Haryana assembly election results
-
హరియాణా బీజేపీఎల్పీ నేతగా సైనీ
చండీగఢ్/ పంచకుల: హరియాణా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నాయబ్‌సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. బుధవారం పంచకులలో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ నాయకుడిగా ఎన్ను కున్నారు. సైనీ పేరును ఎమ్మెల్యే క్రిషన్ కుమార్ బేడీ ప్రతిపాదించగా.. సీనియ ర్ నేత అనిల్ విజ్ బలపరిచారు. అనిల్ విజ్ సైతం సీఎం పదవిని ఆశించినప్పటికీ బీజేపీ అగ్రనేతలు సైనీ వైపు మొగ్గారు. పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సైనీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం సైనీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది. హరియాణా ముఖ్యమంత్రి రెండోసారి సైనీ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీయే సీఎంలు హాజరుకానున్నారు. -
విద్వేషాల ఫ్యాక్టరీ కాంగ్రెస్
నాగపూర్: దేశంలో కాంగ్రెస్‌తోపాటు అర్బన్ నక్సలైట్ల విద్వేషపూరిత కుట్రలను ప్రజలు ఎంతమాత్రం సహించడం లేదని, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుట్రలకు బలి కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. హరియాణాలో బీజేపీ విజయం దేశ ప్రజల మూడ్‌ను ప్రతిబింబిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ బాధ్యత లేని పార్టీ, అది విద్వేషాలను వ్యాప్తి చేసే ఫ్యాక్టరీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మధ్య విభజన తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రయత్నమని ఆరోపించారు. దేశంలో భిన్నవర్గాల మధ్య చిచ్చు పెడుతోందని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో రూ.7,600 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 10 నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి అధికారం కోసం రాష్ట్రాన్ని బలహీనపర్చాలని చూస్తోందని విమర్శించారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార మహాయుతి కూటమి రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని, ఇలాంటి పరిణామం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కేవలం అవినీతి అక్రమాల్లోనే వేగం కనిపించిందని ఎద్దేవా చేశారు హరియాణాలో కాంగ్రెస్‌కు గుణపాఠం విభజన రాజకీయాలు చేస్తూ స్వలాభం కోసం ఓటర్లను తప్పుదోవ పటిస్తున్న కాంగ్రెస్ పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గంలో భయోత్పాతం సృష్టించి, వారిని ఓటుబ్యాంక్‌గా మార్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం హిందువులను విభజించడమే లక్ష్యంగా కుల రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. హరియాణాలో చరిత్రాత్మక విజయం సాధించామని, మహారాష్ట్రలోనూ అంతకంటే పెద్ద విజయం సాధించబోతున్నామని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. ముస్లిం కులాలపై మాట్లాడరా? ముస్లిం వర్గంలోనూ ఎన్నో కులాలు ఉన్నాయని ఇప్పటిదాకా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా చెప్పలేదని ప్రధానమంత్రి మండిపడ్డారు. ముస్లిం కులాల ప్రస్తావన వచి్చనప్పుడల్లా కాంగ్రెస్ నేతలు నోటికి తాళం వేసుకుంటున్నారని విమర్శించారు. హిందువుల విషయంలో మాత్రం కులం కోణంలో మాట్లాడుతుంటారని ధ్వజమెత్తారు. హిందువుల్లో ఒక కులంపైకి మరో కులాన్ని ఉసిగొల్పడమే కాంగ్రెస్ విధానమని ఆక్షేపించారు. హిందువులు ఎంతగా చీలిపోతే రాజకీయంగా అంత లాభమని ఆ పార్టీ భావిస్తోందన్నారు. హిందువుల మధ్య నిప్పు పెట్టి చలి కాచుకోవాలన్నదే కాంగ్రెస్ ఆలోచన అని నిప్పులు చెరిగారు. -
కాంగ్రెస్‌కు అఖిలేష్ యాదవ్ షాక్.. ఆ ఎన్నికల్లో సీట్ల షేరింగ్‌కి ‘నో’
హర్యానా ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హస్తం పార్టీ ఓటమిపై ప్రతిపక్ష బీజేపీతోపాటు మిత్రపక్షాల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), ఆప్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ అతి విశ్వాసం, అహంకారమే ఎన్నికల ఫలితాల్లో ఓటమికి కారణమని మండిపడితున్నాయి. రాష్ట్రంలో ఇండియా కూటమి పోటీ చేయలేదని, కాంగ్రెస్ నేతలు అతివిశ్వాసంతో వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ, లేక ఆప్‌తో కలిసివెళ్లి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న అఖిలేష్ యాదవ్‌కి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కాంగ్రెస్‌కి భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది చివర్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 10లో 5 ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. ఈ అభ్యర్థనను ఎస్పీ తిరస్కరించింది. అయితే, ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ.. ఆ ప్రపోజల్‌ను ఎస్పీ తిరస్కరించింది.తాజాగా ఉప ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఆరింటికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. కర్హల్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను, సిసాము నుంచి నసీమ్ సోలంకి, ఫుల్పూర్ (ప్రయాగ్‌రాజ్) నుంచి ముస్తఫా సిద్దిఖీ, మిల్కిపూర్ (అయోధ్య) నుంచి అజిత్ ప్రసాద్‌కు, కతేహరి నుంచి శోభావాయ్ వర్మ, మజ్వాన్ స్థానం నుంచి జ్యోతి బింద్‌లకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్లు పేర్కొంది. అయితే వీటి పోలింగ్‌కు ఇంకా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఎన్నికల తేదీని ప్రకటించలేదు -
హర్యానా ఫలితాలు: ‘ఈవీఎం హ్యాకింగ్‌పై ఫిర్యాదు చేశాం’
ఢిల్లీ: హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావించారని మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా అన్నారు. అయితే.. హర్యానా ఫలితాలు తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని తెలిపారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృదం భేటీ అయింది. ఈసీతో భేటీ అనంతరం భూపిందర్ సింగ్ హుడా మీడియాతో మాట్లాడారు. ‘‘పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ అన్ని చోట్లా ఆధిక్యంలో ఉంది. అయితే ఈవీఎంల లెక్కింపులో మాత్రం చాలా వెనకంజలోకి వెళ్లిపోయింది. మాకు చాలా ఫిర్యాదులు అందాయి. పలు చోట్ల ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం మాకు హామీ ఇచ్చింది. మేము ఇచ్చిన అన్ని ఫిర్యాదులను అధికారులు పరిశీలిస్తున్నారు’’ అని తెలిపారు.#WATCH | Delhi: After meeting the Election Commission, former Haryana CM and Congress leader Bhupinder Hooda says, "These results of Haryana are surprising because everyone thought that Congress will form the government in Haryana. Be it IB, experts, survey reports, but what… pic.twitter.com/cWFgliYYqg— ANI (@ANI) October 9, 2024 కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు.‘‘ మేము ఎన్నికల సంఘం అధికారులను కలిశాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పత్రాలను సమర్పించాం. మా ఫిర్యాదులకు సానుకూలంగా స్పందించారు. ఎన్నికల సంఘం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరాం. మరో 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఫిర్యాదులను సైతం ఈసీకి సమర్పిస్తాం. మా అభ్యర్థులు ఈవీఎం బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులు లేవనెత్తారని తెలియజేశాం. పరిశీలన పూర్తయ్యే వరకు అన్ని ఈవీఏం యంత్రాలను సీలు చేసి భద్రపరచాలని మేము అధికారులను అభ్యర్థించాం. కర్నాల్, దబ్వాలి, రేవారీ, పానిపట్ సిటీ, హోడల్, కల్కా , నార్నాల్లలో ఈవీఎం హ్యాకింగ్‌కు సంబంధించిన ఆధారాలను సమర్పించాం. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఈసీని కోరాం’ అని అన్నారు.#WATCH | After meeting the ECI officials, Congress leader Pawan Khera says "We met the Election Commission officials and presented the documents of 7 Assembly constituencies...Their reaction as usual was a good smile and a good cup of tea but we need more. Complaints from 13 more… pic.twitter.com/qP7yEhJNPS— ANI (@ANI) October 9, 2024 -
కాంగ్రెస్ అతివిశ్వాసం.. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: ఆప్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బొర్లా పడిన కాంగ్రెస్‌కు ఎటు తోచని పరిస్థితి నెలకొంది. రాష్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాతో వ్యవహరించిన హస్తానికి ఫలితాలు కోలుకోలేని దెబ్బ కొట్టింది. అంచనాలన్నీ తలకిందలు కావడంతో.. అనూహ్య ఫలితాలతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ వైఖరిపై మిత్రపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన భాగస్వామ్య పక్షాలను హస్తం పార్టీ పట్టించుకోలేదని మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అతివిశ్వాసం మితిమీరిందని విమర్శిస్తున్నాయి.తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ మాట్లాడుతూ.. తన భాగస్వామ్య పక్షాలను హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వారికి అతివిశ్వాసం మితిమీరిపోయిందని, ఆ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు.లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ హర్యానాలో ఆప్, సమాజ్ వాదీ పార్టీకి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అతివిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్, అహంకార బీజేపీపై పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీకి ఉందని అన్నారు.ఢిల్లీలో పదేళ్లుగా ఒక్క అసెంబ్లీ సీటు గెలవని కాంగ్రెస్‌కు ఇటీవల లోక్‌సభలో మూడు సీట్లు ఇచ్చామని.. అయినప్పటికీ హరియాణా ఎన్నికల్లో మిత్రపక్షాలకు తోడుగా నిలవలేదని ఆప్ విమర్శించింది. హరియాణా ఎన్నికల్లో పొత్తుకోసం ఇండియా కూటమి చేసిన ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడింది.కాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని ముందుగా కాంగ్రెస్, ఆప్ భావించాయి. కానీ సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్-ఆప్‌ల మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో రెండు పార్టీలు స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి చవిచూశాయి. మెజార్టీ మార్కుకు కాంగ్రెస్ దూరం కాగా.. ఆప్ అసలు ఖాతా తెరవలేదు. దాంతో హ్యాట్రిక్ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. -
కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్.. అంత మాట అనేశారేంటి?
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం చతికిలపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ కాషాయపార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 48 చోట్ల, కాంగ్రెస్ 37 చోట్ల విజయం సాధించాయి. అటూ జమ్మూకశ్మీర్ ఎన్నికల్లోనూ బీజేపీ బాగానే పుంజుకుంది. అధికారంలోకి రాకలేకపోయినప్పటికీ సీట్లను గణనీయంగా పెంచుకుంది. సొంతంగానే 29 స్థానాల్లో జెండా ఎగురవేసింది. కాగా, హరియాణా ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఈవీఎంలపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ఈవీఎంలతోనే గెలిచారని గుర్తు చేశారు. హరియాణాలో బీజేపీ మళ్లీ గెలవడానికి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే కారణమని ఆరోపించారు.బుధవారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "ఈవీఎంలను నిందించడం పరిపాటిగా మారింది. ఈవీఎంలతోనే మీరు ఒకచోట గెలిచారు. మరోచోట ఓటమి ఎదురయ్యేసరికి వాటిని నిందిస్తున్నారు. నా అంచనా ప్రకారం హరియాణాలో బీజేపీ ఓడిపోవాల్సింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా చాలా అంశాలున్నాయి. పదేళ్లపాటు హరియాణాలో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో బీజేపీ లాభపడింది. ఎన్నికల పోరులో బీజేపీకి కొంచెం ఓపెనింగ్ ఇస్తే చాలు.. దాన్ని సద్వినియోగం చేసుకుంటుంద"ని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. చదవండి: ఏపీలాగే హరియాణా ఫలితాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలుహరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడించే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకుందని దుయ్యబట్టారు. "ద్వేష రాజకీయాలతోనే బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పుకునే వారు. ఈ విషయం తప్పని 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను చెప్పాను. హరియాణాలో బీజేపీ విజయానికి కారకులు ఎవరు? బీజేపీని ఓడించే అవకాశం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కానీ సువర్ణ అవకాశాన్ని ఆ పార్టీ జారవిడుచుకుంద"ని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: కాంగ్రెస్షహరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోయింది. హరియాణా ఫలితాలను అంగీకరించబోమని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ ఒత్తిడితో ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించింది. అంచనాలకు విరుద్ధంగా హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. -
పెరిగిన బలం.. బీజేపీలో చేరిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ.. తిరుగులేని పార్టీగా అవతరించింది. 90 స్థానాల్లో 48 చోట్ల గెలుపొంది ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.తాజాగా అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఇద్దరు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేలు దేవేందర్ కద్యన్, రాజేష్ జూన్.. కేంద్రమంత్రి, హర్యానా ఇంచార్జి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మోహన్‌లాల్ బడోలీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రెబల్‌గా బరిలోకి దిగిన కద్యన్ గనౌర్ నుంచి గెలుపొందగా.. రాజేష్ జూన్ బహదూర్‌ఘర్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు. అయితే మరో ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ గత మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. అయితే టికెట్ రాకపోవడంతో హిసార్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆమె కూడా బీజేపీకి తన మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. వీరి చేరికతో పదేళ్ల పాలన తర్వాత గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించిన బీజేపీకి మరింత బలం చేకూరింది. దీంతో అసెంబ్లీలో బీజేపీ బలం 52కి చేరనుంది. -
హర్యానా ఎన్నికల ఫలితాలపై.. స్పందించిన రాహుల్
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసినప్పటికీ.. ఫలితాలు మాత్రం అందుకు విరుద్దంగా వెలువడ్డాయి. ఊహించని విధంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో హర్యానా ఫలితాలపై, పార్టీ పరాజయంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. ఈ అనూహ్య ఫలితాలను తాము విశ్లేషిస్తున్నామని తెలిపారు. అయిలే పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో అగ్రమాలు జరిగాయని రాహుల్ ధ్వజమెత్తారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘జమ్మూకశ్మీర్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయం. ఇక హర్యానాలో వెలువడిన అనూహ్య ఫలితాలపై మేం విశ్లేషిస్తున్నాం. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. మద్దతు ఇచ్చినందుకు హర్యానా ప్రజలందరికీ, పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థికన్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుంది. ప్రజల గళాన్ని మేం వినిపిస్తూనే ఉంటాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అద్భుతమైన విజయం సాధించింది. కాంగ్రెస్ ఆశలు ఆవిరి చేస్తూ 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందింది. 1966లో రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి బీజేపీ ఇన్ని సీట్లు సాధించడం ఇదే తొలిసారి. -
హరియాణాలో ఆప్ గుండుసున్నా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి రెండు రకాల అనుభవాలు ఎదురయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఖాతా తెరవగా, హరియాణాలో మాత్రం చతికిలపడింది. జమ్మూకశ్మీర్‌లో ముస్లిం మెజార్టీ కలిగిన దోడా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గజయ్సింగ్ రాణాపై 4,538 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) సభ్యుడైన మెహ్రాజ్ మాలిక్‌కు 32,228 ఓట్లు, గజయ్సింగ్కు 18,690 ఓట్లు లభించాయి. దోడాలో నేషనల్ కాన్ఫరెన్స్, డీపీఏ పీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామమాత్రంగా ఓట్లు సాధించారు. మెహ్రాజ్ మాలిక్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2020లో డీడీసీ సభ్యుడిగా గెలిచారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనపై పదునైన విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించారు. తన విజయం ప్రజలకే దక్కుతుందని మాలిక్ అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా3 కోసం తన పోరాటం సాగిస్తానని చెప్పారు. ఆయన ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలుపు సొంతం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ‘ఆప్’ 7 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. హరియాణాలో 1.79 శాతం ఓట్లే హరియాణా అసెంబ్లీలో పాగా వేయాలని ఎన్నికల్లో గట్టిగా తలపడిన ఆమ్ ఆద్మీ పార్టీకి నిరాశే మిగింది. ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీకి కేవలం 1.79 శాతం ఓట్లు లభించాయి. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణా ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హరియాణాలో ఆప్ 89 స్థానాల్లో పోటీ చేసింది. చివరకు రిక్తహస్తమే ఎదురయ్యింది. 2014లో ఆ పార్టీ ఏర్పాటయ్యింది. హరియాణాలో ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, లోక్‌సభ ఎన్నికల్లో గానీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలుపు దక్కలేదు. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 46 సీట్లలో పోటీ చేయగా, ఎక్కడా కూడా ‘నోటా’ కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడం ఆప్‌ను దెబ్బతీసినట్లు పరిశీలకులు చెబుతున్నారు. హరియాణాకు రెండు వైపులా ఉన్న పంజాబ్, ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.అతివిశ్వాసం వల్లే ఓటమి: కేజ్రీవాల్న్యూఢిల్లీ: హరియాణాలో అతి విశ్వాసం వల్లే ఓడిపోయామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో ఓ సమావేశంలో మాట్లాడారు. అతి విశ్వాసం ఉన్నవారికి హరియాణా ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠం అని పేర్కొన్నారు. ఏ ఒక్క ఎన్నికనూ తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి సీటూ ముఖ్యమేనని, గెలుపు కోసం కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. హరియాణాలో ఇతర పార్టీలతో తాము పొత్తు పెట్టుకొని ఉంటే భిన్నమైన ఫలితాలు వచ్చేవని రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సుశీల్ గుప్తా చెప్పారు. -
32 ఓట్లతో దక్కిన విజయం
చండీగఢ్: హరియాణాలోని ఉచానా కలాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ అత్రి కేవలం 32 ఓట్ల తేడాతో గెలుపు సాధించారు. అత్రి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బ్రిజేందర్ సింగ్‌న ఓడించారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేత దుష్యంత్ చౌతాలా ఐదో స్థానంలో నిలిచారని తెలిపింది. అత్రికి 48,968 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్‌కు 48,936 ఓట్లు పోలయ్యాయని ఈసీ పేర్కొంది. -
హరియాణా ఎన్నికల్లో గెలుపు పట్టు పట్టిన వినేశ్ ఫొగాట్
-
99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది
న్యూఢిల్లీ: ప్రతికూల ఫలితాలిచి్చన హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పద్ధతి, ఈవీఎంల పనితీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ‘‘ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం(లోక్తంత్ర) ఓడిపోయింది. మరో వ్యవస్థ(తంత్ర) అక్రమంగా గెలిచింది’’ అంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కుట్రకు పాల్పడిందని పరోక్షంగా విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది ‘‘ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వెల్లడైన ఫలితాలివి. వీటిని మేం ఒప్పుకోం. పారదర్శకమైన, ప్రజాస్వామ్యయుత పద్ధతి ఓటమిపాలైంది. హరియాణా అంకం ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది ఇంకా కొనసాగుతుంది. బ్యాటరీ 99 శాతం నిండిన ఈవీఎంలలో బీజేపీ గెలిస్తే, 70 శాతం బ్యాటరీ ఉన్న ఈవీఎంలలో కాంగ్రెస్ గెలిచింది. ఇందులో కుట్ర దాగుంది. 12 నుంచి 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరిగితే మొదట ఆశ్రయించేది ఎన్నికల సంఘాన్నే.పారదర్శకంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అది. అందుకే తీవ్రమైన ఈ అంశంపై లిఖితపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. నిరీ్ణత గడుపులోగా చర్యలు తీసుకోవాలని పట్టుబడతాం. ఓట్ల లెక్కింపు, ఈవీఎంల పనితీరుపై చాలా నియోజకవర్గాల్లో సందేహాలు పెరిగాయి. ప్రతి ఒక్కరితో మాట్లాడాం. ఇది విశ్లేషణల సమయం కాదు. మా నుంచి విజయాన్ని లాక్కున్నారు. వ్యవస్థను అధికార పార్టీ దుర్వినియోగం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పు కోరుకుంటున్నారనే వాస్తవం ప్రతి ఒక్కరికీ తెలుసు. దీనికి ఫలితాలు దర్పణం పట్టట్లేవు.ఫలితాలను కాంగ్రెస్ అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం కౌంటింగ్, ఈవీఎంల పనితీరు, సమగ్రత ప్రశ్నార్థకంలో పడటమే. దాదాపు 3–4 జిల్లాల్లోని 12–14 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు విధానం, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానిక యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిడి మోపారు. ఇదంతా కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఒత్తిడే’’ అని జైరాం రమేశ్ అన్నారు. 200 ఓట్ల తేడాతో ఓడారు : ‘‘ 200 ఓట్లు, 300 ఓట్లు, 50 ఓట్లు.. ఇలా అత్యల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడారు. చక్కని ఆధిక్యత కనబరిచిన అభ్యర్థులు హఠాత్తుగా 100–200 ఓట్ల తేడాతో ఓడిపోవడమేంటి?. అవకతవకలు, అక్రమాల వల్లే ఇది సాధ్యం. అనూహ్య, దిగ్భ్రాంతికర పరిణామమిది. మార్పును కోరుకుంటూ హరియాణా ప్రజలు ఆశించిన దానికి, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వెల్లడైన ఫలితమిది’’ అని జైరాం ఆరోపించారు. ఎందుకంత నెమ్మది? : అంతకుముందు మధ్యాహ్నం వేళ జైరాం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ‘‘ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా ఈసీఐ వెబ్సైట్లో అప్డేట్స్ అనూహ్యంగా నెమ్మదించాయి. దీనికి కారణమేంటి? అదమ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి చందర్ ప్రకాశ్ 1,268 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ ఆయనకు గెలుపు సరి్టఫికేట్ ఇవ్వట్లేదు. ఈసీ వెబ్సైట్లో కూడా ఆయన గెలిచినట్లుగా చూపించట్లేదు. చివరి మూడు రౌండ్ల అప్డేట్స్ ఇవ్వట్లేదు. అనవసర ఆలస్యానికి కారణమేంటి?’ అని జైరాం ప్రశ్నించారు. ఆలస్యం జరగలేదు: ఈసీ : ఈసీ అప్డేట్స్ ఆలస్యమయ్యాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ ఆరోపణల్లో నిజం లేదు. బాధ్యతారాహిత్యంతో, తప్పుడు ఉద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల రూల్ నంబర్ 60 ప్రకారం ఆయా కౌంటింగ్ కేంద్రాల అధికారులు నడుచుకున్నారు. హరియాణా, జమ్మూకశీ్మర్‌లో లెక్కింపుపై అప్డేట్స్ ఆలస్యమయ్యాయన్న మీ మెమొరాండంలో ఎలాంటి వాస్తవాలు లేవు. ప్రతి ఐదు నిమిషాలకు అన్ని నియోజకవర్గాల నుంచి 25 రౌండ్ల ఫలితాలు అప్డేట్ అవుతూనే ఉంటాయి’ అని ఈసీ వివరణ ఇచి్చంది. ఈసీ వివరణపై కాంగ్రెస్ అసహనం వ్యక్తంచేసింది. ‘‘ తటస్థ వైఖరిని అవలంబించాల్సిన ఈసీ ఏకపక్షంగా విపక్ష పార్టీ విన్నపాలను తోసిపుచ్చడం సహేతుకం కాదు. ఫిర్యాదుపై సంప్రదింపుల స్థాయిని ఈసీ దిగజార్చింది’’ అని జైరాం అన్నారు. -
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. ట్రెండింగ్‌లో ‘జిలేబీ’
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌నిచ్చాయి. ఎగ్జిట్ పోల ఫలితాలతో గెలుపుపై గంపెడు ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీకి అధికారిక ఫలితాలు కోలుకోలేని దెబ్బని మిగిల్చాయి. కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. హర్యానా పోరులో బీజేపీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.90 స్థానాలకు గానూ 48 చోట్ల విజయ కేతనం ఎగురవేసి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.హర్యాణా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడంతో నెట్టింట జిలేబీ ట్రెండ్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో సందర్భంగా జిలేబీ తయారీపై రాహుల గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు బీజేపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. చదవండి:తీర్పును అంగీకరించడం లేదు: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్హర్యానాలోని గోహనలో తయారయ్యే మాతూరాం 'జిలేబీ'లకు చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ జిలేబీ ప్రస్తావన తెస్తూ..పెద్దఎత్తున ఈ జిలేబీలను దేశవ్యాప్తంగా తయారు చేసి అమ్మకాలు జరపాలని, విదేశాలకు సైతం వీటిని సరఫరా చేయాలని అన్నారు. జిలేబీ ఫ్యాక్టరీతో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 20,000 వేల మందిని 50,000 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. మాతూరాం వంటి వ్యాపారులు కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.అయితే రాహుల్ చెప్పిన జిలేబీ ఫ్యాక్టరీపై బీజేపీ ఛలోక్తులు విసిరింది. జిలేబీలు వేడివేడిగా తయారు చేస్తారని, అసలు ఆ స్వీట్ తయారీ ఎలాగో కూడా కూడా రాహుల్‌కు తెలియదని విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెలలో హర్యానాలో జరిపిన ఎన్నికల ప్రచారలోనూ గోహన జిలేబి ప్రస్తావన చేశారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే వారివద్ద ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను మార్చే ఫార్ములా ఉందని, ప్రధాని పదవి ఏమైనా మాథురామ్ జిలేబీనా పంచుకోవడానికి అని ప్రశ్నించారు. -
ఎన్నికల ఫలితాలు.. హర్యానా, జమ్మూలో ఓడిన ప్రముఖులు వీరే
జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవ్వడంతో.. పార్టీలు కంగుతున్నాయి. హర్యానా పోరులో బీజేపీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.90 స్థానాలకు గానూ 48 చోట్ల విజయ కేతనం ఎగురవేసి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.. ఇక హర్యానా ఫలితాలు హస్తానికి తీవ్ర నిరాశపరిచాయి. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పక్కా అంటూ ధీమా మీదున్న కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది.అటు జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ కూటమికి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. మెజార్టీ ఫిగర్‌ను దాటి 49 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎన్సీ నేత ఓమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ సీఎంగా అవతరించనున్నారు. బీజేపీ 29 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖ నేతలకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. పార్టీ చీఫ్‌లు, మాజీ సీఎంలు ఓటమిని చవిచూశారు.. వారిలోహర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ హోడల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భాన్.. బీజేపీ అభ్యర్థి హరీందర్ సింగ్ చేతిలో 2,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హోడల్ సీటును గెలుచుకున్న ఆయనతే 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన జగదీష్ నాయర్ చేతిలో ఓడిపోయారు. ఇక 2022 నుంచి హర్యానా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు.అభయ్ చౌతాలాఐఎన్ఎల్డీకి చెందిన అభయ్ చౌతాలా ఎల్లినాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి భరత్ సింగ్ బెనివాల్ చేతిలో 15,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు.అనురాగ్ ధండాకలయత్ నుంచి బరిలోకి దిగిన ఆప్ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనురాగ్ ధండా ఓటమి చెందారు. కలయత్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన ధండా.. ఏడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌కు చెందిన వికాస్ సహారన్ గెలుపొందారు.దుష్యంత్ చౌతాలాజననాయక్ జనతాపార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా భారీ ఓటమిని ఎదుర్కొన్నారు. ఉచానా కలాన్ నుంచి బరిలో దిగిన దుష్యంత్ చౌతాలా .. ఐదో స్థానానికి పరిమితయ్యారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ 32 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి బ్రిజేంద్ర సింగ్‌పై విజయం సాధించారు.దిగ్విజయ్ సింగ్ చౌతాలాననాయక్ జనతాపార్టీ మరో నేత దిగ్విజయ్ సింగ్ చౌతాలా దబ్వాలి నియోజకవర్గం నుంచి ఓటమిని చవిచూశారు. తన దూరపు బంధువు ఆదిత్య దేవి లాల్ చేతిలో ఓడిపోయారు. కాగా దిగ్విజయ్, ఆదిత్య ఇద్దరూ హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవి లాల్‌తో బంధుత్వం కలిగి ఉన్నారు. వీరు భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు.గెలిచిన ప్రముఖులుహర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఘన విజయం సాధించారు. లాడ్వా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన సైనీ.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్ సింగ్రోహాపై గెలుపొందారు.హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా విజయం సాధించారు. గర్హి సంప్లా-కిలోయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిపి మంజుపై 71, 465 ఓట్ల తేడాతో గెలుపొందారు.స్వతంత్ర అభ్యర్థి, భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హిసార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆమె బీజేపీకి చెందిన కమల్ గుప్తా, కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రారాపై 18,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జిందాల్ కుటుంబానికి చెందిన 74 ఏళ్ల మాతృమూర్తి.. మూడోసారి హిసార్‌లో గెలిచారు, గతంలో 2005, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. భారత రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫొగట్ హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా నియోజవర్గంలో తమ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై 5763 ఓట్ల తేడాతో వినేశ్ పైచేయి సాధించారు.జమ్ము కశ్మీర్- ఓటమి చెందిన నాయకులుఇల్తిజా ముఫ్తీపీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీఓటమి పాలయ్యారు. శ్రీగుఫ్వారా – బిజ్బెహరా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ మేరకు తన ఓటమిని ఇల్తిజా అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. తన గెలుపు కోసం కష్టపడిన పీడీపీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ చీఫ్ రవీందర్ రైనానౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్ర బీజేపీచీఫ్ రవీందర్ రైనా ఓటమి చెందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురీందర్ చౌదరి చేతిలో 7, 819ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈసీ ప్రకారం.. చౌదరికి 35,069 ఓట్లు రాగా, రైనాకు 27,250 ఓట్లు వచ్చాయి.పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా ఉన్న అఫ్జల్ గురు సోదరుడైన స్వతంత్ర అభ్యర్థి ఐజాజ్ అహ్మద్ గురూ ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ నియోజకవర్గంలో 26,846 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఇర్షాద్ రసూల్ కర్ విజయం సాధించారు.జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ అధినేత సయ్యద్ అల్తాఫ్ బుఖారీ శ్రీనగర్‌లోని చన్నపోరా నియోజకవర్గంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ముస్తాక్ గురూ చేతిలో ఓడిపోయారు.జమ్ముకశ్మీర్‌లోని రియాసి నుంచి బీజేపీ నేత కుల్దీప్ రాజ్ దూబే 18815 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన ముంతాజ్ అహ్మద్‌ను ఓడించాడు.ఇక జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన గందర్ బాల్, బుద్గాం స్థానాల్లో విజయం సాధించారు. -
తీర్పును అంగీకరించడం లేదు: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులుగా మారాయి. తమదే గెలుపని ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు ఫలితాలు ఊహించని షాక్‌నిచ్చాయి. 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేపట్టబోతున్నామనే హస్తం ఆశలను ఫలితాలు ఆవిరి చేశాయి. మొదట కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యం కనబరిచినప్పటికీ.. అనూహ్యంగా బీజేపీ పుంజుకొని ఎవరూ ఊహించని విధంగా.. హ్యట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ ఫలితాలు ఊహించలేదని, వీటిని తాము అంగీకరించడం లేదని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో జైరాం రమేష్ మాట్లాడుతూ.. హర్యానాలో ఫలితాలు పూర్తిగా ఊహించనివి అని తెలిపారు. పూర్తిగా ఆశ్చర్యం కలిగించాయని, ప్రతికూలమైనవని తెలిపారు.‘ఫలితాలు వాస్తవికతకు విరుద్ధంగా ఉన్నాయి. హర్యానాలో ప్రజలు కోరుకున్న మార్పు, పరివర్తనకు వ్యతిరేకంగా ఉన్నాయి. నేఈ పరిస్థితుల్లో నేడు మనం చూసిన ఫలితాలను అంగీకరించడం సాధ్యం కాదు. హర్యానాలో మనం చూసింది తారుమారైన విజయం. ప్రజల అభీష్టాన్ని, పారదర్శక, ప్రజాస్వామ్య ప్రక్రియలకు ఓటమి. హర్యానా అధ్యాయం పూర్తి కాలేదు.మూడు జిల్లాల్లో ఈవీఎం ట్యాంపరింగ్"మధ్యాహ్నం అంతా, నేను ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాను. వారు నా ఫిర్యాదులకు సమాధానమిచ్చారు, వారి సమాధానానికి నేను ప్రత్యుత్తరం ఇచ్చాను. కనీసం మూడు జిల్లాల నుంచి లెక్కింపు ప్రక్రియ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై మాకు చాలా తీవ్రమైన ఫిర్యాదులు అందాయి. వీటి సమాచారం సేకరిస్తున్నాం. నేడు లేదా రేపటికి దీనిని ఎన్నికల కమిషన్‌కు అందజేస్తాం.’ అని పేర్కొన్నారు.అంతకముందు కూడా కౌంటింగ్ అప్డేట్లో జాప్యంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈసీ వెబ్సైట్లో ఫలితాల అప్డేట్ లేదని, మందకొడిగా సాగుతోందని ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మీడియాలో వస్తోన్న ఫలితాల సరళితో పోల్చినప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్డేట్ ఆలస్యంగా ఉంటుందని తెలిపింది. వెబ్‌సైట్‌ను వాస్తవమైన, ఖచ్చితమైన గణాంకాలతో అప్డేట్ చేయాలంటూ తమ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరింది. దీనివల్ల హానికరమైన తప్పుడు వార్తలను నివారించవచ్చని తెలిపింది.అయితే కాంగ్రెస్ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. మీఆరోపణలు పూర్తిగా ఊహాజనితమని, బాధ్యతారహితంగా ఉన్నాయని పేర్కొంది. నిరాధార ఆరోపణలతో తప్పుదారి పట్టించవద్దని సమాధానమిచ్చింది. ప్రతి ఐదు నిమిషాలకు అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25 రౌండ్లు అప్డేట్ అవుతున్నాయని తెలిపింది. -
‘పెద్ద గుణపాఠం’.. హర్యానా ఎన్నికల్లో ఆప్ ఓటమిపై కేజ్రీవాల్
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. హర్యానాలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండగా.. జమ్మూ కశ్మీర్లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ తమ పరిధిని విస్తరించుకోవాలని చూసినా.. ఆశాభంగం తప్పలేదు. హర్యానాలో ఒక్కస్థానంలోనూ ఆప్ ఖాతా తెరవకపోగా.. జమ్ముకశ్మీర్‌లో ఓచోట బోణీ కొట్టింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మాలిక్ గెలుపుతో పంజాబ్, గుజరాత్ తర్వాత మరో రాష్ట్రంలో 'ఆప్' ఖాతా తెరిచినట్టు అయింది.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 89 స్థానాల్లో ఒంటరిగా పోటి చేసిన ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడంపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆప్ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హర్యానా ఎన్నికలు అతిపెద్ద పాఠాన్ని నేర్పాయని పేర్కొన్నారు. ఎప్పుడూ అతి విశ్వాసంతో ఉండకూడదనే విషయాన్నిఈ ఫలితాలు మనకు నేర్పించాయని అన్నారు. ‘హర్యానాలో ఫలితాలను గమనిస్తే.. ఎన్నికల్లో అతి విశ్వాసం ఉండకూడదనేది మనకు నేర్పిన గుణపాఠం. ఎన్నికలు సమీపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి స్థానం, ప్రతి ఎన్నిక కఠినమైనదే. గెలుపు కోసం తీవ్రంగా కష్టపడి పనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు.’ అంటూ కేజ్రీవాల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. కాగా ఇదే కేజ్రీవాల్ హర్యానా ఎన్నికల్లో ప్రచారం చేస్తూ.. ఆప్ మద్దతు లేకుండా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు.ఇక హర్యానాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. అకార వ్యతిరేకత ఉన్నప్పటికీ వరుసగా మూడోసారి అధికారిన్ని దక్కించుకునే దిశగా సాగుతోంది. మొత్తం 90 స్థానాలకు గానూ 50 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుంది. -
హర్యానాలో హ్యాట్రిక్ విజయం దిశగా బీజేపీ
-
తొలిసారి అసెంబ్లీకి.. హర్యానా ఎన్నికల్లో వినేశ్ ఫోగట్ విజయం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. క్షణక్షణం.. రౌండ్ రౌండ్ అధిక్యాలు తారుమారు అవుతుండటంతో తుది గెలుపు ఎవరిదో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది.తాజాగా భారత రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫొగట్ హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా నియోజవర్గంలో తమ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై 5763 ఓట్ల తేడాతో వినేశ్ పైచేయి సాధించారు. తొలి నుంచి లీడ్‌లో కొనసాగిన రెజ్లర్ వినేష్ ఫోగట్.. మధ్యలో వెనుకంజలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని విజయాన్ని ఆమె ఖాతాలో వేసుకున్నారు. #WATCH | #HaryanaElections | Jind: After winning from Julana, Congress candidate Vinesh Phogat says, "This is the fight of every girl, every woman who chooses the path to fight. This is the victory of every struggle, of truth. I will maintain the love and trust that this country… pic.twitter.com/glAaySd6Ta— ANI (@ANI) October 8, 2024 దీంతో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వినేశ్.. హర్యానా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ విజయంపై రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె ఒట్టి చేతులతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ తరువాత కొన్ని రోజులకే ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. జులానా నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు.ఇదిలా ఉండగా హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది..మూడో సారి అధికారం చేపట్టే దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 50, కాంగ్రెస్ 34, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. చదవండి: హర్యానా కౌంటింగ్ అప్డేట్లో జాప్యం.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు -
హర్యానా కౌంటింగ్ అప్డేట్లో జాప్యం.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు అంచనాలు మారుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ అన్నీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా.. ఫలితాలు అందుకు విరుద్దంగా వెలువడుతున్నాయి. ఫలితాల్లో తొలుత కాంగ్రెస్ దూసుకెళ్లగా తరువాత ఢీలా పడింది. అతితక్కువ స్థానాల్లో లీడ్‌లో ఉన్న బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న పోరులో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తుంది.అయతే తమదే గెలుపు అంటూ ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు హర్యానా ఫలితాలు షాక్‌ను ఇవ్వడంతో.. ఎన్నికల ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం జరుగుతోందంటూ హస్తం పార్టీ మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఉదయం 9 మరియు 11 గంటల మధ్య ఈసీ వెబ్సైట్లో ఫలితాల అప్డేట్ లేదని, మందకొడిగా సాగుతోందని లేఖలో పేర్కొంది.చదవండి: ఎగ్జిట్‌పోల్స్ తలకిందులు..‘హర్యానా’లో బిగ్ ట్విస్ట్మీడియాలో వస్తోన్న ఫలితాల సరళితో పోల్చినప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్డేట్ ఆలస్యంగా ఉంటుందని తెలిపింది. వెబ్‌సైట్‌ను వాస్తవమైన, ఖచ్చితమైన గణాంకాలతో అప్డేట్ చేయాలంటూ తమ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరింది. దీనివల్ల హానికరమైన తప్పుడు వార్తలను నివారించవచ్చని తెలిపింది.Here is my letter to @ECISVEEP on the inordinate and unacceptable delay in updating trends in the Haryana assembly elections pic.twitter.com/Lvq747seTz— Jairam Ramesh (@Jairam_Ramesh) October 8, 2024మరోవైపు ఈసీ వెబ్సైట్ అప్డేట్లో జాప్యంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయంలో మాదిరిగానే.. హర్యానా కౌంటింగ్ ఫలితాల సరళిని కూడా ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్డేట్ చేయడంలో జాప్యం కనిపిస్తోంది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్‌ను షేర్ చేస్తూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోందా..?ఈ అంశంపై ఇసికి ఫిర్యాదు చేశాం. మా ప్రశ్నలకు ఈసీ సమాధానమిస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
ఎగ్జిట్‌పోల్స్ తలకిందులు..‘హర్యానా’లో బిగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో ఐపీఎల్ మ్యాచ్‌ను తలపించాయి. ఫలితాల తొలి రౌండ్ల ట్రెండ్స్ పూర్తిగా యూటర్న్ తీసుకుని తీవ్ర ఉత్కంఠ రేపాయి. మంగళవారం(అక్టోబర్8) ఫలితాలు వెలువడడం మొదలైన కొద్దిసేపటికి హర్యానాలో లీడ్స్ పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. తొలి రౌండ్ల లీడ్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా మ్యాజిక్‌ఫిగర్ మార్కు 46ను కూడా దాటేసింది. ఇంకేముంది ఎగ్జిట్‌పోల్స్ చెప్పినట్లుగా కాంగ్రెస్‌దే ఈసారి హర్యానా పీఠమని అంతా అనుకున్నారు. అటు హర్యానా, ఇటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ శ్రేణులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరని టీవీ ఛానళ్లు కథనాలు కూడా వేయడం మొదలుపెట్టాయి. ఇంతలోనే వచ్చింది అసలు ట్విస్టు.ఒక్కసారిగా ఫలితాల ట్రెండ్స్ తలకిందులయ్యాయి. హస్తాన్ని వెనక్కినెట్టి కమలం జెట్ స్పీడుతో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది.కాంగ్రెస్‌ను కేవలం 30పైచిలుకు సీట్లకే పరిమితం చేసి బీజేపీ మ్యాజిక్‌ఫిగర్ మార్కు 46ను అవలీలగా దాటింది. ఈ ట్రెండ్‌ను బీజేపీ తర్వాత కూడా కొనసాగించి విజయం దిశగా పయనించింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థలతో పాటు రాజకీయ పండితులంతా తలలుపట్టుకున్నారు. సంబరాలు జరుపుకోవడం ఈసారి కమలనాథుల వంతైంది. ఎగ్జిట్‌పోల్స్‌కు అందని ఫలితాలు సాధిస్తామని తాము ముందే చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.జాట్లలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి కలిసొచ్చిందని, కురుక్షేత్ర ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది.కాగా, మరోపక్క జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉండగా బీజేపీ ఇక్కడ కూడా గట్టిపోటీ ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: హర్యానా,జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అప్డేట్స్ -
కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు
చండీగఢ్: హరియాణా, జమ్మూకశ్మీర్‌ల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుందని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో మొత్తం మూడు విడతలుగా, హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే. -
హరియాణ సీఎంగా ఖట్టర్ పదవీ స్వీకార ప్రమాణం
-
సీఎంగా ఖట్టర్.. డిప్యూటీ సీఎం దుష్యంత్..
చండీగఢ్: హరియాణ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హరియాణ గవర్నర్ సత్యదేవ్ ఖట్టర్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జేజేపీ, శిరోమణి అకాలీ దళ్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. 90 స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్ (46)ను సొంతంగా అందుకోలేకపోయింది. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్ చౌతాలా కింగ్‌మేకర్‌గా అవతరించారు. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా జేజేపీతో బీజేపీ అక్రమపొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. -
జైలు నుంచి అజయ్ చౌతాలా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత, హరియాణా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా ఆదివారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అజయ్ చౌతాలా 2013 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కాగా డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాలా నేడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అజయ్ చౌతాలాకు 14 రోజుల పాటు ఫర్లోకు (సెలవు) అనుమతి ఇచ్చింది. దీపావళి పండుగ రోజు ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు హరియాణా రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు. -
సీఎం ఖట్టర్.. డిప్యూటీ దుష్యంత్
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల్లో ‘హంగ్’ ఫలితాల అనంతరం హరియాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపడంతో పదవుల పంపిణీలోనూ దాదాపు స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్(65) కొనసాగనుండగా, జేజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా(31) డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీలోని 90 స్థానాలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ పార్టీ సాధించ లేకపోయింది. ప్రధాన పార్టీలైన బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెల్చాయి. ప్రజాతీర్పును జేజేపీ గౌరవించడం లేదంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై ఆయన..‘ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉంది. అయినా, ఈ ఎన్నికల్లో మేం కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయలేదు కదా?’ అని ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసిన నేతలు బీజేపీకి చెందిన సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ శనివారం గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరులు సమర్పించిన రాజీనామా పత్రాలను అందజేశారు. రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. దీంతోపాటు తమకు మెజారిటీ సభ్యుల మద్దతున్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ చేసిన వినతిని కూడా ఆయన అంగీకరించారు. అనంతరం సీఎం ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగ రోజు ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు హరియాణా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. తనతోపాటు డిప్యూటీ సీఎంగా దుష్యంత్, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారన్నారు. జేజేపీ, స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో 90 సీట్లున్న అసెంబ్లీలో తమ బలం 57కు పెరగనుందని ఆయన చెప్పారు. ఖట్టర్ వెంట వెళ్లిన జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా, స్వతంత్రులు కూడా గవర్నర్‌కు బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు లేఖలను అందజేశారు. గోపాల్ కందా మద్దతు తీసుకోం అంతకుముందు ప్రభుత్వ అతిథిగృహంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశం తమ నేతగా ఖట్టర్‌ను ఎన్నుకుంది. ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరయ్యారు. సీఎం పదవికి ఖట్టర్ పేరును ఎమ్మెల్యేలు అనిల్ విజ్, కన్వర్ పాల్ ప్రతిపాదించగా మిగతా వారు ఆమోదం తెలిపారని సమావేశం అనంతరం రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఖట్టర్ మంత్రి వర్గంలో ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తాము తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు. దుష్యంత్ తండ్రి జైలు నుంచి బయటకు చౌతాలా కుటుంబంలో విభేదాలు రావడంతో ఐఎన్ఎల్డీ పార్టీ నుంచి బయటకు వచ్చిన దుష్యంత్ గత ఏడాదే జేజేపీని స్థాపించారు. ఆయన తల్లి నైనా ఈ ఎన్నికల్లో బధ్రా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్ మునిమనవడు, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మనవడే దుష్యంత్. అధికారంలో ఉండగా ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఓం ప్రకాశ్‌తోపాటు ఆయన తనయుడు, దుష్యంత్ తండ్రి అయిన అజయ్ చౌతాలా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సిర్సా, హిసార్లలో ఉన్న దుష్యంత్ చౌతాలా నివాసాల వద్ద భద్రతను పెంచారు. అంతేకాకుండా, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా ఆదివారం నుంచి రెండు వారాలపాటు బయట గడిపేందుకు ఖైదీలకిచ్చే సెలవులాంటి వెసులుబాటు(ఫర్లో)ను అధికారులు కల్పించారు. -
హరియాణా సీఎంగా రేపు ఖట్టర్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. బీజేఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభా పక్ష నేతగా శనివారం ఎన్నికయ్యారు. దీంతో ఖట్టర్ ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో హరియాణాలో ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే. 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ శుక్రవారం పొత్తు పెట్టుకుంది. దీంతో ఖట్టర్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖట్టర్ ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. వివాదాస్పద స్వతంత్య్ర ఎమ్మెల్యే గోపాల్ కండా మద్దతు తీసుకోవడం లేదని మరో బీజేపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
‘దుష్యంత్ చౌతాలా నన్ను మోసం చేశారు’
చండీగఢ్ : జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా తనను మోసం చేశారని ఆ పార్టీ అభ్యర్థి, భారత ఆర్మీ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. బీజేపీతో జట్టుకట్టి హరియాణా ప్రజల తీర్పును దుష్యంత్ అపహాస్యం చేశారని విమర్శించారు. బీజేపీకి జేజేపీ బీ- టీమ్‌లా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని అన్నారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 సీట్లు గెలుచుకుని స్థానిక జేజేపీ హరియాణా కింగ్‌మేకర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దుతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ- కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేశాయి. అనేక పరిణామాల అనంతరం తమ పార్టీ బీజేపీకి మద్దతునిస్తున్నట్లు జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. ఇక జేజేపీ అండతో మరోసారి అధికారం చేపట్టనున్న బీజేపీ.. ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కేబినెట్లో తగిన ప్రాధాన్యం కల్పించనున్నట్లు సమాచారం. (చదవండి : హరియాణాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే) ఈ నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై జేజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తేజ్ బహదూర్ దుష్యంత్ తీరుపై మండిపడ్డారు. ‘దుష్యంత్ చౌతాలా నాతో పాటు హరియాణా ప్రజలను ఘోరంగా మోసం చేశారు. బీజేపీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు అదే పార్టీకి మద్దతునిచ్చారు. బీజేపీని రాష్ట్రం నుంచి, అధికారం నుంచి తొలగించాలంటూ ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఇక 2017లో భారత జవాన్లకు నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ సెల్ఫీ వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన తేజ్ బహదూర్‌ను భారత భద్రతా దళం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ(ఉత్తరప్రదేశ్)లో చేరిన ఆయన... 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ మహాకూటమి(బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల్డీ) అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ క్రమంలో హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబరులో జేజేపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు. కర్నాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం మనోహర్‌లాల్‌పై పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. -
మొన్న కుల్దీప్, నిన్న చిన్మయానంద్.. నేడు..
న్యూఢిల్లీ : యువతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న గోపాల్ కందను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం బీజేపీకి తగదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చురకలు అంటించారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే బీజేపీ నేతలను భారత నారీమణులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన విషయం తెలిసిందే. అయితే హరియాణాలో హంగ్ ఏర్పడటంతో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు స్థానిక జేజేపీతో పాటు స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదిపి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. దీంతో మరోసారి హరియాణాలో బీజేపీ సర్కారు కొలువుదీరనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రంగంలో దిగినప్పటికీ చేదు ఫలితం ఎదురుకావడంతో పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారం కోసం బీజేపీ నేరస్తులను సైతం ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తోందని ప్రియాంక విమర్శించారు. ఎమ్మెల్యే గోపాల్ కందను ఉద్దేశించి ట్విటర్లో బీజేపీ తీరును విమర్శించారు. ఈ మేరకు... ‘ తొలుత కుల్దీప్ సెంగార్, తర్వాత చిన్మయానంద్.. ఇప్పుడు గోపాల్ కందా.... ఆత్మగౌరవం ఉన్న ప్రతీ భారతీయ మహిళ బీజేపీని, బీజేపీ నాయకులను బహిష్కరించాలి. ఇకపై వారెన్నడూ మహిళల గౌరవం గురించి మాట్లాడే ధైర్యం చేయకుండా బుద్ధి చెప్పాలి’ అని మహిళలకు విఙ్ఞప్తి చేశారు. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ నేత కుల్దీప్ సెంగార్(తర్వాత పార్టీ నుంచి తొలగించారు) ప్రధాన నిందితుడన్న విషయం తెలిసిందే. అదే విధంగా చిన్మయానంద్ సైతం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక హరియాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భూపీందర్ సింగ్ హుడా కేబినెట్లో గోపాల్ కంద మంత్రిగా ఉండేవారు. అయితే గోపాల్ కందా వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ... ఆయన నిర్వహిస్తున్న ఏవియేషన్ కంపెనీలో పనిచేస్తున్న గీతిక శర్మ అనే ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ గోపాల్‌ను టార్గెట్ చేసి కేబినెట్ నుంచి వైదొలిగేలా చేసింది. అయితే ప్రస్తుతం హంగ్ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకే లోక్‌హిత్ పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందిన గోపాల్ కంద మద్దతు తీసుకుంది. కాగా ఈ విషయంపై స్పందించిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘గోపాల్ కందా నిర్దోషా లేదా అమాయకుడా అన్న విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. అయితే అధికారం చేపట్టే క్రమంలో నైతిక విలువలు కోల్పోవడం మంచిది కాదు. అయినా ఓ నిందితుడు ఎన్నికల్లో గెలుపొందినంత మాత్రాన అతడు సచ్ఛీలుడు కాలేడు అని ఆమె ట్వీట్ చేశారు. First Kuldip Sengar, then Chinmayanand, now Gopal Kanda....every self respecting Indian woman should boycott the BJP and its leaders if they EVER dare to speak of respecting women again.#SayNoToKanda — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 25, 2019 -
హరియాణాలో బీజేపీకే ‘జేజే’పీ
న్యూఢిల్లీ: హరియాణాలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడనుంది. గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో హరియాణాలో ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే. 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ(జేజేపీ)తో బీజేపీ శుక్రవారం పొత్తు పెట్టుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రిగా జేజేపీ నేత ఉంటారని బీజేపీ చీఫ్ అమిత్ షా, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌నే మళ్లీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉపముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలా ఉంటారని జేజేపీ వర్గాలు తెలిపాయి. హరియాణాలో రాజకీయ సుస్థిరత కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు దుష్యం త్ చౌతాలా తెలిపారు. హరియాణాలో మెజారిటీ వచ్చే అవకాశం లేదని అమిత్ షాకు ముందే సమాచారముందని, అందువల్ల ఫలితాల వెల్లడికి ముందే అమిత్‌షా దుష్యంత్ చౌతాలాతో మాట్లాడా రని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం శనివారం జరుగుతుందని, ఆ సమావేశానికి పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరవుతారని బీజేపీ హరియాణా ఇన్చార్జ్ అనిల్ జైన్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ శనివారం గవర్నర్‌ను కలిసి కోరతారని, దీపావళి తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ముందు స్వతంత్రుల మద్దతుతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీ గురువారం ఫలితాలు వెల్లడైనప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించింది. మెజారిటీకి ఆరు స్థానాలు అవసరమవడంతో.. తాజాగా గెలిచిన ఏడుగురు ఇండిపెండెంట్లతో సంప్రదింపులు జరిపింది. వారు కూడా మద్దతివ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా నివాసంలో మద్దతు లేఖను సీఎం ఖట్టర్‌కు అందజేశారు. స్వతంత్రుల్లో ఎక్కువమంది బీజేపీ రెబల్సే కావడం గమనార్హం. జేజేపీ మద్దతిచ్చేముందు, ఐఎన్ఎల్yీ ఎమ్మెల్యే అభయ్ చౌతాలా మద్దతూ తమకేనని బీజేపీ నమ్మకంగా ఉంది. గోపాల్ కందా మద్దతుపై అభ్యంతరం స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సమయంలో.. హరియాణ్ లోక్‌హిత్ పార్టీ నేత, ఎమ్మెల్యే గోపాల్ కందా నుంచి మద్దతు తీసుకోవడంపై వివాదం నెలకొంది. పలు క్రిమినల్ కేసులున్న స్వతంత్ర ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకుని పార్టీ నైతిక విలువలకు ద్రోహం చేయవద్దని సీనియర్ నేత ఉమాభారతి పార్టీ నాయకత్వాన్ని కోరారు. వెనక్కు తగ్గని కాంగ్రెస్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం భూపీందర్ హుడా కూడా శుక్రవారం ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ తదితరులతో భేటీ అయ్యారు. జేజేపీ(జననాయక్ జనతా పార్టీ)తో చర్చలు జరుపుతూనే, స్వతంత్రులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్‌తో జేజేపీ కలిసి వచ్చినప్పటికీ మెజారిటీకి మరో ఐదుగురు సభ్యుల బలం అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిపై హుడా స్పందిస్తూ.. ‘ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాల్లో మేం ఏమాత్రం వెనుకబడలేదు. స్వతంత్రులు చాలామంది మాతో కూడా టచ్‌లో ఉన్నారు’ అని పేర్కొన్నారు. స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారంటూ వస్తున్న వార్తలపై హుడా స్పందిస్తూ..‘వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారు. ప్రజా విశ్వాసాన్ని కాలరాస్తున్నారు. హరియాణా ప్రజలు వారిని ఎన్నటికీ క్షమించరు. వారిని చెప్పులతో కొట్టడం ఖాయం’అని మండిపడ్డారు. -
ఆ రెండుచోట్లా ఎదురుగాలి!
జాతీయ స్థాయిలో తిరుగులేని నేతగా నరేంద్రమోదీ స్థిరపడిన తర్వాత మహారాష్ట్ర, హరియాణాల్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశంలో రాజకీయ పవనాలు మారుతున్నాయన్నదానికి తొలి సంకేతాలను అందించాయి. మోదీ ప్రజాదరణను కోల్పోకున్నా ఆయన పార్టీ ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను చవిచూసింది. బీజేపీ పట్ల తమ వైఖరిని అయిదు నెలలలోపే మార్చుకున్నారంటే, జాతీయవాద భావోద్వేగాలు, పాక్ వ్యతిరేక ప్రచారం, మనోభావాలను ప్రేరేపించిన మతపరమైన అత్యుత్సాహం వంటి అనుకూల పవనాలన్నీ ఆర్థిక వ్యవస్థ పతనం, ఉద్యోగాలకు సంబంధించిన భయాందోళనల ముందు వెనకపట్టు పట్టాయన్న సూచనలను సంకేతిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమ ప్రాథమిక సమస్యల వైపు దృష్టి సారించినట్లే ఉంది. ప్రతిపక్షం మేలుకోవలసిన సమయమిది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చి ఆలస్యంగా వెళ్లాయి. చివరకు వాయు చలనాలు కూడా రివర్స్ అయ్యాయి. దేశరాజధానిలో ఇవి ప్రస్తుతం పొడిపొడిగా మారాయి. పంజాబ్, హరియాణాల మీదుగా పశ్చిమం నుంచి వచ్చిన వాయుప్రవాహాలు ఆ రాష్ట్రాల్లోని రైతులు పొలాల్లో తగులబెట్టిన ఎండు దుబ్బు పొగను భారీగా వెంటబెట్టుకొచ్చాయి మరి. ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నది ఆకురాలు కాలం. రుతుపవనాల మార్పు వంటి స్పష్టమైనది కాకున్నా రాజకీయ పవనాలు కూడా మారిపోయాయి. ఆర్థిక వ్యవస్థ స్తబ్ధతకు గురైనందున గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ మతంతో కూడిన ఉద్రేకభరితమైన జాతీయవాద పవనాలను రేకెత్తించి దుమారం లేపుతూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ప్రత్యేకించి బాలాకోట్, అభినందన్ ఘటనలకు ముందు బీజేపీ ఈ తరహా జాతీయ వాదాన్ని పరాకాష్టకు తీసుకెళ్లింది. గత ఏడు దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి భారత్ బాహ్య ప్రమాదాన్ని ఎదుర్కొనేదని, దీన్ని ఎవరూ పరిష్కరించలేని దశలో నరేంద్రమోదీ అంతిమంగా అడ్డుకున్నారని భారతీయ ఓటర్లు నమ్మేశారు. పైగా మోదీ పాక్ సమస్యను నిర్ణయాత్మకంగా, నిర్భయంగా సైనిక దండనతో పరిష్కరించేశారని, పాకిస్తాన్‌ని ఒంటరిని చేయడమే కాకుండా అంతర్జాతీయంగా భారత్ స్థాయిని పెంచివేశారని భారతీయ ఓటర్లు విశ్వసించారు. ఈ అభిప్రాయానికి వచ్చేశాక ఓటర్లు ఇతర పార్టీల పట్ల తమ విశ్వాసాలను విస్మరించేస్తారు కదా. ఓటరు అభిప్రాయాలు దానికనుగుణంగా మారిపోయాయి. అదేమిటంటే.. పాకిస్తాన్ ముస్లిం దేశం. అది జిహాద్ పేరుతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోంది. రక్త పిపాస కలిగిన జిహాదీలు యావత్ ప్రపంచానికే మహమ్మారిగా మారిపోయారు. ప్రపంచమంతటా ఇస్లామిక్ ప్రమాదం పొంచి ఉంది. భారతీయ ముస్లింలు కూడా దానికి మినహాయింపు కాదు. కాబట్టి హిందువులు తమకు తాముగా బలోపేతం కావలసి ఉంది. కానీ ఇలాంటి దురారోపణలు ఏవీ ఎన్నికల ప్రచారంలో పనిచేయలేదు. పేదలకు వంటగ్యాస్, మరుగుదొడ్లు, ఇళ్లు, ముద్రా రుణాలు వంటి పథకాలకోసం కేంద్రప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసిన దాదాపు రూ. 12 లక్షల కోట్ల నగదు పంపిణీనే ప్రచారంలో సమర్థ పలితాలను ఇచ్చింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు వారాల పాటు నేను ఇదే విషయాన్ని రాస్తూ, మాట్లాడుతూ వచ్చాను. ఎన్నికల పరిభాషలో చెప్పాలంటే ఇది జాతీయవాదం, మతం, సంక్షేమం అనే మూడూ సృష్టించిన విధ్వంసం అనే చెప్పాలి. వీటి ముందు ప్రతిపక్షం రఫేల్ యుద్ధవిమానాల కుంభకోణం గురించి చేసిన ప్రచారం అపహాస్యం పాలయింది. పెద్ద నోట్లరద్దు తర్వాత మన ఆర్థిక వ్యవస్థ వృద్ది పతనం, చుక్కలంటుతున్న నిరుద్యోగితను కూడా జనం ఉపేక్షించేశారు. ఈ వారం జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పవనాలు మారుతున్నాయన్న దానికి తొలి సూచికను అందించాయి. అయితే ఈ ఎన్నికల్లో మోదీ తన ప్రజాదరణను కోల్పోయినట్లు చెప్పలేం. అదే జరిగి ఉంటే కనీసం హరియాణాలో అయినా బీజేపీ ఓటమి పాలయ్యేది. బీజేపీకి అనుకూలంగా తగిన సంఖ్యలో ఓటర్లను మోదీ సాధించారనడంలో సందేహమే లేదు. అయితే అయిదు నెలలక్రితం హరియాణాలో బీజేపీ ఓట్ల శాతం 58 శాతం మేరకు ఉండగా ఎన్నికల తర్వాత అది 28 శాతానికి గణనీయస్థాయిలో పడిపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అత్యంత విశ్వసనీయతను సాధించిన ఇండియా టుడే–యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ప్రకటించిన ముందస్తు ఫలితాలు రాజకీయ పవనాల మార్పుకు సంబంధించి కొన్ని సూచనలను వెలువరించాయి. గ్రామీణ యువత, నిరుద్యోగిత, రైతులు, వ్యవసాయ కార్మికులు వంటి పలు విభాగాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే 9 శాతం అదనపు పాయింట్లతో బీజేపీ ఇప్పటికీ ఆరోగ్యకరమైన ఆధిక్యతలో ఉంటున్నప్పటికీ పంజాబీ జనాభా గణనీయంగా ఉన్న హరియాణాలో దాని మధ్యతరగతి, అగ్రకులాలతో కూడిన గ్రామీణ ప్రజానీకం కాంగ్రెస్‌ను ఒకరకంగా ఆదుకోవడం బీజేపీకి తీవ్ర సంకటపరిస్థితిని కలిగించింది. మహారాష్ట్రలో కూడా కుంభకోణాల బారిన పడకుండా, ప్రజామోదం పొందిన బీజేపీ ముఖ్యమంత్రి సుపరిపాలనను అందించినప్పటికీ, ఈదఫా ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగు పడటానికి బదులుగా గణనీయంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంది. ఇది ముందుగానే ఊహించిందే. అదేసమయంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి కీలకనేతలు నిఘా సంస్థల ఆగ్రహం బారిన పడతామేమోనన్న భీతితో బీజేపీలో చేరిపోయినందున ప్రతిపక్షం ర్యాంకు కూడా పడిపోయింది. పాలకపక్షానికి అనేక అనుకూలతలు ఉన్నప్పటికీ సాపేక్షికంగా ఇలాంటి ప్రతికూల విజయం దక్కిన నేపధ్యంలో బీజేపీని దెబ్బతీసింది ఎవరనే ప్రశ్న వస్తుంది. కాంగ్రెస్ కంటే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రత్యేకించి గ్రామీణ పశ్చిమ మహారాష్ట్ర్లలో బీజేపీని బాగా దెబ్బతీశారు. గుర్తుంచుకోండి.. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన 11 వారాల తర్వాత, హౌడీ మోదీ, అమెరికాలో ట్రంప్‌తో మోదీ చర్చలు జరిగిన అయిదు వారాల తర్వాత బీజేపీ ఇలాంటి ఫలితాలు సాధించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మామల్లపురంలో టీవీ మాధ్యమాల్లో మోదీ సంచలనం రేపిన కొద్ది కాలంలోనే ఇలా జరగడం గమనార్హం. పై అన్ని అనుకూల అంశాలు ఉన్నప్పటికీ ఓటర్లు చాలామంది బీజేపీ పట్ల తమ వైఖరిని అయిదు నెలలలోపే మార్చుకున్నారంటే, జాతీయవాద భావోద్వేగాలు, పాక్ వ్యతిరేక ప్రచారం, మనోభావాలను ప్రేరేపించిన మతపరమైన అత్యుత్సాహం వంటి అనుకూల పవనాలన్నీ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలకు సంబంధించిన భయాందోళనల ముందు వెనకపట్టు పట్టాయన్న సూచనలను సంకేతిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమ ప్రాథమిక సమస్యల వైపు దృష్టి సారించినట్లే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ప్రయాణాల్లో పేదలు, ఉపాధి కోల్పోయిన ప్రజలను తరచుగా కలుసుకునేవాళ్లం. ఆర్థిక వ్యవస్థ వికాసం గురించి మోదీ, బీజేపీ చేసిన వాగ్దానాలు ఆచరణలో అమలు కాలేదని, తాము దెబ్బతిన్నామని వీరు మాకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తాము దేశ ప్రయోజనాల కోసం మాత్రమే మోదీకి ఓటేస్తామని వీరన్నారు. దేశాన్ని రక్షించడానికి మోదీ ఉన్నారు కాబట్టి దేశం సురక్షితంగా ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగిత జనాలను నిజంగానే బాధపెడుతోంది. ఇక రైతులు గిట్టుబాటు ధరల లేమితో విసిగిపోయారు. నా ఉద్దేశంలో మతంతో కూడిన జాతీయవాద పవనాలను ఆర్థిక వ్యవస్థ స్తబ్దత, నిరుద్యోగం, అశాంతి, సాధారణ వ్యాకులత వంటివి ఈ ఎన్నికల్లో వెనక్కు నెట్టేసినట్లున్నాయి. పాకిస్తాన్‌పై తాజా దాడులు, కశ్మీర్, ఉగ్రవాదంపై పాలక పార్టీ, ప్రభుత్వం గొంతు చించుకున్నా అది ఎన్నికల ఫలితాలను మార్చలేకపోయాయి. అయోధ్యపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వనుందన్న వార్తలు కూడా హిందీ ప్రాబల్య ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. వీటికి అతీతంగా చాలామంది ప్రజలు తీవ్ర బాధలకు గురవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవాలని వీరు కోరుకున్నారు. హరియాణాలో, మహారాష్ట్రలో బీజేపీకి తగిలిన ఎదురు దెబ్బలు త్వరలో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయా లేదా అన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఒకటి మాత్రం నిజం. ప్రతిపక్షం ఎట్టకేలకు జూలు విదిలించాల్సిన తరుణం ఆసన్నమైంది. అన్ని విజయాలు ఒక నేతకే ఆపాదించే వ్యక్తి ఆరాధనా సంస్కృతిలో ఎదురుదెబ్బల నుంచి ఆ అధినేతను కాయడం కష్టమే అవుతుంది. ప్రత్యేకించి ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థులచే సంపూర్ణ ఓటమి చెందనప్పటికీ తక్కువ పాయింట్లతో విజయాన్ని నమోదు చేయడం పాలకపక్షానికి తీవ్ర ఆశాభంగాన్నే కలిగిస్తుంది. త్వరలోనే జార్ఖండ్‌లో, తర్వాత ఢిల్లీలో ఎన్నికలు జరగనుందున మోదీనే మళ్లీ ముందుపీటికి తీసుకురావాలా వద్దా అని బీజేపీ నిర్ణయించుకోవాలి మరి. మునిసిపల్ కార్పొరేషన్లపై, పోలీసులపై పూర్తి నియంత్రణ కేంద్రం చేతిలో ఉంటున్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కాంగ్రెస్ కంటే మెరుగ్గానే రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. భారత్‌లో రాజకీయాలు మారడానికి సంవత్సరాల సమయం పడుతుంది కానీ రాజకీయ సీజన్లు మాత్రం శరవేగంగా మారతాయి. దేశరాజధానిలో ఇప్పుడున్న పొడి వాతావరణం, ఆకురాలు కాలం ప్రభావం ఏమిటో మీరు గ్రహించవచ్చు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కాషాయ పార్టీకే ఇండిపెండెంట్ల మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో తిరిగి పాలనా పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ సంసిద్ధమైంది. మేజిక్ ఫిగర్‌కు ఆరు సీట్లు అవసరమైన క్రమంలో పాలక బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు స్వతంత్ర ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని హర్యానా లోక్‌హిత్ పార్టీ చీఫ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గోపాల్ కందా చెప్పారు. బీజేపీకి బేషరుతు మద్దతు ఇచ్చేందుకు ఆరుగురు ఇండిపెండెంట్లు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా బీజేపీ 40 మంది సభ్యులకే పరిమితమైంది.కాంగ్రెస్ 31 స్ధానాల్లో, జేజేపీ 10 స్ధానాలు, ఇతరులు 9 స్ధానాల్లో గెలుపొందారు. హరియాణా అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని 8 మంది ఇండిపెండెంట్లను ఆశ్రయించింది. బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించేందుకు హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఢిల్లీ చేరుకున్నారు. తాము హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పది స్ధానాలు పొందిన జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. హరియాణాపై ఆశలు వదులుకోలేదని ఆ పార్టీ నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా పేర్కొనడం గమనార్హం. -
కింగ్‌మేకర్‌గా ఒకే ఒక్కడు..
చండీగఢ్ : హరియాణాలో హంగ్ అసెంబ్లీ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి సభ్యుడూ కీలకంగా మారారు. గతంలో తాము రాజకీయంగా టార్గెట్ చేసిన వ్యక్తి హరియాణా లోక్‌హిత్ పార్టీని స్దాపించి ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తానొక్కడే గెలుపొందడంతో కాషాయ నేతలు అతడిని తమ శిబిరంలోకి రప్పించేందుకు ప్రయత్నించారు. బీజేపీకి మద్దతు ప్రకటించి ఢిల్లీకి చేరిన స్వతంత్ర ఎమ్మెల్యేల బృందంలో ఆ వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా కూడా ఉన్నారు. హరియాణాలో ఐఏఎఫ్ విమానంలో గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరిన వారిలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రంజీత్ సింగ్‌తో పాటు గోపాల్ కందా ఫోటో ఉండటం ఈ వార్తలకు బలం చేకూర్చింది. కాగా 2012లో తన ఏవియేషన్ కంపెనీలో పనిచేసే ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు పాల్పడటంతో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన భూపీందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కేబినెట్ నుంచి ఆయన వైదొలిగారు. గోపాల్ కందా వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఎయిర్‌హోస్టెస్ గీతికా శర్మ సూసైడ్ నోట్లో పేర్కొనడంతో ఆయనను అరెస్ట్ చేశారు.ఇక తొలుత షూ వ్యాపారంలో భారీ నష్టాలు రావడంతో 1998లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన అడుగుపెట్టారు. 2007లో గోపాల్ తన కారులో నలుగురు నేరస్తులతో కలిసి పట్టుబడటంతో ఆయన దందాలపై దర్యాప్తు చేయాలని కేంద్రం హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పద ఎమ్మెల్యే, హర్యానా లోక్‌హిత్ పార్టీ తరపున ఏకైక సభ్యుడు గోపాల్ కందా గతంలో తనను రాజకీయంగా టార్గెట్ చేసిన బీజేపీకి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తుండటం గమనార్హం. -
హరియాణాలో స్వతంత్రుల వైపు బీజేపీ చూపు..
చండీగఢ్ : ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా హరియాణాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ, ఇండిపెండెట్లు కీలకంగా మారారు. జేజేపీకి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌లు గాలం వేస్తుండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి సహకరిస్తారనే విషయంలో దుష్యంత్ చౌతాలా ఇంకా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. ఇక జేజేపీ మద్దతు లభించని పక్షంలో స్వతంత్రుల సహకారంతో రెండోసారి పాలనాపగ్గాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సన్నాహాలు ముమ్మరం చేశారు. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 46 కాగా, బీజేపీకి 40 స్ధానాలే దక్కిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్‌కు 31 స్ధానాలు లభించగా, జేజేపీకి 10 స్ధానాలు, 8 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఒక స్ధానం ఐఎన్ఎల్డీ దక్కించుకుంది. ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉండగా బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు పలువురు ఢిల్లీకి క్యూ కట్టినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు అభ్యర్ధులుగా పోటీచేసిన ముగ్గురు బీజేపీ నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా గెలుపొందడంతో కాషాయ పార్టీకి వారి మద్దతు ఖాయమైంది. -
టార్గెట్ హరియాణా : సోనియాతో భూపీందర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ మేజిక్ ఫిగర్‌కు 6 సీట్ల దూరంలో ఉండటంతో బీజేపీయేతర పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహాలు ముమ్మరం చేసింది. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యులు అవసరం కాగా బీజేపీ 40 స్ధానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ మెరుగైన సామర్ధ్యం కనబరిచి 31 స్ధానాల్లో గెలుపొందింది. ఇక పది స్ధానాలు గెలుచుకున్న దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కింగ్‌మేకర్‌గా మారింది. మరో ఏడు స్ధానాల్లో గెలుపొందిన స్వతంత్రులు సైతం కీలకంగా మారారు. వీరి మద్దతు కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి. హరియాణా వ్యవహారాలపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా ఢిల్లీ చేరుకున్నారు. రోహ్తక్ జిల్లా గర్హి సంప్లా-కిలోల్ నియోజకవర్గం నుంచి హుడా గెలుపొందారు. ఇండిపెండెట్లతో పాటు జేజేపీ మద్దతు కూడగట్టేందుకు హుడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. -
హర్యానాలో హంగ్ అసెంబ్లీ
-
వేచి చూసే ధోరణిలోనే కాంగ్రెస్
న్యూఢిల్లీ: హర్యానాలో తిరిగి అధికార పగ్గాలు చేపట్టడానికి బీజేపీ ఒకపక్క వ్యూహరచన చేస్తుండగా, మరోపక్క ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. 90 సీట్ల హర్యానా అసెంబ్లీలో బీజేపీ అధికారానికి ఆరు సీట్ల దూరంలో ఆగిపోయింది. 10 స్థానాలు సంపాదించిన దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో అవగాహనకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోవంక కాంగ్రెస్ సైతం చౌతాలాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వేచిచూసే ధోరణిని అవలంభిస్తూనే... బీజేపీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టకుండా వీలైన అన్ని చర్యలూ తీసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇందుకు బీజేపీయేతర పార్టీలు, వాటి నేతలు ఏకతాటిపైకి రావాలనీ కోరుతోందని సమాచారం. ఢిల్లీకి కాంగ్రెస్ మాజీ సీఎం ఆయా అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమైన ఆయన, శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, హర్యానా ఇన్చార్జ్ గులాంనబీ ఆజాద్, సీనియర్ పార్టీ నేత అహ్మద్ పటేల్‌తో కూడా హుడా సమావేశం కానున్నారు. నిజానికి గురువారం ఉదయమే సోనియాగాంధీ హుడాకు ఫోన్ చేసి ఎన్నికల తీర్పు, పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా బీజేపీయేతర పార్టీలతో గ్రాండ్ అలయెన్స్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
హరియాణాలో హంగ్
న్యూఢిల్లీ/చండీగఢ్: హరియాణాలో రెండోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు తప్పాయి. రాష్ట్ర అసెంబ్లీలో 90 సీట్లుండగా ‘ఈసారి 75కు పైగా సీట్లు మనవే’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ... ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలు కూడా సాధించలేకపోయింది. సీఎం ఖట్టర్ కేబినెట్లోని మెజారిటీ మంత్రులు అనూహ్యంగా ఓటమి చవిచూశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా బీజేపీతో పోటీగా మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఫలితాల సరళిని బట్టి కొత్తగా అవతరించిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారింది. 90 సీట్లున్న హరియాణా అసెంబ్లీలో తాజా ఫలితాలను బట్టి బీజేపీ 40, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి. మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన జేజేపీ 10 సీట్లలో, స్వతంత్ర అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీటిని బట్టి, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు దుష్యంత్ చౌతాలాతో పాటు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్లు కానున్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తొహానా స్థానం నుంచి ఓటమి పాలైన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ సుభాష్ బరాలా... పార్టీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బీజేపీయేతరులు ఏకం కావాలి: హూడా బీజేపీయేతర పక్షాలన్నీ తమతో చేతులు కలపాలని కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా పిలుపునిచ్చారు. మిశ్రమ ఫలితాల నేపథ్యంలో అధికారం చేజిక్కించుకునేందుకు యంత్రాంగాన్ని వాడుకుని స్వతంత్రులపై ఒత్తిడి పెంచుతూ, వారిని బీజేపీ ఎటూ వెళ్లకుండా చేస్తోందని హూడా ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి సెల్జా మాట్లాడుతూ.. ‘బీజేపీని ప్రజలు తిరస్కరించారు. న్యాయం కోసం కొత్త మార్పును కోరుకున్నారు’ అని పేర్కొన్నారు. ఇది బీజేపీకి నైతిక ఓటమి: కాంగ్రెస్ హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి నైతిక ఓటమి రుచి చూపాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఉన్న 90 సీట్లలో 47 సీట్లతో గతంలో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు 40 స్థానాలకు పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఇప్పుడు దాదాపు 31 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తుకు గతంలో కంటే మంచి ఫలితాలు వచ్చాయని, బీజేపీ మెజార్టీ తగ్గిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది: దుష్యంత్ తాజా ఫలితాలపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా మాట్లాడుతూ.. సీఎం ఖట్టర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ‘ఎవరికి మద్దతిచ్చేదీ ఇప్పుడే చెప్పలేం. ముందుగా మా పార్టీ తరఫున గెలిచిన వారితో సమావేశం ఏర్పాటు చేసి, అసెంబ్లీ నేతను ఎన్నుకుంటాం. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా’ అని అన్నారు. 75 సీట్లలో గెలవాలన్న బీజేపీ లక్ష్యంపై ఆయన స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నారు. అందుకే ఆ పార్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది’అని వ్యాఖ్యానించారు. గెలిచిన ప్రముఖులు వీరే... ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై సుమారు 45 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సీనియర్ మంత్రి అనిల్ విజ్ అంబాలా కంటోన్మెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిపై 20 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ అతిరథులైన మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా, కుల్దీప్ బిష్ణోయి, కిరణ్ ఛౌధరీ విజయం సాధించారు. ఉచానా కలాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రేమ్లతపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా 47వేలకు పైగా ఓట్లతో ఘన విజయం నమోదు చేసుకున్నారు. ఇంకా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీకి చెందిన ఒకే ఒక అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా ముందంజలో ఉండగా హరియాణా లోఖిత్ పార్టీ (హెచ్ఎల్పీ) అధ్యక్షుడు గోపాల్ కందా సిర్సా స్థానంలో గెలుపు సాధించారు. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ విజయం సాధించారు. ప్రముఖుల ఓటమి హరియాణా మంత్రివర్గంలోని కెప్టెన్ అభిమన్యు, కవితా జైన్, కృష్ణకుమార్ బేడీతో పాటు రెజ్లర్ బబితా ఫొగట్ ఓటమిపాలయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా, అసెంబ్లీ స్పీకర్ కన్వర్పాల్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ ఓటమిపాలయ్యారు. లోక్తంత్ర సురక్ష పార్టీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ రాజ్‌కుమార్ సైనీ గొహానాలో ఓడిపోయారు. జాట్ల కంచుకోటలో కాంగ్రెస్ జాట్ల కంచుకోటలైన రొహ్తక్, జజ్జర్, సోనిపట్ జిల్లాల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కేవలం సోనిపట్ జిల్లాలోని రాయ్ సీటును మాత్రం బీజేపీ గెలుచుకోగలిగింది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ 10చోట్లకు పైగా గెలిచి, మరో 11 చోట్ల ముందంజ లో ఉంది. దక్షిణ హరియాణా, ఫరీదాబాద్ జిల్లాల్లో బీజేపీ ప్రభావం చూపగలిగింది. బీజేపీ ముందు 3 దారులు!! హంగ్ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఏం చేస్తాయి? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తమ నేత దుష్యంత్ చౌతాలాని ముఖ్యమంత్రిని చేస్తే మద్దతిస్తామని ఇప్పటికే జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) తేల్చి చెప్పింది. బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈ విషయంలో బీజేపీ ముందు మూడు మార్గాలున్నాయి. 1. మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రిగానే ఉంచి దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు బీజేపీ ముందుకు రావచ్చు. ఇది బీజేపీకి సమస్యేమీ కాదు. అయితే జాట్యేతర ముఖ్యమంత్రి ఖట్టర్ కింద డిప్యూటీ సీఎంగా చేరడం జాట్ ఓట్ల పునాదులపై గెలిచిన దుష్యంత్ చౌతాలా రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారవచ్చు. 2. జేజేపీ మినహా ఇతర స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పొందే అవకాశం బీజేపీకి ఉంది. ఇప్పటికే ఏడుగురు స్వతంత్రులతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ఖట్టర్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టవచ్చు. హెచ్ఎల్పీ అధ్యక్షుడు గోపాల్ గోయల్ కందా, సప్నా చౌదరికి బీజేపీ వర్గాలతో సాన్నిహిత్యం ఉంది. వారిద్వారా మిగిలిన స్వతంత్ర అభ్యర్థులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. 3. ఈ ఎన్నికల్లో జాట్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించే అవకాశమూ ఉంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కనుక బీజేపీ సీఎం పదవిని దుష్యంత్ చౌతాలాకు అప్పగించే అవకాశమూ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే అది అంత తేలిక కాదు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి సీఎంగా.. బీజేపీ నేత, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రోహ్తక్ జిల్లా మహమ్ తెహసిల్‌లోని నిదాన గ్రామంలో 1954 మే 5న జన్మించారు. తండ్రి హర్బాస్ లాల్ ఖట్టర్ వ్యాపారి. భారతదేశ విభజన సమయంలో ఇక్కడకు వలస వచ్చిన కుటుంబానికి చెందినవారు. ఖట్టర్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అవివాహితుడు. హరియాణాకు 10వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో 24 ఏళ్ల వయసులో ఖట్టర్ ఆర్ఎస్ఎస్లో చేరారు. 1980 నుంచి దాదాపు 14 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పని చేశారు. 1994లో బీజేపీలో చేరారు. క్షేత్రస్థాయి కార్యకర్తగా బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2014 హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న ఖట్టర్.. బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2014లో మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో హరియాణా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. -
విలక్షణ తీర్పు
వరసగా రెండోసారి సైతం మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షాలకు అందలం దక్కడం ఖాయమని ఫలితాలు చెబుతున్నా విజేతలైనవారికి పూర్తి సంతృప్తి మిగల్చకుండా ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమికి సులభంగానే అధికారం దక్కే అవకాశం ఉన్నా, దాని మెజారిటీ గతంతో పోలిస్తే తగ్గింది. హరియాణాలో బీజేపీ ఏకైక మెజారిటీ పక్షంగా మాత్రమే అవతరించింది. అక్కడ పది సీట్లు గెలిచిన దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన నాయక్ జనతాపార్టీ(జేజేపీ), మరికొందరు స్వతంత్రుల మద్దతు పొందడం దానికి తప్పనిసరి. అక్కడే తామే సర్కారు ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. గత మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దూసుకుపోయిన బీజేపీకి ఈ రెండు రాష్ట్రాల ఫలితాలూ కాస్త నిరాశ కలిగించకమానవు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే గెలుపెవరిదో చాలామంది సులభంగా అంచనా వేశారు. ఎందు కంటే విపక్షం పెద్దగా ప్రతిఘటించని ఎన్నికలివి. ఎప్పటిలాగే మీడియా కూడా ప్రజలనాడి పట్టుకోవ డంలో పెద్దగా సఫలం కాలేకపోయిందని ఫలితాలు చాటుతున్నాయి. మహారాష్ట్రలో గడిచిన అయి దేళ్లూ కూటమిలో జూనియర్ భాగస్వామిగా కొనసాగిన శివసేనను ఈసారి బీజేపీ పట్టించుకోక తప్పనిస్థితి ఏర్పడింది. అధికారం పంచుకోవడం ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ ప్రాతిపదికనే ఉంటుందని శివసేన చీఫ్ ఉధవ్ ఠాక్రే ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవడం లేదా మంత్రి పదవుల్ని చెరిసగం తీసుకోవడం తప్పనిసరన్నది ఆయన ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ సారాంశం. ఈ ఫలితాలు బీజేపీ కళ్లు తెరిపించగలవని నమ్ముతున్నట్టు ఠాక్రే చేసిన వ్యాఖ్య రానున్నకాలంలో రెండు పార్టీల మధ్యా ఎటువంటి సంబంధాలుంటాయో తేటతెల్లం చేస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వ పటిమను ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో తమ కూటమి ఎటూ విజయదుందుభి మోగించబోవడం లేదని తెలిసినా ఆయన పోరాటాన్ని ఆప లేదు. 78 ఏళ్ల వయసులో ఆయన రాష్ట్రాన్నంతా చుట్టుముట్టారు. అనేక బహిరంగసభల్లో మాట్లా డారు. కనుకనే కాంగ్రెస్‌కు జూనియర్ భాగస్వామిగా ఉన్న పార్టీని పెద్ద పార్టీగా మార్చారు. ఈ ఎన్ని కల్లో అది అది 50కి పైగా స్థానాల్లో విజయం సాధించబోతుండగా కాంగ్రెస్ 40 దరిదాపుల్లో సర్దుకోక తప్పని స్థితిలో పడింది. సతారా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడ్డ శివాజీ వంశస్తుణ్ణి ఓడించి ఎన్సీపీ సత్తా చాటడం ఆ పార్టీ పనితీరుకు నిదర్శనం. క్రితం సారి అసెంబ్లీ ఎన్నికలను ఒకసారి గుర్తుతెచ్చుకోవాలి. 2014 అక్టోబర్‌లో జరిగిన ఆ ఎన్నికలు కాంగ్రెస్ మూలాల్ని పెకలించివేశాయి. అంతక్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారోద్యమ సారథిగా ప్రధాని నరేంద్ర మోదీ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటూ సాగించిన ప్రచారోద్యమం తాలుకు ప్రకంపనలు ఆ అసెంబ్లీ ఎన్నికలనాటికీ కొనసాగి మహారాష్ట్రలో కాంగ్రెస్–ఎన్సీపీ కూటమిని కకావికలు చేసింది. వరసగా రెండు దశాబ్దాలపాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన ఆ కూటమి మోదీ ప్రచారధాటికి కుప్ప కూలింది. హరియాణా కథ కూడా అదే. అక్కడ వరసగా దశాబ్దంపాటు ఏలి మూడోసారి కూడా తనదే విజయమని కలలుగంటున్న కాంగ్రెస్‌ను బీజేపీ ఖంగుతినిపించింది. కానీ అయిదేళ్లు గడిచే సరికి పరిస్థితి అంత ఏకపక్షంగా ఏం లేదని తేటతెల్లమైంది. ఎన్నికలు ముంగిట్లోకొచ్చేసరికి కాంగ్రెస్ కళాకాంతులు కోల్పోయింది. మహారాష్ట్రలో దిగ్గజ నేతలనుకున్నవారు కాషాయ దారి పట్టగా పార్టీలో మిగిలినవారు అనాథలను తలపించారు. పరస్పర కలహాల్లో మునిగితేలారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసలు ప్రచారం జోలికే రాకపోగా, ఆమె కుమారుడు రాహుల్ మొక్కుబడిగా బహిరంగసభలు నిర్వహించారు. మహారాష్ట్ర, హరియా ణాల్లో మొత్తంగా ఆయన ఏడు సభలకు మించి పాల్గొన్నదిలేదు. అందుకు భిన్నంగా మోదీ రెండు రాష్ట్రాల్లోనూ 25 ప్రచారసభల్లో ప్రసంగించారు. ఈ ఎన్నికల ప్రచారంలో 370 అధికరణ రద్దు మోత మోగింది. దానికితోడు సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అభివృద్ధి చర్యలు బీజేపీకి ధీమా ఇచ్చాయి. పైనుంచి కిందివరకూ ఆ పార్టీలో అందరూ ఏకోన్ము ఖంగా పనిచేశారు. మహారాష్ట్రలో ఎంఐఎం పుంజుకోవడంతో ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌నుంచి వలస పోయాయి. ఆ పార్టీ దారుణంగా దెబ్బతినడానికి కారణం అదే. హరియాణా విషయానికొస్తే అక్కడ బీజేపీకి దాదాపు ఎదురులేదన్నంత స్థాయిలో ప్రచారం సాగింది. విపక్ష కాంగ్రెస్ అంతఃకలహాల్లో మునిగి తేలింది. ఒకే ఒక బహిరంగసభలో సోనియా ప్రసంగిస్తారని ప్రకటించినా చివరి నిమిషంలో అది కాస్తా రద్దయింది. హరియాణాలో రెండుసార్లు సీఎంగా పనిచేసి, పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టగల సత్తా ఉన్న భూపిందర్ సింగ్ హూడాకు కాంగ్రెస్‌లో అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. రాహుల్ ఏలుబడిలో అశోక్ తన్వార్‌కు ప్రాధాన్యం పెరిగింది. సోనియా తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సరికి హరియాణా కాంగ్రెస్ రెండు పక్షాలుగా చీలిపోయింది. గత నెలలో తన్వార్‌ను తప్పించి కేంద్ర మాజీ మంత్రి కుమారి షెల్జాకు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలప్పగించి, హూడాను ఎన్నికల ఇన్చార్జిగా నియమించారు. అంతవరకూ అలిగి కూర్చుని వేరే తోవ చూసు కుంటానన్న హూడా మళ్లీ చురుగ్గా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో 30 స్థానాలు దాటుతున్నాయంటే అది ఆయన ఘనతే. ఉప ఎన్నికలు జరిగిన 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 26 స్థానాలు గెల్చుకుని అగ్రభాగంలో ఉన్నా విపక్షాలు చెప్పుకోదగ్గ విజయాలే సాధించాయి. యూపీలో తిరిగి సమాజ్‌వాదీ పార్టీ పుంజుకున్న ఆనవాళ్లు కనబడ్డాయి. బిహార్‌లో జేడీ(యూ) చిన్నబోయింది. అక్కడ నాలుగు ఉప ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి దక్కింది ఒక్కటే. ఆర్జేడీకి రెండు లభించాయి. ఎంఐఎం సైతం ఒక సీటు గెల్చుకోవడం విశేషం. మొత్తానికి అధికార పక్షాలు పూర్తి భరోసాతో ఉండటానికి వీల్లే దని ఈ ఎన్నికల ఫలితాలద్వారా దేశవ్యాప్తంగా ఓటర్లు తేటతెల్లం చేశారు. -
హరియాణాలో తదుపరి సర్కార్ మాదే..
చండీగఢ్ : హరియాణాలో కాంగ్రెస్ పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కుమారి సెల్జా చెప్పారు. హరియాణా ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని, బీజేపీ వైఫల్యాలను వారు ఇక ఎంతమాత్రం సహించబోరనే సంకేతాలు పంపారని సెల్జా గురువారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకత్వంలో హరియాణా తిరిగి నూతన జవసత్వాలు అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హరియాణాలో 90 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 37 స్ధానాల్లో, కాంగ్రెస్ 32 స్ధానాల్లో, ఇతరులు 21 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్ధానాలకు బీజేపీ చాలా దూరంలో నిలవడంతో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కింగ్ మేకర్‌గా నిలిచింది. ఆ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. -
ఢిల్లీకి రండి : ఖట్టర్‌కు అమిత్ షా పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ కసరత్తు చేపట్టింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహల్ లాల్ ఖట్టర్‌ను సత్వరమే దేశ రాజధాని చేరుకోవాలని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. 90 స్ధానాలు కలిగిన హరియాణాలో మేజిక్ మార్క్‌కు కొద్దిస్ధానాలు తక్కువగా 41 స్ధానాల్లోనే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ చేరుకునే పరిస్థితి లేకపోవడంతో కింగ్ మేకర్‌గా అవతరించిన జేజేపీ కీలకంగా మారింది. జేజేపీని దారిలోకి తెచ్చేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలాతో మాట్లాడి ఆయనను బీజేపీకి సహకరించేలా ఒప్పించే బాధ్యతను కాషాయ నేతలు పంజాబ్ మాజీ సీఎం, అకాలీదళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌లకు అప్పగించింది. హరియాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సాధించే పరిస్థితి లేకపోవడంతో జేజేపీని ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. -
హరియాణాలో కాంగ్రెస్ వ్యూహాలకు బీజేపీ చెక్
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ చేరుకునే పరిస్థితి లేకపోవడంతో కింగ్ మేకర్‌గా అవతరించిన జేజేపీ కీలకంగా మారింది. ఆ పార్టీకి సీఎం పదవిని ఆఫర్ చేస్తూ బీజేపీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరోవైపు జేజేపీని దారిలోకి తెచ్చేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలాతో మాట్లాడి ఆయనను బీజేపీకి సహకరించేలా ఒప్పించే బాధ్యతను కాషాయ నేతలు పంజాబ్ మాజీ సీఎం, అకాలీదళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌లకు అప్పగించింది. హరియాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సాధించే పరిస్థితి లేకపోవడంతో జేజేపీని ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 90 మంది సభ్యులతో కూడిన హరియాణ అసెంబ్లీలో బీజేపీ 40 స్ధానాల్లో కాంగ్రెస్ 29 స్ధానాల్లో ఇతరులు 21 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జేజేపీ పది స్ధానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం. కాగా, హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్ధానాలు అవసరం. -
హరియాణాలో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం..
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో హంగ్ దిశగా ఫలితాల సరళి సాగుతుండటంతో ఎవరికి వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల సంఖ్య 46 కాగా మేజిక్ మార్క్‌కు చేరువగా బీజేపీ నిలిచిపోవడంతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు చిన్న పార్టీ జేజేపీని తనవైపు తిప్పకుని ఆ పార్టీకి సీఎం పదవి ఆఫర్ చేయడం ద్వారా బీజేపీని నిలువరించాలని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇక మేజిక్ ఫిగర్‌కు ఒకట్రెండు స్ధానాలే తగ్గడంతో చిన్న పార్టీల్లో రెబెల్స్‌ను బుజ్జగించి దారికి తెచ్చుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మొత్తంమీద హరియాణాలో ఏ ప్రభుత్వం కొలువుతీరినా ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాతే హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి అనుకూల పరిస్థితి ఉందనేది వెల్లడవనుంది. -
ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ
రాజకీయ వ్యూహంపై చర్చలు మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్నిచ్చాయి. ఈ ఫలితాల ప్రభావం ఢిల్లీ ఎన్నికలపైనా ఉంటుందని, మోదీ ప్రభంజనంతో విజయకేతనం ఎగురవేయొచ్చని భావిస్తోంది. ఇక ఢిల్లీలో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్‌లు కూడా శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. న్యూఢిల్లీ: హ ర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరుగుతాయని విశ్లేషకులతోపాటు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ రాజకీయ భవితవ్యంపై ఇన్నాళ్లూ సుప్రీంకోర్టులో నాన్చుడు ధోరణిని అవలంబించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన తన వైఖరిని స్పష్టం చేయవచ్చని వారంటున్నారు. ఎన్నికలు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంతా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని మూడు ప్రధాన పార్టీల నేతలు రాజకీయ వ్యహంపై చర్చలు జరుపుతున్నారు. ఒకవైపు ఎన్నికల విషయంలో బీజేపీ నేతలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుండగా మిగతా పార్టీల నేతలు కూడా తాము కూడా అందుకు సిద్ధమేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల విషయంలో వెనుకంజ వేసినట్టు వారం క్రితం వరకూ కనిపించిన బీజేపీ.. హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సాధించిన ఘనవిజయంతో జాతీయ రాజధాని శాసనసభ ఎన్నికలకు సిద్ధమైపోయింది. హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల మాదిరిగానే నరేంద్ర మోడీ పేరుబలంతో ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తోంది. హర్యానా, మహారాష్ట్రల మాదిరిగానే సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు భావిస్తుండగా, హర్షవర్ధన్‌ను ఢిల్లీ రాజకీయాల్లోకి తీసుకువచ్చి మళ్లీ ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఇంకొందరు భావిస్తున్నారు. ఆప్‌దీ అదే దారి ఇక అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. 49 రోజుల పాలనలో తాము చేసిన పనులు, ఇన్నాళ్లుగా తమ 27 మంది ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుంచాలని యోచిస్తోంది. కేజ్రీవాల్ ఫిర్సే (మళ్లీ కేజ్రీవాల్) పరుతో ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించడంతోపాటు వీలైనంతవరకు స్థానిక సమస్యలను లేవనెత్తి ప్రజల మనస్సులో చోటుసంపాదించాలని భావిస్తోంది. విద్యుత్ చార్జీల తగ్గింపు, విద్యుత్ కంపెనీల ఆడిట్‌కు ప్రయత్నించడం వంటి అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించాలని, దానితోపాటు అధికారంలో లేకపోయినప్పటికీ తమ పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టిన పనులను ప్రజలకు గుర్తుచేయాలని ఆప్ యోచిస్తోంది. పరిస్థితి మెరుగుకు కాంగ్రెస్ యత్నం వరుస పరాజయాలతో కోలుకోనేంతగా దెబ్బతిని ఆత్మవిశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోనైనా తన పరిస్థితిని మెరుగుపరచుకోవాలని ఆశిస్తోంది. ఈ ఎన్నికల వల్ల తమ పార్టీ కోల్పోయేదేమీ లేదని పరిస్థితులు అనుకూలిస్తే మరిన్ని సీట్లు గెలవవచ్చనే భావం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. మాజీ ఎంపీలను కూడా శాసనసభ ఎన్నికల బరిలోకి దింపితే ఫలితాలు కొంత మెరుగ్గా ఉండొచ్చనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇందువల్ల టికెట్ రాని మాజీ శాసనసభ్యులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. హర్యానాలో మాదిరిగా జాట్ ఓటర్లు కాంగ్రెస్‌కు అండగా నిలబడొచ్చని, అందువల్ల తాము ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందని కూడా కొందరు కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
అప్రతిహతంగా మోదీ హవా
బలమైన నాయకులు, సంస్థాగత నిర్మాణం లేకున్నా.. బీజేపీ అద్భుత విజయాలు మహారాష్ట్రలో పాతికేళ్ల పొత్తును పక్కనబెట్టి.. ఒంటరి పోరుతో అద్భుత విజయం హర్యానాలో ప్రస్తుతం 4 సీట్లున్న పార్టీ.. ఏకంగా 47 సీట్ల గెలుపుతో కొత్త చరిత్ర న్యూఢిల్లీ: ఐదు నెలల కిందట జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి తొలిసారి సంపూర్ణ మెజారిటీ సాధించిపెట్టిన నరేంద్ర మోదీ హవా ఇంకా కొనసాగుతోందని తాజాగా మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలు స్పష్టంచేశాయి. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోదీ చరిష్మా అనతి కాలంలోనే ఆవిరైపోతుందన్న చాలా మంది రాజకీయ పండితుల అంచనాలు తప్పని రుజువుచేశాయి. ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన ఐదు నెలల లోపే మోదీ తన పార్టీ వ్యవస్థాగత పునాదిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. పశ్చిమ, ఉత్తర భారతాల్లో కోటలు బద్దలు కొట్టి బీజేపీ పాగా వేసింది. హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల పొత్తులు, రాజకీయ మిత్రులను పక్కనబెట్టి ఒంటరిగా పోటీ చేసిన కమలదళం.. కాంగ్రెస్ నుంచి మరో రెండు రాష్ట్రాలను కొల్లగొట్టింది. దేశ రాజధానికి అతి సమీపంగానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. భారత ఆర్థిక రాజధాని గల మహారాష్ట్ర ఎన్నికల్లో తొలిసారిగా అతి పెద్ద పార్టీగా అవతరించటమే కాదు.. పాతికేళ్లలో రాష్ట్రంలో 100 సీట్ల మార్కును దాటిన ఏకైక పార్టీగా రికార్డు సృష్టించింది. ఏ పార్టీ సాయంతో అధికారం స్వీకరిస్తుందన్నది ప్రస్తుతానికి సందిగ్ధంగానే ఉన్నా.. అధికారాన్ని మాత్రం ఖాయం చేసుకుంది. ఈ విజయాలు మోదీ హవా వల్లే సాధ్యమయ్యాయన్నది ఆ పార్టీ నేతలే కాదు.. ప్రత్యర్థులు, రాజకీయ పండితులు అంగీకరిస్తున్న విషయం. ఈ విజయంలో బీజేపీ సారథిగా ఉన్న మోదీ అనుయాయి అమిత్‌షా కూడా.. సాహసోపేత నిర్ణయాలు తీసుకుని, ఫలితం రాబట్టడం ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ‘మోదీ కే సాథ్’ మాటను నమ్మిన జనం... మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ గెలుపు.. ఆ పార్టీకి స్థానికంగా సరైన, సమర్థుడైన నాయకుడు ఉన్నాడా లేదా అన్నది ఓటర్లు పట్టించుకోలేదని చూపుతోందని.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి పోలైన ఓట్లు.. ఆ పార్టీకి వాస్తవంగా ఉన్న బలం కన్నా చాలా చాలా ఎక్కువని పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి మహారాష్ట్ర, హర్యానాల్లో తన ప్రత్యర్థి పార్టీలతో పోలిస్తే.. బీజేపీకి బలమైన నాయకుడు కానీ, చరిష్మా గల నాయకుడు కానీ, పార్టీ సంస్థాగత నిర్మాణం కానీ లేవు. అయినా.. ‘చలో చలే మోదీ కే సాథ్’ అన్న బీజేపీ ఎన్నికల నినాదాన్ని ఓటర్లు విశ్వసించారని.. మోదీ చెప్పిన మాటలను నమ్మారని.. అందుకే బీజేపీని అంతగా ఆదరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాతికేళ్ల మిత్రుడిని పక్కనబెట్టి... మహారాష్ట్రలో సైతం నిన్నటివరకూ శివసేనకు జూనియర్ మిత్రపక్షంగానే మనుగడ సాగించిన బీజేపీ.. నేడు ఆ పార్టీని కాదని ఒంటరిగా పోటీ చేసి.. 122 సీట్లు (మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో) గెలుచుకుని.. గత రెండున్నర దశాబ్దాల్లో ఏ పార్టీ సాధించలేకపోయిన ఘన విజయం సాధించటానికి కూడా మోదీ హవాయే కారణమంటున్నారు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు చర్చల సందర్భంగా.. బీజేపీకి ఇస్తామని శివసేన ప్రతిపాదించిన సీట్లతో సమానమైన సంఖ్య ఇది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా.. ఆ పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించి తన పెద్దన్న పాత్రను వదులుకోవటానికి శివసేన ససేమిరా ఇష్టపడకపోవటంతో.. ఈ రెండు పార్టీల మధ్య రెండున్నర దశాబ్దాల పొత్తు విచ్ఛిన్నమైంది. రాజకీయ వాతావరణం మారిందన్న బీజేపీ.. మరాఠా బరిలో ఒంటరి పోరుకు దిగి.. సత్తా చాటింది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలుపు అద్భుతమైనదని.. ప్రస్తుత శాసనసభలో కేవలం 4 సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 12 రెట్లు అధికంగా 47 సీట్లు (మొత్తం 90 అసెంబ్లీ సీట్లలో) గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకోవటం మోదీ హవాకు అద్దం పడుతోందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 2005 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ గెలుచుకున్న స్థానాలు కేవలం రెండంటే రెండు. ఈ రెండు రాష్ట్రాల్లో మోదీ 40 బహిసభల్లో ప్రసంగించారు. కాగా, హర్యానా, మహారాష్ట్రల్లో గెలుపుతో బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య ఏడుకు పెరిగింది. మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్న రాష్ట్రాలను (ఏపీ, పంజాబ్) కూడా కలిపితే 9కి చేరుతుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ ఇప్పుడిక దేశ రాధాని రాష్ట్రమైన ఢిల్లీతోపాటు కాశ్మీర్‌పై గురి పెడుతోంది. -
రెండు చోట్లా బీజేపీకే పట్టం!
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే న్యూఢిల్లీ: జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ శక్తులైన శివసేన, లోక్‌దళ్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా... ఫలితాల సరళి మధ్యాహ్నం వరకే వెల్లడయ్యే అవకాశముంది. మూడు గంటల సమయం నుంచి ఆయా స్థానాల్లో తుది ఫలితాల వెల్లడి ప్రారంభమవుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య ప్రధానంగా పోటీ జరుగుతుండగా... హర్యానాలో అధికార కాంగ్రెస్‌కు చావుదెబ్బ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15వ తేదీన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హర్యానాలో76.5 శాతం పోలింగ్ నమోదుకాగా మహారాష్ట్రలో 63.1 శాతం నమోదైంది. బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ప్రధాని మోదీ చరిష్మాకు.. ఈ ఎన్నికల ఫలితాలే తొలి పరీక్షగా నిలవనున్నాయి. మహారాష్ట్రలో హంగ్ ?.. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను.. ప్రధాన పార్టీలైన బీజేపీ 280 స్థానాల్లో, శివసేన 282, కాంగ్రెస్ 287, ఎన్సీపీ 278, ఎంఎన్ఎస్ 219 స్థానాల్లో పోటీపడ్డాయి. మహారాష్ట్రలో ఏ పార్టీకీ సరైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఫలితాలు తప్పకపోవచ్చని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొనడంతో.. ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. కానీ ఎన్నికల ముందు విడిపోయిన మిత్రపక్షాలు బీజేపీ, శివసేనతో పాటు ఎన్సీపీ కూడా తామే పూర్తిస్థాయి మెజారిటీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం చిత్తు చిత్తుగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదర్శ్ కుంభకోణంపై ఆ పార్టీకి చెందిన మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పరిస్థితిని దిగజార్చాయి. అయితే.. ఫలితాల అనంతరం బీజేపీ, శివసేన తిరిగి పొత్తుపెట్టుకోవచ్చనే వార్తలను ఆ పార్టీలు ఖండించాయి. దీనిపై శనివారం శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ... ‘‘మహారాష్ట్రలో శివసేన ఒంటరిగానే అధికారంలోకి వస్తుంది. బీజేపీది ప్రతిపక్షంగా ఉంటుంది’ అని అన్నారు. అయితే ఎన్డీయేలో శివసేన కొనసాగడం నేపథ్యంలో.. మహారాష్ట్రలో తిరిగి బీజేపీ-శివసేన ఒక్కచోటికి చేరడం ఖాయమని విశ్లేషకులటున్నారు. ఎగ్జిట్‌పోల్స్ కూడా మహారాష్ట్రలో రెండో అతిపెద్ద పార్టీగా శివసేన నిలుస్తుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ కూడా శివసేనతో ఎన్నికల అనంతర పొత్తుపై కన్నేసిందని చెబుతున్నారు. హర్యానాలో కాంగ్రెస్ ఔట్.. హర్యానాలోని 90 స్థానాలకు.. అక్కడి అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, ఐఎన్ఎల్డీ తలపడ్డాయి. వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి రావాలనుకున్న భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ భవితవ్యం ఆదివారం వెలువడనుంది. అయితే కాంగ్రెస్ పదేళ్ల పాలనకు ఈ సారితో తెరపడబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ తొలిసారిగా బీజేపీ అధికారాన్ని చేపట్టనుందని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. ఈ సారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మోదీ ఆకర్షణ బీజేపీకి సీట్లు తీసుకొచ్చినా... మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయే అవకాశముందని అంచనా వేశాయి.