Racist attack
-
అమెరికాలో భారత మహిళలపై దాడి.. ఇండియాకు వెళ్లిపోండి అంటూ..
-
ఇండియన్స్ గో బ్యాక్
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈసారి ఏకంగా భారతీయ మహిళలపైనే దాడి జరగడం కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. టెక్సాస్‌లో ఉన్న డల్లాస్‌లో భారతీయ మహిళలజాతివివక్ష దాడి జరిగింది. మెక్సికన్‌కు చెందిన మహిళ ఓ పార్కింగ్ లాట్లో భారతీయ మహిళలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై దాడి చేసింది. కాగా, ఈ ఘటనను తన సెల్ఫోన్లో వీడియో తీస్తూనే సదరు మహిళలను కొడుతూ.. బూతులు తిట్టింది. నేను ఎక్కడికి వెళ్లినా ఇండియన్స్ కనిపిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే భారత మహిళలను.. మీరు ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించింది. ఇండియాలో బెటర్ లైఫ్ లేకపోవడం వల్లే మీరు అమెరికాకు వస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగానే తాను భారతీయులను ద్వేషిస్తానని చెప్పుకొచ్చింది. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. కానీ, మీరు ఇండియాలో పుట్టి ఇక్కడికి వస్తున్నారు. ఒకవేళ ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్కడకి ఎందుకు వచ్చినట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, మహిళలపై దాడి వీడియో అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీలో వైరల్‌గా మారింది. దీంతో, పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. కాగా, మెక్సికన్ మహిళను ఎస్మరాల్డో ఉప్టన్‌గా గుర్తించారు. ఇది కూడా చదవండి: అది రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదు.. జెలెన్స్కీకి సపోర్ట్‌పై భారత్ ‘టెక్నికల్’ వివరణ -
NRI News: కలలో కూడా ఊహించనిది జరిగింది
ఆస్ట్రేలియాలో ఓ భారత సంతతి కుటుంబం ఒకటి రేసిజం దాడికి గురైంది. మెల్బోర్న్ లిన్బ్రూక్ హోటల్ కార్ పార్క్‌లో ఆ కుటుంబంపై దాడి జరిగింది. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తిని దుండగులు తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో ఒకరోజంతా ఉన్న బాధితుడు.. కోలుకున్నాక ఆ అనుభవాన్ని స్థానిక మీడియాకు వెల్లడించారు. తన సోదరిని రక్షించే క్రమంలో 54 ఏళ్ల లిన్ బామ్ దారుణంగా గాయపడ్డారు. ఆయన్ని కిందపడేసి పిడిగుద్దులు గుద్దడంతో పాటు కాలిలో కడుపులో తన్నారు. ‘జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఊహించలేదు. కిందపడేసి కాళ్లతో తన్నారు’ అంటూ బాధితుడు బామ్ మీడియా ముందు వాపోయారు. కారు దిగి వెళ్తున్న మాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశం విడిచిపొమ్మని బూతులు తిట్టారు. రేసిజం గురించి తెలుసు. కానీ, ఈ స్థాయిలో తమపై దాడి చేయడం ఘోరమని అంటూ బామ్ సోదరి జాక్వెలిన్ ప్రకాశమ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి.. 23 ఏళ్ల కెర్రీ ప్రకాశమ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. కెర్రీ.. తన తండ్రి కెయిత్, తల్లి జాక్వెలిన్, అంకుల్ లిన్‌పై ఈ దాడి జరిగిందంటూ ఒక పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 12న రాత్రి ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని ఆరోపిస్తోంది ఆ కుటుంబం. ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఈ కర్కశంపై మాట్లాడరేంటి?
చార్లొట్ (అమెరికా): అమెరికాలో ఓ నల్లజాతీయుడిని శ్వేతజాతి పోలీస్ అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ గళం విప్పాడు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిపై పడగవిప్పిన జాతి వివక్షపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ నల్లజాతి రేసర్ అయిన హామిల్టన్ స్పందిస్తూ ఈ దురాగతంపై స్పందించరా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఈ కర్కశ హత్యపై నా క్రీడ నుంచి ఎవరు మాట్లాడరేంటి. బహుశా శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న క్రీడ కాబట్టే పెదవి విప్పడం లేదనుకుంటా’ అని సోషల్ మీడియాలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ఫార్ములావన్ క్రీడాలోకం స్పందించడం మొదలుపెట్టింది. వర్ణ వివక్ష హత్యపై నిరసించింది. రేసర్లతో పాటు మిగతా క్రీడలకు చెందిన స్టార్లు కూడా జరిగిన ఘోరంపై స్పందించారు. జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాల్సిందేనని సోషల్ మీడియా వేదికపై నినదించారు. బాధగా ఉంది... కోపమొస్తోంది: జోర్డాన్ ఆఫ్రికన్–అమెరికన్‌ను శ్వేతజాతి పోలీసు కర్కశంగా చంపడం తనను చాలా బాధించిందని అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ అన్నాడు. ‘ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నా... చాలా బాధగా ఉంది. అలాగే కోపంగా కూడా ఉంది. జాతి వివక్ష హత్యపై అందరూ కదం తొక్కుతున్నారు. తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా జాత్యహంకారం తొలగిపోవాలి. హింస సద్దుమణగాలి’ అని ఎన్బీఏ సూపర్‌స్టార్ జోర్డాన్ అన్నాడు. -
అగ్రరాజ్యంలో కాల్పుల అలజడి
వాషింగ్టన్/హ్యూస్టన్: వరుస కాల్పుల ఘటనలతో అగ్రరాజ్యం అమెరికా షాక్‌కు గురైంది. 24 గంటల్లో చోటుచేసుకున్న రెండు కాల్పుల ఘటనల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. ఇందులో ఒకటి విద్వేషపూరిత ఘటన కావడం సంచలనం కలిగిస్తోంది. టెక్సస్ రాష్ట్రం ఎల్‌పసో పట్టణంలో శనివారం ఉదయం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఓహియో రాష్ట్రం డేటన్ నగరంలో జరిగిన మరో ఘటనలో అగంతకుడు సహా 10 మంది చనిపోయారు. రెండు ఘటనల్లో 40 మందికిపైగా గాయపడ్డారు. ఎల్‌పసో ఘటనను అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం నైట్‌క్లబ్బులు, షాపింగ్ మాల్స్‌కు పేరుగాంచిన డేటన్ నగరం ఓరెగన్ డిస్ట్రిక్ట్‌లో శనివారం అర్థరాత్రి(స్థానిక కాలమానం) దాటిన తర్వాత జరిగిన కాల్పుల్లో 9 మంది చనిపోయారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని మట్టుపెట్టారు. ఈ ఘటనకు కారణాలు, అగంతకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో గాయపడిన 16 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అగంతకుడు అక్కడికి దగ్గర్లోని బార్ వైపునకు వెళ్తూ తన వద్ద ఉన్న .223 హైకెపాసిటీ గన్‌తో కాల్పులు జరిపాడని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అగంతకుడిని కాల్చి చంపారని, లేకుంటే మరింత ఘోరం జరిగి ఉండేదన్నారు. జాత్యహంకార ఘటన.. అంతకుముందు శనివారం ఉదయం(స్థానిక కాలమానం) టెక్సస్ రాష్ట్రం ఎల్‌పసో పట్టణంలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో దుండగుడు జరిగిన కాల్పుల్లో 20 మంది చనిపోగా 26 మంది క్షతగాత్రులయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు. ‘శనివారం ఉదయం వాల్‌మార్ట్ స్టోర్ కొనుగోలుదారులతో కిక్కిరిసి ఉంది. అదే సమయంలో దుండగుడు(21) వెంట తెచ్చుకున్న అసాల్ట్ రైఫిల్‌తో యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 20 మంది చనిపోగా 26 మంది గాయాలపాలయ్యారు’ అని ఎల్‌పసో పోలీస్ చీఫ్ గ్రెగ్ అలెన్ తెలిపారు. క్షతగాత్రుల్లో 2 ఏళ్ల బాలుడు సహా 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులకు తెగబడిన అనంతరం నిందితుడు పాట్రిక్ క్రుసియస్(21) పోలీసులకు లొంగిపోయాడు. ‘డల్లస్కు చెందిన క్రుసియస్ శ్వేత జాత్యంహకార, విద్వేషపూరిత ధోరణితో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. దేశంలోకి హిస్పానిక్, లాటిన్ అమెరికా దేశాల ప్రజల వలసల కారణంగానే టెక్సస్‌లో స్థానికులకు ఉద్యోగాలు దొరకకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో పలు పోస్టులు చేశాడు. అధ్యక్షుడు ట్రంప్ విధానాలను, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణాన్ని సమర్థించాడు’ అని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం అతడి ట్విట్టర్ ఖాతాను పోలీసులు మూసివేశారు. అతడిపై ఉగ్రవాదం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. రోదిస్తున్న బాధితురాలు -
బ్రిటన్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి
లండన్: రన్వీత్పాల్ సింగ్ అనే పర్యావరణ కార్యకర్తపై బ్రిటన్‌లో జాత్యహంకార దాడి జరిగింది. బ్రిటన్ పార్లమెంటు ఎదుట ‘ముస్లిం వెనక్కి వెళ్లు’ అని అరుచుకుంటూ వచ్చిన ఓ శ్వేత జాతీయుడు సింగ్ తలపాగాను లాగేందుకు ప్రయత్నించాడు. సింగ్ గట్టిగా ప్రతిఘటించడంతో దుండగుడు పారిపోయాడు. ఎకోసిక్ సంస్థకు దక్షిణాసియా ప్రాజెక్టు మేనేజర్‌గా ఉన్న రన్వీత్పాల్ సింగ్.. మార్చి 14న నిర్వహించనున్న ప్రపంచ సిక్కు పర్యావరణ దినోత్సవంపై బ్రిటిష్ సిక్కు ఎంపీ తన్ దేశీతో చర్చించేందుకు వెళ్లారు. పోర్ట్కల్లిస్ హౌస్ వద్ద సెక్యూరిటీ క్యూలో ఉండగా ఈ దాడి జరిగింది. ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని, దాడి చేసిన వ్యక్తిని పట్టుకుంటామని పోలీసులు చెప్పినట్లు ఆయన వివరించారు. -
దాడి చేశాడని.. దడ పుట్టించింది!
లండన్: ఏ కారణం లేకుండానే ఓ నల్లజాతీయుడిపై జాత్యహంకార దాడి జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళా ప్యాసింజర్ తనకెందుకు అనుకోకుండా నిందితుడిని స్టేషన్లో పరుగులు పెట్టించి శభాష్ అనిపించుకుంది. లండన్ లోని ఆప్టాన్ పార్క్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియోలోని సమాచారం ప్రకారం.. ఆసియాకు చెందిన ఓ వ్యక్తి మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నాడు. రైలు ఆప్టాన్ పార్క్ స్టేషన్లో కాసేపు ఆగింది. బ్రిటన్ వాసిగా భావిస్తున్న ఓ వ్యక్తి.. ఎలాంటి కారణం లేకుండానే నల్లజాతియుడి(ఆసియా వాసి) ముఖంపై పంచ్ విసిరాడు. నేటికీ జాత్యహంకారం దాడులు జరుగుతూనే ఉన్నాయని తాజా ఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు. బాధితుడి పక్కనే ఉన్న ఓ మహిళా తొలుత ఆ దాడిని అడ్డుకునే యత్నం చేసేలోపే శ్వేతజాతీయుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ చర్యలకు బెదిరిపోయిన నిందితుడు కాళ్లకు బుద్ధిచెప్పాడు. నిందితుడు బాధితుడి ముఖంపై పంచ్ విసరగానే ఆ నల్లజాతీయుడి తల వెనకాల ఉన్న గ్లాస్ విండోకు తాకింది. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడి చేసిన వ్యక్తిని ఓ మహిళ వెంబడించడంతో తప్పించుకునేందుకు వెంటనే మెట్రో రైలు దిగి ప్లాట్ ఫాం మీద పరుగులుపెట్టాడు. ఆ మహిళ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దాదాపుగా దాడికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకునేంత పని చేసింది. అయితే చివరికి ఏం జరిగిందన్నది ఆ వీడియోలో లేదు. అదే కంపార్ట్ మెంట్లో ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. వైరల్ వీడియో చూసిన వారు ఆ మహిళకు అభినందనలు వెల్లువెత్తుతుండగా, మరో వైపు భాదితుడి పట్ల సానూభూతి వ్యక్తమవుతోంది. బ్రిటన్ రవాణాశాఖ పోలీసులు(బీటీపీ) చర్యలు తీసుకోవాలని ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ జనరల్ సెక్రటరీ మిక్దాద్ వెర్సీ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు వెర్సీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. -
పంచ్ ఇచ్చి.. పరుగో పరుగు!
-
అప్పుడు నిడో తానియా....ఇప్పుడు షాలోని
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. మణిపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని ఐదారుగురు దుండగులు తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. ఈ ఘటన కోట్లా ముబారక్పూర్ ప్రాంతంలోజరిగింది. 30ఏళ్ల షాలోని అనే వ్యక్తి తన స్నేహితుడి నివాసం నుంచి తిరిగి వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈఘటనపై డీసీపీ బీఎస్ జైశ్వాల్ మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. షాలోనిపై అయిదారుగురు దాడి చేసినట్లు చెప్పారు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపారు. కాగా షాలోని ప్రస్తుతం నిరుద్యోగి. అతడు మునిర్కా నివాసం ఉంటున్నాడు. కాగా ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా అనే విద్యార్థి సైతం ఇదే తరహాలో దుండగుల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి మరణించాడు. -
ఢిల్లీలో జాతివివక్ష దాడి
దెబ్బలు తాళలేక ఎమ్మెల్యే కొడుకు మృతి సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారాల రాజధానిగా ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకున్న దేశ రాజధానిపై మరో అపకీర్తి మరక పడింది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా (18) అనే యువకుడిపై జాతివివక్ష దాడి జరిగింది. దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో ఉన్న స్నేహితుడి ఇంటి చిరునామా తెలుసుకోవడానికి తానియా బుధవారం ఇద్దరు దుకాణదారులను సంప్రదించగా వారు అతని జుట్టును చూసి గేలి చేశారు. కోపం ఆపుకోలేక తానియా...ఓ దుకాణ అద్దాన్ని పగలగొట్టడంతో దుకాణదారులు, మరికొందరు కలసి అతన్ని చితకబాదారు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో వారు రాజీ కుదిర్చి పంపారు. రాత్రి తన గదికి వెళ్లి పడుకున్న తానియా నిద్రలోనే కన్నుమూశాడు. దెబ్బలు తాళలేకే అతను మరణించినట్లు మృతుడి స్నేహితులు, బంధువులు ఆరోపించడంతో ప్రభుత్వం ఇద్దరు దుకాణదారులను అరెస్టు చేసింది. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. మృతుడు అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిడో పవిత్ర కుమారుడు. అతని మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.