female passenger
-
గాల్లో ఉండగా పైలట్‌కు అస్వస్థత..ఆ టైంలో 65 ఏళ్ల మహిళ..
ప్రమాదాలు అనుకోకుండా వస్తాయి. అయినా ఎవ్వరూ ఊహించం కదా అనారోగ్యానికి గురవ్వుతామని. సరిగ్గా అలాంటి సమయంలో మన పక్కను ఉన్నవాళ్లు కాస్త తెలివిగా వ్యవహరిస్తే కొన్ని ప్రమాదాల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. అందుకు ఉదాహరణ ఆ బామ్మ. 2006లో జరిగిన ఓ ప్రమాద ఘటనలో ఆమె చేసిన సాహసం ఆమెను అందరిచే ప్రశంసలు అందుకునేలా చేసింది. వివరాల్లోకెళ్లే.. న్యూయార్క్‌లో వెస్ట్చెస్టర్ కౌంటీ నుంచి పైపర్ మెరిడియన్ మినీ విమానం వైన్యార్డ్కు బయలుదేరింది. ద్రాక్ష తోట సమీపంలోని రన్‌వేపై విమానం ల్యాండింగ్‌లో ఉండగా పైలట్(79) అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానంలోని 65 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు సత్వరమే స్పందించి..ఆ విమానాన్ని అదుపు చేసే యత్నం చేసింది. ఐతే ఆమె సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేసే క్రమంలో విమానం ఓ వైపుకి రన్‌వే సమీపంలో కుప్పకూలింది. దీంతో విమానం ఎడమ రెక్క సగానికి విరిగిపోయింది. ఎమర్జెన్సీ రెస్క్యూ టీం వెంటనే అక్కడకు చేరుకుని పైలట్ తోపాటు, మహిళా ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించింది. ఐతే పైలట్ ఆరోగ్యం విషమంగా ఉనట్లు అధికారులు పేర్కొన్నారు. ఐతే సదరు మహిళ ప్రయాణికురాలు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. కానీ ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ మహిళ ఏ మాత్రం గాబరాపడినా సమస్యల్లో చిక్కుపోయింది. ఆ సమయంలో సమయస్ఫూర్తిగి వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. (చదవండి: ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే) -
కేంద్ర మంత్రికి ట్వీట్.. మహిళా ప్యాసింజర్ సేఫ్
భువనేశ్వర్: సోషల్ మీడియాను మనం వాడుకునే తీరును బట్టి అది మనకు అనుకూల, ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఓ మహిళా ప్రయాణికులరాలికి మాత్రం సోషల్ మీడియా పోస్ట్ ఎంతో మేలు చేసింది. ఎలా అంటారా.. న్యూఢిల్లీకి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ప్రయాణిస్తోంది. ఆ రైల్లోనే ఆమె ఉన్న కంపార్ట్మెంట్లో యాభైఏళ్ల ప్రయాణికుడు బని ప్రసాద్ మహంతి ప్రయాణిస్తున్నాడు. ఆ మహిళతో బని ప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకుండా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయంపై ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ పోస్ట్ చూసిన ఓ బాధిత మహిళ స్నేహితురాలు విషయాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లింది. తన స్నేహితురాలికి సాయం చేయాలని రైల్వే మంత్రికి ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన సురేశ్ ప్రభు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. నిందితుడు బని ప్రసాద్‌ను టీటీఈలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది టాటానగర్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని రైలు నుంచి దించేశారు. టాటానగర్ రైల్వే పోలీసులకు నిందితుడిని అప్పగించారు. వారు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు బని ప్రసాద్ ఒడిషాలోని ఖుర్దాకు చెందినవాడని రైల్వే పోలీసులు వివరించారు. -
దాడి చేశాడని.. దడ పుట్టించింది!
లండన్: ఏ కారణం లేకుండానే ఓ నల్లజాతీయుడిపై జాత్యహంకార దాడి జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళా ప్యాసింజర్ తనకెందుకు అనుకోకుండా నిందితుడిని స్టేషన్లో పరుగులు పెట్టించి శభాష్ అనిపించుకుంది. లండన్ లోని ఆప్టాన్ పార్క్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియోలోని సమాచారం ప్రకారం.. ఆసియాకు చెందిన ఓ వ్యక్తి మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నాడు. రైలు ఆప్టాన్ పార్క్ స్టేషన్లో కాసేపు ఆగింది. బ్రిటన్ వాసిగా భావిస్తున్న ఓ వ్యక్తి.. ఎలాంటి కారణం లేకుండానే నల్లజాతియుడి(ఆసియా వాసి) ముఖంపై పంచ్ విసిరాడు. నేటికీ జాత్యహంకారం దాడులు జరుగుతూనే ఉన్నాయని తాజా ఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు. బాధితుడి పక్కనే ఉన్న ఓ మహిళా తొలుత ఆ దాడిని అడ్డుకునే యత్నం చేసేలోపే శ్వేతజాతీయుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ చర్యలకు బెదిరిపోయిన నిందితుడు కాళ్లకు బుద్ధిచెప్పాడు. నిందితుడు బాధితుడి ముఖంపై పంచ్ విసరగానే ఆ నల్లజాతీయుడి తల వెనకాల ఉన్న గ్లాస్ విండోకు తాకింది. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడి చేసిన వ్యక్తిని ఓ మహిళ వెంబడించడంతో తప్పించుకునేందుకు వెంటనే మెట్రో రైలు దిగి ప్లాట్ ఫాం మీద పరుగులుపెట్టాడు. ఆ మహిళ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దాదాపుగా దాడికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకునేంత పని చేసింది. అయితే చివరికి ఏం జరిగిందన్నది ఆ వీడియోలో లేదు. అదే కంపార్ట్ మెంట్లో ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. వైరల్ వీడియో చూసిన వారు ఆ మహిళకు అభినందనలు వెల్లువెత్తుతుండగా, మరో వైపు భాదితుడి పట్ల సానూభూతి వ్యక్తమవుతోంది. బ్రిటన్ రవాణాశాఖ పోలీసులు(బీటీపీ) చర్యలు తీసుకోవాలని ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ జనరల్ సెక్రటరీ మిక్దాద్ వెర్సీ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు వెర్సీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. -
ఆమె పంచ్‌కి..విమానం ఆగింది
మాంచెస్టర్: విమానంలో ఓ యువతి అనుచిత ప్రవర్తన విమాన ఆలస్యానికి కారణమైంది. ఈ సంఘటన మాంచెస్టర్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. సైప్రస్‌లోని పపోస్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఈజీ జెట్ఫ్లైట్లో ప్రవర్తనలో తేడా ఉన్న ఓ యువతిని విమాన సిబ్బంది బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆగ్రహం చెందిన ఆ యువతి సిబ్బంది సమక్షంలోనే పైలెట్ పై దాడికి దిగింది. ఆగ్రహంతో ఊగిపోతూ పైలట్ మోహంపై పంచ్‌ల వర్షం కురిపించింది. దీంతో వివాదం చెలరేగింది. అటు పైలెట్‌పై దాడి చేసినందుకుగానూ గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఆ అమ్మడిని అరెస్ట్ చేశారు. రెండు గంటలు ఆలస్యం తర్వాత విమానం తిరిగి బయలుదేరింది. అయితే సదరు యువతి మాదకద్రవ్యాల కేసులో పోలీసుల వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇలాంటి ఘటనే గత ఏడాది కూడా ఈజీ జెట్ఫ్లైట్లో చోటు చేసుకుంది. సాండ్ విచ్కోసం చాలా సేపు వేచి చూసిన ఓ ప్రయాణికుడు విమాన అటెండెంట్‌పై దాడికి దిగాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. -
సిమ్ కార్డు ఆధారంగా నిందితుడి అరెస్టు
సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే మార్గంలో రాయి విసిరిన ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలి ప్రాణాలు పోవడానికి కారుడైన నిందితున్ని సిమ్ కార్డు ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల కిందట రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన దర్శనా పవార్ (29) అనే మహిళ సీఎస్టీలో లోకల్ రైలు ఎక్కింది. రద్దీ కారణంగా డోరు దగ్గర నిలబడింది. రైలు అంబర్నాథ్ స్టేషన్ దాటిన తరువాత ఓ ఆగంతకుడు విసిరిన రాయి ఆమె ముఖానికి తగలడంతో కిందపడింది. తోటి ప్రయాణికులు కల్యాణ్ స్టేషన్లో రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేసి మరో రైలులో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కాగా, కల్యాణ్ నుంచి వచ్చిన రైల్వే కానిస్టేబుల్ నిబంధన ప్రకారం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలని పట్టుబట్టాడు. చివరకు ముంబైలోని కేం ఆస్పత్రికి తరలించారు. కాని ఆలస్యం కారణంగా ఆమె మరణించిన సంగతి తెలిసిందే. కాగా సంఘటన స్థలంవద్ద ఆమె ఒంటిపై నగలు, బ్యాగులో సెల్‌ఫోన్, ఇతర విలువైన వస్తువులు కనిపించలేదు. దీంతో చోరీ కోసం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్శనా సిమ్ కార్డు ఆధారంగా ఫోన్ నాసిక్‌లోని వర్ణి గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. గ్రామంలో ఫోన్ వినియోగిస్తున్న రతన్ మర్వాడి అనే యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గతంలో ఇలాగే విరార్ పరిసరాల్లో రాయి విసిరి ఓ ప్రయాణికున్ని కిందపడగొట్టాడు. అతన్ని దోచుకున్నందుకు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు.