విషపు పుట్టగోడుగులు
ఆమదాలవలస రూరల్, శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఆమదాలవలస మండలంలోని ముద్దాడపేట గ్రామంలో విషాహారం తిని రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం పొలంలో దొరికిన పుట్టగొడుగులతో రాత్రి ఆహారం వండుకున్నారు. తిని పడుకోగానే అర్ధరాత్రి విరేచనాలు, వాంతులతో బాధపడ్డారు. దీంతో ఎం.ఆనందరావు, ఎం.నిర్మల, ఎం. హనుమంతురావు, జి.సావిత్రి, బి.సత్యనారాయణ, బి.అన్నపూర్ణ, బి.దివ్య, ముద్దాడ హేమలత, బాసిన సత్యనారాయణను స్థానికులు 108కు సమాచారం అందించారు.
దగ్గరలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో బూర్జ మండలానికి చెందిన 108వాహన సిబ్బంది ప్రథమ చికిత్స అందించి బాధితులను శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం వారంతా రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వీరి పెరటిలో ఉన్న పుట్టగొడుగును తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వీరిలో గుర్రాల సావిత్రమ్మ కోలుకోవడంతో ఆమె ఆదివారం ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
మిగిలిన వారు రిమ్స్ మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల తిరుపతి రావు ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment