dushyant chautala
-
Haryana: అసెంబ్లీ ఎన్నికల్లో చౌతాలా-ఆజాద్ దోస్తీ
త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో జననాయక్ పార్టీకి చెందిన దుష్యంత్ చౌతాలా, ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ విషయాన్ని వెల్లడించారు. తమ రెండు పార్టీలు ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తాయన్నారు.నేతలు దుష్యంత్ చౌతాలా, చంద్రశేఖర్ ఆజాద్‌లు మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 36 సంఘాలను ఏకతాటిపైకి తీసుకువస్తామని అన్నారు. రైతులు, యువత, మహిళల సమస్యలను వినిపిస్తూ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నామని దుష్యంత్ చౌతాలా తెలిపారు. ఈ ఎన్నికల్లో జేజేపీ 70 స్థానాల్లో, ఆజాద్ సమాజ్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నదన్నారు. రైతులకు వారి హక్కులు దక్కేలా చూడటమే తమ ప్రయత్నమని చంద్రశేఖర్ అన్నారు. -
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్‌ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
బీజేపీ పాలిత ర్యానాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో బలపరీక్ష డిమాండ్ చేసిన దుష్యంత్ చౌతాలాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. పానిపట్‌లోని మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఖట్టర్, మహిపాల్‌తో సుమారు అరగంటపాటు జేజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న తాజా సంక్షోభంపై చర్చించినట్లు సమాచారం.కాగా ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు (సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్) బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో నయాబ్ సింగ్ సైనీ సర్కార్ సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్‌కు లేఖ రాశారు. ఒకవేళ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కాంగ్రెస్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ మాజీ మిత్రపక్షమైన దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెలిపారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంచుకుంటే కాంగ్రెస్‌కు బయటి మద్దతు ఇస్తానని ప్రకటించారు. -
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్‌కు లేఖ రాసిన జేజేపీ
చండీగఢ్: ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరించుకోవటంతో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మిత్ర పక్షం జననాయక్ జనతా పార్టీ చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా అసెంబ్లీలో ఫోర్ టెస్ట్ (విశ్వాస పరీక్ష) నిర్వహించాలని గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.‘‘మేజార్టీని లేని బీజేపీ కూటమిని విశ్వాస పరీక్షకు పిలవాలని కోరుతున్నాం. ఇటీవల ఒక బీజేపీలో ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్యెల్యే రాజీనామా చేశారు. అదేవిధంగా ప్రస్తుతం మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరిచుకున్నారు. దీంతో బీజేపీ కూటమి ప్రభుత్వం మైనార్టీలో పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టండి. మేము ఫ్లోర్ టెస్ట్ తీర్మానికి మా పార్టీ తరఫున మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ చౌతాలా గవర్నర్‌కు రాసిన లేఖలో తెలిపారు.మరోవైపు.. ‘‘మేము గవర్నర్‌కు ఫ్లోర్ టెస్ట్ చేపట్టాలని లేఖ రాశాం. విశ్వాస పరీక్షలో జేజేపీ.. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది. మేము బహిరంగా మరో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి మా మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ ఓ వీడియో విడుదల చేశారు.ఇక.. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి)లు.. రోహ్తక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో బీజేపీకి తమ మద్దతును ఉపసహరించున్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 45 స్థానాలు. మనోర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 88. ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అయితే ముగ్గరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించగా.. బీజేపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.ఇక.. జేజేపీకి 10 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి కాంగ్రెస్ పార్టీ కూటమికి 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒకవేళ జేజేపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా మొత్తం సంఖ్య 43 కు చేరుంది. ఇలా అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటచేయాలంటే కూడా మరో ఇద్దరు ఎమ్యెల్యేలు అవసరం అవుతారు. ఎలా చూసినా కాంగ్రెస్‌కు ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కూటమి విచ్ఛిన్నం.. ఒంటరిగానే జేజేపీ పోటీ
Haryana: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని జననాయక్ జనతా పార్టీ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. “రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని జననాయక్ జనతా పార్టీ పీఏసీ సమావేశంలో నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం” అని చౌతాలా ఏఎన్ఐకి చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ-జననాయక్ జనతా పార్టీ (BJP-JJP) కూటమి విచ్ఛిన్నమైన కొన్ని రోజులలోనే జేజేపీ నుంచి ఒంటరి పోటీ నిర్ణయం వచ్చింది. ఈ కూటమి విచ్ఛిన్నం మార్చి 12న మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాకు దారితీసింది. నయాబ్ సింగ్ సైనీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నయాబ్ సైనీ కురుక్షేత్ర నుండి బీజేపీ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన పార్టీ రాష్ట్ర చీఫ్‌గా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలోని మొత్తం 10 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. అయితే ఆప్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన జేజేపీ పోటీ చేసిన 7 స్థానాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కాగా హర్యానాలో 2024 సార్వత్రిక ఎన్నికలు మే 25న ఆరో దశలో జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
బలపరీక్షలో నెగ్గిన హర్యానా కొత్త సీఎం
చండీగఢ్: హర్యానా కొత్త సీఎం నాయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయం సాధించారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస పరీక్షలో నెగ్గారు. బీజేపీ ప్రభుత్వానికి అయిదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు, ఆరుగురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. ఇక 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో 41 మంది బీజేపీ సభ్యులున్నారు. జేజేపీకి 10 మంది, కాంగ్రెస్‌కు 30 మంది, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు ఒక ఎమ్మెల్యే, హరియాణా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే, ఏడుగురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అనూహ్యంగా.. సైనీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, బలనిరూపణకు బుధవారం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ నూతన సీఎం సైనా గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. హరియాణాలో గడిచిన 48 గంటల్లో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీనియర్ నేత మనోహర్‌లాల్ ఖట్టర్, మంత్రి వర్గం మొత్తం రాజీనామా చేయడం మొదలు ఓబీసీ నేత నాయబ్ సైనీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడందాకా మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్ధుబాటు విషయంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో విభేదాలు ముదరడంతో ఖట్టర్ సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఖట్టర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిపేందుకే బీజేపీ ఆయనను సీఎం పీఠం నుంచి దింపేసిందని మరో వాదన వినిపిస్తోంది. -
‘అలా జరగకపోతే రాజీనామా చేస్తా’
చండీఘడ్: మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)ను కల్పించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా హెచ్చరించారు. శుక్రవారం చండీఘడ్‌లో జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పటికే ఎమ్ఎస్పీని కల్పించమని కేంద్రానికి లేఖ రాశారు. నేను డిప్యూటీ సీఎంగా ఉన్నంత కాలం రైతులకు ఎంఎస్పీ ఉండేలా కృషి చేస్తాను. ఒకవేళ అలా జరగకుంటే రాజీనామా చేస్తాను’’అని చెప్పారు. ఎంఎస్పీ, ఇతర డిమాండ్లపై రైతులకు లిఖితపూర్వక హామీలు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చినందున అన్నదాతలు తమ ఆందోళనను విరమించుకుంటారని దుష్యంత్ చౌతాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపే రైతులు కేంద్రం రాతపూర్వక హామీ ఇస్తున్నప్పుడు, అది “వారి పోరాటానికి విజయం” అని చౌతాలా అన్నారు. చదవండి: (నడ్డాపై దాడి: బెంగాల్ డీజీపీ, సీఎస్‌లకు సమన్లు) అయితే, ఎంఎస్పి, మండి వ్యవస్థపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన విషయం తెలిసిందే. వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో నిరసనను కొనసాగించారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలు, కొంతమంది హర్యానా రైతుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న దుష్యంత్ చౌతాలా, కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) వ్యవస్థకు ముప్పు ఉంటే తాను రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. ఏదేమైనా, రైతు సంఘాలు, ముఖ్యంగా పంజాబ్ మరియు హర్యానాలో, కొత్త చట్టాలు ఎంఎస్పీ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: (రైతన్నలూ.. చర్చలకు రండి) -
బీజేపీ నేత మృతి; మహిళా ఐపీఎస్‌పై కేసు
చండీఘడ్: హరియాణా బీజేపీ నేత హరీశ్ శర్మ మృతి నేపథ్యంలో పానిపట్ ఎస్పీ మనీషా చౌదరిపై కేసు నమోదైంది. హరీశ్‌ను ఆత్మహత్యకు పురిగొల్పారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు ఈ మేరకు ఆమెపై చర్య తీసుకున్నారు. మనీషాతో పాటు మరో ఇద్దరు పోలీసులపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. హోం మంత్రి అనిల్ విజ్ ఆదేశాల మేరకు మనీషాపై కేసు నమోదు చేయగా, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘‘ఒకవేళ ఎస్పీపై ఈ విధంగా కేసు నమోదు చేసినట్లయితే, రాష్టంలో ఏదో ఒకచోట నేరం జరిగితే అందుకు డీజీపీపై కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా’’ అంటూ చౌతాలా ప్రశ్నించారు. దీంతో ఈ కేసు రాష్ట వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. దీపావళి పండుగ నేపథ్యంలో టపాసులపై నిషేధం గురించి బీజేపీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ హరీశ్ శర్మ(52) కుమార్తె అంజలి శర్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. (చదవండి: కశ్మీర్ భూ స్కామ్‌లో మాజీ మంత్రులు!) ఈ క్రమంలో హరీశ్‌తో పాటు ఆయన కూతురు సహా మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన హరీశ్ శర్మ నవంబరు 19న కెనాల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, తనను కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుడు కూడా చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి అంజలి శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా నాన్నను ఓ ఉగ్రవాదిలా చిత్రీకరిస్తూ పోలీసులు వేధింపులకు గురిచేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వారు వ్యవహరించిన తీరుతో ఆయన కుంగిపోయారు. అందుకే ఆత్మహత్య చేసుకున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: అమానుషం: పసిపాపను వదిలించుకునేందుకు..) ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనిల్ విజ్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ చీఫ్ మనోజ్ యాదవ్‌ను సోమవారం ఆదేశించారు. సత్వరమే స్పందించకపోవడంతో ఆయనకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పానిపట్ ఎస్పీ మనీషా చౌదరిపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా మనీషా చౌదరి 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. త్వరలోనే ఆమె చండీఘర్ ఎస్ఎస్పీ(ట్రాఫిక్)గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా, ఈ మేరకు కేసు నమోదు కావడంతో జాప్యం నెలకొంది. -
వారికి ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్లు
చంఢీఘడ్: నిరుద్యోగులుకి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించేందుకు హరియాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిరుద్యోగులుకి ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్లు ఇచ్చే బిల్లును గురువారం ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి, జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, జానాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతం వ్యక్తం చేశారు. అయినప్పటికి ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. నెలకు 50,000 రూపాయల కన్నా తక్కువ జీతం ఉన్న ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు 75% కొత్త ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ( ఉద్యోగులకు దీపావళి కానుక : ఒక నెల బోనస్ ) ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేటు కంపెనీలు, సంఘాలు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలు మొదలైన వాటిలో స్థానికులకు ఉపాధి దొరకనుంది. స్థానిక యువతకు ఉపాధి అవకశాలు పెంచేందుకు ఈ బిల్లు తీసుకువచ్చినట్టు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. దుష్యంత్ చౌతాలా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. "ఈ రోజు హరియాణలోని లక్షలాది మంది యువతకు ప్రైవేట్ రంగంలో 75 శాతం ఉద్యోగాలు లభిస్తాయి" అని పేర్కొన్నారు. -
ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
చండీగఢ్ : కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను సైతం వదలడం లేదు. ఇప్పటికే పలువురు మఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా హరియాణా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మంగళవారం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందే కోవిడ్ నిర్ధారణ రిపోర్ట్స్ వచ్చాయి. దాంట్లో నాకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ స్వీయ నిర్భంధంలో ఉండండి. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లండి’ అని దుష్యంత్ ట్వీట్ చేశారు. सभी साथियों के लिए सूचना - मेरी Covid-19 की रिपोर्ट positive आई है। मेरा स्वास्थ्य ठीक है। आग्रह है कि बीते कुछ दिनों में मेरे संपर्क में आए लोग अपना ध्यान रखें और डॉक्टर सलाह दें तो टेस्ट करवाएं। pic.twitter.com/whuguUR3bp — Dushyant Chautala (@Dchautala) October 6, 2020 -
దుష్యంత్ దారెటు..?
-
బీజేపీ షాక్: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేజేపీ చీఫ్ దుశ్యంత్ సింగ్ చౌతాలా ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తాము ఇక ప్రభుత్వంలో కొనసాగలేమంటూ అకాలీదళ్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. చౌతాలా మీదకూడా ఒత్తిడి పెరుగుతోంది. (కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా) కేంద్ర ప్రతిపాదిత బిల్లుపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీలోని కొంతమంది సీనియర్లు సైతం అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ సీరియర్లు, ఎమ్మెల్యేలతో చౌతౌలా సమావేశం కానున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేజేపీ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాల కోరారు. రైతుల పక్షపాతిగా చరిత్ర కలిగిన చౌతౌలా కుటుంబం క్లిష్ల సమయంలో రైతాంగానికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలగాలని సూచించారు. మాజీ ఉప ప్రధాని, దేవీలాల్‌కు రైతు బాంధవుడిగా మంచి గుర్తింపు ఉందని, దుశ్యంత్ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని ట్విటర్ ద్వారా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)’ బిల్లును, ‘ద ఫార్మర్స్(ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్’ బిల్లును గురువారం మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. (బీజేపీకి ఊహించని షాకిచ్చిన మిత్రపక్షం) ఇదిలావుండగా.. 90 స్థానాలు ఉన్న హరియాణాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్ (46)ను సొంతంగా అందుకోలేకపోయింది. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్ చౌతాలా కింగ్‌మేకర్‌గా అవతరించారు. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జేజేపీ ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఖట్టర్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉంది. -
హరియాణా సీఎంగా ఖట్టర్ ప్రమాణం
చండీగఢ్: హరియాణాలో బీజేపీ–జేజేపీల సంకీర్ణప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఖట్టర్, ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలాలు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఖట్టర్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగా, దుష్యంత్ మొదటిసారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ కూర్పు చేపట్టనున్నారు. ఇటీవలే జైలు నుంచి సెలవు మీద బయటకు వచ్చిన దుష్యంత్ చౌతాల తండ్రి అజయ్ చౌతాలా, ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దుష్యంత్ తల్లి నైనా చౌతాలాలు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారాల అనంతరం సీఎం ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్‌లు మీడియాతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
హరియాణ సీఎంగా ఖట్టర్ పదవీ స్వీకార ప్రమాణం
-
సీఎంగా ఖట్టర్.. డిప్యూటీ సీఎం దుష్యంత్..
చండీగఢ్: హరియాణ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హరియాణ గవర్నర్ సత్యదేవ్ ఖట్టర్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జేజేపీ, శిరోమణి అకాలీ దళ్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. 90 స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్ (46)ను సొంతంగా అందుకోలేకపోయింది. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్ చౌతాలా కింగ్‌మేకర్‌గా అవతరించారు. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా జేజేపీతో బీజేపీ అక్రమపొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. -
జైలు నుంచి అజయ్ చౌతాలా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత, హరియాణా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా ఆదివారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అజయ్ చౌతాలా 2013 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కాగా డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాలా నేడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అజయ్ చౌతాలాకు 14 రోజుల పాటు ఫర్లోకు (సెలవు) అనుమతి ఇచ్చింది. దీపావళి పండుగ రోజు ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు హరియాణా రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు. -
సీఎం ఖట్టర్.. డిప్యూటీ దుష్యంత్
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల్లో ‘హంగ్’ ఫలితాల అనంతరం హరియాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపడంతో పదవుల పంపిణీలోనూ దాదాపు స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్(65) కొనసాగనుండగా, జేజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా(31) డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీలోని 90 స్థానాలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ పార్టీ సాధించ లేకపోయింది. ప్రధాన పార్టీలైన బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెల్చాయి. ప్రజాతీర్పును జేజేపీ గౌరవించడం లేదంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై ఆయన..‘ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉంది. అయినా, ఈ ఎన్నికల్లో మేం కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయలేదు కదా?’ అని ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసిన నేతలు బీజేపీకి చెందిన సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ శనివారం గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరులు సమర్పించిన రాజీనామా పత్రాలను అందజేశారు. రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. దీంతోపాటు తమకు మెజారిటీ సభ్యుల మద్దతున్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ చేసిన వినతిని కూడా ఆయన అంగీకరించారు. అనంతరం సీఎం ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగ రోజు ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు హరియాణా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. తనతోపాటు డిప్యూటీ సీఎంగా దుష్యంత్, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారన్నారు. జేజేపీ, స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో 90 సీట్లున్న అసెంబ్లీలో తమ బలం 57కు పెరగనుందని ఆయన చెప్పారు. ఖట్టర్ వెంట వెళ్లిన జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా, స్వతంత్రులు కూడా గవర్నర్‌కు బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు లేఖలను అందజేశారు. గోపాల్ కందా మద్దతు తీసుకోం అంతకుముందు ప్రభుత్వ అతిథిగృహంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశం తమ నేతగా ఖట్టర్‌ను ఎన్నుకుంది. ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరయ్యారు. సీఎం పదవికి ఖట్టర్ పేరును ఎమ్మెల్యేలు అనిల్ విజ్, కన్వర్ పాల్ ప్రతిపాదించగా మిగతా వారు ఆమోదం తెలిపారని సమావేశం అనంతరం రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఖట్టర్ మంత్రి వర్గంలో ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తాము తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు. దుష్యంత్ తండ్రి జైలు నుంచి బయటకు చౌతాలా కుటుంబంలో విభేదాలు రావడంతో ఐఎన్ఎల్డీ పార్టీ నుంచి బయటకు వచ్చిన దుష్యంత్ గత ఏడాదే జేజేపీని స్థాపించారు. ఆయన తల్లి నైనా ఈ ఎన్నికల్లో బధ్రా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్ మునిమనవడు, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మనవడే దుష్యంత్. అధికారంలో ఉండగా ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఓం ప్రకాశ్‌తోపాటు ఆయన తనయుడు, దుష్యంత్ తండ్రి అయిన అజయ్ చౌతాలా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సిర్సా, హిసార్లలో ఉన్న దుష్యంత్ చౌతాలా నివాసాల వద్ద భద్రతను పెంచారు. అంతేకాకుండా, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా ఆదివారం నుంచి రెండు వారాలపాటు బయట గడిపేందుకు ఖైదీలకిచ్చే సెలవులాంటి వెసులుబాటు(ఫర్లో)ను అధికారులు కల్పించారు. -
హరియాణా: బీజేపీకి గవర్నర్ ఆహ్వానం
చండీగఢ్: హరియాణాలో బీజేపీ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శనివారం రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆమోదం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానించారు. కాగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా సమర్పించగా గవర్నర్ ఆమోదించారు. రాజ్‌భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి ముఖ్యమంత్రిగా ఖట్టర్ ఆదివారం గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేయనున్నారు. ఈరోజు జరిగిన బీజేఎల్పీ సమావేశంలో శాసనసభా పక్ష నేతగా ఖట్టర్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. జన నాయక జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా(31) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. దుష్యంత్ ప్రమాణ స్వీకారోత్సావానికి ఆయన తండ్రి అజయ్ చౌతాలా హాజరుకానున్నారు. టీచర్ల భర్తీ కుంభకోణంలో దోషిగా తేలిన అజయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. శనివారం ఆయనకు కోర్టు 14 రోజుల పెరోల్ మంజూరు చేసింది. కాగా శుక్రవారం సాయంత్రం బీజేపీతో పొత్తుపై అధికారిక ప్రకటన చేయడానికి ముందు దుష్యంత్ తిహార్ జైలులో ఉన్న తన తండ్రిని కలిశారు. -
ఆ మద్దతు మాకొద్దు: రవిశంకర్ ప్రసాద్
చత్తీస్గడ్: హర్యాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకోబోదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. చత్తీస్‌గడ్‌లో విలేఖర్ల సమావేశంలో భాగంగా రవిశంకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ(46) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతోంది. అయితే, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి మద్దతిస్తారని తెలిపారు. మరోవైపు కందా మాత్రం తన కుటుంబానికి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో విస్తృత సంబంధాలు దృష్యా బీజేపీకి బేషరత్తుగా మద్దతిస్తానని తెలపడం గమనార్హం. కాగా, కందా లైంగిక ఆరోపణలు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలోనే గోపాల్ కందా మద్దతును బీజేపీ కోరబోదని రవిశంకర్ పేర్కొన్నారు. -
దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలకు పెరోల్
-
డిప్యూటీ సీఎంగా తెరపైకి దుష్యంత్ తల్లి పేరు!
చంఢీఘడ్: హరియాణా ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్ తల్లి నైనా చౌతాలా(53) పేరును పరిశీలిస్తున్నట్లు శనివారం జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎవరిని డిప్యూటీ సీఎం చేస్తారనేది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని అన్నారు. నైనా బాంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 13వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ నేత రణ్‌బీర్ సింగ్ మహేంద్రను ఓడించారు. టీచర్ల భర్తీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అజయ్ చౌతాలాకు భార్య నైనా చౌతాలా. దబ్వాలి నుంచి ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన నైనా.. 2018లో కుమారుడు దుష్యంత్ చౌతాలా(31) స్థాపించిన జన్నాయక్ జనతా పార్టీలో చేరారు. హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటుకు 46 స్థానాలు దక్కించుకోవాలి. కానీ హరియాణాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో.. అత్యధికంగా 40 సీట్లు గెలిచిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శుక్రవారం జేజేపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా బీజేపీ, హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో 10 సీట్లు గెలిచిన జేజేపీకి డిప్యూటీ సిఎం పదవి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొంది. హరియాణాలో స్థిరమైన ప్రభుత్వం కోసం బీజేపీ-జేజేపీ కూటమి అవసరమని భావించడంతో పొత్తుకు అంగీకరించామని మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ మనవడైన దుష్యంత్ చౌతాలా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దుష్యంత్ నేడు చండీగఢ్‌లో గవర్నర్‌ను కలిసి మద్దతు లేఖను సమర్పించనున్నారని సమాచారం. -
హరియాణా సీఎంగా రేపు ఖట్టర్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. బీజేఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభా పక్ష నేతగా శనివారం ఎన్నికయ్యారు. దీంతో ఖట్టర్ ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో హరియాణాలో ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే. 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ శుక్రవారం పొత్తు పెట్టుకుంది. దీంతో ఖట్టర్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖట్టర్ ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. వివాదాస్పద స్వతంత్య్ర ఎమ్మెల్యే గోపాల్ కండా మద్దతు తీసుకోవడం లేదని మరో బీజేపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
‘దుష్యంత్ చౌతాలా నన్ను మోసం చేశారు’
చండీగఢ్ : జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా తనను మోసం చేశారని ఆ పార్టీ అభ్యర్థి, భారత ఆర్మీ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. బీజేపీతో జట్టుకట్టి హరియాణా ప్రజల తీర్పును దుష్యంత్ అపహాస్యం చేశారని విమర్శించారు. బీజేపీకి జేజేపీ బీ- టీమ్‌లా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని అన్నారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 సీట్లు గెలుచుకుని స్థానిక జేజేపీ హరియాణా కింగ్‌మేకర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దుతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ- కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేశాయి. అనేక పరిణామాల అనంతరం తమ పార్టీ బీజేపీకి మద్దతునిస్తున్నట్లు జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. ఇక జేజేపీ అండతో మరోసారి అధికారం చేపట్టనున్న బీజేపీ.. ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కేబినెట్లో తగిన ప్రాధాన్యం కల్పించనున్నట్లు సమాచారం. (చదవండి : హరియాణాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే) ఈ నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై జేజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తేజ్ బహదూర్ దుష్యంత్ తీరుపై మండిపడ్డారు. ‘దుష్యంత్ చౌతాలా నాతో పాటు హరియాణా ప్రజలను ఘోరంగా మోసం చేశారు. బీజేపీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు అదే పార్టీకి మద్దతునిచ్చారు. బీజేపీని రాష్ట్రం నుంచి, అధికారం నుంచి తొలగించాలంటూ ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఇక 2017లో భారత జవాన్లకు నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ సెల్ఫీ వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన తేజ్ బహదూర్‌ను భారత భద్రతా దళం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ(ఉత్తరప్రదేశ్)లో చేరిన ఆయన... 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ మహాకూటమి(బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల్డీ) అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ క్రమంలో హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబరులో జేజేపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు. కర్నాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం మనోహర్‌లాల్‌పై పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. -
హరియాణాలో బీజేపీకే ‘జేజే’పీ
న్యూఢిల్లీ: హరియాణాలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడనుంది. గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో హరియాణాలో ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే. 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ(జేజేపీ)తో బీజేపీ శుక్రవారం పొత్తు పెట్టుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రిగా జేజేపీ నేత ఉంటారని బీజేపీ చీఫ్ అమిత్ షా, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌నే మళ్లీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉపముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలా ఉంటారని జేజేపీ వర్గాలు తెలిపాయి. హరియాణాలో రాజకీయ సుస్థిరత కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు దుష్యం త్ చౌతాలా తెలిపారు. హరియాణాలో మెజారిటీ వచ్చే అవకాశం లేదని అమిత్ షాకు ముందే సమాచారముందని, అందువల్ల ఫలితాల వెల్లడికి ముందే అమిత్‌షా దుష్యంత్ చౌతాలాతో మాట్లాడా రని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం శనివారం జరుగుతుందని, ఆ సమావేశానికి పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరవుతారని బీజేపీ హరియాణా ఇన్చార్జ్ అనిల్ జైన్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ శనివారం గవర్నర్‌ను కలిసి కోరతారని, దీపావళి తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ముందు స్వతంత్రుల మద్దతుతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీ గురువారం ఫలితాలు వెల్లడైనప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించింది. మెజారిటీకి ఆరు స్థానాలు అవసరమవడంతో.. తాజాగా గెలిచిన ఏడుగురు ఇండిపెండెంట్లతో సంప్రదింపులు జరిపింది. వారు కూడా మద్దతివ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా నివాసంలో మద్దతు లేఖను సీఎం ఖట్టర్‌కు అందజేశారు. స్వతంత్రుల్లో ఎక్కువమంది బీజేపీ రెబల్సే కావడం గమనార్హం. జేజేపీ మద్దతిచ్చేముందు, ఐఎన్ఎల్yీ ఎమ్మెల్యే అభయ్ చౌతాలా మద్దతూ తమకేనని బీజేపీ నమ్మకంగా ఉంది. గోపాల్ కందా మద్దతుపై అభ్యంతరం స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సమయంలో.. హరియాణ్ లోక్‌హిత్ పార్టీ నేత, ఎమ్మెల్యే గోపాల్ కందా నుంచి మద్దతు తీసుకోవడంపై వివాదం నెలకొంది. పలు క్రిమినల్ కేసులున్న స్వతంత్ర ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకుని పార్టీ నైతిక విలువలకు ద్రోహం చేయవద్దని సీనియర్ నేత ఉమాభారతి పార్టీ నాయకత్వాన్ని కోరారు. వెనక్కు తగ్గని కాంగ్రెస్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం భూపీందర్ హుడా కూడా శుక్రవారం ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ తదితరులతో భేటీ అయ్యారు. జేజేపీ(జననాయక్ జనతా పార్టీ)తో చర్చలు జరుపుతూనే, స్వతంత్రులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్‌తో జేజేపీ కలిసి వచ్చినప్పటికీ మెజారిటీకి మరో ఐదుగురు సభ్యుల బలం అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిపై హుడా స్పందిస్తూ.. ‘ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాల్లో మేం ఏమాత్రం వెనుకబడలేదు. స్వతంత్రులు చాలామంది మాతో కూడా టచ్‌లో ఉన్నారు’ అని పేర్కొన్నారు. స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారంటూ వస్తున్న వార్తలపై హుడా స్పందిస్తూ..‘వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారు. ప్రజా విశ్వాసాన్ని కాలరాస్తున్నారు. హరియాణా ప్రజలు వారిని ఎన్నటికీ క్షమించరు. వారిని చెప్పులతో కొట్టడం ఖాయం’అని మండిపడ్డారు. -
వేచి చూసే ధోరణిలోనే కాంగ్రెస్
న్యూఢిల్లీ: హర్యానాలో తిరిగి అధికార పగ్గాలు చేపట్టడానికి బీజేపీ ఒకపక్క వ్యూహరచన చేస్తుండగా, మరోపక్క ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. 90 సీట్ల హర్యానా అసెంబ్లీలో బీజేపీ అధికారానికి ఆరు సీట్ల దూరంలో ఆగిపోయింది. 10 స్థానాలు సంపాదించిన దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో అవగాహనకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోవంక కాంగ్రెస్ సైతం చౌతాలాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వేచిచూసే ధోరణిని అవలంభిస్తూనే... బీజేపీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టకుండా వీలైన అన్ని చర్యలూ తీసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇందుకు బీజేపీయేతర పార్టీలు, వాటి నేతలు ఏకతాటిపైకి రావాలనీ కోరుతోందని సమాచారం. ఢిల్లీకి కాంగ్రెస్ మాజీ సీఎం ఆయా అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమైన ఆయన, శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, హర్యానా ఇన్చార్జ్ గులాంనబీ ఆజాద్, సీనియర్ పార్టీ నేత అహ్మద్ పటేల్‌తో కూడా హుడా సమావేశం కానున్నారు. నిజానికి గురువారం ఉదయమే సోనియాగాంధీ హుడాకు ఫోన్ చేసి ఎన్నికల తీర్పు, పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా బీజేపీయేతర పార్టీలతో గ్రాండ్ అలయెన్స్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
హరియాణాలో హంగ్
న్యూఢిల్లీ/చండీగఢ్: హరియాణాలో రెండోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు తప్పాయి. రాష్ట్ర అసెంబ్లీలో 90 సీట్లుండగా ‘ఈసారి 75కు పైగా సీట్లు మనవే’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ... ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలు కూడా సాధించలేకపోయింది. సీఎం ఖట్టర్ కేబినెట్లోని మెజారిటీ మంత్రులు అనూహ్యంగా ఓటమి చవిచూశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా బీజేపీతో పోటీగా మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఫలితాల సరళిని బట్టి కొత్తగా అవతరించిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారింది. 90 సీట్లున్న హరియాణా అసెంబ్లీలో తాజా ఫలితాలను బట్టి బీజేపీ 40, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి. మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన జేజేపీ 10 సీట్లలో, స్వతంత్ర అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీటిని బట్టి, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు దుష్యంత్ చౌతాలాతో పాటు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్లు కానున్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తొహానా స్థానం నుంచి ఓటమి పాలైన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ సుభాష్ బరాలా... పార్టీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బీజేపీయేతరులు ఏకం కావాలి: హూడా బీజేపీయేతర పక్షాలన్నీ తమతో చేతులు కలపాలని కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా పిలుపునిచ్చారు. మిశ్రమ ఫలితాల నేపథ్యంలో అధికారం చేజిక్కించుకునేందుకు యంత్రాంగాన్ని వాడుకుని స్వతంత్రులపై ఒత్తిడి పెంచుతూ, వారిని బీజేపీ ఎటూ వెళ్లకుండా చేస్తోందని హూడా ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి సెల్జా మాట్లాడుతూ.. ‘బీజేపీని ప్రజలు తిరస్కరించారు. న్యాయం కోసం కొత్త మార్పును కోరుకున్నారు’ అని పేర్కొన్నారు. ఇది బీజేపీకి నైతిక ఓటమి: కాంగ్రెస్ హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి నైతిక ఓటమి రుచి చూపాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఉన్న 90 సీట్లలో 47 సీట్లతో గతంలో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు 40 స్థానాలకు పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఇప్పుడు దాదాపు 31 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తుకు గతంలో కంటే మంచి ఫలితాలు వచ్చాయని, బీజేపీ మెజార్టీ తగ్గిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది: దుష్యంత్ తాజా ఫలితాలపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా మాట్లాడుతూ.. సీఎం ఖట్టర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ‘ఎవరికి మద్దతిచ్చేదీ ఇప్పుడే చెప్పలేం. ముందుగా మా పార్టీ తరఫున గెలిచిన వారితో సమావేశం ఏర్పాటు చేసి, అసెంబ్లీ నేతను ఎన్నుకుంటాం. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా’ అని అన్నారు. 75 సీట్లలో గెలవాలన్న బీజేపీ లక్ష్యంపై ఆయన స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నారు. అందుకే ఆ పార్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది’అని వ్యాఖ్యానించారు. గెలిచిన ప్రముఖులు వీరే... ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై సుమారు 45 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సీనియర్ మంత్రి అనిల్ విజ్ అంబాలా కంటోన్మెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిపై 20 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ అతిరథులైన మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా, కుల్దీప్ బిష్ణోయి, కిరణ్ ఛౌధరీ విజయం సాధించారు. ఉచానా కలాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రేమ్లతపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా 47వేలకు పైగా ఓట్లతో ఘన విజయం నమోదు చేసుకున్నారు. ఇంకా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీకి చెందిన ఒకే ఒక అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా ముందంజలో ఉండగా హరియాణా లోఖిత్ పార్టీ (హెచ్ఎల్పీ) అధ్యక్షుడు గోపాల్ కందా సిర్సా స్థానంలో గెలుపు సాధించారు. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ విజయం సాధించారు. ప్రముఖుల ఓటమి హరియాణా మంత్రివర్గంలోని కెప్టెన్ అభిమన్యు, కవితా జైన్, కృష్ణకుమార్ బేడీతో పాటు రెజ్లర్ బబితా ఫొగట్ ఓటమిపాలయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా, అసెంబ్లీ స్పీకర్ కన్వర్పాల్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ ఓటమిపాలయ్యారు. లోక్తంత్ర సురక్ష పార్టీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ రాజ్‌కుమార్ సైనీ గొహానాలో ఓడిపోయారు. జాట్ల కంచుకోటలో కాంగ్రెస్ జాట్ల కంచుకోటలైన రొహ్తక్, జజ్జర్, సోనిపట్ జిల్లాల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కేవలం సోనిపట్ జిల్లాలోని రాయ్ సీటును మాత్రం బీజేపీ గెలుచుకోగలిగింది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ 10చోట్లకు పైగా గెలిచి, మరో 11 చోట్ల ముందంజ లో ఉంది. దక్షిణ హరియాణా, ఫరీదాబాద్ జిల్లాల్లో బీజేపీ ప్రభావం చూపగలిగింది. బీజేపీ ముందు 3 దారులు!! హంగ్ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఏం చేస్తాయి? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తమ నేత దుష్యంత్ చౌతాలాని ముఖ్యమంత్రిని చేస్తే మద్దతిస్తామని ఇప్పటికే జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) తేల్చి చెప్పింది. బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈ విషయంలో బీజేపీ ముందు మూడు మార్గాలున్నాయి. 1. మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రిగానే ఉంచి దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు బీజేపీ ముందుకు రావచ్చు. ఇది బీజేపీకి సమస్యేమీ కాదు. అయితే జాట్యేతర ముఖ్యమంత్రి ఖట్టర్ కింద డిప్యూటీ సీఎంగా చేరడం జాట్ ఓట్ల పునాదులపై గెలిచిన దుష్యంత్ చౌతాలా రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారవచ్చు. 2. జేజేపీ మినహా ఇతర స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పొందే అవకాశం బీజేపీకి ఉంది. ఇప్పటికే ఏడుగురు స్వతంత్రులతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ఖట్టర్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టవచ్చు. హెచ్ఎల్పీ అధ్యక్షుడు గోపాల్ గోయల్ కందా, సప్నా చౌదరికి బీజేపీ వర్గాలతో సాన్నిహిత్యం ఉంది. వారిద్వారా మిగిలిన స్వతంత్ర అభ్యర్థులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. 3. ఈ ఎన్నికల్లో జాట్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించే అవకాశమూ ఉంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కనుక బీజేపీ సీఎం పదవిని దుష్యంత్ చౌతాలాకు అప్పగించే అవకాశమూ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే అది అంత తేలిక కాదు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి సీఎంగా.. బీజేపీ నేత, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రోహ్తక్ జిల్లా మహమ్ తెహసిల్‌లోని నిదాన గ్రామంలో 1954 మే 5న జన్మించారు. తండ్రి హర్బాస్ లాల్ ఖట్టర్ వ్యాపారి. భారతదేశ విభజన సమయంలో ఇక్కడకు వలస వచ్చిన కుటుంబానికి చెందినవారు. ఖట్టర్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అవివాహితుడు. హరియాణాకు 10వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో 24 ఏళ్ల వయసులో ఖట్టర్ ఆర్ఎస్ఎస్లో చేరారు. 1980 నుంచి దాదాపు 14 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పని చేశారు. 1994లో బీజేపీలో చేరారు. క్షేత్రస్థాయి కార్యకర్తగా బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2014 హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న ఖట్టర్.. బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2014లో మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో హరియాణా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.