అప్పుడు నిడో తానియా....ఇప్పుడు షాలోని | Manipuri man beaten to death in Delhi | Sakshi
Sakshi News home page

అప్పుడు నిడో తానియా....ఇప్పుడు షాలోని

Published Mon, Jul 21 2014 11:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

Manipuri man beaten to death in Delhi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. మణిపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని ఐదారుగురు దుండగులు తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. ఈ ఘటన కోట్లా ముబారక్‌పూర్‌ ప్రాంతంలోజరిగింది. 30ఏళ్ల షాలోని అనే వ్యక్తి తన స్నేహితుడి నివాసం నుంచి తిరిగి వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

ఈఘటనపై డీసీపీ బీఎస్ జైశ్వాల్ మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. షాలోనిపై అయిదారుగురు దాడి చేసినట్లు చెప్పారు.  దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపారు. కాగా షాలోని ప్రస్తుతం నిరుద్యోగి. అతడు మునిర్కా నివాసం ఉంటున్నాడు. కాగా  ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా అనే విద్యార్థి సైతం ఇదే తరహాలో దుండగుల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి మరణించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement