చండీఘడ్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్డౌన్ను విధించాయి. అయితే, ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు మరికొన్ని రోజులు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా లాక్డౌన్ను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరేన్స్ సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య అదపులోనే ఉందని అన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని మరింత కట్టడి చేయడానికి మరికొంత కాలం లాక్డౌన్ అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్నినూతన సడలింపులను జారీ చేశారు. దీని ప్రకారం... ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు షాపులు పనివేళలని తెలిపారు. అదే విధంగా.. ఇకమీదట దుకాణ యజమనులు సరి,బేసి నియమాలను పాటిస్తూ దుకాణాన్ని తెరుచుకోవాలని అన్నారు.
అయితే, కొన్ని మాల్స్లలో మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు తెరవడానికి ప్రత్యేకంగా అనుమతిస్తున్నామని తెలిపారు. అయితే, వీటిలో ఒకేసరి సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాల్ యజమానులకు ఆదేశాలను జారీ చేశారు. అయితే, కర్య్ఫూ మాత్రం యధావిధిగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు. అన్నిరకాల విద్యాసంస్థలు జూన్ 15 వరకు మూసివేయబడి ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. అదే విధంగా వ్యాక్సిన్ కూడా వేసుకోవాలని పేర్కొన్నారు.
కాగా.. శనివారం ఒక్క రోజే 1,868 కొత్తగా కరోనా కేసులు నమోదుకాగా, 97 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకుఈ మహమ్మారి కారణంగా 8,132 మంది చనిపోయారు. కాగా, ఇప్పటి వరకు హరియాణాలో 7,53,937 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 23,094 కేసులు ఆక్టివ్గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment