న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఐఐటీ) ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. మృతుడిని 21 ఏళ్ల అనిల్ కుమార్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్‌లో బీటెక్ చదువుతున్నాడు. అతను క్యాంపస్‌లోని వింద్యాంచల్ హాస్టల్‌లో నివసిస్తున్నాడు. హాస్టల్ నిబంధనల ప్రకారం అనిల్ గత జూన్‌లో రూమ్‌ను ఖాళీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని సబ్జెక్ట్‌లు తప్పడంతో అవి క్లియర్ చేసేందుకు మరో ఆరు నెలల సమయం ఇచ్చారు.
ఈ క్రమంలో అనిల్ గురువారం గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు తిరిగి రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా. అనిల్ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. అయితే సబ్జెక్టులు తప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఎస్పీ తండ్రి మృతి
ఇదిలా ఉండగా ఐఐటీ-ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం గత రెండు నెలల్లో ఇది రెండో ఘటన. జూలై 10న బీటెక్ (మ్యాథ్స్) చదువుతున్న ఆయుష్ అష్నా అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందాడు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment