
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు, వృద్ధురాలు
టెక్కలి రూరల్ : పొలంలో దొరికిన పుట్టగొడుగు తిని ఇద్దరు చిన్నారులతో పాటు వృద్ధురాలు అస్వస్థతకు గురయ్యారు. మండంలోని భగవాన్‌పురానికి చెందిన వృద్ధురాలు ముత్యాలమ్మ, బాడాన సీత(13), బాడాన సత్యనారాయణ(10) బుధవారం పొలానికి వెళ్లారు.
అక్కడి నుంచి వచ్చే సమయంలో పుట్టగొడుగును ఇంటికి తెచ్చుకున్నారు. తర్వాత దానిని వండి తిన్న తర్వాత.. వాంతులు, విరేచనాలు అవడంతో స్థానికులు హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వీరు అక్కడే చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment