న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌లో తన వద్ద పని చేసే కార్మికులను విమానంలో స్వరాష్ట్రానికి పంపించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రైతు పప్పన్ సింగ్ గెహ్లోట్(55) ఇక లేరు. ఢిల్లీలోని ఓ ఆలయంలో బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలిపోరా ప్రాంతంలోని తన ఇంటి ఎదురుగా ఉన్న గుడిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని పేరొన్న సూసైడ్ నోట్ లభించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పెంపించినట్లు వెల్లడించారు.
ఢిల్లీ అలిపొరా ప్రాంతంలో పుట్టగొడుగుల సాగు చేస్తారు పప్పన్ సింగ్. ఆయన వద్ద బిహార్‌కు చెందిన పలువురు కార్మికులు పని చేస్తున్నారు. 2020లో కరోనా మహమ్మారి కట్టడి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కార్మికులు స్వరాష్ట్రం చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తన వద్ద పని చేసే కార్మికులకు విమాన టికెట్లు కొనుగోలు చేసి బిహార్‌కు పంపించారు పప్పన్ సింగ్. దీంతో దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ తర్వాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి లాక్‌డౌన్ ఎత్తివేసిన క్రమంలో మళ్లీ విమానంలోనే వారిని తిరిగి పని ప్రదేశానికి తీసుకొచ్చారు రైతు.
ఇదీ చదవండి: నితీశ్ బలపరీక్ష రోజే.. ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment