న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పూర్తిస్థాయి డైరెక్టర్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి ఎస్కే మిశ్రా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం శనివారం రాత్రి వెలువరించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిశ్రా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా (రెంటింట్లో ఏది ముందైతే అది) పదవిలో ఉంటారు. అక్టోబర్ 27న ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్‌గా నియమితులైన మిశ్రాకు మూడు నెలల కాలానికి ఈడీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్నాల్ సింగ్ స్థానంలో ఆయన ఈడీ బాధ్యతలు చేపట్టారు. మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి. ఈడీ డైరెక్టర్ హోదా..కేంద్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శి పదవికి సమానం.
Comments
Please login to add a commentAdd a comment