న్యూఢిల్లీ: అవినీతి అధికారులపై సీబీఐ కొరడా ఝులిపించింది. ఆదాయపన్ను ముఖ్య కమిషనర్ (ఢిల్లీ) ఎస్‌కే మిట్టల్‌తోపాటు ఆదాయపు పన్ను శాఖకు చెందిన 9 మంది అధికారులు, ముగ్గురు ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదుచేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఖమ్మంలలో సోదాలు జరిగాయి.
ఒక అధికారి ఇంట్లో రూ.2.6 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, 16 లక్షల నగదు, 4.25 కేజీల బంగారు ఆభరణాలు, 13 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అవినీతి ఐటీ అధికారులపై కొరడా
Published Thu, Jun 23 2016 2:51 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
Advertisement