mashroom
-
మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?
బిజీ లైఫ్‌లో ఏ రోజు కారోజు తాజాగా ఉండే కూరగాయాలు తెచ్చుకోవడం అందరికీ కుదరదు. అందులోనూ కొన్ని కాయగూరలు తొందరగా మెత్తగా లేదా మొలకెత్తడం, కలర్ మారిపోవడం జరుగుతుంది. అన్ని డబ్బులు పెట్టి కొని పాడేయడానికి మనసొప్పక ఏదో రకంగా వండేస్తాం. కొందరైతే పాడైన భాగాన్ని తొలగించి మిగతా భాగం నుంచి వండేస్తారు.ఇలా చెయ్యొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా..? కొన్ని కూరగాయాలు కొద్ది రోజులే నిల్వ ఉంటాయి. మరికొన్ని పాడైపోయినా ఆ విషయం తెలియదు. మెత్తబడటం లేదా మొలకెత్తుతుంటాయి ఇంకొన్ని కూరగాయాలు. మనం పడేయబుద్ధికాక వండేస్తుంటాం. అయితే ఇలా ఉంటే కొన్ని రకాల కూరగాయాలు అస్సలు వాడకూడదట. అవేంటో సవివరంగా చూద్దామా..! బంగాళదుంపం: బంగాళ దుంపపై మొలకలు వస్తే కొందరూ వెంటనే పడేస్తారు. మరొకందరూ వాటిని తొలగించి వండేస్తారు. మరీ వాడొచ్చా అంటే..నిజానికి బంగాళదుంపలో సహజంగా సోలనిన్ , చకోనిన్ అనే రెండు రకాల టాక్సిన్లు ఉంటాయి. అయితే బంగాళదుంపపై మొలకలు వచ్చి, ఆకుపచ్చని రంగు కనిపిస్తే వెంటనే పడేయ్యడం మంచిది. జస్ట్ అప్పుడే చిన్నగా మొలకలు వచ్చి ఆకుపచ్చ రంగు కనిపించనట్లయితే వినయోగించొచ్చు. కానీ మొలకలు, ఆకుపచ్చ రంగు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వినయోగించొద్దిన నిపుణులు చెబుతున్నారు. ఈ సోలనిన్ విష పదార్థం అని దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ఉల్లిపాయలపై నల్ల మచ్చలు ఉల్లిపాయలు వద్దకు వస్తే బయటి తొక్కలు పొడిగా ఉంటాయి. కానీ లోపాల చాలా వాటికి నల్లటి రంగు ఉంటుంది. మనం వాటిన కడిగేసి వాడేస్తుంటా. అయితే ఇదేం అంత ప్రమాద కాదని చెబుతున్నారు నిపుణులు. మట్టిలో ఉండటం వల్ల వచ్చే కొద్దిపాటి ఫంగస్ అని, దీన్ని చక్కగా కడగడం లేదా ఆ భాగాన్ని తీసేయండి చాలు అని సూచిస్తున్నారు. కానీ ఒక్కోసారి బయటపోరలు తీస్తుండగా మెత్తగా కుళ్లినట్టు ఉండి లోపల భాగం బాగుంటే అస్సలు వంటకు వినయోగించొద్దుని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆకుకూరలు వద్దకు వస్తే.. ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వడలిపోయి, కలర్ మారిపోతే వాడొద్దని హెచ్చరిస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా ఆకులు పసుపురంగులో ఉంటే ఆయా ఆకులను తీసుకుని వాడుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఆకుకూర కాళ్లుభాగం లేదా, ఆకులు కుళ్లినట్లు ఉంటే అస్సలు వినయోగించొద్దని చెబతున్నారు. మొత్తని టొమాటాలు.. దెబ్బతగిలిన టొమాటాలు, కొన్ని లేత మచ్చలు ఉన్నా..ఆ ప్రాంతం వరకు కట్ చేసి తీసేసి వాడుకోవచ్చు. అదే టమాట బూజు పట్టి ఉండి మొత్తం మొత్తగా ఉంటే వెంటనే పారేయండి. కొన్ని టమాటాలు మెత్తగా అయిపోతాయి. అవి వాడుకోవచ్చని, ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. వెల్లుల్లి.. భారతీయ వంటశాలల్లో ప్రధానమైనది. ఇవి గోధుమ రంగులోకి మారిన, దానిపై గోధుమ కలర్ మచ్చలు ఉన్నా.. వెల్లుల్లి పాడైందని అర్థం. కొన్నింటికి ఆకుపచ్చగా మొలకలు వస్తాయి. అలాంటి వెల్లుల్లిలోని ఆకుపచ్చ భాగాన్ని తొలగించి హాయిగా వాడుకోవచ్చు. ఎందుకంటే..? వెల్లుల్లిలోని మొలకెత్తిన ఆకుపచ్చ భాగం చేదుగా ఉంటుంది. కూరల్లో వినయోగిస్తే టేస్ట్ మారుతుంది కాబట్టి వాటిని తొలగించాలి. పుట్టగొడుగులు.. పుట్టగొడుగులు ముడతలు పడినట్టు ఉండి జిగటగా ఉండి పాడైపోయినట్లు సంకేతం. అలాగే వాటిపై నల్ల మచ్చలు చెడిపోవటాన్ని సూచిస్తాయి. ఇలాంటివి వినియోగించకపోవటమే మేలు. దోసకాయలు.. దోసకాయ సాధారణంగా ఫ్రిజ్‌లో ఒక వారం పాటు తాజగా ఉంటుంది. దోసకాయ మెత్తబడితే అది పాడైపోయిందని అర్థం. మొత్తంగా కాకుండా కేవలం దోసకాయ చివరి భాగం మాత్రమే మెత్తగా ఉంటే ఆ భాగాన్ని తీసేసి వాడుకోవచ్చు. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచిది, సూప్ చేసుకొని తాగేయండి
మష్రుమ్ సూప్ తయారీకి కావల్సినవి మష్రుమ్- 100 గ్రా (సన్నగా తరగాలి) కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు - తగినంత దాల్చిన చెక్క- చిన్న ముక్క, మిరియాల పొడి - పావుటీ స్పూన్ వెన్న లేదా నూనె- ఒక టేబుల్ స్పూన్ , మైదా- 50 గ్రా; వెల్లుల్లి రేకలు- నాలుగు తయారీ: ఒక గిన్నెలో పావు లీటరు నీరు పోసి అందులో కొత్తిమీర (సగం), దాల్చిన చెక్క, మిరియాలపొడి, ఉప్పు వేసి ఉడికించాలి. పెనంలో వెన్న వేసి మష్రుమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పెనంలో వెల్లుల్లి రేకలు, మైదా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడకట్టాలి. వడపోసిన మిశ్రమంలో మష్రుమ్ వేసి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి. -
లాక్డౌన్లో కూలీలను విమానంలో పంపించిన రైతు ఆత్మహత్య
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్లో తన వద్ద పని చేసే కార్మికులను విమానంలో స్వరాష్ట్రానికి పంపించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రైతు పప్పన్ సింగ్ గెహ్లోట్(55) ఇక లేరు. ఢిల్లీలోని ఓ ఆలయంలో బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలిపోరా ప్రాంతంలోని తన ఇంటి ఎదురుగా ఉన్న గుడిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని పేరొన్న సూసైడ్ నోట్ లభించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పెంపించినట్లు వెల్లడించారు. ఢిల్లీ అలిపొరా ప్రాంతంలో పుట్టగొడుగుల సాగు చేస్తారు పప్పన్ సింగ్. ఆయన వద్ద బిహార్‌కు చెందిన పలువురు కార్మికులు పని చేస్తున్నారు. 2020లో కరోనా మహమ్మారి కట్టడి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కార్మికులు స్వరాష్ట్రం చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తన వద్ద పని చేసే కార్మికులకు విమాన టికెట్లు కొనుగోలు చేసి బిహార్‌కు పంపించారు పప్పన్ సింగ్. దీంతో దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ తర్వాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి లాక్డౌన్ ఎత్తివేసిన క్రమంలో మళ్లీ విమానంలోనే వారిని తిరిగి పని ప్రదేశానికి తీసుకొచ్చారు రైతు. ఇదీ చదవండి: నితీశ్ బలపరీక్ష రోజే.. ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు -
ఫ్రైయిడ్ రైస్ ఆమ్లెట్, మష్రూమ్స్ సూప్, వెజ్ నూడూల్ బాల్స్ తయారీ ఇలా..
కొత్త రుచుల కోసం రెస్టారెంట్లవైపు పరుగులు తీసే అలవాటుకు స్వస్తిపలికే వేళాయే! ఎందుకంటే రెస్టారెంట్ లాంటి స్పెషల్ డిషెస్ మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా.. ఫ్రైయిడ్ రైస్ ఆమ్లెట్ కావలసిన పదార్థాలు: అన్నం – పావు కప్పు బోన్‌లెస్ చికెన్ – పావు కప్పు (ఉడికించినది) కూరగాయ ముక్కలు – పావు కప్పు (నూనెలో వేయించినవి) బటర్, టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున గుడ్లు – 3, నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత, మిరియాల పొడి – కొద్దిగా, నూనె – సరిపడా తయారీ విధానం: ముందుగా కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. అందులో అన్నం, చికెన్ ముక్కలు దోరగా వేయించిన తర్వాత.. బటర్, టొమాటో సాస్, మిరియాల పొడి, కూరగాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఈ లోపు ఒక చిన్న బౌల్లో గుడ్లు, నీళ్లు, ఉప్పు బాగా కలుపుకుని మరో పాన్ మీద ఆమ్లెట్ వేసుకుని.. దానిపైన ఈ ఫ్రైయిడ్ రైస్ వేసుకుని.. ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్స్ సూప్ కావలసినవి: మష్రూమ్స్ ముక్కలు (పుట్టగొడుగులు) – 2 కప్పులు (అదనంగా 2 టేబుల్ స్పూన్లు గార్నిష్‌కి నూనెలో వేయించినవి) ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు అల్లం తురుము – అర టీ స్పూన్, మొక్కజొన్న పిండి – పావు కప్పు కొబ్బరి పాలు – 2 కప్పులు, ఉప్పు – తగినంత మిరియాల పొడి – 1 టీ స్పూన్ నీళ్లు – ఒకటిన్నర కప్పులు బ్రెడ్ ముక్కలు – గార్నిష్‌కి (నూనె లేదా నేతిలో వేయించాలి) చీజ్ తురుము, నూనె – 2 టేబుల్ స్పూన్ల చొప్పున తయారీ విధానం: ముందుగా ఒక కళాయిలో చీజ్, నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో మష్రూమ్ ముక్కలు వేసుకుని 5 నిమిషాలు పైనే మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ మగ్గనివ్వాలి. అనంతరం మొక్కజొన్న పిండి, కొబ్బరి పాలు పోసి గరిటెతో బాగా కలిపి చిన్న మంట మీద ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆపైన ఉప్పు, మిరియాల పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడగానే నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. చివరిగా హెవెన్ క్రీమ్ కరిగించి అందులో కలుపుకోవాలి. కొత్తమీర తురుము, వేయించి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల మష్రూమ్ ముక్కలు, బ్రెడ్ ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగాఉంటుంది. వెజ్ నూడూల్ బాల్స్ కావలసినవి: వెల్లుల్లి రేకలు – 3 ధనియాలు, కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్ చొప్పున ఉప్పు – కొద్దిగా ఓట్స్ పౌడర్, జొన్న పిండి, క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము, కొబ్బరి కోరు – పావు కప్పు చొప్పున గడ్డ పెరుగు – 4 టేబుల్ స్పూన్లు నీళ్లు – కొన్ని నూనె – డీప్ ఫ్రైకి సరిపడా నూడూల్స్ – బాల్స్ చుట్టేందుకు సరిపడా (నీటిలో ఉడికించి పక్కనపెట్టుకోవాలి) తయారీ విధానం: ముందుగా మిక్సీలో వెల్లుల్లి రేకలు, ధనియాలు, కొత్తిమీర తురుము వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకుని, ఓట్స్ పౌడర్, జొన్న పిండి, క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము, కొబ్బరి కోరు, గడ్డపెరుగుతో పాటు నీళ్లు అవసరం అయితే కొద్దికొద్దిగా పోసుకుంటూ.. ముద్దలా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. నూడూల్స్ పొడవుగా పరచి.. రోల్స్ మాదిరి బాల్స్ చుట్టూ నూడూల్స్ చుట్టి, తడి చేత్తో నూడూల్స్ చివర్లను బాల్స్‌కి గట్టిగా ఒత్తాలి. నూనెలో దోరగా వేయించుకోవాలి. -
క్యాన్సర్ ఒత్తిడి తగ్గించుకోవాలంటున్నారా? అయితే..
క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఓ రోగి ఎంత మానసిక వేదన అనుభవిస్తాడో తెలియంది కాదు. అయితే... క్యాన్సర్ పూర్తిగా తగ్గాక కూడా కొందరిలో ఒక రకమైన మానసిక వేదన ఉంటుంది. తమకు వచ్చిన క్యాన్సర్ పూర్తిగా తగ్గినప్పటికీ... అంతకు ముందు వారు ఆ వ్యాధి వల్ల కలిగిన షాక్ కారణంగా కొందరు ‘ఎగ్జిస్టెన్షియల్ డిస్ట్రెస్’ అనే మానసిక సమస్యకు గురవుతారు. చాలా వేగంగా ప్రయాణం చేస్తున్న వాహనంలో ప్రయాణం చేస్తూ ఆ వేగపు తీవ్రతను అనుభవిస్తున్నవారు కాస్తా.... వాహనం వేగం తగ్గాక కూడా అంతకు ముందు తాను అనుభవించిన ఉద్విగ్నతను మరికాసేపు కొనసాగించినట్లుగానే... క్యాన్సర్ తగ్గాక కూడా ఆ ముందు అనుభవించిన వేదనలోనే మరికొంతకాలం పాటు కొనసాగుతారు. అయితే సైలోసైబన్ మష్రూమ్స్ అనే ఒక రకం పుట్టగొడుగులను ఆహారంగా తీసుకునే వారిలో ఈ తరహా మానసిక సమస్య తీవ్రత అంతగా ఉండదని పేర్కొంటోంది ఒక హెల్త్ జర్నల్. ఈ మష్రూమ్‌ను ఆహారంగా తీసుకున్నా లేదా దీని నుంచి దీని నుంచి తయారు చేసిన సైలోసైబిన్ అనే డ్రగ్‌ను తీసుకున్నా కూడా ఇదే ప్రభావం ఉంటుందని పేర్కొంటోంది ‘హెల్త్ డే’ అనే హెల్త్ జర్నల్. సైలోసైబిన్‌ను తీసుకున్న వారు ఒక రకమైన హాయి గొలుపుతున్న ఫీలింగ్‌ను పొందుతుంటారట. అందుకే దీన్నే సైకెడెలిక్ మష్రూమ్ అని కూడా అంటారని ఆ జర్నల్‌కు చెందిన ప్రతినిధి స్టీవెన్ రెయిన్‌బర్గ్ పేర్కొంటున్నారు. మామూలుగానైతే సైలోసైబిన్‌ను నరాలకు సంబంధించిన జబ్బుల్లోనూ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) అనే మానసిక రుగ్మతలోనూ సాధారణంగా ఉపయోగిస్తుంటారు. అయితే అనేక మంది క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన వివరాలను బట్టి కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ నయమైన రోగులనుంచి తీసుకున్న వివరాల ప్రకారం... క్యాన్సర్ రోగులలోనూ ఇది చాలా ప్రభావపూర్వకంగా పనిచేస్తుందని తేలింది. దాంతో ఆ రసాయనం పుష్కలంగా ఉండే మ్యాజిక్ మష్రూమ్స్‌ను ఆహారం తీసుకోవడం వల్ల కూడా అదే ఫలితం దొరుకుతుందని పేర్కొంటోంది ‘హెల్త్ డే’ అనే హెల్త్ జర్నల్. చదవండి: మహిళలు రుతు సమయంలో వ్యాయామం చేయకూడదా? -
అంగారకుడిపై జీవం ఉందా?
అంగారకుడిపై జీవం ఉండేదా? ఉందా? దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నామంటున్నారు కొందరు పరిశోధకులు. మరో భూమి కాగలదని భావిస్తున్న అరుణ గ్రహంపై జీవం ఉండటమే కాదు.. ఇప్పుడు అక్కడ శిలీంధ్రాలు పెరుగుతున్నాయని వీరి వాదన. నీళ్లలో పెరిగే నాచు.. పుట్టగొడుగుల్లాంటి శిలీంధ్రాల రూపంలో ఇవి ఉన్నాయని, క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రాల ఆధారంగా వీరు ఈ అంచనాకు వచ్చినట్లు.. జర్నల్ ఆఫ్ ఆస్ట్రో బయాలజీ అండ్ స్పేస్ సైన్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ద్వారా వెల్లడైంది. క్యూరియాసిటీ పంపిన కనీసం 15 చిత్రాల్లో అత్యంత సాధారణ స్థాయి జీవం తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ రెజీనా డాస్ చెప్పారు. ఈ రకమైన జీవం ఇప్పుడు కూడా అక్కడ పెరుగుతూ ఉండొచ్చునని.. లేదంటే ఒకప్పుడు అక్కడ మనుగడ సాగించి ఉండవచ్చునని ఆయన అంటున్నారు. వీరి అంచనా ప్రకారం అంగారకుడి వాతావరణంలో ఉన్న మీథేన్ వాయువు ఒక క్రమ పద్ధతిలో హెచ్చుతగ్గులకు లోనవుతోంది. అక్కడి జీవం బతికి ఉన్నప్పుడు ఒకలా, చనిపోయినప్పుడు మరోలా మీథేన్ స్థాయిలు మారుతున్నాయన్నమాట. క్యూరియాసిటీ పంపిన చిత్రాలు మూడు రోజులకు సంబంధించినవైతే.. మొదటి రోజు చిత్రంలోని నాచు కంటే మూడో రోజు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నాసా ఏమంటోంది? రెజీనా డాస్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించామని స్పష్టంగా చెబుతున్నప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) దీనిపై వ్యాఖ్యానించలేదు. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉల్కా శకలాలు ఢీకొట్టినందున ఒకప్పుడు అంగారకుడిపై జీవం ఉండేందుకు అవసరమైన అన్ని అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అంగారక గ్రహం ఏర్పడిన తొలినాళ్లలో అక్కడి వాతావరణంపై హైడ్రోజన్ ఎక్కువగా ఉండి ఉంటే.. గ్రహశకలాలు ఢీకొట్టడం వల్ల జీవం ఏర్పడేందుకు అత్యంత కీలకమైన నైట్రోజన్ రూపాలు నైట్రైట్లు (ఎన్ఓ2), నైట్రేట్లు (ఎన్ఓ3)లు ఏర్పడతాయని, క్యూరియాసిటీ రోవర్ వీటిని గేల్ క్రేటర్ ప్రాంతంలో సేకరించిన మట్టి, రాతి నమూనాల్లో గుర్తించిందని పేర్కొంది. అంగారకుడిపై అత్యంత పురాతనమైన సరస్సులు, భూగర్భ జలాలు ఉన్నది ఈ గేల్ క్రేటర్లోనే కావడం గమనార్హం. క్యూరియాసిటీ గుర్తించిన నైట్రోజన్ రూపాలు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేసింది. ప్రయోగంలో హైడ్రోజన్ ఎక్కువైన కొద్దీ నైట్రేట్లు, నైట్రైట్ల మోతాదు ఎక్కువ కావడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. అంగారకుడిపై హైడ్రోజన్ ఎక్కువగా ఉండి ఉంటే జీవం మనుగడకు అవసరమైన పరిస్థితులు ఉండేవన్న నిర్ధారణకు వచ్చారు. -
పుట్టగొడుగులు తిని 8 మందికి అస్వస్థత
ఆమదాలవలస రూరల్, శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఆమదాలవలస మండలంలోని ముద్దాడపేట గ్రామంలో విషాహారం తిని రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం పొలంలో దొరికిన పుట్టగొడుగులతో రాత్రి ఆహారం వండుకున్నారు. తిని పడుకోగానే అర్ధరాత్రి విరేచనాలు, వాంతులతో బాధపడ్డారు. దీంతో ఎం.ఆనందరావు, ఎం.నిర్మల, ఎం. హనుమంతురావు, జి.సావిత్రి, బి.సత్యనారాయణ, బి.అన్నపూర్ణ, బి.దివ్య, ముద్దాడ హేమలత, బాసిన సత్యనారాయణను స్థానికులు 108కు సమాచారం అందించారు. దగ్గరలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో బూర్జ మండలానికి చెందిన 108వాహన సిబ్బంది ప్రథమ చికిత్స అందించి బాధితులను శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం వారంతా రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వీరి పెరటిలో ఉన్న పుట్టగొడుగును తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వీరిలో గుర్రాల సావిత్రమ్మ కోలుకోవడంతో ఆమె ఆదివారం ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వారు రిమ్స్ మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల తిరుపతి రావు ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. -
పుట్టగొడుగు తిని ముగ్గురికి అస్వస్థత
టెక్కలి రూరల్ : పొలంలో దొరికిన పుట్టగొడుగు తిని ఇద్దరు చిన్నారులతో పాటు వృద్ధురాలు అస్వస్థతకు గురయ్యారు. మండంలోని భగవాన్‌పురానికి చెందిన వృద్ధురాలు ముత్యాలమ్మ, బాడాన సీత(13), బాడాన సత్యనారాయణ(10) బుధవారం పొలానికి వెళ్లారు. అక్కడి నుంచి వచ్చే సమయంలో పుట్టగొడుగును ఇంటికి తెచ్చుకున్నారు. తర్వాత దానిని వండి తిన్న తర్వాత.. వాంతులు, విరేచనాలు అవడంతో స్థానికులు హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వీరు అక్కడే చికిత్స పొందుతున్నారు. -
పడగ కాదు.. పుట్టగొడుగు
పుట్టగొడుగులో నాగుల ఆకారం అందరినీ ఆకర్షిస్తోంది. మారుతీనగర్ మంగళవారికాలనీలోని నాల్గో క్రాస్‌లో కొలువైన నాగుల కట్ట కింద చిన్న పుట్టగొడుగు పుట్టింది. 26 రోజుల క్రితం పడగ ఆకారంలో పుట్టిన పుట్టగొడుగు నానాటికీ పెద్దదవుతూ వస్తోంది. ఈ వింతను చూడడానికి జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. - సాక్షి, ఫొటోగ్రాఫర్, అనంతపురం