ప్రమాదవశాత్తూ ఇంటిగోడ కూలి ఐదుగురు మృతి | Five family members killed in wall collapse Mainpuri | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ ఇంటిగోడ కూలి ఐదుగురు మృతి

Published Sat, Feb 22 2014 3:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

ప్రమాదవశాత్తూ ఓ ఇంటి గోడకూలి ఐదురుగు కుటుంబ సభ్యులు దుర్మరణం పాలైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని మణిపురి జిల్లా ఒన్హా గ్రామంలో చోటుచేసుకుంది.

మణిపురి: ప్రమాదవశాత్తూ ఓ ఇంటి గోడ కూలి ఐదురుగు కుటుంబ సభ్యులు దుర్మరణం పాలైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని మణిపురి జిల్లా ఒన్హా గ్రామంలో చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు , అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 

శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను రిస్క్యూ టీం వెలికితీశారు. వారిలో విర్మా దేవి(70), మినా దేవి(35), ఆమె కుమారుడు రాహుల్ (17), ఇద్దరు ఆడపిల్లలు శశి(14), శివానీ(9)లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, మృతిచెందిన వారి కుటుంబానికి లక్షన్నర రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రకటించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ వీకే పన్వర్  పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement