Manoharlal khattar
-
2.70 లక్షల ఇళ్లు ఇవ్వండి: సీఎం రేవంత్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో తెలంగాణకు బీఎల్సీ మోడల్లో 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రికి వివరించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. తెలంగాణలో రాష్ట్ర సర్కారు నిర్మించ తలపెట్టిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని కేంద్ర మంత్రికి తెలిపారు. వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్సీ) విధానంలో నిర్మించనున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ)– పీఎంఏవై (యూ) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై (యూ) మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని వివరించారు. పీఎంఏవై (యూ) కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి, రూ.2,390.58 కోట్లు గ్రాంటుగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ.1,605.70 కోట్లే ఇచ్చారని, మిగతా నిధులు విడుదల చేయాలని కోరారు. స్మార్ట్‌సిటీ మిషన్ కాలపరిమితి పొడిగించండి స్మార్ట్‌సిటీ మిషన్ కింద చేపట్టిన పనులు పూర్తికానందున మిషన్ కాలపరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ నగరాల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. వరంగల్‌లో 45 పనులు పూర్తయ్యాయని, రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయని.. కరీంనగర్లో 25 పనులు పూర్తయ్యాయని, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని వివరించారు. స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగుస్తోందని.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనులు ముగిసేందుకు వీలుగా మరో ఏడాది పొడిగించాలని కోరారు. రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించండి హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం 2,500 ఎకరాల రక్షణశాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్‌ను రేవంత్ కలిశారు. ర్యావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటున్న విషయాన్ని రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు కీలకమని చెప్పారు. ఆర్సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములను వినియోగించుకుంటున్నందున.. బదులుగా రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలని కోరారు. భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని విజప్తి చేశారు. వరంగల్ సైనిక్ స్కూల్ ఇవ్వండి.. వరంగల్ నగరానికి కేంద్రం సైనిక్ స్కూల్ మంజూరు చేసినా.. గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం తెలిపారు. ఆ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిశాయని.. ఆ అనుమతులను పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. నీట్‌పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించామని సీఎం రేవంత్ తెలిపారు. రక్షణ భూముల బదలాయింపు, మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు, పీఎంఏవై ఇళ్ల విషయంలో విజ్ఞప్తులు అందజేశామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాం«దీలతో భేటీ రేవంత్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డిఫెన్స్ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరామని.. సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని చెప్పారు. యూపీలో మూడు, ఏపీలో రెండు సైనిక్ స్కూళ్లు ఉన్నాయని.. కానీ తెలంగాణలో ఒక్కటి కూడా లేదని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ పదేళ్ల పాటు అడగలేదని, ప్రధాని మోదీ ఇవ్వలేదని విమర్శించారు. నీట్ పరీక్ష నిర్వహణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఈ కేసును సీబీఐతో కాకుండా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఆ కేసును ఖతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘నీట్ పరీక్ష నిర్వహణలో మోదీ గ్యారంటీ ఏదీ? యువతకు మోదీ భరోసా ఏది?’అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే నా రాజకీయ జన్మ ప్రారంభమైంది: పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జన్మ కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని, చివరికి ముగిసేది కూడా కాంగ్రెస్‌లోనే అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత పోచారం మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఎన్టీఆర్ పిలుపుతో తాను టీడీపీలో చేరానని, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు పనిచేశానని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమర్థ పాలన అందిస్తున్నారని.. రైతులకు మంచి జరగాలనే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నానని చెప్పారు. -
ఖట్టర్ రాజీనామా
చండీగఢ్: హరియాణాలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీనియర్ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ రాజీనామా చేయడం మొదలు ఓబీసీ నేత నాయబ్ సైనీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడందాకా మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో విభేదాలు ముదరడంతో ఖట్టర్ సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చిందని వార్తలొచ్చాయి. అయితే ఖట్టర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిపేందుకే బీజేపీ ఆయనను సీఎం పీఠం నుంచి దింపేసిందని మరో వాదన వినిపించింది. హరియాణాలో లోక్‌సభ సీట్ల సర్దుబాటు విషయంలో జేజేపీతో బీజేపీకి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెగదెంపులు చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. దీంతో చివరకు సీఎం ఖట్టర్, 13 మంది మంత్రులు రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు హరియాణా నివాస్‌లో కలిసి 54 ఏళ్ల సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ సైనీ గవర్నర్‌ను కలిసి కోరారు. ఇందుకు గవర్నర్ ఒప్పుకోవడంతో హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ మంత్రులుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం చకచకా జరిగిపోయాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఖట్టర్ హాజరయ్యారు. జేజేపీతో పొసగని పొత్తు సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీ–జేజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి. హరియాణాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీచేస్తామని జేజేపీ పార్టీ పట్టుబట్టడంతో పార్టీతో పొత్తుకు బీజేపీ ఫుల్స్టాప్ పెట్టిందని తెలుస్తోంది. ఖట్టర్ రాజీనామా తర్వాత డెప్యూటీ సీఎం పదవి నుంచి జేజేపీ నేత దుష్యంత్ తప్పుకోవాల్సి వచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారీ గెలుపు ఖాయమని భావిస్తోంది. అందుకే గెలవబోయే స్థానంలో ఖట్టర్‌ను నిలపాలని బీజేపీ భావిస్తోంది. కులగణన డిమాండ్‌ను కాంగ్రెస్ తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో జనాభాలో 30 శాతమున్న ఓబీసీ వర్గానికి చెందిన సైనీని సీఎంగా చేసింది. 2014లో తొలిసారి ఎంపీ అయిన ఖట్టర్‌ను సీఎంగా ఎంచుకున్నట్లే తొలిసారి ఎంపీ అయిన నాయబ్నూ సీఎంగా కమలదళం ఎన్నుకుంది. ప్రస్తుత హరియాణా శాసనసభ కాలపరిమితి అక్టోబర్‌తో ముగియనుంది. ఈలోపు ఓబీసీ నేతతో సీఎం పదవిని భర్తీచేసి ఓబీసీలను తమవైపు తిప్పుకోవాలని పార్టీ భావిస్తోంది. బలపరీక్షకు అవకాశమివ్వండి తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, బలనిరూపణకు బుధవారం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ నూతన సీఎం సైనా గవర్నర్‌కు లేఖ రాశారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో 41 మంది బీజేపీ సభ్యులున్నారు. తమకు ఆరుగురు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు, ఒక హరియాణా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. జేజేపీకి 10 మంది, కాంగ్రెస్‌కు 30 మంది, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. -
వరి వేయకుంటే రూ.7 వేలు
చండీగఢ్ నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: హరియాణ రాష్ట్రంలో వరి పంట వేయకపోతే ఎకరాకు (ఇన్ని ఎకరాలు అనే పరిమితి లేకుండా) రూ.7 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేయడం ద్వారా 1.74 లక్షల ఎకరాల్లో వరికి బదులు ఇతర పంటలకు మళ్లించగలిగామని ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. వరితో పాటు నీరు అధికంగా అవసరమయ్యే ఇతర ధాన్యం పంటలు వేయకుండా ఏ పంట వేసినా లేదా పడావుగా (ఏమీ వేయకుండా) వదిలేసినా ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందన్నారు. 2020లో చేపట్టిన ‘మేరా పానీ మేరా విరాసత్’పథకంలో భాగంగా భావితరాలకు నీటిని అందించాలనే ఉద్దేశంతో దీనిని అమలు చేస్తున్నట్టు తెలియజేశారు. హరియాణలో గుడ్‌గవర్నెన్స్ అమలు చేస్తున్న విషయం వివరించేందుకు మీడియా ప్రతినిధులను అక్కడి ప్రభుత్వం ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హరియాణ పాటు చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటికీ యమున నదే ఆధారం కావడంతో వరి పంటకు నీరు భారీగా అవసరమై భూగర్భనీటి మట్టాలు పడిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలకు వివిధ పథకాల కింద కల్పించే ఉచితాలను, ఇది ఫ్రీ, అది ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఇచ్చే హామీలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని, స్వాభిమాన వ్యక్తులెవరూ వీటిని కోరుకోరని చెప్పారు. 2014 నుంచి హరియాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మనోహర్‌లాల్‌తో సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: ‘గుజరాత్ మోడల్’అంటూ కొందరు బీజేపీ నే తలు ప్రచారం చేశారు కదా ? తెలంగాణలో ‘హరి యాణ మోడల్’అమలు చేయమని చెబుతారా? సీఎం: ఈ మోడల్ ఆ మోడల్ అనే ప్రచారం ఎక్కువగా మీడియా సృష్టే అని చెప్పాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అక్కడి అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రజలకు ఏమి చేస్తారో ఎన్నికల హామీ ఇవ్వడంతో పాటు ‘హరియాణ మోడల్’అమలు అంశానికి కూడా ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ఒక రాష్ట్రంలో మంచి పథకాలు, మెరుగైన విధానాలుంటే వాటిని మరోచోట అమలు చేయొచ్చని ప్రధాని మోదీ కూడా సూచించారు. సాక్షి: మీ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు ఏవీ? సీఎం: హరియాణ ఒక్క రా్రష్ఠంలోనే ‘మేరి ఫసల్ మేరీ బ్యోరా’(ఎమ్మెస్‌ఎంబీ)కింద రైతులు రిజిష్టర్ చేసుకుంటే ఎంఎస్పీ ధర చెల్లింపుతో పాటు ఇతర రూపాల్లో ప్రయోజనాలు అందిస్తున్నాం. దీనిని ఈ–ఖరీద్ పోర్టల్‌కు లింక్ చేసి ఎంఎస్పీ ధరను డైరెక్ట్‌గా రైతు అకౌంట్లో వేస్తున్నాం. ఇప్పటిదాకా రూ.45వేల కోట్లు వారికి బదలీచేశాం. ముఖ్యమంత్రి అంత్యోదయ పరివార్ ఉత్థాన్ యోజనలో భాగంగా పేదవర్గాలను గుర్తించి వారికి బీపీఎల్‌కార్డులు, రేషన్ అందజేయడంతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నాం. -
హరియాణా సీఎంతో వైఎస్ జగన్ మర్యాదపూర్వక భేటీ
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మ.1.05 గంటలకు విశాఖ రుషికొండ పెమా వెల్నెస్ కేంద్రానికి చేరుకున్న జగన్‌కు హరియాణా సీఎం ఖట్టర్ బయటకు వచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ ఆత్మీయ సత్కారం చేసి జ్ఞాపికను అందించారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్న అనంతరం వైఎస్ జగన్ తిరిగి విజయవాడకు పయనమయ్యారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సెక్రటరీ ధనుంజయ్‌రెడ్డి.. సీఎం ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం కూడా విశాఖ వచ్చారు. అంతకుముందు.. విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ శ్రేణుల్ని సీఎం జగన్ ఆత్మీయంగా పలకరించారు. సుమారు 50 నిమిషాల పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లతో ఆయన ముచ్చటించారు. గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు గుడివాడ అమర్నా«థ్, దాడిశెట్టి రాజాతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. నేచురోపతి కోసం వచ్చా ఈ సందర్భంగా మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. తన మిత్రుడు సూచన మేరకు తాను ఇక్కడకు నేచురోపతి చికిత్స కోసం వచ్చానన్నారు. ఇక్కడైతే ఎలాంటి హడావుడి ఉండదని, ప్రశాంతత కోసం వచ్చానని ఆయన చెప్పారు. వైజాగ్ చాలా బాగుందని ఖట్టర్ కితాబిచ్చారు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను కలవడానికి వచ్చారని.. ఇరువురం కలిసి లంచ్ చేశామని.. సుహృద్భావ వాతావరణంలో తమ భేటీ జరిగిందని.. ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన తెలిపారు. -
హర్యానా ముఖ్యమంత్రితో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ
Updates: ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం నుంచి తాడేపల్లికి తిరుగు పయనమయ్యారు. ► హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ వెల్నెస్ రిచాట్స్ నుంచి వైజాగ్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. ► విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్నారు. రుషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం జగన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ►విశాఖకు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖ నగర మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, కలెక్టర్ స్వాగతం పలికారు. ►విశాఖ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం భేటికానున్నారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10.25 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11.05 గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.50 గంటలకు రుషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్‌కు వెళతారు. అక్కడ హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం
సాక్షి, విశాఖపట్నం(పెందుర్తి): విశాఖ శ్రీశారదా పీఠాన్ని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం సందర్శించి రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. స్వామీజీ చేతుల మీదుగా శంకరాచార్య విగ్రహాన్ని అందుకున్నారు. ధర్మ పరిరక్షణ కోసం పీఠం చేస్తోన్న కృషిని సీఎంకు స్వరూపానందేంద్ర వివరించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే హరియాణాలో కూడా శ్రీశారదాపీఠం ఆశ్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖట్టర్ మాట్లాడుతూ..రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం హరియాణా ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. అంతకుముందు సీఎంకు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాగతం పలికారు. కాగా, ఆదివారం సాయంత్రం సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ఖట్టర్ సందర్శించారు. చదవండి: (AP: వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ల వేతనాలు పెంపు) -
హరియాణా ఆవిర్భావ దినోత్సవం: ఖైదీలకు సీఎం ఖట్టర్ తీపికబురు
చండీగఢ్: హరియాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రాష్ట్రంలోని.. వివిధ జైళ్లలో శిక్షలను అనుభవిస్తున్నవారికి తీపికబురు అందించారు. ఇప్పటికే.. జైళ్లలో లేదా పెరోల్‌పై ఉన్న సుమారు 250 మంది నిందితులకు క్షమాభిక్ష ఇస్తున్నట్లు ప్రకటించారు. శిక్షాకాలంలో 6 నెలలు, అంతకన్నా తక్కువ కాలం ఉన్న నిందితులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే, క్రూరమైన నేరాలకు పాల్పడి శిక్షలు అనుభవిస్తున్న వారికి మాత్రం ఇది వర్తించదని సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. చదవండి: బస్సు లోయలో పడిన ఘటన: బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం Haryana CM ML Khattar announces pardoning of sentences of 250 prisoners lodged in different jails of the state or currently on parole, who have a duration of 6 months or less remaining in their sentence. This will not be applicable to convicts of heinous crimes. pic.twitter.com/BpJQS3Ymmc — ANI (@ANI) November 1, 2021 -
నీరజ్‌కు హరియాణా ప్రభుత్వం నజరానా రూ. 6 కోట్లు
భారత అథ్లెటిక్స్‌లో స్వర్ణ చరిత్ర లిఖించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అటు ప్రశంసలు ఇటు రూ. కోట్లు కురుస్తున్నాయి. హరియాణాకు చెందిన ఈ చాంపియన్ అథ్లెట్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ భారీ నజరానా ప్రకటించారు. హరియాణా క్రీడాపాలసీ ప్రకారం అతనికి రూ. 6 కోట్ల పారితోషికం, క్లాస్–1 ఉన్నతోద్యోగంతో పాటు నివాస స్థలం (నామమాత్రపు ధరతో) ఇస్తామని సీఎం తెలిపారు. కాంస్యం నెగ్గిన రెజ్లర్ బజరంగ్ పూనియాకు రూ.2 కోట్ల 50 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం, నివాస స్థలం అందజేస్తామని చెప్పారు. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాకు క్రికెట్ వర్గాలు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా రూ. ఒక కోటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రూ. ఒక కోటి నజరానాగా ఇస్తామని వెల్లడించింది. దేశీ వాహనరంగ సంస్థ మహీంద్ర త్వరలో విడుదల చేసే ‘ఎక్స్‌యూవీ700’ ప్రీమియం కారును తొలుత నీరజ్‌కే బహుమతిగా ఇస్తామని మహీంద్ర గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర వెల్లడించారు. -
బంపర్ ఆఫర్: మొక్కలు నాటితే ఎక్స్ట్రా మార్కులు..
చండీగఢ్: చదువులో భాగంగా మొక్కలు నాటిన విద్యార్థులకు ఎక్స్ట్రా మార్కులు ఇవ్వనున్నట్లు హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. 8-12 తరగతుల విద్యార్థులకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేశారు. పంచకుల జిల్లాలోని నేచర్ క్యాంప్ తప్లి అండ్ నేచర్ ట్రయల్స్ ఆఫ్ మోర్నిహిల్స్ ప్రాంతంలో పంచకర్మ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్‌లాల్ ఖట్టర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. ‘‘పర్యావరణ పరిరక్షణలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో విద్యార్థులను ప్రకృతితో కలిపేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. రాష్ట్రపరిధిలోని పాఠశాలలకు ఈ నియమం వర్తిస్తుంది. 8-12వ తరగతి విద్యార్థులు తమ పాఠశాల పరిధిలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలి. దీని ప్రకారం ఆఖరి పరీక్షలో వారికి మార్కులు కేటాయిస్తాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. చదవండి: ఆమె అడవిగా విస్తరించింది -
సెకండ్‌వేవ్: లాక్డౌన్ పొడిగించిన మరో రాష్ట్రం
చండీఘడ్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించాయి. అయితే, ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరేన్స్ సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య అదపులోనే ఉందని అన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని మరింత కట్టడి చేయడానికి మరికొంత కాలం లాక్డౌన్ అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్నినూతన సడలింపులను జారీ చేశారు. దీని ప్రకారం... ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు షాపులు పనివేళలని తెలిపారు. అదే విధంగా.. ఇకమీదట దుకాణ యజమనులు సరి,బేసి నియమాలను పాటిస్తూ దుకాణాన్ని తెరుచుకోవాలని అన్నారు. అయితే, కొన్ని మాల్స్‌లలో మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు తెరవడానికి ప్రత్యేకంగా అనుమతిస్తున్నామని తెలిపారు. అయితే, వీటిలో ఒకేసరి సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాల్ యజమానులకు ఆదేశాలను జారీ చేశారు. అయితే, కర్య్ఫూ మాత్రం యధావిధిగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు. అన్నిరకాల విద్యాసంస్థలు జూన్ 15 వరకు మూసివేయబడి ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. అదే విధంగా వ్యాక్సిన్ కూడా వేసుకోవాలని పేర్కొన్నారు. కాగా.. శనివారం ఒక్క రోజే 1,868 కొత్తగా కరోనా కేసులు నమోదుకాగా, 97 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకుఈ మహమ్మారి కారణంగా 8,132 మంది చనిపోయారు. కాగా, ఇప్పటి వరకు హరియాణాలో 7,53,937 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 23,094 కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. -
కోవిడ్ మరణాలపై రాద్ధాంతం అవసరమా?: హర్యానా సీఎం
రోహతక్: కరోనా కారణంగా జరిగిన మరణాల సంఖ్యపై చర్చోపచర్చలతో వారిని తిరిగి బతికించలేమని, దానికి బదులు ప్రస్తుతం బతికిఉండి బాధపడుతున్నవారిని పట్టించుకోవడంపై శ్రద్ధ పెట్టాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకు, వాస్తవ మరణాల లెక్కలకు పొంతన కుదరడంలేదన్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో మరణాల డేటా పట్టుకొని వాదోపవాదాలు చేయవద్దని, బతికిఉన్నవారిని కాపాడడం, వారికి స్వాంతన చేకూర్చడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. దయలేని పాలకులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని, సంభవించిన ప్రతిమరణం ప్రభుత్వ అసమర్ధత వల్లనే జరిగిందని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా విమర్శించారు. రాష్ట్రంలోని నగరాల్లో ఆక్సిజన్ సరఫరాను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి పర్యటించారు. ఎవరూ ఇలాంటి సంక్షోభాన్ని ఊహించలేదని, దీన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేయడమే మార్గమన్నారు. ఈ సమయంలో అనవసర వివాదాలకు తావివ్వవద్దన్నారు. మెడికల్ ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రుల్లో మరణాలపై విచారణకు ఆదేశించారు. చదవండి: ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు ఎందుకంత డిమాండ్? -
కరోనా: హర్యానా కీలక నిర్ణయం
చండీగఢ్: కరోనా(కోవిడ్-19)పై పోరాటంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు అండగా ఉండేందుకు హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి ప్రబలుతున్న తరుణంలోనూ నిర్విరామంగా వార్తలు చేరవేస్తున్న జర్నలిస్టులకు రూ. 10 లక్షల బీమా సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గురువారం ప్రకటన చేశారు. కాగా ముంబై, చెన్నైలో పనిచేస్తున్న దాదాపు 70 మంది జర్నలిస్టులకు ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. (న్యూస్ ఛానల్లో పని చేస్తున్న 27 మందికి కరోనా) ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధి నిర్వహణలో విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తున్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై తరహాలో ఢిల్లీలోనూ మీడియా ప్రతినిధులకు మూకుమ్మడిగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీంతో బుధవారం నుంచి అక్కడ జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. State govt has decided to provide insurance of Rs 10 lakh each to all journalists who are reporting during #Coronavirus pandemic: Haryana CM Manohar Lal Khattar (File pic) pic.twitter.com/9u7U8pi9lJ — ANI (@ANI) April 23, 2020 -
హరియాణా సీఎంగా ఖట్టర్ ప్రమాణం
చండీగఢ్: హరియాణాలో బీజేపీ–జేజేపీల సంకీర్ణప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఖట్టర్, ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలాలు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఖట్టర్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగా, దుష్యంత్ మొదటిసారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ కూర్పు చేపట్టనున్నారు. ఇటీవలే జైలు నుంచి సెలవు మీద బయటకు వచ్చిన దుష్యంత్ చౌతాల తండ్రి అజయ్ చౌతాలా, ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దుష్యంత్ తల్లి నైనా చౌతాలాలు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారాల అనంతరం సీఎం ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్‌లు మీడియాతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
సీఎం ఖట్టర్.. డిప్యూటీ దుష్యంత్
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల్లో ‘హంగ్’ ఫలితాల అనంతరం హరియాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపడంతో పదవుల పంపిణీలోనూ దాదాపు స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్(65) కొనసాగనుండగా, జేజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా(31) డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీలోని 90 స్థానాలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ పార్టీ సాధించ లేకపోయింది. ప్రధాన పార్టీలైన బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెల్చాయి. ప్రజాతీర్పును జేజేపీ గౌరవించడం లేదంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై ఆయన..‘ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉంది. అయినా, ఈ ఎన్నికల్లో మేం కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయలేదు కదా?’ అని ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసిన నేతలు బీజేపీకి చెందిన సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ శనివారం గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరులు సమర్పించిన రాజీనామా పత్రాలను అందజేశారు. రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. దీంతోపాటు తమకు మెజారిటీ సభ్యుల మద్దతున్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ చేసిన వినతిని కూడా ఆయన అంగీకరించారు. అనంతరం సీఎం ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగ రోజు ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు హరియాణా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. తనతోపాటు డిప్యూటీ సీఎంగా దుష్యంత్, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారన్నారు. జేజేపీ, స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో 90 సీట్లున్న అసెంబ్లీలో తమ బలం 57కు పెరగనుందని ఆయన చెప్పారు. ఖట్టర్ వెంట వెళ్లిన జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా, స్వతంత్రులు కూడా గవర్నర్‌కు బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు లేఖలను అందజేశారు. గోపాల్ కందా మద్దతు తీసుకోం అంతకుముందు ప్రభుత్వ అతిథిగృహంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశం తమ నేతగా ఖట్టర్‌ను ఎన్నుకుంది. ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరయ్యారు. సీఎం పదవికి ఖట్టర్ పేరును ఎమ్మెల్యేలు అనిల్ విజ్, కన్వర్ పాల్ ప్రతిపాదించగా మిగతా వారు ఆమోదం తెలిపారని సమావేశం అనంతరం రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఖట్టర్ మంత్రి వర్గంలో ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తాము తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు. దుష్యంత్ తండ్రి జైలు నుంచి బయటకు చౌతాలా కుటుంబంలో విభేదాలు రావడంతో ఐఎన్ఎల్డీ పార్టీ నుంచి బయటకు వచ్చిన దుష్యంత్ గత ఏడాదే జేజేపీని స్థాపించారు. ఆయన తల్లి నైనా ఈ ఎన్నికల్లో బధ్రా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్ మునిమనవడు, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మనవడే దుష్యంత్. అధికారంలో ఉండగా ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఓం ప్రకాశ్‌తోపాటు ఆయన తనయుడు, దుష్యంత్ తండ్రి అయిన అజయ్ చౌతాలా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సిర్సా, హిసార్లలో ఉన్న దుష్యంత్ చౌతాలా నివాసాల వద్ద భద్రతను పెంచారు. అంతేకాకుండా, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా ఆదివారం నుంచి రెండు వారాలపాటు బయట గడిపేందుకు ఖైదీలకిచ్చే సెలవులాంటి వెసులుబాటు(ఫర్లో)ను అధికారులు కల్పించారు. -
ఎందుకు మనసు మార్చుకున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదిపిన బీజేపీ, దుష్వంత్ నాయకత్వంలోని ‘జన్నాయక్ జనతా పార్టీ’తో చేతులు కలిపింది. దుష్వంత్కు డిప్యూటి ముఖ్యమంత్రి పదవిని ఎరవేసి మద్దతు కూడకట్టింది. ఇలాంటి విషయాల్లో పావులు కదపడంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పుడు ముందే ఉంటారనే విషయం తెల్సిందే. అయితే గత (2019) లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీకి బ్రహ్మరథం పట్టిన హరియాణా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీని కూడా బీజేపీకి ఎందుకు అందించలేదు? అంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు? గత లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది స్థానాలను గెలుచుకున్న బీజేపీకి 58.2 శాతం ఓట్లు వచ్చాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి ఆరు సీట్లు తక్కువగా 40 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీకి 36. 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఐదు నెలల కాలంలోనే 22 శాతం ఓట్లు తగ్గాయి ఎందుకు? ఆరెస్సెస్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజాకర్షణలో వెనకబడ్డారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఎదురైన అసమ్మతిని సర్దుబాటు చేసుకోవడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టింది. మరోపక్క హరియాణాలో ఎక్కువ ఉన్న జాట్లు ఓటు వేయక పోవడం వల్ల పోలింగ్ శాతం తగ్గిందని భావిస్తున్నారు. ఎందుకు? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. హరియాణా ఓటరు తెలివి మీరాడని, లోక్‌సభ ఎన్నికల్లో ఒకలాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలాగా వ్యవహరించే వివేచన వచ్చిందేమో! అన్నట్లుగా జాతీయ టీవీ యాంకర్లు మాట్లాడారు. సాధారణంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒక్కసారి జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఓటు వేసిన పార్టీకే, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తారని ఇప్పటి వరకు నిర్వహించిన అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. లోక్‌సభకు, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు జరిగినప్పుడు ఓటరు ఎప్పుడూ భిన్నంగానే ఆలోచిస్తాడని, అయితే అందుకు అనేక కారణాలు ఉంటాయని రాజకీయ పండితులు గతంలో అభిప్రాయపడ్డారు. అయితే ఈసారి హరియాణా ప్రజల స్పందనకు స్పష్టమైన కారణాలు కనిపించక పోవడం అంటే బీజేపీ పట్ల గుడ్డి అభిమానం తగ్గుతుందన్నదనడానికి సూచన అని కొంత మంది రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: దుష్యంత్ నన్ను మోసం చేశారు) -
హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా మనోహర్‌లాల్ ఖట్టర్
-
‘హరియాణాలో మళ్లీ మేమే’
చండీగఢ్ : ప్రధాని నరేంద్ర మోదీ హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ప్రారంభించారు. రోహ్తక్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ హరియాణాలో పదికి పది పార్లమెంట్ స్ధానాలను బీజేపీకి కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత కొద్ది నెలలుగా రోహ్తక్ తాను రావడం ఇది మూడవసారని, ప్రజల నుంచి మరింత మద్దతు కోరేందుకు ఇక్కడకు వచ్చానని, తాను కోరినదానికంటే మిన్నగా రోహ్తక్ ప్రజలు తనకు అందించారని చెప్పుకొచ్చారు. హరియాణాలో మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మీరిస్తున్న ప్రోత్సాహం చూస్తుంటే రాష్ట్రంలో కాషాయ ప్రభంజనం ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన తరహాలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు బాసటగా నిలవాలని ప్రధాని కోరారు. గత వందరోజులగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, మార్పు దిశగా పురోగతి సాధిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడిందని స్పష్టం చేశారు. -
ఇక కశ్మీర్ వధువులను తెచ్చుకోవచ్చు
చండీగఢ్: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు పరిణామాలపై స్పందిస్తూ ‘గతంలో బిహార్ నుంచి కోడళ్లను తెచ్చుకునేవారమని, ఇకపై కశ్మీర్ నుంచి అందమైన వధువులను తెచ్చుకోవచ్చు’అంటూ వ్యాఖ్యానించారు. ఫతేబాద్‌లో శనివారం లింగ నిష్పత్తిపై జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాదం కావడంతో, మీడియా తనను అపార్థం చేసుకుందంటూ తను అన్న మాటలను వీడియో ఆధారాలతో ట్విట్టర్లో పోస్టు చేశారు. కాగా, హరియాణా ముఖ్యమంత్రివి హేయమైన మాటలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. కఠోరమైన ఆర్ఎస్ఎస్ శిక్షణ కూడా ఆ బలహీన మనస్తత్వం ఉన్న మనిషిపై ప్రభావితం చూపలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, ‘ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు కూడా అవమానంగా భావించాలి’అని అన్నారు. -
ఖట్టర్ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్
న్యూఢిల్లీ: కశ్మీరీ అమ్మాయిలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఖట్టర్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ భావజాలానికి అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ‘కశ్మీర్ యువతులపై హరియాణా సీఎం ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. బలహీన మనస్కుడు, అభద్రతతో కూడిన వ్యక్తికి ఏళ్లకు ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ ఇచ్చిన శిక్షణకు ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మగాళ్లు సొంతం చేసుకోవడానికి మహిళలేమి ఆస్తులు కాద’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ లోయలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు. ఇక బాధ్యత గల పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలవతున్నారు. ‘ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించి దుమారం రేపిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వ్యవహారం మరువక ముందే హరియాణా ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బిహార్ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. అందరి చూపు ఇక కశ్మీరీ అమ్మాయిల పైపే ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దవడంతోనే ఇది సాధ్యమైంది. కశ్మీరీ అమ్మాయిల్ని కోడళ్లుగా, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గుచూపుతార’ని మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
హరియాణా ఓటు ఎవరికి ?
సాక్షి, న్యూఢిల్లీ : ఈ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందంటూ పలు సర్వేలు సూచిస్తోన్న నేపథ్యంలో పాలకపక్షం బీజేపీ ప్రధానంగా తన దృష్టిని ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై పెట్టింది. అధికారంలో ఉన్న హరియాణాపై అంతగా దృష్టిని కేంద్రీకరించలేదు. ఈ రాష్ట్రంలోని పది లోక్‌సభ స్థానాలకు మే 12వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మే 12, మే 19 మరో రెండు విడతల పోలింగ్ మిగిలివున్న విషయం తెల్సిందే. గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని పది సీట్లకుగాను ఏడు లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకోగా, రెండు సీట్లను ‘ఇండియన్ నేషనల్ లోక్‌దళ్’ గెలుచుకోగా, ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. 2014, అక్టోబర్‌లో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వాన ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి ఆది నుంచి ఆటు పోట్లు తప్పడం లేదు. హిస్సార్‌లో ఓ ఆధ్యాత్మిక గురువును హత్య కేసులో అరెస్ట్ చేయడంతో ఆయన అనుచరులకు, పారా మిలటరీ దళాలకు పెద్ద హింసాకాండే చెలరేగింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన జాట్లు 2016లో తమకూ విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వారి ఆందోళన విధ్వంసకాండకు దారితీయడంలో 20వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. 2017, ఆగస్టు నెలలో డేరా సచ్చా సౌదాకు చెందిన మత గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను అరెస్ట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసకాండ చెలరేగింది. ఈ సంఘటనల్లో 126 కోట్ల రూపాయల ఆస్తి ధ్వంసం అయినట్లు అంచనా వేశారు. 2014 నుంచి 2018 మధ్య రాష్ట్రంలో పలు గోరక్షకుల దాడులు జరగడంతో ఎందుకు సరైన నివారణ చర్యలు తీసుకోవడం లేదంటూ సుప్రీం కోర్టు నుంచి చీవాట్లు కూడా తినాల్సి వచ్చింది. ఖట్టర్ ప్రభుత్వం ఇటీవల 18 వేల పోస్టులను పోలీసులు, టీచర్లు, డీ తరగతి ఉద్యోగులతో భర్తీ చేయడం ఒక్కటే ప్రభుత్వానికి కాస్త అనుకూలించే అంశం. ‘నాలుగేళ్ల నుంచి ఏం చేస్తోందీ ఈ ప్రభుత్వం ?’ అంటూ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోన్న హర్ష అనే మహిళ ప్రశ్నిస్తోంది. తాను 2009లో టీచర్ టెస్ట్ పాసయ్యాయని, పదేళ్ల తర్వాత టీచర్ నియామకాలు జరిగాయని, ఇప్పుడు తనకు 40 ఏళ్లు రావడంతో ఉద్యోగానికి అర్హురాలిని కాలేక పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎంతో మంది నష్టపోయి ఉంటారని ఆమె అన్నారు. రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగంతో బాధ పడుతుంటే 18 వేల ఉద్యోగాలు ఏ మూలకు సరిపోతాయని ఆమె ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసిన జాట్లు ఈసారి కాంగ్రెస్, లోక్‌దళ్‌కు వేస్తామని చెబుతుండగా, వారిని రాజకీయ ఆదిపత్యాన్ని అంగీకరించని ఇతర సామాజిక వర్గాల వారు ఏం చేయకపోయినా బీజేపీకి వేస్తామని చెబుతున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్రంలో జాట్లతే ప్రాబల్యం నడుస్తోందని, వారి ఆందోళన సందర్భంగా అన్యాయంగా తమ దుకాణాలను తగలబెట్టారని చిల్లర వ్యాపారులు చెబుతున్నారు. -
అప్పుడు గీతా శ్లోకాలు.. ఇప్పుడు గాయత్రి మంత్రం
హర్యానా : పాఠ్య పుస్తకాల్లో గీతా శ్లోకాలను ప్రవేశపెట్టిన హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు ముందుకు వేసింది. పాఠశాలల్లో రోజువారి ప్రార్థనా గీతంగా గాయత్రి మంత్రాన్ని ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈమేరకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి. దీనికి సంభందించి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నత విలువలు, సంస్కృతి, సంప్రాదాయలను పెంపొందించేందు గాయత్రి మంత్రం సహాయపడుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి రామ్ బిలాష్ శర్మ నిర్ధారించారు. డిపార్టుమెంట్‌లోని పలువురు సీనియర్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు గాయత్రి మంత్రం గొప్పతనం తెలిసేలా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గాయత్రి మంత్రం సాథువులు,రుషులు ప్రపంచానికిచ్చిన వరం అని విద్యాశాఖ మంత్రి రామ్ బిలాస్ శర్మ తెలిపారు. ఇక పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో గాయత్రి మంత్రం తప్పనిసరి అన్నారు. 2015లోనే గీతా శ్లోకాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఖట్టర్ భావించినా ప్రతిపక్షాలనుంచి తీవ్ర విమర్శలు రావడంతో 2016లో సిలబస్‌గా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
తిరగబడ్డ యువతులకు సన్మానం
రోహ్తక్ అక్క చెల్లెళ్లను గౌరవించనున్న హర్యానా సర్కారు చండీగఢ్: బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన ఇద్దరు రోహ్తక్ అక్కచెల్లెళ్లను గణతంత్ర దినోత్సవ సందర్భంగా సన్మానించాలని హరియానా ప్రభుత్వం నిర్ణయిం చింది. వీరికి నగదు బహుమతి అందచేయనున్నట్లు హరియానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఇటీవల హరియానాలో కళాశాలకు వెళుతున్న యువతుల పట్ల ముగ్గురు పోకిరీలు అసభ్య చేష్టలకు దిగటంతో తీవ్రంగా ప్రతిఘటించి బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో మిగతా ప్రయాణికులు చేష్టలుడిగి చూస్తున్నా బాధితుల్లో ఓ యువతి బెల్టుతో నిందితులపై తిరగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్‌ను హరియానా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు కుల్దీప్, మోహిత్, దీపక్‌లను డిసెంబర్ 6 వరకు రిమాండ్‌కు తరలించారు. యువతులకు కేంద్ర మంత్రుల ప్రశంసలు యువతులంతా రోహ్తక్ అక్కచెల్లెళ్లను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమా భారతి సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు అన్ని రకాలుగా ముప్పు ఉందని ఈ సంఘటనతో తేలిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా, కన్ల్సాకి చెందిన ముగ్గురు నిందితులను 24 గంటల్లోగా విడుదల చేయాలని గ్రామస్తులు హెచ్చరించా రు. తమ గ్రామ యువకులపై తప్పుడు కేసులో బనాయించారని ఆరోపించారు. ఇది వేధింపుల కేసు కాదని, సీట్ల గురించి వివాదమన్నారు. -
హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణం
రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు మోదీ సహా ప్రముఖుల హాజరు పంచకుల: హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్(60)ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. పెళ్లి కూడా చేసుకోకుండా 40 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తగా సేవలకే అంకితమైన ఖట్టర్.. ఎమ్మెల్యేగా ఎన్నికకావడం ఇదే తొలిసారి అయినా సీఎం పీఠాన్ని అధిష్టించడం గమనార్హం. హర్యానాలోని పంచకులలో జరిగిన ఈ కార్యక్రమంలో ఖట్టర్‌తో పాటు తొమ్మిది మందితో మంత్రులుగా ఆ రాష్ట్ర గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకి ప్రమాణస్వీకారం చేయించారు. హర్యానా రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేగాకుండా హర్యానాకు తొలి పంజాబీ సీం కూడా ఖట్టరే. ప్రమాణ స్వీకారాన్ని చండీగఢ్‌లో నిర్వహించే సాంప్రదాయానికి భిన్నంగా.. పంచకులలోని సెక్టార్ 5లో ఉన్న హుడా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్ నేతలు అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మా, వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఖట్టర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజాసంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తు జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కొత్త మంత్రులు అనిల్ విజ్, అభిమన్యు చెప్పారు. అభినందించిన మోదీ.. ఖట్టర్‌ను మోదీ అభినందించారు. ఖట్టర్, ఆయన మంత్రివర్గ బృందం హర్యానాను నూతన శిఖరాలకు తీసుకెళతారన్నారు. -
హర్యానా పీఠంపై ఖట్టార్
సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ నాయకత్వం శాసనసభాపక్ష నేతగాఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు {పభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన రాష్ర్ట గవర్నర్ 26న ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఛండీగఢ్: హర్యానా సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టార్‌ను బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. సుదీర్ఘకాలంగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా సేవలందిస్తూ వచ్చిన 60 ఏళ్ల ఖట్టార్.. హర్యానాకు తొలి పంజాబీ ముఖ్యమంత్రి కానున్నారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సమావేశమై ఆయన్ను పార్టీ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా హాజరయ్యారు. హర్యానా బీజేపీ అధ్యక్షుడు, సీఎం పీఠం కోసం పోటీ పడిన రామ్‌విలాస్ శర్మతో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ సందర్భంగా ఖట్టార్ పేరును ప్రతిపాదించారు. ఈ భేటీ అనంతరం ఖట్టార్తో పాటు ఇతర నేతలంతా రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమని వెల్లడించారు. దీంతో ఆయన కూడా అందుకు సమ్మతిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. ఈ నెల 26న ఇక్కడి పంచకులలోని తవు దేవీలాల్ క్రీడా ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. కాగా, ఏకైక ఎమ్మెల్యే ఉన్న బీఎస్పీ కూడా బీజేపీకి తన మద్దతు తెలుపుతూ గవర్నర్‌కు లేఖ ఇచ్చింది. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతు లేఖలు అందజేశారు. టాస్క్ మాస్టర్ ఖట్టార్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, అవినీతిరహిత పాలన అందిస్తానని కాబోయే సీఎం మనోహర్‌లాల్ ఖట్టార్ పేర్కొన్నారు. బీజేపీపై నమ్మకంతో అధికారం కట్టబెట్టినందుకు రాష్ర్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ విజన్‌కు అనుగుణంగా రాష్ర్టంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన వివరించారు. పెళ్లి కూడా చేసుకోకుండా 40 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తగా సేవలకే అంకితమైన ఖట్టార్.. ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇదే తొలిసారి. రోహతక్ జిల్లాలో జన్మించిన ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టాస్క్ మాస్టర్‌గా పార్టీలో తన పని తాను సమర్థంగా చేసుకుపోయే వ్యక్తిగా, నిష్కళంకుడిగా పేరున్న ఖట్టార్‌ను.. ప్రధాని నరేంద్ర మోదీకి, పార్టీ జాతీయాధ్యక్షడు అమిత్ షాకు సన్నిహితుడిగా పేర్కొంటారు. గతంలో ఆయన మోదీతో కలసి పనిచేశారు. మంచి వ్యూహకర్తగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంలో ఖట్టార్ కీలకపాత్ర పోషించారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ హర్యానాలో పార్టీ ప్రచార బాధ్యత లను ఆయనే భుజానేసుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఖట్టార్ నేతృత్వం వహిస్తున్న కర్నాల్ నియోజకవర్గం నుంచే ప్రధాని మోదీ తన ప్రచారాన్ని ప్రారంభించడం గమనార్హం. ఖట్టార్ కుటుంబం దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి వచ్చి హర్యానాలో స్థిరపడింది. అక్కడే 1954లో జన్మించిన ఖట్టార్.. 26 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు. అంతకుముందు కాశీకి వెళ్లిన సందర్భంగా తన జీవితాన్ని దేశానికే అంకితం చేయాలన్న దృఢ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత బీజేపీలోనూ ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా హర్యానా, గుజరాత్, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన రచించిన వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. ఆయన కార్యదక్షతను గుర్తించిన పార్టీ నాయకత్వం.. ఒక దశలో ఖట్టార్‌కు ఏకంగా 12 రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించింది. కలసి పనిచేస్తాం: వెంకయ్య హర్యానాలో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో కేంద్రం కలసి పనిచేస్తుందని, ఆ రాష్ర్ట అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలు కలసి పనిచేసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్న ఉద్దేశంతోనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని వెంకయ్య వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీపై ప్రజలు పూర్తి విశ్వాసం ప్రదర్శించారని పేర్కొన్నారు.