ప్రమాదాలు అనుకోకుండా వస్తాయి. అయినా ఎవ్వరూ ఊహించం కదా అనారోగ్యానికి గురవ్వుతామని. సరిగ్గా అలాంటి సమయంలో మన పక్కను ఉన్నవాళ్లు కాస్త తెలివిగా వ్యవహరిస్తే కొన్ని ప్రమాదాల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. అందుకు ఉదాహరణ ఆ బామ్మ. 2006లో జరిగిన ఓ ప్రమాద ఘటనలో ఆమె చేసిన సాహసం ఆమెను అందరిచే ప్రశంసలు అందుకునేలా చేసింది.
వివరాల్లోకెళ్లే.. న్యూయార్క్లో వెస్ట్‌చెస్టర్ కౌంటీ నుంచి పైపర్ మెరిడియన్ మినీ విమానం వైన్యార్డ్‌కు బయలుదేరింది. ద్రాక్ష తోట సమీపంలోని రన్‌వేపై విమానం ల్యాండింగ్‌లో ఉండగా పైలట్(79) అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానంలోని 65 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు సత్వరమే స్పందించి..ఆ విమానాన్ని అదుపు చేసే యత్నం చేసింది. ఐతే ఆమె సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేసే క్రమంలో విమానం ఓ వైపుకి రన్‌వే సమీపంలో కుప్పకూలింది.
దీంతో విమానం ఎడమ రెక్క సగానికి విరిగిపోయింది. ఎమర్జెన్సీ రెస్క్యూ టీం వెంటనే అక్కడకు చేరుకుని పైలట్ తోపాటు, మహిళా ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించింది. ఐతే పైలట్ ఆరోగ్యం విషమంగా ఉనట్లు అధికారులు పేర్కొన్నారు. ఐతే సదరు మహిళ ప్రయాణికురాలు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. కానీ ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ మహిళ ఏ మాత్రం గాబరాపడినా సమస్యల్లో చిక్కుపోయింది. ఆ సమయంలో సమయస్ఫూర్తిగి వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
(చదవండి: ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే)
Comments
Please login to add a commentAdd a comment