Assembly elctions
-
ఓడితే మీసం తీసేసి, గుండు కొట్టించుకుంటా’
జైపూర్: మహారాష్ట్ర-జార్ఖండ్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే కోవలో రాజస్థాన్‌లోని ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు విరివిగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాజస్థాన్ బీజేపీ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్సర్ సంచలన ప్రకటన చేశారు.ఈ ఎన్నికల్లో రాజస్థాన్‌లో బీజేపీ ఓటమిపాలు కాదని, ఒకవేళ ఓడిపోతే తాను మీసాలు తీసేసి, గుండు కొట్టించుకుంటానని అన్నారు. ఖిన్వ్సర్లోని సదర్ బజార్ చౌక్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. తాను ఖిన్వసర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనకు 95 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు.ఈ ఎన్నికలు గ్రామ అభివృద్ధి కోసం దోహదపడతాయన్నారు. తాను తొలిసారి ఎన్నికల్లో గెలిచి నప్పుడు తనను నాటి సీఎం వసుంధర రాజే మంత్రిని చేశారన్నారు. ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఈ ఎన్నికల సభలో బీజేపీ అభ్యర్థి రేవంత్రం దంగా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతి మిర్ధా పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఖిన్వ్సర్, డియోలీ-ఉనియారా, దౌసా, జుంఝును, రామ్‌గఢ్, సాలంబెర్ చౌరాసి అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. ఇది కూడా చదవండి: Jharkhand Polls: ఐదుగురు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న ఒక బ్లాక్ ఓటర్లు -
32 ఓట్లతో దక్కిన విజయం
చండీగఢ్: హరియాణాలోని ఉచానా కలాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ అత్రి కేవలం 32 ఓట్ల తేడాతో గెలుపు సాధించారు. అత్రి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బ్రిజేందర్ సింగ్‌న ఓడించారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేత దుష్యంత్ చౌతాలా ఐదో స్థానంలో నిలిచారని తెలిపింది. అత్రికి 48,968 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్‌కు 48,936 ఓట్లు పోలయ్యాయని ఈసీ పేర్కొంది. -
Haryana Election: ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
HARYANA ASSEMBLY ELECTION POLLING UPDATES...హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో నిల్చున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.మరికాసేపట్లో హర్యానాలో పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 49.1 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పలుచోట్లు ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 36.7% పోలింగ్ నమోదైంది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా, అధికార బీజేపీ హ్యాట్రిక్‌పై కన్నేసింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, బహుజన్ సమాజ్ పార్టీ, జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ సైతం తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి.అనేక స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోరు జరిగే అవకాశం ఉంది. ఉదయం నుంచీ సీఎం నాయబ్ సైనీ, మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సహా పలువురు వీఐపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే స్టార్ క్రీడాకారులు మనూ బాకర్, వినేష్ ఫోగట్ కూడా ఓటేసిన వారిలో ఉన్నారు.ఇవాళ జరుగుతున్న హర్యానా ఎన్నికల్లో నాయబ్ సైనీ, భూపీందర్ హుడా, వినేష్ ఫోగట్ సహా దాదాపు వెయ్యి మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది.హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో 2.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 20వేల623 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను బాకర్ ఝజ్జర్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటేసింది.ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.కర్నాల్‌లో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.చర్కి దాద్రిలోని పోలింగ్ కేంద్రంలో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫోగట్ ఓటు వేశారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కురుక్షేత్రలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.హరియాణా సీఎం, బీజేపీ అభ్యర్థి నాయబ్ సింగ్ సైనీ అంబాలాలో ఓటు వేశారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ విశ్వాసం వ్యక్తంచేశారు.ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి కృషణ్ పాల్ గుర్జార్, సిర్సాలో మాజీ డిప్యూటీసీఎం దుశ్యంత్ చౌతాాలా ఓటుహక్కు వినియోగించుకున్నారు. దేశంలో అత్యంత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ హిస్సార్‌లో ఓటు వేశారు. -
‘అగ్నివీర్’పై రాహుల్‌ది తప్పుడు ప్రచారం: అమిత్ షా
చండీగఢ్:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,హర్యానా మాజీ సీఎం భూపీందర్సింగ్హుడాపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. అగ్నివీర్ పథకంపై రాహుల్,హుడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(సెప్టెంబర్17)లోహారులో నిర్వహించిన ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడారు. రాహుల్ ఏ భాషలోనైనా అబద్ధాలు చెప్పగలరని ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఒకవేళ కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాలు ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తారని హెచ్చరించారు.జమ్మూకశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయడంపై రాహుల్ తన వైఖరిని స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఆర్మీలో ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకాన్ని అమలు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ సీట్లకు అక్టోబర్5న పోలింగ్, 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇదీ చదవండి.. మోదీ వందరోజుల పాలన బుక్లెట్ విడుదల -
ఆ స్కీమ్‌లన్నీ ఓట్ల కోసమే: ఉద్ధవ్ థాక్రే
ముంబయి: మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌షిండే ప్రభుత్వం మహిళల కోసం ప్రకటిస్తున్న స్కీమ్‌లపై శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు. ఈ స్కీమ్‌లన్నీ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మూలకు పడేసే స్కీమ్‌లని ఎద్దేవా చేశారు. ఆదివారం(జులై 7) ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో ఉద్ధవ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. ‘అత్యవసరంగా చాలా స్కీమ్‌లను లాంచ్ చేస్తున్నారు. ఇది ఎన్నికల ముందు మహిళల ఓట్ల కోసం చేసే రాజకీయ స్టంట్ మాత్రమే. స్కీమ్‌లు రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినా..రాకపోయినా ఈ స్కీమ్‌లను అమలు చేయరు’అని థాక్రే హెచ్చరించారు. -
అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, దాని మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 42 స్థానాల్లో గెలపొందింది. ఇంకా నాలుగు స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 50 స్థానాల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. బీజేపీ గెలుపుతో పెమా ఖండూ మూడోసారి ముఖ్యమంత్రి కానున్నారు.ఇప్పటికే 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఉన్నారు. మిగతావారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఇటానగర్ నుండి టెకీ కాసో, తాలిహా నుండి న్యాతో దుకమ్, రోయింగ్ నుంచి ముచ్చు మితితో పాటు పలువురు ఉన్నారు. ఇక.. 2019లో 41 సీట్లు గెలుచుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో తమ అభ్యర్థులను ఇక్కడ బరిలో నిలిపింది. -
TS Election 2023: సై అంటున్న బీఆర్ఎస్ క్యాండెట్లు
ఆదిలాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇప్పటికే ప్రకటించడంతో ఇక ప్రత్యర్థులు ఎవరనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నియోజకవర్గం వారీగా ఎవరుంటారనే దానిపై దృష్టి నెలకొంది. అధికార పార్టీ పరంగా ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్ జాదవ్ పేర్లను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ పరంగా హైదరా బాద్‌లో గాంధీ భవన్ వేదికగా నియోజకవర్గం వారీ గా దరఖాస్తు ప్రక్రియ సాగుతుంది. బీజేపీలో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హస్తం పార్టీలో పోటాపోటీ.. హస్తం పార్టీలో గాంధీభవన్ వేదికగా నియోజకవర్గం వారీగా ఈనెల 18 నుంచి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 25 వరకు కొనసాగనుంది. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డిలు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, ఆదిలాబాద్‌కు చెందిన గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ కె.దామోదర్ రెడ్డి బుధవారం దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక బోథ్ నుంచి సైతం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఏఐసీసీ సభ్యుడు డాక్టర్ నరేష్ జాదవ్, నేతలు ఆడె గజేందర్, వన్నెల అశోక్ ముందు నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇచ్చోడ మండలానికి చెందిన కుమ్ర కోటేశ్వర్, నేరడిగొండ మండలం బుగ్గారం సర్పంచ్ జాదవ్ వసంత్‌రావు, బజార్హత్నూర్కు చెందిన జల్కె పాండురంగ్, గుడిహత్నూర్ మండలం సీతాగోందికి చెందిన దౌలత్రావుతో పాటు జహీరాబాద్‌కు చెందిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివరాథోడ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా బోథ్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి కనబర్చుతున్నట్లు పార్టీలో ప్రచారం ఉంది. అయితే ఆయన దరఖాస్తు చేసుకున్న విషయం తెలియరాలేదు. బీజేపీలో ప్రయత్నాలు ముమ్మరం.. కమలం పార్టీలోనూ ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ చిట్యాల సుహాసినిరెడ్డి టికెట్ కోసం యత్నిస్తున్నారు. తాజాగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బోథ్ నుంచి సాకటి దశరథ్, బలరాం జాదవ్, ఆడె మానాజీ తమ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఇదిలా ఉంటే పార్టీలో ప్రస్తుతం ఎంపీలుగా వ్యవహరిస్తున్న వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశాలు ఉన్న దృష్ట్యా ఎంపీ సోయం బాపురావు బోథ్ నుంచే బరిలోకి దిగుతారా.. లేనిపక్షంలో ఆయన ఆసక్తి ఎలాంటిదన్న విషయంలో స్పష్టత లేదు. ఏదేమైనా ఈ పార్టీ పరంగా జాబితా తయారీలో అధిష్టానం ఇప్పటికే నిమగ్నం కావడంతో అందరి దృష్టి నెలకొంది. -
తెలుగు ప్రజల మధ్దతుతో మేమె గెలుస్తాం...
-
ముందుంది ఎన్నికల సమరం.. బీజేపీలోకి కేజీఎఫ్ నటుడు!
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, మాజీ మంత్రి అనంత్ నాగ్ బీజేపీలో చేరనున్నారు. ఎమ్మెల్యేగా, పరిషత్ సభ్యుడిగా పనిచేసిన అనంత్ నాగ్, జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2004లో చామరాజ్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అనంత్ నాగ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరేందుకు బీజేపీ మంత్రులు మునిరత్న, డాక్టర్ కే సుధాకర్‌లు అనంత్‌నాగ్‌ను ఒప్పించినట్లు సమాచారం. మరో వైపు రానున్న కర్టాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర నేతలు కర్ణాటకలో భారీగా ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళూరు, ఉడిపి, చక్కమగళూరు హాసన్ కార్యక్రమాల్లో నడ్డా పాల్గొన్నారు. ప్రధాని కూడా త్వరలో షిమోగాలో పర్యటించి మహా సమ్మేళనంలో ప్రసంగించనున్నారు. కర్టాటకలో మరో సారి గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి అతిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.. ఇదేమైనా ఇంగ్లాండా? సీఎం నితీష్ ఆగ్రహం -
7 అసెంబ్లీ స్థానాల ఫలితాలు.. నాలుగు సీట్లలో బీజేపీ విజయం
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన, తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్‌లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి. ► మునుగోడు(తెలంగాణ).. టీఆర్ఎస్ ► అంధేరీ(మహారాష్ట్ర)... శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ► మొకామా(బిహార్).. ఆర్జేడీ ► ధామ్‌నగర్(ఒరిశా).. బీజేపీ ► గోపాల్‌గంజ్(బిహార్)... బీజేపీ ► అదమ్‌పుర్(హరియాణా).. బీజేపీ ► గోలా గోక్రానాథ్(ఉత్తర్‌ప్రదేశ్).. బిజేపీ TIME: 3:45PM ► ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తెలిపోయాయి. ఇప్పటి వరకు బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఆర్జేడీ, శివసేన ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో టీఆర్ఎస్ లీడ్‌లో కొనసాగుతున్నాయి. బిహార్‌లోని గోపాల్‌గంజ్, హరియాణాలోని అదమ్‌పుర్, గోలా గోక్రానాథ్‌లో బీజేపీ విజయం సాధించింది. అంధేరీలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే విజయం సాధించారు. TIME: 1:00PM ► అంధేరి తూర్పులో శివసేనకు చెందిన రుతుజా లట్కే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పది రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 37,469 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. రుతుజా లట్కే విజయం దాదాపు ఖరారు కావడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు మొదలెట్టారు. ►బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. 22వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి 607 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►యూపీలోని గోల గోకరనాథ్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో 29 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ దాదాపు 33,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ► మునుగోడు కౌంటింగ్ ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ►ఒడిశాలోని ధామ్‌నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,392 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 22,495 ఓట్లు పోలయ్యాయి. Odisha | Counting underway for Dhamnagar by-elections. BJP candidate Suryabanshi Suraj continues his lead on the assembly seat after five rounds of counting, with a total of 22,495 votes so far. pic.twitter.com/TNe4j2UtLC — ANI (@ANI) November 6, 2022 ► హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. 6 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ 13,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►మొకమలో 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఆర్జేడీ 16,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది. TIME: 12:00PM ► అంధేరి తూర్పులో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రుతుజా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 4,078 ఓట్లతో మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు మొత్తం 29,033 ఓట్లు పోలయ్యాయి. ► ఒడిశాలోని ధమ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 18,181 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ 14,920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ► మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. In Pics | Counting of votes in Andheri East bypoll elections underway Follow for live updates:https://t.co/069cEQIUP9 pic.twitter.com/XMyjNa7fu1 — Express Mumbai (@ie_mumbai) November 6, 2022 TIME: 11:00AM అంధేరి తూర్పులో ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి రుతుజా లత్కే 2,630 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమెకు 17,278 ఓట్లు పోలయ్యాయి. ► బిహార్ మోకమలో తొమ్మిదో రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవి 35,036 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి 24,299 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. TIME: 10:00AM బిహార్‌లోని రెండు( మోకమ, గోపాల్‌గంజ్) స్థానాల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►అంధేరి (తూర్పు)లో రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన రుతుజా లట్కే 7,817 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. Patna, Bihar | Counting underway for Mokama By-poll, visuals from counting center Counting started at 8 am & is happening peacefully. 3-tier security deployed. No complaint so far, patrolling is being done in nearby areas: Manavjeet Singh Dhillon, SSP pic.twitter.com/9WtVmW3qfh — ANI (@ANI) November 6, 2022 ► ఒడిశాలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,749 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన అభ్యర్థి అబంతి దాస్‌కు 3,980 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. Haryana | Counting of #AdampurByElection underway. Outside visuals from counting center 3-layer security provided as EVMs have reached. CAPF & district police deployed. Law & order company with anti-riot equipment present in case of any eventuality. Checking is being done: SSP pic.twitter.com/KeJJYj7TNI — ANI (@ANI) November 6, 2022 ► యూపీలోని గోల గోకరానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 15,866 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీ 10,853 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ►మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 1,100 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది. సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), బిహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, హరియాణాలోని ఆదంపూర్, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో, ఒడిశాలోని ధామ్నగర్తోపాటు తెలంగాణలోని మునుగోడు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ పోరులో ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు మధ్యే పోటీ నడుస్తోంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు తేలనున్నాయి. కాగా ఈ ఏడు నియోజవర్గాలకు ఈ నెల 3న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు (7) ►మహారాష్ట్ర-తూర్పు అంధేరి ►బిహార్-మోకమ ►బిహార్- గోపాల్‌గంజ్ ►హరియాణ-అదంపూర్ ►తెలంగాణ-మునుగోడు ►ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ►ఒడిశా- ధామ్‌నగర్ హరియాణలో మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఆదంపూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే అకాల మరణంతో అంధేరీ ఈస్ట్‌లో ఎన్నికలు వచ్చాయి. బిహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో మొకమ స్థానం ఖాళీ అయింది. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కూడా సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణం కారణంగా పోటీ అనివార్యమైంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్టు 2న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. యూపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి చెందడంతో లఖింపూర్ ఖేరీ జిల్లా గోల గోకరనాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ్మెల్యే బిష్ణు చరణ్ దాస్ అకాల మరణంతో ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. చదవండి: Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు -
అమిత్ షా డైరెక్షన్లో ‘మిషన్ తెలంగాణ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం పూర్తిగా దృష్టి సారించింది. పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణలో ‘మిషన్ తెలంగాణ’ అమలుకు చర్యలు మొదలుపెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార సాధనే లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసింది. దీనికోసం ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను రప్పించి.. ఒక్కొక్కరికి మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైఫల్యాలు, వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై ఎప్పటికప్పుడు నేరుగా అమిత్‌షాకే నివేదికలు అందించేలా వివిధ బృందాలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు పలు అంశాలపై సర్వేల ద్వారా క్షేత్రస్థాయి సమాచారాన్ని అమిత్‌షా కార్యాలయానికి చేరవేస్తున్నారు. ప్రజా సమస్యలపై చేపట్టే నిరసనలు, ఆందోళన వంటివి కూడా పూర్తిగా పార్టీ అధినాయకత్వం కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు... ఇతర రాష్ట్రాలకు చెందిన 26మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఎంపిక చేసి, ఒక్కొక్కరిని మూడు సీట్లకు ఇం చార్జీలుగా నియమించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా వారు తెలంగాణ లో పనిచేస్తారని తెలుస్తోంది. వీరంతా కూడా ఎన్నికలు, ప్రచార వ్యూహాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలను చూడనున్నారు. రాష్ట్రా నికి చెందనివారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా రాగద్వేషాలకు తావులేకుండా ఎన్నికల కార్యచరణను అమలు చేయవచ్చని నాయకత్వం భావిస్తోంది. అలాగే సమన్వయం కోసం.. ఎన్నికల్లో పోటీకి ఆసక్తిలేని, పార్టీ కోసం పనిచేసే సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే వీరంతా ఎన్నికలు పూర్తయ్యే దాకా పూర్తి సమయం పార్టీకే కేటాయించి పనిచేయాలనే నిబంధన పెట్టనున్నారు. ఇప్పటికే 19ఎస్సీ, 12ఎస్టీ నియోజకవర్గాల్లో కార్యా చరణ నిమిత్తం అనుభవజ్ఞులైన సీనియర్ నేతలు, మాజీ ఎంపీల నేతృత్వంలో 2 ప్రత్యేక సమన్వయ కమిటీలను కూడా రాష్ట్ర పార్టీ నియమించింది. సర్వేలతో నూతనోత్సాహం... రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభా స్థానాల్లోని పరిస్థితులపై ప్రజల నుంచి ‘ఫీడ్‌బ్యాక్’ రూపంలో వస్తు న్న సమాచారం బీజేపీలో ఉత్సాహాన్ని నింపుతు న్నట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు.. ఇలా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న పార్టీగా బీజేపీకి ఆదరణ పెరుగుతున్న తీరు స్పష్టమవుతోందని అంటున్నారు. ప్రజా సమస్యలు, ఇతరత్రా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇదే సమయంలో బీజేపీ ఇమేజీ పెరుగుతున్నట్లు సర్వేల్లో అభిప్రాయం వ్యక్తమవుతోందని చెబుతున్నారు. దీంతో జాతీయ నాయకత్వం తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టిందని ఒక ముఖ్యనేత ‘సాక్షి’కి వెల్లడించారు. బీజేపీలో చేరేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నా.. మంచి రోజులు లేని కారణంగా చేరికలు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఉగాది తర్వాత ఇతర పార్టీల్లోంచి చేరికలు ఊపందుకుంటుందన్నారు. -
యూపీ ప్రజలు ఎప్పుడో వాటిని దూరంగా విసిరేశారు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 5 రాష్ట్రాల్లోనూ బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకునేలా పథకాలు రూపొందించామని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఘన విజయం సాధిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్‌పైనే దృష్టి పెట్టాయని, బీజేపీ డబుల్ ఇంజిన్ గ్రోత్తో ముందుకెళ్తోందన్నారు. ఇక లఖీంపూర్ ఘటనపై స్పందించిన మోదీ.. యూపీ ప్రభుత్వం విచారణకు సహకరిస్తోందన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు చదవండి: Hijab Row: ముస్లిం విద్యార్థులకు ప్రియాంక మద్దతు.. బికినీ, జీన్స్, హిజాబ్ ఏదైనా అంటూ.. ‘బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేస్తాం. పాత సిద్ధాంతాలను యూపీ ప్రజలు ఎప్పుడో దూరంగా విసిరేశారు. ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే మా నినాదం.’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చదవండి: మేఘాలయలో కాంగ్రెస్ కల్లాస్.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు.. -
జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధం!
Election Rallies Ban Extended Till Jan 31: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధం కొనసాగుతుందని ఎలక్షన్ కమీషన్(ఈసీ) పేర్కొంది. ఈ మేరకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ప్రచార ర్యాలీలు నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. అంతేకాదు దేశంలోని కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా శనివారం రోడ్‌షోలు, ర్యాలీల పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ముఖ్య ఆరోగ్య కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలను మొదట జనవరి 15 వరకు నిషేధించిన తదుపరి మళ్లీ జనవరి 22 వరకు ఆ నిషేధాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాజకీయ పార్టీల భౌతిక బహిరంగ సభలకు లేదా పోటీ చేసే అభ్యర్థులకు జనవరి 28 నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2 కోసం ఫిబ్రవరి 1 నుంచి సడలింపులను అనుమతించింది. పైగా కోవిడ్-19 ఆంక్షల మేరకు నిర్దేశించిన బహిరంగ ప్రదేశాలలో ప్రచారం కోసం అనుమతించిన భద్రతా సిబ్బంది, వీడియోవ్యాన్‌లను మినహాయించి, ఇంటింటికీ ప్రచారం కోసం ఐదుగురు వ్యక్తుల పరిమితిని 10కి పెంచినట్లు తెలిపింది. (చదవండి: బలమైన స్థానం నుంచే పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్!) -
అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని రూ. 70 నుంచి 95 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 54 నుంచి 75 లక్షలు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిని రూ. 28 నుంచి 40 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 20 నుంచి 28 లక్షలకు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు) పెంచుతున్నట్లు ఈసీ గురువారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. రాబోయే ఎన్నికల నుంచి ఈ నూతన పరిమితులు అమల్లోకి వస్తాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
వ్యూహాత్మక ఎత్తుగడ: బీజేపీకి దీదీ సవాల్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ప్రత్యర్థులతో పోటీకి సై అంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల క్రితం తనకు అధికారాన్ని తెచ్చిపెట్టిన రైతు ఉద్యమ కేంద్రం నందీగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నట్టు సోమవారం ప్రకటించారు. అంతేకాదు వీలైతే కోల్‌కతాలోని భవానిపూర్, తూర్పు మిడ్నాపూర్‌లోని నందీగ్రామ్ రెండింటినుంచీ పోటీ చేస్తానని తెలిపారు. గత ఐదేళ్ళలో తొలిసారిగా నందీగ్రామ్ బహిరంగ సభలో ఆమె ఈ సంచలన ప్రకటన చేశారు. (సీఎం అభ్యర్థిపై ప్రకటన.. బీజేపీలో కలకలం) ఇటీవల పార్టీకి చెందిన సీనియర్ నేత, నందీగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారి తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీదీ తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఎన్నికల్లో భవానీపూర్ నుంచి గెలుపొందిన ఆమె దయచేసి చెడుగా భావించవద్దు, మీకోసం మంచి అభ్యర్థిని కేటాయిస్తానని భవానీపూర్ వాసులకు భరోసా ఇచ్చారు. తద్వారా బీజేపీకి, ఇటు సువేందుకు సవాలు విసిరారు. అంతేకాకుండా టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సువేందు అధికారికి చెక్ పెట్టాలనే వ్యూహంలో భాగంగానే మమత అక్కడ పోటీకి సిద్ధమైనట్లు టీఎంసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ‘నందీగ్రామ్ తనకు లక్కీ ప్లేస్ అని గతంలో ఎన్నోసార్లు రుజువైంది. 2016 ఎన్నికలలో నందీగ్రామ్ నుండే ప్రకటించా.. ఈ రోజు కూడా నందీగ్రామ్‌కు వచ్చాను. ఈ క్రమంలో 2021ఎన్నికలలో టీఎంసీ గెలిచి తీరుతుదంటూ’ ఆమె ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీకి నందీగ్రామ్ అత్యంత ప్రతిష్టాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఎందుకంటే 2006-08లో నందీగ్రామ్, సింగూర్‌లో భూసేకరణకు వ్యతిరేక సామూహిక ఉద్యమాలు బెనర్జీ రాజకీయ పునరుత్థానానికి మార్గం సుగమం చేశాయి. ఈ క్రమంలో 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు తద్వారా దీదీకి చెక్ చెప్పాలని బీజేపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత కొన్ని నెలలుగా బీజేపీ అగ్ర నాయకులు కసరత్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా, జెపీ నడ్డీ దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్లో 294 సీట్లకు మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. -
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు: మోదీ
బర్హి/బొకారొ: ఉప ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు అద్భుత తీర్పునిచ్చారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో తామిచ్చిన తీర్పును అపహాస్యం చేసి, వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికల్లో మంచి గుణపాఠం చెప్పారన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బర్హి, బొకారొల్లో జరిగిన బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించారు. ‘కర్ణాటక ఉప ఎన్నికలు మూడు విషయాలు చెబుతున్నాయి. ఒకటి, ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. రెండు, తమ తీర్పును అవమానించినవారికి గుణపాఠం చెప్పారు. మూడు, బీజేపీ ప్రజల కోసం పనిచేస్తుందని నమ్మారు’ అని అన్నారు. -
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్
సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల నగారా మోగింది. మొత్తం 81 అసెంబ్లీ స్ధానాలకు ఐదు దశల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నవంబర్ 30న తొలి దశ పోలింగ్, డిసెంబర్ 7న రెండో దశ, డిసెంబర్ 12న మూడో దశ, డిసెంబర్ 16న నాలుగో దశ, డిసెంబర్ 20న అయిదో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. ఇక వచ్చేఏడాది జనవరి 5తో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సీఈసీ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. కాగా, 2000లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జార్ఖండ్‌లో ఇవి నాలుగో అసెంబ్లీ ఎన్నికలు కావడం గమనార్హం. -
క్రాస్‌రోడ్స్‌లో కామ్రేడ్లు!
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీలు పూర్వవైభవం సాధించడం సాధ్యమా? ‘గుర్తింపు సంక్షోభం’ఎదుర్కొంటున్న ఈ పార్టీలు మళ్లీ ఉనికి చాటుకుని రాజకీయాల్లో నిలవగలవా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలే కమ్యూనిస్టు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులను వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎంతోపాటు ఎన్నికల రాజకీయాల్లో ఉన్న ఎంఎల్ పార్టీలు సైతం ‘క్రాస్‌రోడ్స్’లో నిలిచి ఉన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు విడివిడిగా ఎంచుకున్న ఎత్తుగడలు, వ్యూహాలు కుదేలయ్యాయి. కేవలం మూడుసీట్ల కోసం కాంగ్రెస్ ప్రజాఫ్రంట్‌లో సీపీఐ భాగస్వామి కావడం, తన సొంత సీటు కోసం పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తాపత్రయపడిన తీరుపై ఆ పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక న్యాయం, ప్రత్యామ్నాయ విధానాలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) కూటమి పేరిట కులాల ప్రాతిపదికన అభ్యర్థులను పోటీకి నిలబెట్టడంపై పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనుసరించిన పద్ధతులను ఆ పార్టీ కేంద్ర కమిటీ ఓ నివేదికలో ఎండగట్టింది. వేర్వేరు పద్ధతులు అవలంబించినా కనీసం ఒక్కో సీటు అయినా గెలవకపోగా, కొన్నేళ్లుగా ఈ పార్టీలకు సంప్రదాయ ఓటింగ్‌గా ఉన్న చోట్ల కూడా పడాల్సిన ఓట్లు పడకపోవడంతో ఎన్నికల రాజకీయాల్లో ఈ పార్టీల పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. గత ఏడు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ, ఏపీల్లో వామపక్షాలు ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయి... కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంతాలు వదిలేసి, పచ్చి అవకాశవాద రాజకీయాలకు పాల్పడటం వల్లే ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడింది. ఈ పార్టీల్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులు డబ్బు, కుల ప్రభావం వంటి పలు బలహీనతలకు లోనవుతున్నారు. ఇక కొందరు నాయకులైతే అవకాశవాద రాజకీయాలు సైతం చేస్తున్నారు. మధ్యతరగతి అవకాశవాద రాజకీయాలనే ప్రధాన స్రవంతి రాజకీయాలుగా ఈ పార్టీల నాయకులు తీసుకొస్తున్నారు. 1990లో మొదలైన నయా ఉదారవాద విధానాలతో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఈ పార్టీలపైనా డబ్బు ప్రభావం పడింది. డబ్బులు లేకపోతే ఎన్నికల్లో గెలవమనే పరిస్థితులు కమ్యూనిస్టు పార్టీల్లోనూ ఏర్పడ్డాయి. – డి.పాపారావు, ఆర్థిక విశ్లేషకులు కమ్యూనిస్టు పార్టీల ప్రతిష్ట దెబ్బతింది పార్లమెంటరీ రాజకీయాల్లో కమ్యూనిస్టుపార్టీల ప్రతిష్ట దెబ్బతింది. ప్రత్యామ్నాయ సమాజాన్ని సృష్టించే దిశలో కృషి చేయాల్సిన వామపక్షాలకు ఆ స్వప్నమే కొరవడితే పరిస్థితులు మరో రకంగా మారతాయి. అధికార, బూర్జువా పార్టీలు ఎన్నికల రాజకీయాలను డబ్బు, కులం, ఇతర ప్రభావాలతో తమకు అనుకూలంగా మలుచుకోవడంతో 1970 దశకం నుంచి కమ్యూనిస్టుపార్టీల అస్తిత్వం తగ్గుముఖం పట్టడం మొదలైంది. – ప్రొ.జి.హరగోపాల్, పౌరహక్కుల నేత సమస్యలపై పోరాటంలో విఫలం ప్రజల మౌలిక సమస్యలపై పోరాడటంలో కమ్యూనిస్టు పార్టీలు విఫలమవుతున్నాయి. ప్రజల ఎజెండానే చేపడుతున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో సంబంధా లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న రైతులు, ప్రజల సమస్యల లోతుల్లోకి వెళ్లలేకపోతున్నాయి. 1991 నుంచి నూతన ఆర్థికవిధానా లు, సంస్కరణల అమలు వల్ల జరిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించలేకపోయారు. – జీవన్‌కుమార్, మానవహక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) -
ఐదుచోట్ల బోణి కొట్టలే..!
మిర్యాలగూడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి మూడు దశాబ్దాలు దాటింది. ఇంతవరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో బోణీనే కొట్టలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలుండగా వివిధ రాజకీయ పార్టీలతో కుదుర్చుకునే పొత్తులలో భాగంగా కొన్ని నియోజకవర్గాలను టీడీపీకి కేటాయించే వారు. పొత్తులలో భాగంగా పోటీ చేసిన నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజవర్గంలో రెండు, మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయినా జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవలేదు. జిల్లాలో మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో 1999, 2004లో రెండు పర్యాయాలు పోటీ చేయడంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో 2014లో కూడా పోటీ చేసి ఇప్పటి వరకు ఓటర్లు అవకాశం ఇవ్వలేదు. మిర్యాలగూడలో.. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో 1957లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మూడు పర్యాయాలు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇక్కడ ఏడు పర్యాయాలు కాంగ్రెస్, ఐదు పర్యాయాలు సీపీఎం అభ్యర్థులు గెలవగా ఒక పర్యాయం పీడీఎఫ్ గెలిచింది. 1999లో సుందరి అరుణ టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేపాల శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలమైంది. అదేవిధంగా 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా బంటు వెంకటేశ్వర్లు పోటీ చేసి ఓడిపోయారు. దేవరకొండలో.. దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. 1978 నుంచి ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎస్టీలకు రిజర్వ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది పర్యాయాలు సాధారణ, ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. ఉపఎన్నికలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఐదు పర్యాయాలు, నాలుగు పర్యాయాలు సీపీఐ గెలుపొందగా రెండు పర్యాయాలు పోటీ చేసిన టీడీపీ ఓటమి పాలైంది. 1999లో టీడీపీ అభ్యర్థిగా నీనావత్ వశ్యానాయక్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ధీరావత్ రాగ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అదే విధంగా 2004లో టీడీపీ తరఫున సక్రునాయక్ పోటీ చేసి సీపీఐ అభ్యర్థి రవీంద్రకుమార్ చేతిలో ఓడిపోయారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా బిల్యానాయక్ కాంగ్రెస్ మద్దతులో పోటీ చేసి రవీంద్రకుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. మనుగోడులో.. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులతో పొత్తులో భాగంగా వారికే కేటాయించే వారు. కానీ ఇక్కడ కూడా రెండు పర్యాయాలు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మునుగోడు అసెంబ్లీ నియోజవర్గం 1967లో ఏర్పడగా ఇప్పటి వరకు 11 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కాగా ఐదు పర్యాయాలు కాంగ్రెస్, ఐదు పర్యాయాలు సీపీఐ, ఒక పర్యాయం టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన జెల్లా మార్కండేయులు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేతిలో, 2004లో టీడీపీ అభ్యర్థి కాశీనాథ్ పోటీ చేయగా సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇలా రెండు పార్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయి బోణీ కొట్టలేదు. నకిరేకల్‌లో.. కమ్యూనిస్టుల కోటగా పేరుగాంచింది నకిరేకల్. ఇక్కడ మొదటి నుంచీ కూడా టీడీపీ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకే సీటు కేటాయించారు. కానీ ఇక్కడ మూడు పర్యాయాలు టీడీపీ పోటీ చేసినా లాభం లేకుండా పోయింది. ఈ నియోజకవర్గం 1957లో ఏర్పడగా ఇప్పటికి 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కాగా పీడీఎఫ్, సీపీఐ, టీఆర్ఎస్ ఒక్కొక్క పర్యాయం, 8 పర్యాయాలు సీపీఎం, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కటికం సత్తయ్యగౌడ్ సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై ఓటమి పాలయ్యారు. హుజూర్‌నగర్‌లో.. హుజూర్నగర్ నియోజకవర్గం 1952లో ఏర్పడి 1972లో రద్దయింది. 2009లో కొత్తగా ఏర్పడింది. కాగా ఇక్కడ మొత్తం ఏడు పర్యాయాలు సాధారణ, ఒక పర్యాయం ఉప ఎన్నికలు జరిగాయి. కాగా మూడు పర్యాయాలు పీడీఎఫ్, నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఒక పర్యాయం స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడి హుజూర్నగర్ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆ సంవత్సరం టీడీపీ పోటీ చేయలేదు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన స్వామిగౌడ్ ఓటమి పాలయ్యారు. -
ఓటు బడ్జెట్..!
ముంబై: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతాంగానికి పెద్దపీట వేసింది. వ్యాపారులు, ఉద్యోగులకు కూడా పలు రాయితీలు ప్రకటించింది. 2014-15 సంవత్సరానికి సంబంధించి రూ. 4,103.3 కోట్ల లోటు బడ్జెట్‌ను విధానసభలో గురువారం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రిత్వశాఖను కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రవేశపెట్టిన ఈ బడె ్జట్‌లో రూ. 1,80,320.5 కోట్ల ఆదాయాన్ని, రూ. 1,84,423.28 కోట్ల ఖర్చును చూపారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు కొనసాగాయి. రైతుల ఆత్మహత్యను దృష్టిలో ఉంచుకొని వారికందించే కనీస సాయాన్ని ఈ ఏడాది రెట్టింపు చేసినట్లు మంత్రి అజిత్‌పవార్ తెలిపారు. ముఖ్యంగా కరువు ప్రభావిత ప్రాంతాల రైతులతోపాటు అకాల వర్షాలు, వడగండ్లతో పంట దెబ్బతిన్న రైతులకు ఇది ఎంతో ఊరటనిస్తుందన్నారు. 2014 జనవరి-జూన్ మధ్య కాలంలో నష్టపోయిన రైతుల విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. అంతేకాక పంట రుణాలపై వడ్డీని కూడా చెల్లిస్తామని, రుణాల చెల్లింపు గడువును పెంచుతామన్నారు. రుణాల వసూలు కోసం ఎటువంటి బలవంత చర్యలకు దిగబోమని స్పష్టం చేశారు. వ్యాపారవర్గాలకూ ఊరట... వ్యాపారవర్గాలకు ఊరట కలిగించేలా గత ఏడాది ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల పన్ను అమలు విషయంలో ఎటువంటి ఆమోదముద్ర వేయలేదు. వ్యాట్ టర్నోవర్ రిజిస్ట్రేషన్‌ను రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అంతేకాక రిజిస్టర్ట్ ఆడిటర్‌తో వ్యాపార లావాదేవీలను మదిం పు చే సి సమర్పించే నివేదికను ఇకపై కోటి రూపాయల ఆదాయం దాటినవారు మాత్రమే సమర్పిం చాలి. గతంలో దీని పరిమితి రూ. 60 లక్షలు ఉండే ది. ఎల్బీటీ స్థానంలో మళ్లీ ఆక్ట్రాయ్‌ను అమలు చే సేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా పవార్ చెప్పారు. నవీముంబై ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం కేంద్రం రూ. 14,574 కోట్లు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసిందని, మరింత సాయం కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. శివాజీ స్మారకానికి రూ. 100 కోట్లు గుజరాత్లో నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకాన్ని మించిన రీతిలో రాష్ట్రంలో రాజ్‌భవన్ సమీపంలోని అరేబియా సముద్ర తీరంలో నిర్మించాలనుకుంటున్న శివాజీ స్మారకానికి రూ. 100 ఇవ్వాలనే ప్రతిపాదనలు చేశారు. ఈ సమావేశాల్లోనే మరాఠ రిజర్వేషన్ సాక్షి, ముంబై: మరాఠ రిజర్వేషన్‌ను ప్రస్తుత శాసన సభ సమావేశాల్లోనే అమలుచేసే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో సమీక్ష జరిపినట్లు తెలిపారు. సాధారణంగా ఒకే పార్టీ 10, 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటే ఎంత మంచి పనులు చేసినా ప్రజలు మార్పు కోరుకుంటారని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారడానికి ఇది కూడా ఒక కారణమని సూచన ప్రాయంగా అన్నారు. కొన్ని కీలక నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోరాదని, ఇవి భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తాయని అన్నారు. మరాఠ రిజర్వేషన్‌పై ప్రభుత్వం ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చవాన్ చెప్పారు. ఇదిలాఉండగా లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. అందుకు మరాఠ సమాజం రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా రాజుకున్న వాతావరణాన్ని శాంతపర్చాలని ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే మరాఠ సమాజంలోని పేద వర్గాలకు విద్యా, ఉద్యోగ రంగంలో కొంత రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఎన్నికలు సమీపించడంతో ఒత్తిడి మరింత ఎక్కువైంది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మరాఠ సమాజం రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. డీఎఫ్ కూటమి ప్రభుత్వం మరాఠ సమాజాన్ని మోసం చేసిందని ప్రచార సభల్లో తీవ్రంగా విమర్శించింది. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా వాతావరణం ఏర్పడవచ్చనే ధీమాతో మరాఠ రిజర్వేషన్ బిల్లును అమలులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -
టిడిపి రెబల్ అభ్యర్థుల సస్పెన్షన్
హైదరాబాద్: టిడిపి తిరుగుబాటు అభ్యర్థులను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ కోసం శ్రమిస్తున్న కొందరు తమకు టికెట్ వస్తుందని ఆశించారు. అటువంటి వారు టికెట్ రాకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. టిడిపి-బిజెపి పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించిన స్థానాలలో కూడా కొందరు నామినేషన్లు వేశారు. అటువంటి తిరుగుబాటు అభ్యర్థులు ఎనిమిది మందిని టిడిపి సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన రెబెల్ అభ్యర్థులు - వారు నామినేషన్ వేసిన స్థానాలు 1.శర్మ - పిఠాపురం 2.కొట్టు సత్యనారాయణ - తాడేపల్లిగూడెం 3.టీవీ రామారావు - కొవ్వూరు 4.దుర్గాప్రసాద్ - కడప 5.జితేందర్ - గుంతకల్లు 6. జయరాజ్ - కురుపాం 7.కుంభా రవిబాబు - అరకు 8.అనిత - భీమిలి వీరిలో పార్టీ బిఫారాలు ఇచ్చినవారు కూడా ఉన్నారు. పార్టీ బిఫారమ్ ఇచ్చి ఇప్పుడు సస్పెండ్ చేయడమేమిటని పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సస్పెన్షన్ అంతా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామాగా కొందరు భావిస్తున్నారు. -
పలువురి నామినేషన్లపై అభ్యంతరాలు!
హైదరాబాద్: సీమాంధ్రలో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఈరోజు పరిశీలించారు. అయితే వివిధ రాజీకీయ పార్టీలకు చెందిన పలువురినామినేషన్లకు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది అభ్యర్థుల నామినేషన్లపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మరికొంతమంది నామినేషన్లపై ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా భీమిలి టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై రిటర్నింగ్ అధికారికి సీపీఎం ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లున్న గంటా శ్రీనివాసరావు పోటీకి అనర్హుడంటూ ఆర్వో సుబ్బరాజుకు సీపీఎం నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే నియోజకవర్గంలో జైసమైక్యాంధ్ర అభ్యర్థి వినోద్‌కుమార్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అతని వయసు కనీసం ఉండవలసిన దానికంటే రెండు రోజులు తక్కువగా ఉండడంతో ఆర్వో సుబ్బరాజు అతనిని పోటీకి అనర్హుడుగా ప్రకటించారు. ఇదే జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత కుల ద్రువీకరణ పత్రంపై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్వో చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌పై వైఎస్ఆర్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భార్య ఆస్తుల వివరాలు మురళీమోహన్ తప్పుగా చూపించారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై రిటర్నింగ్ అధికారి మురళీమోహన్ను వివరణ కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి నామినేషన్‌పై టీడీపీ నేత రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ఆధారంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని నిలదీయడంతో రాంబాబు పలాయనం చిత్తగించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి నామినేషన్‌పై మాజీ కౌన్సిలర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. జయనాగేశ్వర్ రెడ్డి అఫిడవిట్లో అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ అభ్యర్థి యామిని బాల నామినేషన్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారని ఆరోపించారు. అయినప్పటికీ ఆమె నామినేషన్‌ను ఆర్వో రామ్మోహన్ ఆమోదించారు. దాంతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లా గుంతకల్లు టీడీపీ అభ్యర్థి జితేందర్‌గౌడ్ నామినేషన్‌పై వైఎస్ఆర్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐటీ రిటర్న్ వివరాలు పొందుపరచలేదని ఫిర్యాదు చేశారు. దాంతో జితేందర్‌గౌడ్ నామినేషన్ నామినేషన్‌ను ఆర్వో పెండింగ్‌లో పెట్టారు. అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థి ఈరన్న నామినేషన్‌పై వైఎస్ఆర్ సిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈరన్నపై కర్ణాటకలో పలు కేసులు ఉన్నాయని తెలిపింది. నామినేషన్ పత్రంలో ఆ విషయాలు ప్రస్తావించలేదని పేర్కొంది. ఎన్నికల అధికారులు ఈ ఫిర్యాదునుఎ పరిశీలిస్తున్నారు. -
అభ్యర్థుల ఎంపికలోనే సత్తా చూపిన పార్టీ!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఉన్నత విద్యావంతులకు పెద్దపీట వేసింది. చదువులలో తమ ప్రతిభ కనబరిచిన పలువురు రాజకీయాలలో కూడా తమ సత్తా చాటడానికి ముందుకు దూసుకువస్తున్నారు. అటువంటివారికి ఈ పార్టీ అవకాశం కల్పించింది. ఈ పార్టీ ఎంపిక చేసిన లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులలో ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపిఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలు చేసినవారితోపాటు డాక్లర్లు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు ఉన్నారు. కొంతమంది కార్పోరేట్ కొలువులు కాదని, మరి కొంత మంది వైట్ కాలర్ ఉద్యోగాలు వదులుకొని ప్రజాసేవ పట్ల ఆసక్తి కనబరిచారు. అటువంటి వారిని వైఎస్ఆర్ సిపి అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఈ పార్టీ విశాఖ జిల్లా అరకు లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత గ్రూప్ వన్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రెడ్డి శాంతి కూడా ఉన్నత విద్యావంతురాలు. ఆమె భర్త ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. నెల్లిమర్ల నుంచి పోటీచేస్తున్న సురేష్ వృత్తి రీత్యా డాక్టర్. అమలాపురం నుంచి పోటీ చేస్తున్న పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు గతంలో జిల్లా పరిషత్ సిఇఓగా పనిచేశారు. అనపర్తి నుంచి పోటీ చేస్తున్న సూర్యనారాయణరెడ్డి, గన్నవరం నుంచి పోటీ చేస్తున్న దుట్టా రామచంద్రరావు, నరసరావుపేట నుంచి పోటీచేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ నుంచి పోటీలో ఉన్న నన్నపనేని సుధ, మదనపల్లి బరిలో ఉన్న పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, పూతలపట్టు నుంచి పోటీ చేస్తున్న సునీల్ డాక్టర్లే. ఏలూరు లోక్‌సభ అభ్యర్ధి తోట చంద్రశేఖర్ మాజీ ఐఏఎస్ అధికారి. తిరుపతి అభ్యర్ధి వరప్రసాదరావు, కుప్పం అభ్యర్ధి చంద్రమౌళిలు కూడా మాజీ ఐఏఎస్ అధికారులే. పెనమలూరు నుంచి పోటీ చేస్తున్న విద్యాసాగర్ డాక్టరేట్ పట్టా పొందారు. ప్రత్తిపాడు బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సుచరిత కూడా ఉన్నత విద్యావంతురాలే. ఆమె భర్త ఐఆర్ఎస్ అధికారి. పామర్రు నుంచి పోటీ చేస్తున్న ఉప్పులేటి కల్పన కూడా ఓ ఐఆర్ఎస్ అధికారి సతీమణే. చిత్తూరు లోక్‌సభ అభ్యర్ధి సామాన్య కిరణ్ డాక్టరేట్ పట్టా పొందారు. ఆమె భర్త ఐఏఎస్ అధికారి. చంద్రగిరి నుంచి బరిలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డాక్టరేట్ పట్టా పొందిన వ్యక్తే. వీరేకాకుండా పలువురు న్యాయవాదులు, ఉన్నత విద్యావంతులు కూడా ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరితో పాటు అనేకమంది పారిశ్రామికవేత్తలు కూడా ఎన్నికల రేసులో ఉన్నారు. తెలంగాణ విషయాని కొస్తే మాజీ పోలీస్‌బాస్ దినేష్‌రెడ్డి మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంబరిలో ఉన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా డాక్టర్ కటికనేని నగేష్, మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్ధిగా డాక్టర్ తెల్లం వెంకట్రావు పోటీలో ఉన్నారు. సత్తుపల్లి నుంచి డాక్టర్ మట్టా దయానంద్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హుజూర్నగర్ రేసులో ఉన్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి డాక్టరేట్ పట్టా పొందిన వ్యక్తే. వీరితొ పాటు అనేకమంది ఎంబీఏ, ఎంసీఏ చదివి విదేశాల్లో ఉద్యోగాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినవారు కూడా ఉన్నారు. ఉన్నత అధికారులుగా వ్యవహరించినవారు, విద్యావంతులు, యువకులు రాజకీయాలలోకి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. వైఎస్ఆర్ సిపి తరపున పోటీలో ఉన్న విద్యావంతుల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. అభ్యర్థి పేరు - పోటీ చేసే స్థానం - వారు నిర్వహించిన అధికార హోదా/ విద్యార్హతలు కొత్తపల్లి గీత - అరకు - గ్రూప్ వన్ ఆఫీసర్ రెడ్డి శాంతి - శ్రీకాకుళం - ఐఎఫ్ఎస్ అధికారి సతీమణి సురేష్ - నెల్లిమర్ల - డాక్టర్ గొల్ల బాబూరావు - అమలాపురం - మాజీ జెడ్పీ సీఈవో సూర్యనారాయణరెడ్డి - అనపర్తి - డాక్టర్ దేవీ ప్రియ మద్దాల - చింతలపూడి - డాక్టర్ దుట్టా రామచంద్రరావు - గన్నవరం - డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి - నరసరావుపేట - డాక్టర్ నన్నపనేని సుధ - వినుకొండ - డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి - మదనపల్లి - డాక్టర్ సునీల్ - పూతలపట్టు - డాక్టర్ తోట చంద్రశేఖర్ - ఏలూరు - మాజీ ఐఏఎస్ వరప్రసాద్‌రావు - తిరుపతి - మాజీ ఐఏఎస్ చంద్రమౌళి - కుప్పం - మాజీ ఐఏఎస్ కుక్కల విద్యాసాగర్ - పెనమలూరు - డాక్టరేట్ మేకతోటి సుచరిత - పత్తిపాడు - ఐఆర్ఎస్ అధికారి సతీమణి ఉప్పులేటి కల్పన - పామర్రు - ఐఆర్ఎస్ అధికారి సతీమణి సామాన్య కిరణ్ - చిత్తూరు - డాక్టరేట్ - ఐఏఎస్ అధికారి సతీమణి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి - చంద్రగిరి - డాక్టరేట్ వి.దినేష్‌రెడ్డి - మల్కాజ్గిరి - మాజీ ఐపీఎస్ కటికనేని నగేష్ - కరీంనగర్ - డాక్టర్ తెల్లం వెంకట్రావు - మహబూబాబాద్ - డాక్టర్ మట్టా దయానంద్ - సత్తుపల్లి - డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి - హుజూర్నగర్ - డాక్టరేట్ -
సార్వత్రిక ఎన్నికల బరిలో 180 మంది
వరంగల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని రెండు లోక్ సభ, 12 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధిం చి మొత్తం180 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వరంగల్ ఎం పీ నియోజకవర్గ స్థానం లో 10 మంది, మహబూబాబాద్‌లో 17 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ రెం డు లోక్‌సభ స్థానాల్లో మొత్తం 27 మంది బరిలో నిలిచారు. ఇక 12 శాసనసభ స్థానాలకు మొత్తం 153 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా జనగామ నుంచి 19 మంది అత్యల్పంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది అభ్యర్ధులు బరిలో మిగిలారు.