ దరువుల ఊసే లేదు. వంటల ఘుమఘుమలు, నోరూరించే పిండి వంటలు లేనే లేవు. చపాతి, అన్నం, పప్పు, కూరలు వంటి సామాన్య భోజనంతో అతిథులను సంతృప్తిపరచారు. రివాజుగా వచ్చే ఆచారాలు, సంప్రదాయాలను దరిచేరనివ్వలేదు. వేదికపైనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల గురించి వివరించే వివిధ రకాల గోడచిత్రాలు, బ్యానర్లను వేదికనిండా అతికించారు. పెళ్లిలో రైతు నాయకులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా ముందువరుసలో కొలువు తీరారు. పది రైతు కుటుంబాలకు తలా 20 వేలు కొండలా పేరుకుపోయిన అప్పులు, వరుస పంట నష్టాలతో తనువు చాలించటంతో అండదండలు కోల్పోయిన 10 మంది రైతుల కుటుంబాలకు తలా రూ. 20 వేల చొప్పున ఇచ్చారు ఈ దంపతులు. వారి పిల్లలను ఇంటర్మీడియట్ వరకు పిల్లలను చదివించే బాధ్యతను కూడా తీసుకున్నారు. దీంతోపాటు అభయ్ స్వగ్రామం ఉమ్బర్దా బజార్ లోని ఐదు లైబ్రరీలకు రూ. 52 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను ఇచ్చారు. తమ జీతాల్లోంచి పెళ్లి కోసమని దాచుకున్న డబ్బును దీనికోసం వాడారు. చంద్రకాంత్ వాంఖేడే, అర్జున్ థోసరే లాంటి రైతు నాయకులు రైతుల ఆత్మహత్యలపై చేసిన ప్రసంగాలు అతిథులను కంటతడి పెట్టించాయి. ఎన్నో పెళ్లిళ్లకు హాజరైన తమకు ఈ పెళ్లి ప్రత్యేకమని.. ప్రీతి, అభయ్‌లతో పాటు తమకు ఇది జీవితాంతం గుర్తుండే అనుభవమని వారు చెప్పారు. ‘మేము కూడా నిరాడంబరంగా పెళ్లి చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు మా వంతు సహాయ పడతాం’ అని పెళ్లికి హాజరైన యువతీ యువకులు ప్రతిన పూనారు. రైతు కుటుంబాల్లో వెలుగులు పంచేందుకు పెళ్లి మండపాన్నే వేదికగా చేసుకున్న అభయ్ ప్రీతి దంపతులకు ఇది ఒక జీవిత కాలపు మధురానుభూతి. - దండేల కృష్ణ