
సియా కక్కర్
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన టిక్ టాక్ స్టార్, డ్యాన్సర్ సియా కక్కర్ (16) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకుపైగా ఫాలోవర్లు, టిక్ టాక్‌లో 10 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఘటన మరువక ముందే మరో నైపుణ్యం ఉన్న ఆర్టిస్ట్ మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె తన వ్యక్తిగత సమస్యల వల్ల ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని, పని పరంగా ఆమె బాగా చేస్తున్నారని సియా మేనేజర్ అర్జున్ సారిన్ చెప్పారు. బుధవారం రాత్రి కూడా ఓ ప్రాజెక్టు విషయమై ఆమెతో మాట్లాడినట్లు చెప్పారు. అప్పుడంతా బాగానే ఉన్నట్లు అనిపించిందని చెప్పారు. ఆమె మరణించడంపై ఫొటోగ్రాఫర్ వైరల్ భయాణి కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో మంచి నైపుణ్యం ఉన్న ఆమె ఇలాంటి దారి ఎంచుకోవడం విషాదమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment