
చండీగఢ్: హరియాణాలోని ఉచానా కలాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ అత్రి కేవలం 32 ఓట్ల తేడాతో గెలుపు సాధించారు. అత్రి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బ్రిజేందర్ సింగ్‌న ఓడించారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేత దుష్యంత్ చౌతాలా ఐదో స్థానంలో నిలిచారని తెలిపింది. అత్రికి 48,968 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్‌కు 48,936 ఓట్లు పోలయ్యాయని ఈసీ పేర్కొంది.