
ప్రమాణస్వీకారంచేసిన ఖట్టర్, దుష్యంత్
చండీగఢ్: హరియాణాలో బీజేపీ–జేజేపీల సంకీర్ణప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఖట్టర్, ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలాలు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఖట్టర్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగా, దుష్యంత్ మొదటిసారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ కూర్పు చేపట్టనున్నారు. ఇటీవలే జైలు నుంచి సెలవు మీద బయటకు వచ్చిన దుష్యంత్ చౌతాల తండ్రి అజయ్ చౌతాలా, ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దుష్యంత్ తల్లి నైనా చౌతాలాలు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారాల అనంతరం సీఎం ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్‌లు మీడియాతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment