సీబీఐ వలలో ఐఆర్‌ఎస్ అధికారి
తెలంగాణవ్యాప్తంగా ప్లాట్లు సహా ఆస్తులు
న్యూఢిల్లీ: అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన కేసులో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో ఆదనపు కమిషనర్‌గా పని చేస్తున్న ఎస్. మురళీమోహన్‌పై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. మురళీ మోహన్ తన ఆదాయం కంటే 295 రెట్లు అధికంగా ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ ఆరోపించింది. 1999 ఐఆర్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన మురళీమోహన్ 2002–2014 మధ్య చెన్నై ఐటీ శాఖ అదనపు కమిషనర్‌గా పని చేసిన సమయంలో రూ. 3.28 కోట్ల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్లు సీబీఐ వెల్లడించింది.
మురళీ తెలంగాణలోని హైదరాబాద్, హయత్‌నగర్, మణికొండ, ఖమ్మం జిల్లాలో ప్లాట్లు సహా ఆస్తులు కూడబెట్టారని, రూ. 3.94 కోట్ల ఆస్తుల్లో రూ. 3.28 కోట్లకు సరైన లెక్కలు లేవని పేర్కొంది. కాగా, ఖమ్మం జిల్లాలోని పెనుబల్లిలోనూ మురళీమోహన్‌కు భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. పెనుబల్లిలో ఆయన కుటుంబ సభ్యుల పేరుతో నాలుగేళ్ల క్రితం ఆర్కే లాడ్జి, ఫంక్షన్ హాల్‌ను పెద్దమొత్తం వెచ్చించి నిర్మించారు.