ప్రతీకాత్మక చిత్రం
ఢిల్లీ : లాక్‌డౌన్ కారణంగా మానసిక ఒత్తిడితో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. బహుళ అంతస్తుల భవనం పైనుంచి దూకడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నోయిడాకు చెందిన 35 ఏళ్ల ఉపాధ్యాయురాలు శుక్రవారం తెల్లవారుజామున తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని 17వ అంతస్తు పైనుంచి దూకింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూసిందని, మృతురాలిని భతవతి బిష్త్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
లాక్‌డౌన్ కారణంగా ఆమె మానసిక ఒత్తిడికి గురైందని, లాక్‌డౌన్ పొడిగింపు కూడా ఆత్మహత్య కారణం కావచ్చని, డిప్యూటీ కమిషనర్ సంకల్ప్ శర్మ తెలిపారు. మృతురాలి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా మహిళలపై గృహహింస కేసులు పెరిగినట్లు ఇటీవలి గణాంకాల్లో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment