ill
-
ఆహారంలో బల్లి.. 50 మందికి అస్వస్థత
లాతూర్: మహారాష్ట్రలోని లాతూర్‌లో కలుషిత ఆహారం తిన్న విద్యార్థినులు అనారోగ్యం బారినపడ్డారు. ఇక్కడి పురన్మల్ లాహోటీ హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న 50 మంది విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థినులను తిరిగి హాస్టల్‌కు పంపించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం వారు తిన్న ఆహారంలో బల్లి కనిపించింది. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆస్పత్రిలో వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. లాతూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శివాజీ కల్గే మీడియాతో మాట్లాడుతూ గార్మెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్నారు. వారికి చికిత్స అందించి, అబ్జర్వేషన్లో ఉంచి తరువాత తిరిగి హాస్టల్‌కు పంపించామన్నారు. కాగా ఈ ఘటనపై హాస్టల్ అధికారులు విచారణ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: 'మూడు రెట్ల జీతం వచ్చే ఉద్యోగం' -
పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్‌రాజ్ పరిధిలోని శృంగవేర్పూర్ ధామ్‌లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళం పగులగొట్టి అష్టధాతువులతో తయారు చేసిన 100 ఏళ్ల రాధాకృష్ణుల విగ్రహాన్ని చోరీ చేశారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. అయితే ఈ చోరీకి పాల్పడ్డ దొంగ వారం రోజుల తరువాత ఆలయానికి కొద్దిదూరంలో రోడ్డుపై రాధాకృష్ణుల విగ్రహాలను, ఒక లేఖను ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు ఆ విగ్రహాల గురించి ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడ లభ్యమైన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సదరు దొంగ క్షమాపణలు చెబుతూ.. రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించాక తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని, పీడకలలతో బాధపడుతున్నాడని’ రాశాడు. తాను అప్పగించిన విగ్రహాలను ఆలయంలో తిరిగి అదోచోట ఉంచాలని ఆ దొంగ వినయపూర్వకంగా కోరాడు.ఇది కూడా చదవండి: ఆర్జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం -
పవిత్రా గౌడకు అనారోగ్యం
బనశంకరి: రేణుకాస్వామి హత్య కేసులో జైలుపాలైన నటి పవిత్రా గౌడ అనారోగ్యానికి గురి కావడంతో పరప్పన అగ్రహార జైలులోనే ఆసుపత్రి వార్డులో చికిత్స అందిస్తున్నారు. చికిత్స తరువాత ఆమె కోలుకున్నట్లు తెలిసింది. హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌తో పాటు 17 మంది నిందితులు పరప్పన జైలులో ఉన్నారు. జూన్ 11వ తేదీన నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. రెండువారాల పాటు తీవ్రంగా విచారించి, తరువాత జైలుకు పంపారు. మరోవైపు దర్శన్ కూడా జైలులో ఆహారం సరిపడక ఇబ్బందులు పడుతున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. సరిగా నిద్రపోవడం లేదని, నిరంతరం చింతిస్తున్నాడని సమాచారం. ఫలితంగా బాగా బరువు కూడా తగ్గిపోయాడు. -
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. -
కలుషిత ఆహారం.. 200 మంది విద్యార్థులు అనారోగ్యంపాలు!
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో గల ఒక హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న సుమారు 200 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్యన్ రెసిడెన్సీ అండ్ లాయిడ్స్ హాస్టల్ విద్యార్థులు కలుషిత ఆహారం తిన్న కారణంగా అనారోగ్యం పాలయ్యారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా హాస్టల్లో తమకు నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకునిపై బాధిత విద్యార్థులు పోలీసుల ఎదుట తీవ్ర ఆరోపణలు చేశారు. మార్చి 8వ తేదీ సాయంత్రం హాస్టల్లో ఆహారం తిన్న విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని నాలెడ్జ్ పార్క్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే బాధిత విద్యార్థులందరినీ సమీపంలోని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు వివరించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. -
గాల్లో ఉండగా పైలట్‌కు అస్వస్థత..ఆ టైంలో 65 ఏళ్ల మహిళ..
ప్రమాదాలు అనుకోకుండా వస్తాయి. అయినా ఎవ్వరూ ఊహించం కదా అనారోగ్యానికి గురవ్వుతామని. సరిగ్గా అలాంటి సమయంలో మన పక్కను ఉన్నవాళ్లు కాస్త తెలివిగా వ్యవహరిస్తే కొన్ని ప్రమాదాల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. అందుకు ఉదాహరణ ఆ బామ్మ. 2006లో జరిగిన ఓ ప్రమాద ఘటనలో ఆమె చేసిన సాహసం ఆమెను అందరిచే ప్రశంసలు అందుకునేలా చేసింది. వివరాల్లోకెళ్లే.. న్యూయార్క్‌లో వెస్ట్చెస్టర్ కౌంటీ నుంచి పైపర్ మెరిడియన్ మినీ విమానం వైన్యార్డ్కు బయలుదేరింది. ద్రాక్ష తోట సమీపంలోని రన్‌వేపై విమానం ల్యాండింగ్‌లో ఉండగా పైలట్(79) అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానంలోని 65 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు సత్వరమే స్పందించి..ఆ విమానాన్ని అదుపు చేసే యత్నం చేసింది. ఐతే ఆమె సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేసే క్రమంలో విమానం ఓ వైపుకి రన్‌వే సమీపంలో కుప్పకూలింది. దీంతో విమానం ఎడమ రెక్క సగానికి విరిగిపోయింది. ఎమర్జెన్సీ రెస్క్యూ టీం వెంటనే అక్కడకు చేరుకుని పైలట్ తోపాటు, మహిళా ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించింది. ఐతే పైలట్ ఆరోగ్యం విషమంగా ఉనట్లు అధికారులు పేర్కొన్నారు. ఐతే సదరు మహిళ ప్రయాణికురాలు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. కానీ ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ మహిళ ఏ మాత్రం గాబరాపడినా సమస్యల్లో చిక్కుపోయింది. ఆ సమయంలో సమయస్ఫూర్తిగి వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. (చదవండి: ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే) -
కుల్ఫీ తిన్న 65 మంది చిన్నారులు ఆసుపత్రిపాలు
ఆనందంగా గంతులేసుకుంటూ కుల్ఫీ తిన్న ఆ 65 మంది పిల్లలు ఉన్నట్టుండి అనారోగ్యం బారినపడి ఆసుపత్రి పాలయ్యారు. కుల్ఫీ తిన్న వెంటనే వారు కడుపునొప్పితో తల్లడిల్లి పోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో కుల్ఫీ తిన్న 65మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. కడుపునొప్పి, వాంతులతో తల్లడిల్లిపోతున్న ఆ చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పిల్లలు ఏ వెండర్ దగ్గర నుంచి కుల్ఫీలు కొనుగోలు చేశారో, వాటి శాంపిల్స్‌ను అధికారులు సేకరించి, పరిశీలన కోసం పంపించారు. ఆరోగ్యశాఖ అధికారి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఈ ఘటన రాజగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకున్నదన్నారు. చిన్నారులు ఒక వెండర్ దగ్గర కుల్ఫీలు కొనుగోలు చేశారు. వాటిని తిన్నవెంటనే వారికి కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. ఒక్కక్కరుగా పిల్లలంతా అనారోగ్యం బారినపడ్డారు. వెంటనే స్థానికులు వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరికొందరు చిన్నారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరికి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్ శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ బాధిత చిన్నారులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 50 మంది చిన్నారులు కోలుకోగా, వారిని వారి ఇళ్లకు పంపించామన్నారు. మరో 15 మంది చిన్నారులకు ఇంకా చికిత్స కొనసాగుతోంది. వీరు తిన్న కుల్ఫీ శాంపిల్‌ను పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపించామన్నారు. చదవండి: రైతు ప్రాణాలు కాపాడిన ఆవు -
Bihar: కల్తీ మద్యంతో 20 మంది మృతి!
పాట్నా: బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం కాటేసింది. మోతిహారీ జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి మద్యం సేవించిన కొందరి పరిస్థితి విషమించింది. ఇప్పటివరకు 20 మంది మరణించగా.. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం 2016లోనే మద్యపాన నిషేధం విధించింది. అయినప్పటికీ కల్తీ మద్యాన్ని జోరుగా విక్రయిస్తున్నారు. ఇది తాగి అమాయకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజా ఘటనపై సీఎం నితీశ్ స్పందించారు. ఘటన బాధాకరమన్న ఆయన.. విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో కూడా సివాన్‌లో కల్తీమద్యం సేవించి నలుగురు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి అక్రమంగా ఆల్కహాల్ విక్రయించిన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లిక్కర్ మాఫియా.. శానిటైజర్ తయారు చేస్తామని చెప్పి కోల్‌కతా నుంచి ఇథేనాల్ తీసుకొచ్చి మద్యం తయారు చేస్తోందని పోలీసులు తెలిపారు. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్సైజ్ శాఖ 15 మంది లిక్కర్ వ్యాపారులను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది బిహార్‌లోని ఛప్రా జిల్లాలో కల్తీ మద్యం కారణంగా ఏకంగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కాగా.. కల్తీమద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. తాగితే చస్తారని, మద్యం జోలికి వెళ్లొద్దని కరాకండీగా చెప్పారు. చదవండి: అసద్ అంత్యక్రియలు పూర్తి.. తండ్రి అతిఖ్ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ -
మిడ్ డే భోజనంలో పాము కలకలం..విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మయూరేశ్వర్ బ్లాక్‌లోని ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల్లో అనూహ్యంగా మధ్యాహ్నా భోజనంలో పాము కనిపించినట్లు కలకలం రేగింది. ఇంతలో ఐతే అప్పటికే ఆ భోజనం తిన్న 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం జరిగింది. దీంతో వారిని హుటాహుటినా రామ్‌పూర్‌హట్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐతే పప్పు నింపిన కంటైనర్‌లో పాము కనిపించినట్లు భోజనం సిద్ధం చేసిన సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. వారిలో ఒక విద్యార్థి మాత్రం ప్రమాదం నుంచి బయటపడి.. డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. అదీగాక మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నట్లు ఆ పాఠశాలపై ఫిర్యాదు వస్తున్నట్లు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీపాంజన్ జానా చెప్పారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆ పాఠశాల ఉపాధ్యాయుడిని ముట్టడించి, అతడి వాహానాన్ని ధ్వసం చేసినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: దారుణం: ఆకస్మికంగా ఓ వ్యక్తిపై దాడి.. చేయి నరికి..) -
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆమె చేరారు. అయితే ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. వైరల్ ఫీవర్, పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగానే నిర్మాలా సీతారామన్ ఆస్పత్రిలో చేరారని అధికారులు పేర్కొన్నారు. వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ఆదివారం బాగానే ఉన్నారు. మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత వాజ్‌పేయీ జయంతి సందర్భంగా నివాళులు కూడా అర్పించారు. కానీ ఆ మరునాడే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. చదవండి: రాహుల్ స్పీచ్‌లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్ -
భర్త క్రూరత్వం! భార్య అనారోగ్యంతో ఉందని..
యశవంతపుర: అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన భార్యను భర్త అతి క్రూరంగా చంపిన ఘటన సోమవారం బెంగళూరు తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు...శివమ్మ (50), శంకరప్ప భార్యభర్తలు. శంకరప్ప తుహళ్లి రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి శివమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నాడు. శివమ్మను ఎలాగైన అడ్డు తొలగించుకోవాలని శంకరప్ప పథకం వేశాడు. పిల్లలు పనికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం సెల్లార్‌లోని నీటి ట్యాంకులోకి ఆమెను తీసుకువచ్చి పడేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కొడుకు, కుమార్తె తల్లి కనిపించకపోవడంతో తండ్రిని నిలదీశారు. తనకు తెలియదని శంకరప్ప చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. కొడుకు అనుమానంతో సెల్లార్‌లోని నీటి ట్యాంకులో చూడగా శివమ్మ శవమై కనిపించింది. తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. (చదవండి: కొడుకు హత్యకు తండ్రి సుపారీ) -
ఈడీ విచారణలో ఎల్ రమణకు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) విచారణకు హాజరైన తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని ఈడీ అధికారులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతలకు గురైన ఎమ్మెల్సీ రమణను హైదర్గూడా అపోలో ఆస్పత్రికి తరలించారు ఈడీ అధికారులు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు ఆయన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. చికోటీ ప్రవీణ్ సారథ్యంలో విదేశాల్లో అక్రమ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తవ్వేకొద్దీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో వంద మందితో కూడిన ఓ జాబితా లిస్ట్‌ను రూపొందించింది ఈడీ. శుక్రవారం ఎమ్మెల్సీ రమణను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది. దీంతో హైదరాబాద్ ఈడీ ఆఫీస్‌కు వచ్చారు ఆయన. అయితే విచారణ సమయంలో రమణ అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ వ్యవహారంలో మంత్రి తలసాని యాదవ్ ఇద్దరు సోదరులను ఇదివరకే ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. -
18 మంది విద్యార్థులకు అస్వస్థత
కాకినాడ రూరల్: ఊపిరి ఆడక 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటన మంగళవారం కాకినాడలోని కేంద్రీయ విద్యాలయలో చోటు చేసుకుంది. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో ఉన్న కేంద్రీయ విద్యాలయలో 473 మంది చదువుకుంటున్నారు. మంగళవారం మొదటి పీరియడ్ 9.30 గంటలకు ప్రారంభం కాగా, 6వ తరగతి విద్యార్థి ఒకరు తనకు ఊపిరి ఆడడం లేదని.. కళ్లు మండుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత వరుసగా మరో 17 మంది ఇదే సమస్యతో తరగతి గదుల నుంచి బయటకు వచ్చేశారు. వీరిలో 11 మంది అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరందరినీ సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. వీరిలో ముగ్గురు విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. మిగతా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వారందరినీ పరిశీలనలో ఉంచామని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీ బుద్ధా తెలిపారు. విద్యార్థులను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్లా పరామర్శించారు. పాఠశాలను పరిశీలించిన అధికారుల బృందం డీఎంఅండ్‌హెచ్‌వో రమేష్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, పొల్యూషన్ కంట్రోల్ అధికారి వెంకటాచలం, డీఎస్పీ భీమారావు, ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ నాగూర్ మీరా, తహశీల్దార్ మురార్జీ తదితరులు స్కూల్‌ను పరిశీలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణం తరగతి గదుల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటమేనని భావిస్తున్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు నురుగు వచ్చే పోమ్తో కూడిన స్ప్రే టిన్లను వినియోగించినట్టు తెలిసింది. రాత్రి కిటికీలు మూసి ఉండటంతో స్ప్రేలో ఉండే ఐసోసైనెట్, పాలియాల్ రసాయనాలు గదుల్లో వ్యాపించి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. కలెక్టర్ చైర్మన్‌గా విచారణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. -
కాకినాడలో ఊపిరాడక 30 మంది విద్యార్థులకు అస్వస్థత..
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్‌లోని వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5, 6 తరగతి గదుల్లో ఊపిరాడక 30 మంది స్కూల్ పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని వలసపాకలలోని ఓ ప్రైవేట ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గల కారణాలను టీచర్స్, విద్యార్ధులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కాగా తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రోదనలతో స్థానికంగా హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అస్వస్థతకు గురైన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారు. విద్యార్ధుల అస్వస్ధతకు గల కారణాలు తెలుసుకునేందుకు రక్త నమూనాలను వైద్యులు సేకరించారు. మంత్రి ఆరా కాకినాడ వలసపాకలలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్దులు అస్వస్థతకు గురైన ఉదంతంపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. -
బీజేపీ ఎంపీకి మరోసారి తీవ్ర అస్వస్థత : ఎయిర్‌లిఫ్ట్
సాక్షి,భోపాల్: బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిగా ఉందని ఆమె ఫిర్యాదు చేయడంతో ఆమెను హుటాహుటిన విమానంలో ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భోపాల్‌లోని ఎంపీ కార్యాలయం అధికారులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. కాగా ప్రజ్ఞా ఠాకూర్ కోవిడ్-19 ప్రేరిత లక్షణాలతో గత ఏడాది డిసెంబర్లో ఎయిమ్స్‌లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. 2008 మాలెగావ్ బాంబు దాడిలో నిందితురాలిగా ఉన్న ఆమెకు అనారోగ్య కారణాల రీత్యా జాతీయ దర్యాప్తు సంస్థ 2017లో బెయిల్ మంజూరు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్‌పై 3.6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించింది. -
ప్రసాదంలో విషం.. 12 మంది మృతి
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. దేవాలయంలో పంపిణీ చేసిన ప్రసాదం తిని ఇద్దరు చిన్నారులతో సహా 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చామరాజనగర్ జిల్లా హనూరు తాలూకా సుళివాడి గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. గ్రామంలోని మారెమ్మ దేవాలయ గోపుర నిర్మాణానికి గురువారం శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. పూజాది కార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రసాదం కోసం సిద్ధం చేసిన రైస్‌బాత్‌తో అన్నదానం నిర్వహించారు. ఆ రైస్‌బాత్ తిన్న కొద్దిసేపటికి చాలామంది భక్తులు వాంతులు చేసుకుని స్పృహ తప్పారు. ఆస్పత్రిలో చేర్పించగా 12 మంది చికిత్సపొందుతూ చనిపోయారు. దేవుడి ప్రసాదం విషమయం కావడానికి దేవాలయ పాలక మండలిలో ఉన్న రెండు వర్గాల మధ్య విబేధాలే కారణమని తెలుస్తోంది. కార్యక్రమానికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ఒక వర్గం వారు ప్రసాదంలో కిరోసిన్‌తో పాటు క్రిమిసంహారక మందులు కలిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ సీఎం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. -
కొంపముంచిన టమాటా రైస్
సాక్షి, బెంగళూరు: గుడిలో పంచిపెట్టిన ప్రసాదం భక్తుల పాలిట యమపాశమైంది. కర్నాటక, చామరాజ్ నగర్ జిల్లాలోని సులివాడి గ్రామంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా మారమ్మ దేవాలయం శంకుస్థాపన సందర్బంగా భక్తులకు పంపణీ చేసిన ప్రసాదం విషపూరితం కావడంతో దాన్ని స్వీకరించిన పదకొండు మంది భక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు 72మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో 12 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై జిల్లా ఆరోగ్య అధికారి ప్రసాద్ అందించిన సమాచారం ప్రకారం ప్రసాదం తిన్నవెంటనే భక్తులు వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు, పోలీసులు బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రసాదంలో విషం కలిసి వుంటుందనే అనుమానాలను ఆరోగ్య అధికారి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో సేకరించిన ప్రసాదం శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపించినట్టు తెలిపారు. అలాగే ప్రసాదంలో కిరోసిన్ కలిసిన వాసన వచ్చినట్టుగా బాధితులు చెప్పారన్నారు. చనిపోయినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు చెప్పారు. తమకు పంచిపెట్టిన టమాటో రైస్ వాసన వచ్చిందని, అయితే క్యూలో ముందున్న వాళ్లు ప్రసాదం తిన్న వెంటనే వాంతులు చేసుకున్నారని, దీంతో కొంతమంది తినకుండా పారేయడంతో క్షేమంగా బయటపడ్డారని భక్తుడు మురుగప్ప తెలిపారు. అటు ప్రసాదంలో విషం కలిపారన్న ఆరోపణలపై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. చనిపోయినవారికి 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే తక్షణమే సంబంధిత చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
పుట్టగొడుగులు తిని 8 మందికి అస్వస్థత
ఆమదాలవలస రూరల్, శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఆమదాలవలస మండలంలోని ముద్దాడపేట గ్రామంలో విషాహారం తిని రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం పొలంలో దొరికిన పుట్టగొడుగులతో రాత్రి ఆహారం వండుకున్నారు. తిని పడుకోగానే అర్ధరాత్రి విరేచనాలు, వాంతులతో బాధపడ్డారు. దీంతో ఎం.ఆనందరావు, ఎం.నిర్మల, ఎం. హనుమంతురావు, జి.సావిత్రి, బి.సత్యనారాయణ, బి.అన్నపూర్ణ, బి.దివ్య, ముద్దాడ హేమలత, బాసిన సత్యనారాయణను స్థానికులు 108కు సమాచారం అందించారు. దగ్గరలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో బూర్జ మండలానికి చెందిన 108వాహన సిబ్బంది ప్రథమ చికిత్స అందించి బాధితులను శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం వారంతా రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వీరి పెరటిలో ఉన్న పుట్టగొడుగును తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వీరిలో గుర్రాల సావిత్రమ్మ కోలుకోవడంతో ఆమె ఆదివారం ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వారు రిమ్స్ మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల తిరుపతి రావు ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. -
82మంది మహిళా ఖైదీలకు ఆస్వస్థత
ముంబై : 82మంది మహిళా ఖైదీలు అస్వస్థకు గురైన సంఘటన శుక్రవారం ముంబై నగరంలో చోటుచేసుకుంది. ముంబైలోని బైకుళ్లా కారాగారంలో మహిళా ఖైదీలు శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైయ్యారు. వారిని జైలు సిబ్బంది ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జైలు అధికారులు చెబుతున్నారు. అపరిశుభ్రమైన నీటి కారణంగానే వారు అనారోగ్యానికి గురై ఉంటారని భావిస్తున్నారు. జైలు ఉన్నతాధికారి రాజ్‌వర్థన్ సిన్హా మాట్లాడుతూ.. మూడురోజుల క్రితం ఓ మగఖైదీకి కలరా రాగా వెంటనే మందులు ఇచ్చామని తెలిపారు. కలరాను నివారించటానికి జైలులోని అందరికి ఆరోగ్యశాఖ వారు మందులు అందజేశారన్నారు. మహిళా ఖైదీలు అస్వస్థతకు గురైన వెంటనే జైలులోని మిగితా అందరికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. -
163 పాడిగేదెలకు పునర్జీవనం
సిరిసిల్ల : అదో మారుమూల పల్లె. జిల్లా సరిహద్దులోని అటవీ గ్రామం. వ్యవసాయ ఆధారమైన ఆ పల్లెకు పాడి పరిశ్రమ ఓ ఉపాధిమార్గం. వ్యవసాయ అనుబంధంగా పాలతో ఆ పల్లె ప్రజలు జీవనం సాగిస్తారు. అలాంటి ఊరిలో 178 బర్రెలు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి.. 15 బర్రెలు మరణించాయి. కళ్ల ముందే గేదెలు చనిపోతుండడంతో రైతుల గుండెలు అవిసిపోయాయి. కన్నీరు మున్నీరుగా విలపించారు. మహిళా రైతులు గుండెలు బాదుకుంటూ.. రోధిస్తున్నారు. ఆ గ్రామస్తులు సెల్ఫోన్లో బర్రెల ఫొటోలు కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్‌బాషా, పశువైద్యులకు పంపించారు. అంతే జిల్లా నలుమూలన ఉన్న పశువుల డాక్టర్లు మరిమడ్ల బాట పట్టారు. ఉన్న పళంగా అందుబాటులో ఉన్న మందులను, ప్రైవేటుగా అత్యవసరమైన మందులను కొనుగోలు చేసి మూడు అంబులెన్స్‌లు మరిమడ్ల చేరాయి. ఐదుగంటల పాటు శ్రమించారు. 163 బర్రెలను బతింకించారు. వంద మంది రైతులకు దీర్ఘకాలిక మేలు చేశారు. పాడికి ప్రాణం పోశారు. ఏం జరిగిందంటే.. మరిమడ్లలో గేదెలను ఒకరిద్దరు కాపరులు కాస్తుంటారు. బర్రెలన్నీ ఎప్పటిలాగే సమీప అడవుల్లోకి మేతకు వెళ్లాయి. పక్కనే లూటీ అయిన పొలాలున్నాయి. ఎర్రజొన్న పంటను కోశారు. పక్షంరోజుల కిందట కురిసిన అకాల వర్షాలకు జొన్న కొయ్యలు(మోడులు) చిగురించాయి. చిగురించిన లేత జొన్న ఆకులను బర్రెలు మేశాయి. ఎక్కువగా లేత ఆకులు తినడంతో నాము వచ్చింది. దీంతో బర్రెలన్నీ సొమ్మ సిల్లాయి. అందులో 13 మరణించాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో పశువైద్యులు చేరుకుని వైద్యం చేశారు. చికిత్స పొందుతుండగానే మరో రెండు బర్రెలు మరణించాయి. ఎనిమిది కొన ఊపిరితో ఉండగా.. సెలైన్లు ఎక్కించి బతికించారు. జేసీ పర్యవేక్షణలో వైద్య సేవలు.. జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా పర్యవేక్షణలో మరిమడ్లలో పశువైద్య శిబిరం సాగింది. యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది కదిలివెళ్లారు. ఐదురుగు డాక్టర్లు అంజిరెడ్డి, ప్రశాంత్, కార్తీక, సాయిమాధవి, చందన, 14 మంది పారామెడికల్ సిబ్బంది, 1962 అంబులెన్స్ సిబ్బంది, మరోవైపు కరీంనగర్ డెయిరీ డాక్టర్లు, సిబ్బంది, మందులతో అక్కడికి చేరుకున్నారు. వైద్యం అందుతున్న తీరుపై జేసీ యాస్మిన్‌బాషా సిరిసిల్ల నుంచి ఫోన్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. మొత్తంగా జిల్లా పశువైద్యుల సమష్టి కృషితో 163 బర్రెలకు ఊపిరి పోశారు. పశువైద్యుల సేవలను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు శుక్రవారం అభినందించారు. వైద్యులు సకాలంలో రాకుంటే మరిన్ని చనిపోయేవని గ్రామస్తులు ఎమ్మెల్యేకు చెప్పడం కొసమెరుపు. అందరూ టీం వర్క్ చేశారు మా డాక్టర్లు అందరూ మరిమడ్లలో టీం వర్క్ చేశారు. ఎవరికి వారు బర్రెలను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. లేత జొన్న ఎక్కువగా మేయడంతో గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. రైతులు ఇంకా ముందుగా గుర్తిస్తే నష్టం జరిగేది కాదు. మేమంతా బాధ్యతగా ఎవరికి వారు పని చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. – డాక్టర్ కె .కొమురయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ -
ధూంధాం కళాకారుడు మృతి
కొల్చారం(నర్సాపూర్) : కొల్చారం మండలం ఎనగండ్లకు చెందిన ధూంధాం కళాకారుడు పెద్ద రమేశ్(35) అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. రమేశ్ కొన్ని రోజులుగా మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందినట్లు లయా కళాబృందం సభ్యుడు శేఖర్‌గౌడ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డప్పు కళాకారుడిగా రమేశ్ పోషించిన పాత్ర మరవలేనిదని తోటి కళాకారులు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతిపై స్థానిక టీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
క్షీణించిన ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హెదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీల ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శనివారం మేకపాటి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తిరపతి ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన శనివారం సాయంత్రం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో పాటు డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. పలు పరీక్షలు జరిపిన రామ్‌మనోహర్‌లోహియా వైద్యులు పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, దీక్ష వెంటనే విరమించాలని వరప్రసాద్‌కు సూచించారు. రక్తంలో షుగర్ లెవల్స్ 72కు పడిపోయాయని, దీక్ష కొనసాగించడం ప్రమాదకరం అని డా. భల్లా వైద్య బృందం తెలిపింది. ఈ పరిస్థితులపై ఏపీ భవన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పందించారు. వైస్సార్ సీపీ ఎంపీలు దీక్ష విరమించాలని కోరారు. ఇప్పటికే మేకపాటి ఆరోగ్యం క్షీణించిందని తాజాగా వరప్రసాద్ సైతం అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించాలని, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే వైద్యుల విన్నపాన్ని వరప్రసాద్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన దీక్షాస్థలికి చేరుకున్నారు. బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. -
వీడియోగేమ్స్ అలవాటు జబ్బే
రకరకాల వీడియోగేమ్స్ ఆడుతూ కంప్యూటర్లకు, స్మార్ట్ఫోన్లకు గంటల తరబడి అతుక్కుపోయి గడపడం కూడా జబ్బేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ప్రకటించింది. వీడియోగేమ్స్‌కు అలవాటు పడటాన్ని జబ్బుగా పరిగణించాలా, లేదా అనేది నిర్ధారించుకునేందుకు ఏకంగా పదేళ్ల పాటు విస్తృతంగా అధ్యయనం సాగించింది. ఫలితంగా డబ్ల్యూహెచ్ఓ వచ్చే ఏడాది విడుదల చేయనున్న వ్యాధుల జాబితాలో ‘వీడియోగేమింగ్ అడిక్షన్’ కూడా చేరనుంది. డబ్ల్యూహెచ్ఓకు చెందిన మానసిక ఆరోగ్య, మాదక ద్రవ్యాల దుర్వినియోగ విభాగం పదేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం జరిపిన తర్వాత వీడియో గేమింగ్ అడిక్షన్‌ను కూడా ఒక మానసిక వ్యాధిగానే పరిగణించాలని నిర్ణయం తీసుకుందని డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త వ్లాదిమిర్ పోజ్న్యాక్ తెలిపినట్లు ‘న్యూ సైంటిస్ట్’ పత్రిక వెల్లడించింది. మానసిక వైద్యనిపుణులు వీడియోగేమింగ్ అలవాటుపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చినట్లు తెలిపింది. -
మోదీ అధ్యక్షతన భేటీ.. కేంద్రమంత్రికి అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కృష్ణరాజ్ అనూహ్యంగా అస్వస్థతకు గురయ్యారు. బీజేపీ పార్లమెంటరీ భేటీ జరుగుతుండగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రికి తరలించారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని గ్రంథాలయ భవనంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి కృష్ణరాజ్ కూడా హాజరయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై చర్చిస్తున్నారు. అదే సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. గత మూడు రోజులుగా జ్వరం రావడంతోపాటు ఆమెకు షుగర్ వ్యాధి కూడా ఉన్నందున ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యులు చెప్పారు. -
పిల్లలు చనిపోతుంటే ఏం చేస్తున్నారు?
నల్లగొండ: శిశుగృహలో పిల్లలు అనారోగ్యంతో చనిపోతుంటే ఏం చేస్తున్నారు? మీరంతా బాధ్యత గా వ్యవహరిస్తే ఇంతమంది చనిపోయేవారా? అసలు ఇన్నేళ్ల సర్వీసులో ఒక్కసారైనా రికార్డులను పరిశీలించారా? అని నల్లగొండ జిల్లా శిశు సంక్షేమ కమిటీ పనితీరుపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ వారం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘చిన్నా రుల మృత్యుఘోష’ కథనంపై స్పందించిన ఆమె గురువారం శిశుగృహలో విచారణ చేపట్టారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మంది పిల్లలు బలహీనంగా ఉన్నారు? ఎంతమంది బరువు తక్కువగా ఉన్నారు? అనే వివరాలు రికార్డుల్లో ఎందుకు నమోదు చేయలేదని సీడబ్ల్యూసీ, శిశుగృహ సిబ్బందిని ప్రశ్నించారు. పిల్లల అనారోగ్య పరిస్థితి విషమించి చివరి నిమిషంలో నిలోఫర్‌కు తీసుకెళుతున్నారని, దాంతో సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని జేడీ తెలిపారు. శిశుగృహకు పిల్లలు వచ్చిన తర్వాత సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఆరు మాసాల్లో 11 మంది మృతి విచారణ అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసిన జేడీ.. చిన్నారుల మృతికి గల కారణాలపై చర్చించారు. ఆరు మాసాల్లో 11 మంది ఆడశిశువులు మృతి చెందారని కలెక్టర్ చెప్పారు. చిన్నారుల మృతికి బాధ్యులు ఎవరైనా సరే కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటారని జేడీ తెలిపారు. -
మరో ఆరుగురికి అస్వస్థత
మొత్తం 42 మంది బాలికలు ఆస్పత్రిపాలు కస్తూరిబా విద్యాలయలో అధికారుల విచారణ వై.రామవరం (రంపచోడవరం) : తోటకూరపాలెంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో బాలికల అస్వస్థత ఘటన.. మిగిలిన విద్యార్థినులను హడలెత్తిస్తే.. అధికారులను పరుగులు పెట్టించింది. ఈ విద్యాలయంలో గురువారం మరో ఆరుగురికి విరేచనాలు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం తిన్న ఆహారం వికటించి 36 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతలకు గురైన విషయం విదితమే. దీంతో అస్వస్థతకు గురైన వారి సంఖ్య 42కు పెరిగింది. ఈ సంఘటనపై సర్వశిక్షా అభియాన్ జిల్లా పీఓ శేషగిరిరావు గురువారం విచారణ చేశారు. స్టోర్ రూమ్‌లోని ఆహార పధార్థాలను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వై.పాండురంగరావు తనిఖీ చేశారు. అందరిలోనూ ఆందోళన.. విద్యాలయ ప్రత్యేకాధికారి (ప్రిన్సిపాల్) విజయకుమారి నిర్వాకమే ఈ సంఘటనకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడి మానేసిన బడిఈడు (డ్రాపౌట్స్) పిల్లల కోసం కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ చదువు కొనసాగిస్తున్న వారందరూ అసలే డ్రాపౌట్స్ కావడంతో ఈ సంఘటన వారిని బెంబేలెత్తిస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విద్యాలయంలో ప్రస్తుతం మొత్తం 130 మంది బాలికలు ఉన్నారు. పెత్తనం చెలాయిస్తున్న భర్త! ఈ విద్యాలయంలో ప్రత్యేకాధికారి విజయకుమారి భర్త పెత్తనం చలాయిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మహిళా ఉపాధ్యాయులే ఉన్న ఆ బాలికల విద్యాలయంలోకి పురుషులకు ప్రవేశం ఉండదు. అయితే అ నిబంధనలను తుంగలోకి తొక్కి, ఆయన విద్యాలయంలో యథేచ్ఛగా తిరుగుతుంటారని విద్యార్థినులు చెబుతున్నారు. ఒక మహిళా ఉపాధ్యాయిని నిర్వర్తించాల్సిన వార్డెన్ విధులను ఎస్ఓ భర్తే చేపట్టారన్న విమర్శలున్నాయి. సకాలంలో స్పందించారు... విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం తెలియగానే ఐటీడీఏ పీఓ దినేష్ కుమార్ వెంటనే వై.రామవరం చేరుకున్నారు. చవిటిదిబ్బలు పీహెచ్సీ వైద్యాధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది సకాలంలో వైద్యం చేయడంతో విద్యార్థినులు ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారని గ్రామస్తులు అంటున్నారు. సర్వశిక్షా అభియాన్ జిల్లా పీఓ శేషగిరిరావు, ఏజెన్సీ డీఈఓ హెచ్వీ ప్రసాద్, ఎంపీడీఓ కె.బాపన్నదొర, ఎంఈఓ కె.ప్రసాదబాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గొర్లె శ్రీకాంత్ తదితరులు బుధవారం రాత్రి నుంచి ఆస్పత్రిలో మకాం వేసి తగిన సేవలు అందించారు. -
12 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఖమ్మం: కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఎన్కూరులో గురువారం వెలుగుచూసింది. స్థానిక కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు రాత్రి భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొత్త బియ్యంతో వంట చేయడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు అంటున్నారు. -
నూడుల్స్ తిని వాంతులు, విరోచనాలు?
కల్లూరు (రూరల్): రిలయన్స్ మార్కెట్లో కొనుగోలు చేసిన నూడుల్స్ తిని తన కుమారుడు అఫ్రోజ్ హుస్సేన్ (9) వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిపాలయ్యాడని తండ్రి పి.మహబూబ్‌బాష ఆరోపించారు. ఈ విషయాన్ని డాక్టర్ కూడా నిర్థారించారని చెప్పారు. అయితే రిలయన్స్ మార్కెట్ నిర్వాహకులు మాత్రం.. నూడుల్స్ తినడంతో వాంతులు, విరోచనాలు కాలేదని చెబుతున్నారు. బుధవారం బాధితుడు.. రిలయన్స్ మార్కెట్ ఎదుట నూడుల్స్‌ను పెట్టుకుని పట్టుకుని నిరసన తెలిపారు. నాల్గో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని.. ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని చెప్పి పంపించారు. -
వెంటిలేటర్‌పై దాసరి నారాయణరావు..!
-
ఆస్పత్రిపాలైన ప్రఖ్యాత తెలుగు దర్శకుడు
హైదరాబాద్: ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా ప్రస్తుతం ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా దాసరి నారాయణరావు ఆస్పత్రిలో చేరారని, ఆయనకు తగిన చికిత్స అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయనకు డయాలసిస్ చేశామని, వెంటిలేటర్ మీద ఉంచి కృత్రిమ శ్వాస అందిస్తున్నామని, దీనికి ఆయన స్పందిస్తున్నారని కిమ్స్ ఎండీ, సీఈవో బొల్లినేని భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్ఫెక్షన్ను కంట్రోల్ చేయడానికి ఆయనకు ఛాతి ఆపరేషన్ చేయబోతున్నామని, ఆపరేషన్ తర్వాత దాసరి ఆరోగ్య పరిస్థితిపై మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు. దాసరి చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు కూడా చెపుతున్నారు. అనేక సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా లిమ్కా బుక్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించారు. రాజకీయాలలోను దాసరి నారాయణరావు చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపుల రిజర్వేషన్ ఉద్యమానికి దాసరి మద్దతు పలికారు. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీనంబర్ 150' వేడుకకు కూడా దాసరి హాజరైన సంగతి తెలిసిందే. ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన మోహన్‌బాబు, జయసుధ దంపతులు దాసరిని పరామర్శించేందుకు నటుడు మోహన్‌బాబు, జయసుధ దంపతులు కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. దాసరి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో ఆపరేషన్ చేయనున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు. -
జన్మభూమి సభలోనే అస్వస్థత
- పింఛన్‌కోసం వచ్చి సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధుడు - గూడూరు వార్డు సభలో ఘటన గూడూరు: మండల కేంద్రంలోని వార్డు సభకు మంగళవారం పింఛన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు పంపిణీ ఆలస్యం కావడంతో తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానిక ఏబీఎం పాఠశాల ఆవరణలోæ చైర్పర్సన్ ఇందిరాసుభాషిణి అ«ధ్యక్షతన 3వ వార్డు సభను మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ లక్ష్మికాంతరావు, కార్యాలయ మేనేజర్ వెంకటేశ్వర్లు, టీపీఎస్ నరసింహమూర్తి తదితరులు హాజరయ్యారు. సభను ఆలస్యంగా ప్రారంభించడంతో పాటు అధికారుల ప్రసంగాలు ముగిసే వరకు పింఛన్ పంపిణీ మొదలు పెట్టలేదు. పింఛన్ కోసం ఉదయం నుంచి సభలో వేచి ఉన్న కాంట్రాక్టర్ నారాయణ అనే వృద్ధుడు నీరసించి అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. -
ఫుడ్ పాయిజన్.. 300 మందికి అస్వస్థత
-
ఫుడ్ పాయిజన్.. 300 మందికి అస్వస్థత
కె.కోటపాడు(విశాఖపట్నం): కలుషిత ఆహారం తిని 300 మంది అస్వస్థతకు గురైన సంఘటన విశాఖపట్నం జిల్లా కె. కోటపాడు మండలం మర్రివలసలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామంలోని ఓ పెళ్లిలో ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన 300 మంది అస్వస్థతకు గురయ్యారు. మాంసాహరం విషతుల్యమై వాంతులు, విరోచనాలతో డీలా పడ్డారు. దీంతో వారిని కోటపాడు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తలరించారు. -
పరకాలలో 100 మందికి అస్వస్థత
వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లా పరకాలలలో ఒక్కసారిగా వంద మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక సీఎస్ఐ కాలనీ వాసులు శుక్రవారం ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. దీంతో వారిని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. కలుషిత తాగునీటి వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. -
'అమ్మ ఆరోగ్యంపై ఆందోళన వద్దు'
-
'అమ్మ ఆరోగ్యంపై ఆందోళన వద్దు'
సాక్షి, చెన్నై: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, ఇక ఎలాంటి ఆందోళన వద్దని, త్వరలోనే ఆమె ఇంటికి చేరుకుంటారని ఏఐడీఎంకే నాయకురాలు, సినీ నటి సీఆర్ సరత్వతి మీడియాకు చెప్పారు. తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతోన్న జయలలితను గురువారం(సెప్టెంబర్ 22న) చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. (సింగపూర్‌కు జయలలిత తరలింపు?) ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, సలహాదారు షీలాబాలకృష్ణన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ తదితరులున్నారు ఆదివారం ఆసుపత్రికి వచ్చి ముఖ్యమంత్రిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కూడా తమ అమ్మ కోసం అన్నాడీఎంకే వర్గాలు పూజల్లో నిమగ్నమయ్యాయి. (ఆస్పత్రిలో అమ్మ) -
అనారోగ్యంతో ఏఎస్ఐ మృతి
కర్నూలు: కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహానంది పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ యూసుఫ్ (52) బుధవారపేటలోని ఓమ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఈయన చిప్పగిరితోపాటు నంద్యాల స్పెషల్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో పని చేశారు. ఈయనకు భార్య ముస్తరిబేగం, కుమారుడు, కూతురున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆకె రవికృష్ణ హాస్పిటల్‌కు వెళ్లి భౌతికాయం శ్రద్ధాంజలి ఘటించారు. దహన సంస్కారాల నిమిత్తం పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.15వేల నగదును భార్య ముస్తరిభేగంకు అందజేశారు. త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, సహాయ కార్యదర్శి దామోదర్‌రెడ్డి తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. -
ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి
సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలి కలెక్టర్ జగన్మోహన్ ఉట్నూర్ : ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. శుక్రవారం కేబీ ప్రాంగణంలోని పీఎమ్మార్సీ భవనంలో ఐటీడీఏ పీవో కర్ణన్‌తో కలిసి రాష్ట్రీయ స్వస్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అన్నారు. స్థానికంగా నివాసం ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. గ్రామాల్లోని 18 ఏళ్లలోపు బాలబాలికలు అనారోగ్యం పాలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జ్వరాలతో బాధపడే విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైద్యులు గ్రామాలకు వెళ్లేందుకు వీలుగా జిల్లాలోని 17 క్లస్టర్లకు ప్రతీ క్లస్టర్ రెండు చొప్పున 34 వాహనాలు కేటాయించామని చెప్పారు. వైద్య బృందాలు ప్రతి రోజు కనీసం పది అంగన్వాడీ కేంద్రాలు, ఉన్నత పాఠశాలలు, ఆశ్రమాలు సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మూడు నెలలపాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో మలేరియాధికారి అల్హం రవి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆర్బీఎస్కే జిల్లా కో ఆర్డినేటర్ సుంకన్న, డీడీటీడబ్ల్యూ రాంమూర్తి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన కలెక్టర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ జగన్మోహన్ మండలంలోని ఎక్స్ రోడ్డు చీమ్నానాయక్ తండాలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. మొక్కలు నాటిన ప్రతి ఒక్కరూ వాటిని రక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
విద్యార్థిని మృతి
సిద్దిపేట రూరల్: అనారోగ్యంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. రాఘవాపూర్ గ్రామానికి చెందిన రేణిగుంట పద్మ, సత్తయ్యల రెండో కుమార్తె మానస (17) సిద్దిపేట పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజు మాదిరిగానే సోమవారం కళాశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మానసకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కుటుంబీకులు తగ్గుతాయని అనుకుని ఇంటి వద్దే ఉంచారు. మంగళవారం ఉదయం మరింత ఎక్కువ కావడంతో వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాత్రి మృతి చెందింది. మానస తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
బీజేపీ నాయకుడు నాగేశ్వరరావు మృతి
చిలువూరు (దుగ్గిరాల) : చిలువూరుకు చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోటా నాగేశ్వరరావు (70) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని మంగళవారం పలువురు బీజేపీ నాయకులు సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు గారపాటి పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొంగర జోగేంద్రప్రసాద్, కొండపనేని రవీంద్రరావు తదితరులు ఉన్నారు. -
ఐసీయూలో అమ్మానాన్నలకు.. వెంటనే కూతురికి పెళ్లి
చికాగో : అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన జుబల్ కిర్బీ (49) నయంకాని జబ్బుతో మూడు వారాలుగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నాడు. అతని ఆరోగ్యం దాదాపుగా మెరుగుపడే అవకాశాలు లేవని వైద్యులు ధృవీకరించారు. ఇంతటి విషాదకర సమయంలోనూ అతడి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. నీళ్లు నిండిన కళ్లతోనే తన జీవితంలో అతి ముఖ్యమైన రెండు సంతోషకర ఘట్టాలను తన గుండెల్లో పదిలపర్చుకున్నాడు. సుదీర్ఘం కాలంగా సహజీనం చేస్తున్న కొలీన్ ను జుబల్ పెళ్లాడటం ఒకటయితే, మరొకటి అతని గారాల కూతురు కైలా వివాహ వేడుక. వేడుకలు వివరాల్లోకి వెడితే జుబల్ తీవ్రమైన శ్వాసకోశ (పల్మనరీ ఫైబ్రోసిస్) వ్యాధితో బాధపడుతున్నాడు. రోజురోజుకి మృత్యువుకు చేరువవుతున్నాడు. ఈ సమయంలో గత సోమవారం కొల్లీన్ కిర్బీని చట్టబద్ధంగా తన భార్యను చేసుకున్నాడు. 26 సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కోసం ఎదురు చూసే టైం లేదు. అందుకే ఇదే సరైన సమయమని భావించారు. అంతే కూతుళ్లు కూడా లేకుండానే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నే వేదికగా ఎంచుకున్నారు. కూతురు కైలా (20) కు వచ్చే సంవత్సరం జూలై 16న పెళ్లి చేయాలని ముహూర్తం నిర్ణయించారు. కానీ జుబల్ పరిస్థితి క్షీణిస్తూ వుండడంతో కైలా తన నిర్ణయం మార్చుకుంది. అత్యవసరంగా పెళ్లి చేసుకోవాలనుకుంది. తండ్రి సమక్షంలోనే జుబల్ చికిత్స పొందుతున్న ఇంటెన్సివ్ కేర్ రూమ్‌లోనే తమ పెళ్లి జరగాలని కోరుకుంది. హాస్పిటల్ లోని డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టులే అతిధులు కాగా జుబల్ ఆనందబాష్పాల్ని చూస్తూ కైలా కిర్బీ, డానియల్ పార్దూ ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకను చూస్తున్న జుబల్ ఆక్సిజన్ మాస్క్ తీసేసి కన్నకూతురును ఆప్యాయంగా ముద్దాడాడు. దీంతో అక్కడంతా గంభీర వాతావరణం నెలకొంది. దాదాపు 50 మంది హాజరైన ఆ వేడుకకు ఆసుపత్రి సిబ్బంది కేక్ లు, పూలతో సహా అన్ని ఏర్పాటు చేశారు. నాకు సంతోషంగా ఉంది.. కానీ...నాన్న నా పక్కన నిలబడాలనుకున్నా.. ఎందుకంటే తనే నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ కన్నీళ్లు తుడుచుకుంది నవవధువు కైలా. తను కోరుకున్నట్టుగా, అనుకున్నట్టుగానే అన్నీ ఇవ్వలేకపోయినా...కనీసం తండ్రి కళ్లముందు పెళ్లి జరగాలన్న కైలా కోరికను తీర్చగలిగానంటూ ఆమె బంధువు చెప్పారు. -
ఓపిక లేకున్నా ఉద్యోగానికి ఎందుకెళ్తారో తెలుసా?
లండన్: ఆరోగ్యం బాగోలేకపోయినా, ఒంట్లో సత్తువ లేకున్నా కొన్ని భయాల కారణంగానే నేటి తరం ఉద్యోగాలకు వెళ్తున్నారని ఓ అధ్యయనం తెలిపింది. అందులో ప్రధాన కారణాలుగా ఉద్యోగాలకు భారీ స్థాయిలో డిమాండ్ ఉండటం, ఒత్తిడి, అభద్రతా భావం, వ్యక్తిగతంగా ఆర్థిక సమస్యలు వారిని విధుల నిర్వహణకు గైర్హాజరు కాకుండా చేస్తాయట. అసలు కొంతమంది వ్యక్తులు చిన్న జబ్బులు చేసినా, రోగంతో బాధపడుతున్నా అవన్నీ పట్టించుకోకుండా ఎందుకు ఉద్యోగానికి వెళుతుంటారో అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా అనే విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మారియెల్లా మిరాగిలియా ప్రత్యేక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా పై మూడు కారణాలు గుర్తించిన ఆయన ఫలితాలు కూడా వివరించారు. 'ఆరోగ్యం బాగాలేనప్పుడు పనిచేస్తుండటం వల్ల ఏ పని చేస్తున్నామో దానిపై ప్రతికూల దృక్పథం ఏర్పడే ప్రమాదం ఉంది.పనిమధ్యలో విరమించుకునే అవకాశం కూడా ఉంది. ఇవి తెలిసినా కూడా చాలా మంది ఉద్యోగులు అలాగే తమ విధులకు హాజరవుతుంటారు. అయితే, ఇలా చేయడం కొందరికి స్ఫూర్తి దాయకంగా కనిపిస్తుంటుంది. మరింత ముందుకు వెళ్లేలా పనిచేయాలని అవతలివారికి అనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా విధులు తప్పక నిర్వర్తించాలనే బాధ్యతను గుర్తు చేస్తుంటుంది' అని ఆయన తెలిపారు. ఈ అధ్యయనం కోసం ఆయన మొత్తం 61 అధ్యయనాలు పూర్తి చేశారు. ఈ అధ్యయనాల్లో మొత్తం 1,75,960మంది పాల్గొన్నట్లు తెలిసింది. -
కల్తీ కల్లు తాగి ముగ్గురి పరిస్థితి విషమం
చింతపల్లి(నల్లగొండ): కల్తీ కల్లు తాగి ముగ్గురు యువకులు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమించడంతో.. మెరుగైన చికిత్స మేరకు హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కెళ్లపల్లి పంచాయతి పరిధిలోని రోటిగడ్డతాండలో ఆదివారం జరిగింది. వివరాలు.. తాండకు చెందిన రాములు(30), షావుకారి(28), హరిప్రసాద్(27)అనే ముగ్గురు స్నేహితులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమించడంతో.. 108 సాయంతో హైదరాబాద్‌కు తరలించారు. -
కలుషిత నీటితో 10 మందికి అస్వస్థత
వరంగల్ : కలుషిత నీరు తాగి పదిమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా చేర్యాల మండలం యాదవ్ నగర్లో గురువారం జరిగింది. కాలనీకి సరఫరా అవుతున్న మంచినీరు కలుషితం కావడంతో కాలనీ వాసులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా దీనిపై కాలనీ వాసులు మాట్లాడుతూ.. గతంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. -
30 మంది బాలికలు ఆస్పత్రిపాలు
జైపూర్: కలుషిత ఆహారం తిని 30 మంది బాలికలు అస్వస్థతకు గురైన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. నాగౌర్ జిల్లాలోని లాంగోర్ అనే గ్రామంలో ఓ ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఉంది. గత రాత్రి భోజనం చేసిన ఆ బాలికలు.. అనంతరం తమకు వికారంగా ఉందని, వాంతులవుతున్నాయని, కడుపులో నొప్పిగా ఉందని వసతి గృహం అధికారులకు చెప్పారు. దీంతో వారిని అందుబాటులో ఉన్న వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రి పాలైన బాలికలంతా కూడా 11 నుంచి 13 సంవత్సరాల లోపువారే. వీరంతా ఈ పాఠశాల సమీపంలోని పలు గ్రామాలకు చెందిన నిరుపేదలు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆహార పదార్థాల తనిఖీల అధికారులు స్టాక్‌ను పరీక్షించారు. కలుషితమైన ఆహారం కారణంగానే బాలికలకు సమస్య ఎదురైందని స్పష్టం చేశారు. -
కలుషిత ఆహారం తిని 350 మందికి అస్వస్థత
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న350 మంది పైగా విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు లోనయైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బెంగళూరులో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం ఆహారం తీసుకున్న అనంతరం తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. దీంతో అసలు విషయాన్ని గ్రహించిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ విద్యార్థులు ఆహారం తీసుకున్న అనంతరం తలనొప్పి, కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందిపడటంతో డాక్టర్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలామంది వైద్యం తీసుకున్న తరువాత ఇంటికి చేరుకున్నారు. కాగా చాలామంది విద్యార్థులకు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
సంపూర్ణ ఆరోగ్యానికి 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్
జబ్బు చేసినప్పుడు చికిత్స ఇవ్వడం వైద్యం... జబ్బు రాకుండా నివారించే పద్ధతిలో చికిత్స అందించి, పదేళ్ల వయసు తగ్గిస్తే.. అదే ఏజ్ మేనేజ్మెంట్ మెడిసిన్. అరవైలో కూడా యవ్వనపు ఆరోగ్యాన్ని తీసుకొచ్చే ఈ వైద్య విభాగం మొదటిసారిగా మన దేశంలో అయిదేళ్ల క్రితం రేవా హెల్త్ సెంటర్లో అందుబాటులోకి వచ్చింది. దీనిలో భాగమే 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్. ఒక జబ్బు, ఒక భాగం అని కాకుండా శరీరం మొత్తాన్ని పరిశీలించి, ఆరోగ్యాన్ని సమీక్షించి చికిత్స అందించడమే ఈ 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్ ఉద్దేశం. గతి తప్పే ఆరోగ్యం, జీవనశైలి వ్యాధులకు ఉత్తమ పరిష్కారం 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగామ్ చిన్నవయస్సులో బాధ్యతలు తక్కువ కాబట్టి ఒత్తిడి తక్కువ. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి బాధ్యతలు, ఉద్యోగపరమైన ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆహారం తీసుకోవడం క్రమం తప్పుతుంది. మహిళల్లో కూడా పని ఒత్తిడి పెరగడంతోపాటు, ఉపవాసాలు, ప్రెగ్నెన్సీ, హార్మోన్ల మార్పులు... ఇవన్నీ శరీర ఫిజియాలజీలో మార్పులకు కారణం అవుతాయి. వీటన్నింటికి తోడు కాలుష్యం. సహజసిద్ధమైన ఆహారం లేకపోవడం ఆరోగ్యం గతి తప్పడానికి దోహదం చేస్తుంది. ఈ అంశాలన్నింటినీ సమతుల్యం చేసి, అనుకూల స్థితికి రావడమే 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్ ఉద్దేశం. ఈ చికిత్స తరువాత శరీర పనితీరు యవ్వనదశలో లాగ మెరుగుపడుతుంది. ఈ చికిత్సలో భాగంగా వ్యక్తి శరీరతత్వాన్ని, సమస్యల్ని అన్నింటికి సంబంధించిన హిస్టరీ తీసుకుంటారు. అవసరమైన అన్ని పరీక్షలూ చేస్తారు. అప్పుడు తదనుగుణమైన చికిత్స మొదలవుతుంది. డైట్ ద్వారా కొంత, న్యూట్రసుటికల్స్ (న్యూట్రిషన్ సప్లిమెంట్స్) ద్వారా మరికొంత, అవసరాన్ని బట్టి మందులు వాడుతూ ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. ఆరువారాలకు, నాలుగు, ఎనిమిది నెలలకు ఆరోగ్యాన్ని తిరిగి సమీక్షిస్తారు. జెనెటిక్మ్యాపింగ్ ద్వారా జబ్బు రాగల అవకాశాన్ని కూడా ఇప్పుడు ముందే తెలుసుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. వివరాలకు 800 800 1225 800 800 1235 040 4454 4330 మెయిల్: ksrgopal@revami.com వెబ్సైట్: www.revami.in/ అడ్రస్: రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్ జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా రోడ్ నెం.4, బంజారాహిల్స్, హైదరాబాద్ -
స్కూల్లో ఆహారం తిని 53 చిన్నారులకు అస్వస్థత
సెహొర్: స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాఠశాలలో భోజనం చేసిన 53 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని సెహొర్ జిల్లా బలాపూర్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు పిల్లలు స్కూలుకు వెళ్లారు. వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పిల్లలు భోంచేసిన కాసేపటికే అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమత్తం ఇచ్చావర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. భోజనం సరఫరా చేసిన ఎన్జీవో లైసెన్స్‌ను రద్దు చేశారు. -
ప్రసాదం తిని 60 మందికి అస్వస్థత
పాట్నా: బీహార్‌లో ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో దేవుడి ప్రసాదం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ చికిత్స నిమిత్తం ముజఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ప్రసాదం తినడం వల్ల వాంతులు అయ్యాయని పోలీసులు చెప్పారు. వీరికి వెంటనే ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ముజఫర్‌పూర్ తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా మెరుగవుతున్నట్టు వైద్యులు చెప్పారు. -
ఆరో రోజుకు చేరిన అమరనాథ రెడ్డి దీక్ష