దాడి చేశాడని.. దడ పుట్టించింది! | punching a man in the face at Upton Park station in london | Sakshi
Sakshi News home page

దాడి చేశాడని.. దడ పుట్టించింది!

Published Wed, Oct 19 2016 9:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

దాడి చేశాడని.. దడ పుట్టించింది!

దాడి చేశాడని.. దడ పుట్టించింది!

లండన్: ఏ కారణం లేకుండానే ఓ నల్లజాతీయుడిపై జాత్యహంకార దాడి జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళా ప్యాసింజర్ తనకెందుకు అనుకోకుండా నిందితుడిని స్టేషన్లో పరుగులు పెట్టించి శభాష్ అనిపించుకుంది. లండన్ లోని ఆప్టాన్ పార్క్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియోలోని సమాచారం ప్రకారం..  ఆసియాకు చెందిన ఓ వ్యక్తి మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నాడు. రైలు ఆప్టాన్ పార్క్ స్టేషన్లో కాసేపు ఆగింది. బ్రిటన్ వాసిగా భావిస్తున్న ఓ వ్యక్తి.. ఎలాంటి కారణం లేకుండానే నల్లజాతియుడి(ఆసియా వాసి) ముఖంపై పంచ్ విసిరాడు. నేటికీ జాత్యహంకారం దాడులు జరుగుతూనే ఉన్నాయని తాజా ఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు.

బాధితుడి పక్కనే ఉన్న ఓ మహిళా తొలుత ఆ దాడిని అడ్డుకునే యత్నం చేసేలోపే శ్వేతజాతీయుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ చర్యలకు బెదిరిపోయిన నిందితుడు కాళ్లకు బుద్ధిచెప్పాడు. నిందితుడు బాధితుడి ముఖంపై పంచ్ విసరగానే ఆ నల్లజాతీయుడి తల వెనకాల ఉన్న గ్లాస్ విండోకు తాకింది. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడి చేసిన వ్యక్తిని ఓ మహిళ వెంబడించడంతో తప్పించుకునేందుకు వెంటనే మెట్రో రైలు దిగి ప్లాట్ ఫాం మీద పరుగులుపెట్టాడు. ఆ మహిళ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దాదాపుగా దాడికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకునేంత పని చేసింది. అయితే చివరికి ఏం జరిగిందన్నది ఆ వీడియోలో లేదు.

అదే కంపార్ట్ మెంట్లో ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. వైరల్ వీడియో చూసిన వారు ఆ మహిళకు అభినందనలు వెల్లువెత్తుతుండగా, మరో వైపు భాదితుడి పట్ల సానూభూతి వ్యక్తమవుతోంది. బ్రిటన్ రవాణాశాఖ పోలీసులు(బీటీపీ) చర్యలు తీసుకోవాలని ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ జనరల్ సెక్రటరీ మిక్దాద్ వెర్సీ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు వెర్సీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement