చండీగఢ్: కరోనా(కోవిడ్-19)పై పోరాటంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు అండగా ఉండేందుకు హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి ప్రబలుతున్న తరుణంలోనూ నిర్విరామంగా వార్తలు చేరవేస్తున్న జర్నలిస్టులకు రూ. 10 లక్షల బీమా సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గురువారం ప్రకటన చేశారు. కాగా ముంబై, చెన్నైలో పనిచేస్తున్న దాదాపు 70 మంది జర్నలిస్టులకు ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. (న్యూస్ ఛానల్‌లో పని చేస్తున్న 27 మందికి కరోనా)
ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధి నిర్వహణలో విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తున్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై తరహాలో ఢిల్లీలోనూ మీడియా ప్రతినిధులకు మూకుమ్మడిగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీంతో బుధవారం నుంచి అక్కడ జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
State govt has decided to provide insurance of Rs 10 lakh each to all journalists who are reporting during #Coronavirus pandemic: Haryana CM Manohar Lal Khattar (File pic) pic.twitter.com/9u7U8pi9lJ
— ANI (@ANI) April 23, 2020
Comments
Please login to add a commentAdd a comment