Haryana Lockdown, Extends Lockdown Till June 14 Relaxed Restrictions - Sakshi
Sakshi News home page

Lockdown​: భారీ సడలింపులతో పొడిగించిన మరో రాష్ట్రం

Published Mon, Jun 7 2021 8:36 AM | Last Updated on Mon, Jun 7 2021 4:05 PM

Haryana Extends Covid Lockdown Till June 14 With Relaxed Restrictions - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చండీఘడ్‌:  దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్​ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను మరింత కాలం పొడిగించడానికే మొగ్గుచూపుతున్నాయి. తాజాగా, హర్యానా ప్రభుత్వం లాక్​డౌన్​ను జూన్​ 14 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే, కొంత వరకు నిబంధలను మాత్రం సడలించినట్లు హర్యానా రాష్ట్ర కార్యదర్శి విజయ్​ వర్ధన్​ వెల్లడించారు.

  • కార్పొరేట్​ ఆఫీసులలో 50 శాతం ఉద్యోగులు, కోవిడ్​ నిబంధనలు పాటిస్తూ హజరవ్వాడానికి అనుమతి ఇచ్చారు. దుకాణాలను సరి, బేసి విధానాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉంచుకోవడానికి వెసులు బాటు కల్పించారు.
  • షాపింగ్​ మాల్స్​ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఇక, బార్​లు, హోటల్​లు, రెస్టారెంట్, క్లబ్​​లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు తెరచి ఉంచుకోవచ్చని తెలిపారు. వీటిలో కూడా  50 శాతంమేర ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేలా చూడాలని సూచించారు.  
  • ప్రార్థన మందిరాలలో ఏసమయంలో అయినా.. 21 మందికి మించి ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివాహ వేడుకలలో 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బరాత్​లకు, ఊరేగింపులు, ఇతర సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
  • అదేవిధంగా.. అంతిమ సంస్కారాలకు కూడా కేవలం 21 మందిలోపు మాత్రమే హజరవ్వాలని సూచించారు. అయితే, గత నెలలో హర్యానా రాష్ట్రం  లో ప్రతిరోజు 15,000 వేల కరోనా కేసులు నమోదవుతుండగా, ప్రస్తుతం  ఆసంఖ్య 9,974 కు తగ్గినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

చదవండి: కారులో ఎలుగుబంటి.. ప్రాణాలు కాపాడిన కుక్క!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement