న్యూఢిల్లీ: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన మహిళలపై జరుగుతున్న అరాచకాలను కట్టడి చేయలేకపోతున్నారు. పాఠశాలల్లో, బస్సుల్లో, కార్యాలయాల్లో వారిపై వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ మహిళా ఐఏఎస్ అధికారికి కూడా ఈ వేధింపులు బెడద తప్పలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐఆర్‌ఎస్ అధికారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో మహమ్మారి సమయంలో కోవిడ్ సపోర్ట్ గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు నిందితుడు ఆమెతో టచ్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి బాధితురాలితో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించేవాడు.. అయితే ఆమె మాత్రం దానిని నిరాకరిస్తూనే వచ్చింది. అంతేకాకుండా తనను వ్యక్తిగతంగా కలవాలని ఆమెకు మెసేజ్‌లు పంపుతూ వేధించేవాడు. ఒక్కోసారి ఆమెను కలిసేందుకు మహిళ పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి ఇబ్బంది పెట్టేవాడని మహిళా అధికారి తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు.
చదవండి: ‘మోసం చేసింది.. నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..
Comments
Please login to add a commentAdd a comment