ఐఆర్‌ఎస్‌ అధికారి ఆత్మహత్య | IRS Officer Committed Suicide at Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఐఆర్‌ఎస్‌ అధికారి ఆత్మహత్య

Published Wed, May 27 2020 5:54 PM | Last Updated on Wed, May 27 2020 5:54 PM

IRS Officer Committed Suicide at Delhi  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం ఢిల్లీలోని బాపుదామ్‌లో ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారి ఆత్మహత్య చేసుకొని మరణించాడు. తన ఇంట్లో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాం వద్ద సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. ఈ విషయంపై న్యూఢిల్లీ డీసీపీ ఈష్‌ సింగాల్‌ మాట్లాడుతూ... ‘ఈ రోజు ఒక ఐఆర్‌ఎస్‌ అధికారి బాపుదామ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో ఒక సూసైడ్‌ దొరికింది. ఈ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది’ అని తెలిపారు. అయితే సూసైడ్‌ నోట్‌లో ఏముందో మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఐఆర్‌ఎస్‌ అధికారి మరణంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.  (కేరళనుసూపర్ స్ప్రెడర్గా మారుస్తారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement