సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రత్యక్షంగా పరోక్షంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తన మూలంగా కుటుంబానికి కరోనా వైరస్ సోకుతుందేమో అన్న భయంతో ఢిల్లీలో ఒక సీనియర్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన వైనం విషాదాన్ని నింపింది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ మహమ్మారి సోకుతుందేమోనని ఆందోళన అధికారి ప్రాణాలను బలిగొంది.
పోలీసు ఉన్నతాధికారి అందించిన సమాచారం ప్రకారం ఆదాయపు పన్నుఅధికారి శివరాజ్ సింగ్ (56)కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. దీంతో గతవారం కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. అయితే కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు వస్తుందనే భయంతో శివరాజ్ ఆదివారం విషం (యాసిడ్ లాంటి ద్రవం) తాగి ఉసురు తీసుకున్నారు. అంతేకాదు తన కుటుంబానికి కూడా ఈ ఘోరమైన వైరస్ సోకుతుందన్న భయం ఆయనను వెంటాడింది. ఈ మేరకు ఆయన రాసిన ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా 2006 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి శివరాజ్ సింగ్ ఢిల్లీ ఆర్‌కె పురంలో ఆదాయపు పన్ను కమిషనర్‌గా (సీఐటిగా) పనిచేస్తున్నారు.
చదవండి : మరో విషాదం : 2020.. దయచేసి ఇక చాలు!
Comments
Please login to add a commentAdd a comment