జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధం! | EC Extend Ban Roadshows Rallies 5 Poll Bound States Till Jan 31 | Sakshi
Sakshi News home page

Extend Ban: జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధం!

Published Sat, Jan 22 2022 7:20 PM | Last Updated on Sat, Jan 22 2022 8:29 PM

EC Extend Ban Roadshows Rallies 5 Poll Bound States Till Jan 31 - Sakshi

Election Rallies Ban Extended Till Jan 31: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధం కొనసాగుతుందని ఎలక్షన్‌ కమీషన్‌(ఈసీ) పేర్కొంది. ఈ మేరకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ప్రచార ర్యాలీలు నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. అంతేకాదు దేశంలోని కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా శనివారం రోడ్‌షోలు, ర్యాలీల పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ముఖ్య ఆరోగ్య కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలను మొదట జనవరి 15 వరకు నిషేధించిన తదుపరి మళ్లీ జనవరి 22 వరకు ఆ నిషేధాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు రాజకీయ పార్టీల భౌతిక బహిరంగ సభలకు లేదా పోటీ చేసే అభ్యర్థులకు జనవరి 28 నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2 కోసం ఫిబ్రవరి 1 నుంచి సడలింపులను అనుమతించింది. పైగా కోవిడ్‌-19 ఆంక్షల మేరకు నిర్దేశించిన బహిరంగ ప్రదేశాలలో ప్రచారం కోసం అనుమతించిన భద్రతా సిబ్బంది, వీడియోవ్యాన్‌లను మినహాయించి, ఇంటింటికీ ప్రచారం కోసం ఐదుగురు వ్యక్తుల పరిమితిని 10కి పెంచినట్లు తెలిపింది. 

(చదవండి: బలమైన స్థానం నుంచే పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement