Manipuri
-
'మొదటిసారి అక్కడే కలుసుకున్నాం'.. ప్రియురాలితో పెళ్లిపై రణ్‌దీప్!
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా పెళ్లిబంధంలోకి అడుగు పెడుతున్నారు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను నవంబర్ 29న పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సరదాగా కనిపించారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ప్రియురాలి సంప్రదాయంలోనే వీరి పెళ్లి వేడుక జరగబోతోంది. మరి కొన్ని గంటల్లో మూడుముళ్లతో ఒక్కటి కాబోతున్న ఈ జంట పెళ్లికి ముందు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లిన్ లైష్రామ్ పెళ్లికి ముందు ఎలా కలుసుకున్నారో రణ్‌దీప్ గుర్తు చేసుకున్నారు రణ్‌దీప్ మాట్లాడుతూ.. 'వధువు సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం మాత్రమే గౌరవప్రదమని నేను భావించా. మైటీ సంప్రదాయం ప్రకారం ప్రేమ వివాహాల్లో వరుడు చాలా సేపు కూర్చోవాలని విన్నా. ఆ సంప్రదాయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా జీవిత భాగస్వామి సంస్కృతిపై గౌరవంతోనే ఈ రోజు ఇక్కడ ఉన్నా. మణిపురి సంప్రదాయాలను ఆస్వాదిస్తున్నా. నేను, లిన్ మణిపురి సంస్కృతి గురించి మాట్లాడుకునేవాళ్లం. భవిష్యత్తులో మా జంట పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. రణదీప్, లిన్ ప్రేమకథ లిన్ లైష్రామ్‌తో పరిచయంపై చెబుతూ.. 'మేము చాలా కాలంగా స్నేహితులం. థియేటర్లలో ఉన్నప్పుడే కలిశాం. మా మధ్య మంచి స్నేహం ఉంది. అదే ఇప్పుడు పెళ్లిబంధంగా మారింది' అని అన్నారు. కాగా.. నసీరుద్దీన్ షా థియేటర్ గ్రూప్‌లో రణదీప్‌ను కలిశానని లిన్ తెలిపింది. అక్కడ రణదీప్ తన సీనియర్ అని వెల్లడించింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఇవాళ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. -
జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధం!
Election Rallies Ban Extended Till Jan 31: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధం కొనసాగుతుందని ఎలక్షన్ కమీషన్(ఈసీ) పేర్కొంది. ఈ మేరకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ప్రచార ర్యాలీలు నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. అంతేకాదు దేశంలోని కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా శనివారం రోడ్‌షోలు, ర్యాలీల పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ముఖ్య ఆరోగ్య కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలను మొదట జనవరి 15 వరకు నిషేధించిన తదుపరి మళ్లీ జనవరి 22 వరకు ఆ నిషేధాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాజకీయ పార్టీల భౌతిక బహిరంగ సభలకు లేదా పోటీ చేసే అభ్యర్థులకు జనవరి 28 నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2 కోసం ఫిబ్రవరి 1 నుంచి సడలింపులను అనుమతించింది. పైగా కోవిడ్-19 ఆంక్షల మేరకు నిర్దేశించిన బహిరంగ ప్రదేశాలలో ప్రచారం కోసం అనుమతించిన భద్రతా సిబ్బంది, వీడియోవ్యాన్‌లను మినహాయించి, ఇంటింటికీ ప్రచారం కోసం ఐదుగురు వ్యక్తుల పరిమితిని 10కి పెంచినట్లు తెలిపింది. (చదవండి: బలమైన స్థానం నుంచే పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్!) -
భార్య ఆచూకీ అడిగినందుకు.. చేతివేళ్లు విరిచి..
లక్నో : న్యాయం కోసం పోలీసు స్టేషను గడప తొక్కిన ఓ దళిత వ్యక్తి పట్ల రక్షకభటులు కర్కశంగా ప్రవర్తించారు. తన భార్య ఆచూకీ కనుక్కోవాలని ఫిర్యాదు చేసిన అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురిచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మనిపురి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు... బులంద్‌షహర్‌కు చెందిన ఓ 48 ఏళ్ల దళిత వ్యక్తి తన భార్యతో కలిసి శుక్రవారం రాత్రి బైక్‌పై బంధువుల ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో కారులో ఆ దంపతులను వెంబడించిన కొంతమంది దుండగులు అతడిని కొట్టి.. భార్యను తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. అయితే అతడి ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. బాధితుడినే నిందితుడిగా పేర్కొంటూ తీవ్రంగా కొట్టారు. అనంతరం తన భార్యను తానే చంపానని స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అతడి భార్య గుర్తు తెలియని దుండగులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. అయినప్పటికీ పోలీసులు ఆమె భర్తనే నిందితుడంటూ చేతివేళ్లు విరిచేశారు. కాగా ఈ ఘటనపై మనిపురి ఎస్పీ అజయ్ శంకర్ రాయ్ తీవ్రంగా స్పందించారు. బాధితుడి కాళ్లు, నడుముపై తీవ్ర గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఘటనకు కారణమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే బాధితుడి భార్య ఆరోపించినట్లుగా ఆమెపై అత్యాచారం జరుగలేదని వైద్యులు ధ్రువీకరించినట్లు తేలడంతో ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
రూ.100 కోసం పోలీసులు ఇద్దరి ప్రాణాలు తీశారు...!
మణిపురిః పదిహేను రూపాయలకోసం దళిత దంపతులను నరికి చంపిన ఘటన మరువక ముందే.. ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. 100 రూపాయలు లంచం ఇవ్వనందుకు ఇద్దరు కూలీలపై దాడి చేసి చంపిన పోలీసుల దాష్టీకం శుక్రవారం మణిపురి ప్రాంతంలో కలకలం రేపింది. ఇటుకలతో వెడుతున్న ట్రాక్టర్ ను ఆపిన పోలీసులు డ్రైవర్ వద్ద లంచం డిమాండ్ చేశారు. అతడు ఇచ్చేందుకు నిరాకరించడంతో కూలీలకు, పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఘటనాస్థలినుంచీ ఇద్దరు తప్పించుకొని పారిపోగా మరో ఇద్దరు కూలీలు పోలీసు దెబ్బలకు ప్రాణాలు కోల్పోగా వారిని దగ్గరలోనే ఉన్న చెరువులో పడేసినట్లు తెలుస్తోంది. చెరువులో తేలుతూ కనిపించిన ఇద్దరు కూలీల మృతదేహాలు.. ఉత్తరప్రదేశ్ మణిపురి జిల్లా ఘిరార్ ప్రాంతంలో తీవ్ర ఆందోళనను రేపింది. మృతదేహాలను బయటకు తెచ్చిన కుటుంబ సభ్యులతోపాటు, గ్రామస్థులు మృతుల శవాలతో రహదారులు దిగ్బంధించి ఆందోళనకు దిగారు. 100 రూపాయల లంచంకోసం పోలీసులు చేసిన దౌర్జన్యానికి అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం మణిపురి ఎస్పీ దేవరంజన్ వర్మ గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన ఇద్దరు హోం గార్డులతో సహా ఆరుగురు పోలీసులపై ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేశామని, దర్యాప్తు అనంతరం నిందితులపై యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. ఇటుకలు లోడ్ చేసిన ట్రక్ తో పాటు ప్రయాణిస్తున్న నలుగురు కూలీలను పోలీసులు ఘిరార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చెక్ పోస్టువద్ద శుక్రవారం ఉదయం అడ్డుకుని, వారివద్దనుంచీ 100 రూపాయలు లంచం డిమాండ్ చేశారని, డ్రైవర్ లంచం ఇచ్చేందుకు నిరాకరించడంతో గొడవ మొదలైనట్లు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ఘటనాస్థలం నుంచీ ఇద్దరు తప్పించుకోగా.. మరోఇద్దర్నిపోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే వారు చనిపోయారని అనంతరం వారి మృతదేహాలను పోలీసులు పక్కనే ఉన్న చెరువులో పడేసినట్లు కంప్లైంట్ లో వివరించారు. మృతదేహాలు చెరువులో కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. -
ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లు, 21 మంది అరెస్టు
లక్నో: ఉత్తర ప్రదేశ్ మణిపూరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆవులను చంపేస్తున్నారనే వదంతులు వ్యాపించడంతో హింస చెలరేగింది. రాష్ట్ర రాజధాని లక్నోకి ఆగ్రాకి సమీపంలో ఈ అల్లర్లు చెలరేగాయి. ఆవులను వధించారని, సమీప పొలాల్లో వాటి కళేబరాలు పడివున్నాయనే పుకార్లు చెలరేగడంతో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు పలుషాపులను ధ్వంసం చేశారు. రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అవు మాంసం అమ్ముతున్నారనే వార్తల నేపథ్యంలో లల్లా, షాఫిక్ అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకుని చితకబాదారు. గుంపునుంచి వారిని విడిదీసి స్టేషన్‌కు తరలిస్తుండగా పోలీసు వాహనంపై దాడి చేసిన వారిని బయటకు లాగి పడేశారు. దీంతో అ దనపు బలగాలను రప్పించారు. డీఐజీ లక్ష్మీ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప రిస్థితిని అదుపు చేశారు. తమ విచారణలో ఇవన్నీ పుకార్లని తేలాయని జిల్లా మాజిస్ట్రేట్ ప్రకటించారు. ఈ కేసులో 21 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా డీఎస్పీ ని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కాగా ఉత్తర ప్రదేశ్ దాద్రి లో ఆవు మాంసం అమ్ముతున్నాడనే అనుమానంతో 52 ఏళ్ల వృద్ధుణ్ని కొట్టి చంపిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. -
న్యూఢిల్లీలో 'మరో మణిపురి' దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మణిపురికీ చెందిన జింగ్రామ్ కెన్గో (33)ను ఆగంతకులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆగంతకులు పరారైయ్యారు. జింగ్రామ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన హస్తినలోని కోట్ల ముబారక్పూర్ ప్రాంతంలో గత రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్య దొంగతనం కోసం చేసినదిగా లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. జింగ్రామ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. పీహెచ్డీ చేసేందుకు మృతుడు జింగ్రామ్ నెల క్రితమే మణిపూర్ నుంచి హస్తినకు తరలి వచ్చాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో జింగ్రామ్ పీహెచ్డీ చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
అప్పుడు నిడో తానియా....ఇప్పుడు షాలోని
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. మణిపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని ఐదారుగురు దుండగులు తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. ఈ ఘటన కోట్లా ముబారక్పూర్ ప్రాంతంలోజరిగింది. 30ఏళ్ల షాలోని అనే వ్యక్తి తన స్నేహితుడి నివాసం నుంచి తిరిగి వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈఘటనపై డీసీపీ బీఎస్ జైశ్వాల్ మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. షాలోనిపై అయిదారుగురు దాడి చేసినట్లు చెప్పారు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపారు. కాగా షాలోని ప్రస్తుతం నిరుద్యోగి. అతడు మునిర్కా నివాసం ఉంటున్నాడు. కాగా ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా అనే విద్యార్థి సైతం ఇదే తరహాలో దుండగుల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి మరణించాడు. -
ప్రమాదవశాత్తూ ఇంటిగోడ కూలి ఐదుగురు మృతి
మణిపురి: ప్రమాదవశాత్తూ ఓ ఇంటి గోడ కూలి ఐదురుగు కుటుంబ సభ్యులు దుర్మరణం పాలైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మణిపురి జిల్లా ఒన్హా గ్రామంలో చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు , అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను రిస్క్యూ టీం వెలికితీశారు. వారిలో విర్మా దేవి(70), మినా దేవి(35), ఆమె కుమారుడు రాహుల్ (17), ఇద్దరు ఆడపిల్లలు శశి(14), శివానీ(9)లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, మృతిచెందిన వారి కుటుంబానికి లక్షన్నర రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రకటించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ వీకే పన్వర్ పేర్కొన్నారు.