
సాక్షి, న్యూఢిల్లీ: జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత, హరియాణా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా ఆదివారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అజయ్ చౌతాలా 2013 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కాగా డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాలా నేడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అజయ్ చౌతాలాకు 14 రోజుల పాటు ఫర్‌లోకు (సెలవు) అనుమతి ఇచ్చింది. దీపావళి పండుగ రోజు ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు హరియాణా రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు.