extend
-
ఉడాన్ స్కీము మరో పదేళ్లు పొడిగింపు!
న్యూఢిల్లీ: ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ స్కీము ఉడాన్‌ను మరో పదేళ్ల పాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే, సీప్లేన్ కార్యకలాపాల కోసం ఆపరేటర్లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కల్పించే యోచన ఉన్నట్లు వివరించారు.2017లో ప్రారంభమైన ఉడాన్ స్కీము రెండేళ్లలో ముగియనుండగా దాన్ని అవసరమైతే మరింత మెరుగుపర్చి, పొడిగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా విమానాలు, హెలికాప్టర్లు, సీప్లేన్లను డిజైన్ చేసి, తయారు చేసేలా కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించనున్నట్లు మంత్రి చెప్పారు.సీప్లేన్ కార్యకలాపాలపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అక్టోబర్‌లో విజయవాడ నుంచి సీప్లేన్ల డెమో ఫ్లయిట్ల నిర్వహణ ఉంటుందని చెప్పారు. -
మనిషికి చిరాయువు ఇక సాధ్యమే?
సాధారణంగా ఎవరైనా ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షు కోరుకుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు కూడా మనిషి జీవిత కాలం పొడిగించేందుకు పలు పరిశోధనలు సాగిస్తుంటారు. ఈ నేపధ్యంలో అనేక సిద్ధాంతాలు, ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. అయితే అవేవీ ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తల నూతన పరిశోధనలు మనిషి దీర్ఘాయువుకు గట్టి హామీని ఇచ్చేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు యాంటీ ఏజింగ్ డ్రగ్ కోసం పలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు మనిషి దీర్ఘాయువుకు దోహదపడేలా పలు పరిష్కార మార్గాలను కనుగొంటున్నారు. వృద్ధాప్య కణాలను తొలగించి, అదే సమయంలో వాటి స్థానంలో కొత్త కణాలను సృష్టించడం ద్వారా దీర్ఘాయువు పొందవచ్చని చాలామంది భావిస్తుంటారు. తాజాగా బక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ అనే నెమటోడ్లు (నీటిలో నివసించే సూక్ష్మజీవులు)లను ఎలుకలలో ప్రవేశపెట్టి వాటి జీవితకాలాన్ని పొడిగించడంలో విజయం సాధించారు. ఈ ప్రయోగాలు మనిషికి దీర్ఘాయువును అందించేందుకు చేస్తున్న పరిశోధనలకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్లు పుష్కలంగా మైక్రోఫాగీలను కలిగివుంటాయి. మైక్రోఫాగీ అనేది ఒకరరమైన తెల్లరక్త కణం. ఇది మనిషి రోగ నిరోధకశక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మృత కణాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మైక్రోఫాగీ అనేది యాంటీఆక్సిడెంట్ కావడానికి తోడు న్యూరోప్రొటెక్టివ్ ప్రయోజనాలను అందిస్తుంది. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్లు అందించే ప్రయోజనాలను కొమారిన్లో కూడా ఉన్నాయని కనుగొన్నారు. ఇవి మొక్కలలో కనిపిస్తాయి. ముఖ్యంగా దాల్చినచెక్కలో అధికంగా ఉంటాయి. దాల్చిన చెక్క అనేది సెల్యులార్ ఆటోఫాగి, లైసోసోమల్ ఫంక్షన్లను నిర్దేశించడంలో కీలకంగా ఉండే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ కార్యాచరణను ప్రోత్సహిస్తున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొమారిన్ అనేది శరీరంలో కణాంతర రీసైక్లింగ్ వ్యవస్థను చక్కగా నిర్వహిస్తుంది. దీని కారణంగా వయస్సు పెరిగే ప్రక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్త, పరిశోధకులు శంకర్ చింతా.. న్యూరోనల్ కణాలపై సహజ సమ్మేళనాల ప్రభావం గురించి అధ్యయనం సాగిస్తున్నారు. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని ఈ అధ్యయనానికి సారధ్యం వహిస్తున్న శాస్త్రవేత్త జూలీ ఆండర్సన్ చెప్పారు. మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు యాంటీ ఏజింగ్ థెరపీకి కీలకంగా ఉపయుక్తమవుతాయి. ఇవి ఎలుకల కండరాల కణాలలో మైటోకాన్డ్రియల్ పనిచేయకపోవడాన్ని కూడా నిరోధించాయని పరిశోధనల్లో తేలింది. మైటోకాండ్రియా అనేది ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. లోపభూయిష్టమైన మైటోకాన్డ్రియల్ ఫంక్షన్ పార్కిన్సన్స్, అల్జీమర్స్ , అనేక హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, జీవక్రియ వ్యాధులు, వయసు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. మైటోకాన్డ్రియల్ కార్యకలాపాలు సవ్యంగా సాగాలంటే మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు అవసరం అవుతాయి. సమర్థవంతమైన మైటోఫాగి.. జీవుల జీవితకాలం పొడిగించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపై జరుగుతున్న పరిశోధనలు మనిషికి చిరాయువును ప్రసాదించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
డిజిటల్ ఇండియా ప్రాజెక్టు పొడిగింపు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందు కోసం 2021–22 నుంచి 2025–26 మధ్య కాలానికి రూ. 14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణులకు కొత్త నైపుణ్యాల్లోను, 2.64 లక్షల మందికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పొడిగించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మరో తొమ్మిది సూపర్ కంప్యూటర్లను నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్‌కు (ఎన్సీఎం) జోడించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎన్సీఎం కింద 18 సూపర్ కంప్యూటర్స్ ఉన్నట్లు వివరించారు. డిజిటల్ ఇండియా పథకం 2015లో ప్రారంభమైనప్పుడు రూ. 4,500 కోట్లతో 2022 నాటికి ఎన్సీఎం కింద 70 సూపర్‌కంప్యూటర్స్‌ను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాటికి అదనంగా మరో తొమ్మిది సూపర్‌కంప్యూటర్లకు తాజాగా ఆమోదముద్ర వేసిందని మంత్రి చెప్పారు. 12 కోట్ల మంది విద్యార్థులకు కోర్సులు.. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద 12 కోట్ల మంది కాలేజీ విద్యార్థుల కోసం సైబర్ అవగాహన కోర్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 1,200 స్టార్టప్‌లకు ఆరి్థక తోడ్పాటు అందించే వెసులుబాటు కూడా ఉందని వైష్ణవ్ చెప్పారు. 1,787 యూనివర్సిటీలు, పరిశోధన సంస్థల నెట్వర్క్ అయిన నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్‌ను డిజిటల్ ఇండియా ఇన్ఫోవేస్‌గా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధ ను వినియోగించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పా రు. డిజిలాకర్ యాప్‌ను లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్ ఇదే..
ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు తేదీ సమీపించడంతో పన్ను చెల్లింపుదారులు రిటర్న్ ఫైలింగ్ హడావుడిలో ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం గడువు తేదీ పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే ఐటీఆర్ ఫైలింగ్ సందర్భంగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యలు ఎదురైనట్లు కొంతమంది పన్ను చెల్లింపుదారులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి ➤ Income Tax Refund: ట్యాక్స్ రీఫండ్ 12 గంటల్లోనే.. నమ్మబుద్ధి కావడం లేదా? ఈ-ఫైలింగ్ పోర్టల్ గత ఐదు రోజులుగా సరిగా పనిచేయడం లేదంటూ ఓ ట్యాక్స్ పేయర్ ట్విటర్లో ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యల కారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును మారో 30 రోజుల పాటు పొడిగించాలని కోరారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందిస్తూ.. “ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది. మీకు ఎదురైన నిర్దిష్ట సమస్యను వివరిస్తూ పాన్, మొబైల్ నంబర్, సమస్యకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌తో సహా orm@cpc.incometax.gov.inలో మాకు పంపించండి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది” అని పేర్కొంది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని డేటా ప్రకారం జులై 29 వరకు 5.73 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. వీటిలో 4.9 కోట్లకు పైగా రిటర్న్‌లను వాటిని దాఖలు చేసిన ట్యాక్స్ పేయర్లు వెరిఫై చేశారు. అలాగే 3.18 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లందరూ జులై 31లోపు తమ రిటర్న్‌లను ఫైల్ చేయడం చాలా ముఖ్యం. గడువు తేదీ తర్వాత కూడా ఆలస్యంగా ఐటీఆర్‌ను ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ కింద రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికైతే రూ. 1000. దీంతోపాటు గడువు తేదీలోపు ఐటీఆర్‌ను ఫైల్ చేయకపోతే అనేక ఇతర పరిణామాలు ఉంటాయి. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు Dear @NeeleshTax, The e-filing portal is working fine. May we request you to write to us at orm@cpc.incometax.gov.in detailing the specific issue you've encountered (along with PAN, your mobile no. & a screenshot of the error). Our team will get in touch with you. — Income Tax India (@IncomeTaxIndia) July 30, 2023 -
ఏటీఎస్‌లలో ఫిట్నెస్ పరీక్షల గడువు పెంపు
న్యూఢిల్లీ: భారీ సరుకు వాహనాలు, ప్రయాణికుల కోసం ఉపయోగించే భారీ వాహనాలకు నమోదిత ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ద్వారా తప్పనిసరి ఫిట్నెస్ పరీక్ష తేదీని ప్రభుత్వం 18 నెలల పాటు పొడిగించింది. ఈ నిబంధన 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుందని రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ మినిస్ట్రీ వెల్లడించింది. వాస్తవానికి ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. మధ్యస్థాయి, తేలికపాటి సరుకు రవాణా వాహనాలు, మధ్యస్థాయి ప్యాసింజర్ వెహికిల్స్‌కు 2024 జూన్ 1 నుంచి తప్పనిసరి చేయాలని గతంలో నిర్ణయించారు. తాజా ప్రకటన ప్రకారం ఈ వాహనాలకు అన్నిటికీ సామర్థ్య పరీక్షలు 2024 అక్టోబర్ 1 నుంచి ఏటీఎస్ ద్వారా తప్పనిసరిగా జరపాల్సి ఉంటుంది. రవాణాయేతర వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో (వాహనం కొన్న 15 ఏళ్లకు) ఫిట్నెస్ పరీక్షలు చేపడతారు. -
ఏపీలో మరో వారంపాటు నైట్ కర్ఫ్యూ పొడిగింపు
-
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. చదవండి: టెన్త్, ఇంటర్ ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
ఏపీలో ఈనెల 30 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు
-
Lockdown: భారీ సడలింపులతో పొడిగించిన మరో రాష్ట్రం
చండీఘడ్: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించడానికే మొగ్గుచూపుతున్నాయి. తాజాగా, హర్యానా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే, కొంత వరకు నిబంధలను మాత్రం సడలించినట్లు హర్యానా రాష్ట్ర కార్యదర్శి విజయ్ వర్ధన్ వెల్లడించారు. కార్పొరేట్ ఆఫీసులలో 50 శాతం ఉద్యోగులు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హజరవ్వాడానికి అనుమతి ఇచ్చారు. దుకాణాలను సరి, బేసి విధానాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉంచుకోవడానికి వెసులు బాటు కల్పించారు. షాపింగ్ మాల్స్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఇక, బార్లు, హోటల్లు, రెస్టారెంట్, క్లబ్‌లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు తెరచి ఉంచుకోవచ్చని తెలిపారు. వీటిలో కూడా 50 శాతంమేర ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేలా చూడాలని సూచించారు. ప్రార్థన మందిరాలలో ఏసమయంలో అయినా.. 21 మందికి మించి ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివాహ వేడుకలలో 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బరాత్‌లకు, ఊరేగింపులు, ఇతర సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా.. అంతిమ సంస్కారాలకు కూడా కేవలం 21 మందిలోపు మాత్రమే హజరవ్వాలని సూచించారు. అయితే, గత నెలలో హర్యానా రాష్ట్రం లో ప్రతిరోజు 15,000 వేల కరోనా కేసులు నమోదవుతుండగా, ప్రస్తుతం ఆసంఖ్య 9,974 కు తగ్గినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కారులో ఎలుగుబంటి.. ప్రాణాలు కాపాడిన కుక్క! -
Lockdown: భారీ సడలింపులతో పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభన తగ్గుముఖం పట్టింది. రోజు నమోదయ్యే కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. దీంతో రాష్ట్రాలు భారీ సడలింపులతో లాక్డౌన్ కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు లాక్‌డౌన్‌ను జూన్ 14వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీ, తమిళనాడు, మేఘాలయ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే పేరుకు లాక్డౌన్ కానీ సడలింపులు భారీగా ఇచ్చారు. కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించగా.. కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ఆంక్షలు సడలిస్తూ ఉత్వర్వులు జారీ చేశాయి. ఇక మహారాష్ట్ర కూడా అన్‌లాక్ ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఈ మేరకు సోమవారం నుంచి అన్‌లాక్‌కు ఐదంచెల వ్యూహాన్ని రచిస్తోంది. (చదవండి: తగ్గని కరోనా ఉధృతి: లాక్డౌన్ పొడగింపు) ఢిల్లీ ప్రస్తుతం లాక్డౌన్ ప్రభావంతో కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ మొదలుపెట్టారు. సరి బేసి విధానంలో సడలింపులు ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ కొన్ని ఒకరోజు.. మరికొన్ని మరుసటి రోజు తెరచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దుకాణాలు, మార్కెట్లు తెరచుకోవచ్చని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ దుకాణాలు ఉదయం 10 నుంచి 8 గంటల వరకు తెరుచుకోవచ్చు. నిత్యావసర దుకాణాలు, మెడికల్ దుకాణాలు రోజు తెరవచ్చు. ఈ లాక్‌డౌన్‌ను జూన్ 14వ తేదీ వరకు పొడగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా మూడో వేవ్‌కు తాము బాధ్యత వహించమని సీఎం కేజ్రీవాల్ ప్రజలకు స్పష్టం చేశారు. అంటే జాగ్రత్తలు పాటిస్తూ తమ కార్యకలాపాలు చేసుకోవాలని సీఎం పరోక్షంగా సూచించారు. కాగా ఢిల్లీలో ఏప్రిల్ 18వ తేదీ నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది. మేఘాలయ ఈశాన్య రాష్ట్రం మేఘాలయ కూడా లాక్‌డౌన్‌ను జూన్ 14వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే అన్నీ దుకాణాలు తెరచుకోవచ్చని స్పష్టం చేసింది. చాయ్ దుకాణాలు తెరచుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే కరోనా వ్యాప్తి ఇక్కడే అధికంగా ఉందని గుర్తించి ప్రభుత్వం టీ దుకాణాలపై నిషేధం విధించింది. మార్కెట్లు, దుకాణాలు మధ్యాహ్నం 3 గంటలలోపు మూసివేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడమని స్పష్టం చేసింది. మే 18వ తేదీ నుంచి ఈ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతోంది. తమిళనాడు కరోనా ఉధృతి తగ్గకపోవడంతో తమిళనాడులో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 14వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తూనే సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న 27 జిల్లాల్లో స్వల్ప సడలింపులు ఇచ్చింది. ఇక కరోనా తీవ్రత అధికంగా ఉన్న 11 జిల్లాలకు మాత్రం మరికొన్ని ఆంక్షలు విధించింది. కోయంబత్తూరు, నీలగిరిస్, తిరుపూర్, ఈరోడు, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్టణం, మాయిలదుతూరై కఠిన ఆంక్షలు కొనసాగనున్నాయి. కాగా తమిళనాడులో మే 8వ తేదీ నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది. -
తగ్గని కరోనా ఉధృతి: లాక్డౌన్ పొడగింపు
చెన్నె: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా ఉధృతి తగ్గకపోవడంతో తమిళనాడులో లాక్‌డౌన్‌ను పొడగించారు. అయితే మరికొన్ని సడలింపులు ఇచ్చారు. జూన్ 14వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7వ తేదీ వరకు ఉన్న లాక్‌డౌన్‌ను తమిళనాడు ప్రభుత్వం జూన్ 14 వరకు పొడగించింది. ఆంక్షలు.. సడలింపులు వంటివి ఉత్తర్వుల్లో వివరంగా పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ పొడగించినా 11 జిల్లాలకు మాత్రం మరికొన్ని ఆంక్షలు విధించారు. ఆ జిల్లాల్లో (కోయంబత్తూరు, నీలగిరిస్, తిరుపూర్, ఈరోడు, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్టణం, మాయిలదుతూరై) కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 24 నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం 21,95,402 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 463 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. కరోనా కట్టడి కోసం ఎంకే స్టాలిన్ చర్యలు చేపడుతూనే లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు కూడా తీసుకుంటున్నారు. -
లాక్డౌన్ పొడిగించిన కర్ణాటక.. రూ. 500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
బెంగళూరు: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొదటి దశలో కంటె సెకండ్‌వేవ్‌లో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అనేక రాష్ట్రాలు కోవిడ్ కట్టడికి లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అయితే, కేసులు అదుపులోకి వస్తున్న క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. తాజాగా, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప జూన్ 14 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయని.. మరికొన్ని రోజులు లాక్డౌన్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలే మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ తీవ్రత 5 శాతానికి తగ్గిందని అన్నారు. అయితే, ఈ సారి ప్రత్యేకంగా మత్స్యకారులు, పూజారులు, పవర్లూమ్ కార్మికులు..ఇతరులకు రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. ప్రతిరోజు నమోదవుతున్న కేసులు కూడా గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. లాక్డౌన్ వలన ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అయితే, ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రజల జీవనోపాధి కోసం 1,250 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. అలాగే, తమ ప్రభుత్వం ఈ నెలలో 60 లక్షలకు పైగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. జూన్ 30 నాటికి దాదాపు 2 కోట్ల మందికి టీకాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యాక్సిన్లను సరఫరాకు చేయుత అందించిన ప్రధాని మోదీకి, యడ్యూరప్ప ట్వీటర్లో ధన్యవాదాలు తెలిపారు. -
మారటోరియం రెండేళ్లు ఉండొచ్చు
న్యూఢిల్లీ: బ్యాంకు అప్పులపై విధించిన మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. కోవిడ్–19 లాక్డౌన్, ఆంక్షల మూలంగా ఆర్థికవ్యవస్థ మందగించిందని, ఏప్రిల్– జూన్ త్రైమాసికంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 24 శాతం లోటు నమోదైందని కేంద్రం, ఆర్బీఐల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభావితవర్గాలకు సహాయపడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి ఆర్నెళ్ల పాటు లోన్ల వాయిదాలపై కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఇది ఆగస్టు 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో మారటోరియంను రెండేళ్లు పొడిగించే అవకాశం ఉందని కేంద్రం... అత్యున్నత న్యాయస్థానానికి తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిస్తుల్లో వడ్డీ కలిపే ఉంటుందని, వాటి వసూలు వాయిదా వేసినందున బ్యాంకులు వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తున్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మారటోరియం కాలంలో వడ్డీ వేయకుండా కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించాలని ఆగ్రావాసి గజేంద్ర శర్మ తన పిటిషన్లో కోరారు. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తున్న అంశాన్ని బుధవారం విచారిస్తామని సుప్రీం పేర్కొంది. కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో అఫిడవిట్‌ను దాఖలు చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. తమకు ఆ అఫిడవిట్ ఇంకా అందలేదని కోర్టు తెలుపగా... బెంచ్ అఫిడవిట్‌ను పరిశీలించాలని, రెండు మూడు రోజుల తర్వాత విచారణ జరిపినా, బుధవారమే విచారణకు స్వీకరించినా నష్టమేమీలేదని మెహతా అన్నారు. వడ్డీపై వడ్డీ అంశాన్ని కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకర్లు కలిసి పరిశీలించే అవకాశమివ్వాలన్నారు. మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. వాయిదా వేసిన కిస్తులపై వడ్డీని మాఫీ చేయడం ఆర్థిక సహజసూత్రాలకు విరుద్ధమని కేంద్రం తెలిపింది. ఒకవేళ వడ్డీ మాఫీ చేస్తే... క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన వారికి అన్యాయం చేసినట్లే అవుతుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. -
పీఈసెట్ దరఖాస్తులకు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీఈసెట్ దరఖాస్తుల గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మంగళవారం వెల్లడించారు. ఇప్పటి వరకు 5,678 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ రీ వెరిఫికేషన్‌కు 73,984 దరఖాస్తులు ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీలకు మొత్తంగా 73,984 మంది వి ద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రీకౌంటింగ్ కోసం 14,333 మంది, రీ వెరిఫికేషకన్ ఫొటో కాపీ కోసం 59,651 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. వెరిఫికేషన్‌కు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. -
లాక్డౌన్ 4.0 : కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగించింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో మార్గదర్శకాలు జారీ చేయనుంది. కాగా నాలుగో విడత లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులను ప్రకటించనున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇక లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలపై కేంద్రం ఎలాంటి నిబంధనలతో ముందుకొస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక లాక్డౌన్ మార్గదర్శకాలపై రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హోం శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాలుగో విడత లాక్డౌన్ అమలుపై సంప్రదింపులు జరుపుతారు. ఈ సమావేశం తర్వాత లాక్డౌన్ నిబంధనలు, సడలింపులపై మార్గదర్శకాలను విడుదల చేస్తారు. చదవండి : 'కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా' -
వైరస్‌తో కలిసి సహజీవనం తప్పదు..
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరింత కాలం పాటు పొడిగించిన పక్షంలో దేశానికి ఆర్థికంగా.. ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్కు పొంచి ఉందని పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. లాక్డౌన్ వల్ల లక్షల ప్రాణాలను కాపాడుకోగలిగినప్పటికీ.. పొడిగిస్తూ పోవడం వల్ల బడుగు వర్గాలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ‘టెస్టింగ్ పెరిగే కొద్దీ, కేసుల సంఖ్యపెరగడం కూడా సాధారణంగా జరిగేదే. అయితే, లాక్‌డౌన్‌ను మరింత దీర్ఘకాలం పొడిగిస్తే మాత్రం ఆర్థికంగా ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్కు ఉంది. వైరస్‌తో కలిసి సహజీవనం చేయక తప్పదు’ అని ట్వీట్ చేశారు. -
సంగక్కర పదవీకాలం పొడిగింపు
లండన్: ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా కుమార సంగక్కర మరో ఏడాది పాటు కొనసాగనున్నాడు. అతని పదవీ కాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించేందుకు ఎంసీసీ సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 24న జరుగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి దీనిపై ఆమోదముద్ర వేయనున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. ‘కరోనా నేపథ్యంలో సంగక్కర పదవీ కాలాన్ని పొడిగించాలని కమిటీ నిర్ణయించింది. ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. మామూలుగానైతే అధ్యక్షుని పదవీ కాలం 12 నెలలు మాత్రమే. కానీ అనుకోని పరిస్థితుల్లో దీన్ని పొడిగించే వెసులుబాటు ఉంది’ అని క్లబ్ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 1న ఎంసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ శ్రీలంక మాజీ ప్లేయర్... ఈ పీఠాన్ని అధిష్టించిన తొలి బ్రిటిషేతర వ్యక్తిగా ఘనత సాధించాడు. -
ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ స్కీమ్ పొడిగింపు!
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ పథకాన్ని (ఈక్వలైజేషన్ స్కీమ్) కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలున్నాయి. ఎగుమతుల రంగానికి సంబంధించిన ఈ పథకం 2015, ఏప్రిల్‌లో మొదలైంది. ఎంపిక చేసిన వస్తువులకు సంబంధించిన రుణాలపై 3–5 శాతం సబ్సిడీనిచ్చే ఈ స్కీమ్ ఈ ఏడాది మార్చి 31న ముగిసింది. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఎగుమతుల రంగాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా ఈ స్కీమ్‌ను పొడిగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన వెబినార్‌లో విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ అమిత్ యాదవ్ మాట్లాడారు. రానున్న వారాల్లో ఈ స్కీమ్ పొడిగింపునకు సంబంధించి శుభవార్త వింటారనిపేర్కొన్నారు -
పంజాబ్‌లో లాక్డౌన్ పొడిగింపు
చండీగఢ్/కోల్‌కతా: మే 3 తర్వాత లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ బుధవారం ప్రకటించారు. ఇందులో కొంత మేర సడలింపులు ఉన్నప్పటికీ, రెడ్ జోన్లలో సడలింపులు ఉండబోవన్నారు. మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ వారిని వెనక్కు తీసుకొస్తామని, అయితే వారు 21 రోజుల లాక్ డౌన్ లో ఉండాల్సిందేనని చెప్పారు. కరోనాను అదుపులో ఉంచేందుకు మే చివరి వరకూ లాక్ డౌన్ విధించక తప్పదని, ఈ విషయాన్ని పలువురు నిపుణులు, వైద్యులు చెబుతున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. -
కరోనా..ఏడు సూత్రాలు
-
సప్తపది!
-
వాటిపై నిషేధం ఏడాది పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : గుట్కా, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయాలపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ ఉత్పత్తులపై నిషేధాన్ని పొడిగిస్తూ ఫుడ్ సేఫ్టీ విభాగం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎల్ఆర్ గార్గ్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ప్రజారోగ్య ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని గుట్కా, పాన్ మసాలాతో సహా పొగాకు ఉత్పత్తులన్నింటిపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాల్లో మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది. అయితే సిగరెట్లపై అలాంటి నిషేధం విధించే ఉద్దేశం లేదని అధికార వర్గాలు పేర్కొనడం గమనార్హం. -
‘ఇంటర్’ పరీక్ష ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. వచ్చే నెల 2వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 29తో ఫీజు గడువు ముగుస్తుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న వినతులను పరిశీలించిన బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తల్లిదండ్రులు సకాలంలో ఫీజు చెల్లించాలని, ఆ మొత్తాన్ని సంబంధిత ప్రిన్సిపాళ్లు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలని స్పష్టం చేసింది. -
గడువు పెంపుపై గ్రూప్-2 అభ్యర్థుల మహా ధర్నా
-
అంబేద్కర్ యూనివర్సిటీ పరీక్షల గడువు పెంపు
నల్లగొండ: డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనవర్సిటీ పరీక్షల గడువు పొడిగించారు. ఎలాంటి విద్యార్హత లేకుండా డిగ్రీలో చేరేందుకు, బీఈడీ ప్రవేశానికి ఆగస్టు 6వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు రీజియన్ కోఆర్డినేటర్ ధర్మానాయక్ తెలిపారు. ఈ రెండు పరీక్షలు ఆగస్టు 14వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. పీజీ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 2 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. -
రాజీవ్‌శర్మ సర్వీస్‌ను పొడిగించండి
♦ మరో ఆరు నెలలు అనుమతించండి ♦ ప్రధానికి లేఖ ఇచ్చిన సీఎం కేసీఆర్ ♦ మే నెలతో ముగియనున్న పదవీకాలం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సర్వీసును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఓ లేఖను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అందజేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ పదవీ కాలం మే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును ఆరు నెలలు పెంచాలని సీఎం ఈ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇదే సందర్భంలోనే ఈ లేఖను అందించారు. నిబంధనల ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు గడువు పెంచాలంటే మూడు నెలల ముందు కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐఎస్ పెన్షన్ రూల్స్ సెక్షన్ 16 ప్రకారం సదరు అధికారికి ఆరు నెలల వరకు గడువు పొడిగించవచ్చు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారులైతే సర్వీసు కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేంద్రంతోనే సంప్రదింపులు జరిపితే డీవోపీటీ సీఎస్ పదవీ కాలాన్ని మూడు నెలలకు మాత్రమే పెంచే అవకాశముంది. అందుకే సీఎం ఈ లేఖను నేరుగా ప్రధానికి ఇచ్చి ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరారు. కొత్త రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత ఉన్న దృష్ట్యా ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌శర్మ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014 జూన్ 2 అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రాజీవ్‌శర్మ కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై ఉన్నారు. కేంద్ర హోంశాఖలో జాయింట్ సెక్రెటరీ హోదాలో పని చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ ఏడాది మే 31న రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగియనుంది. ఆరు నెలల పాటు పొడిగిస్తే నవంబర్ నెలాఖరు వరకు ఆయనే తెలంగాణ సీఎస్‌కు కొనసాగుతారు. -
'వచ్చే నెల వరకు వారిని అరెస్టు చేయొద్దు'
న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసులో గుజరాత్‌కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లకు ఊరట లభించింది. శుక్రవారం సుప్రీంకోర్టు వారిని అరెస్టు చేయకుండా గడువు మరింత పొడిగించింది. వచ్చే నెల 15 వరకు వారిని అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. 2002 గుజరాత్ అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలో బాధితుల స్మారకార్ధం మ్యూజియం ఏర్పాటుచేస్తామంటూ సేకరించిన నిధులను సొంతానికి వాడుకున్నారన్న కేసులో సెతల్వాద్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ గత వారం సీబీఐ సెతల్వాద్ ఇంటిపై దాడులు చేసింది. ఈ నిధులను ఆమె తన మద్యం కోసం, జుట్టు సింగారానికి వాడుకున్నారని ఆరోపించింది. అయితే సెతల్వాద్ దంపతులను బీజేపీ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. -
కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: 2005కి ముందు ఉన్నకరెన్సీ మార్చుకునేందుకు రిజర్వు బ్యాంకు ఇచ్చిన గడువు మరింత పొడిగించారు. మరో వారం రోజుల్లో ఈ గడువు ముగియనుండగా.. ఈ ఏడాది చివరివరకు(డిసెంబర్ 31) వరకు పొడిగించారు. ఆలోగా ప్రజలు తమ వద్ద ఉన్న 2005కు పూర్వంనాటి కరెన్సీ నోట్లను రూ.500, రూ.1000 సహా బ్యాంకుల్లో ఇచ్చేసి కొత్తగా మార్పిడి చేసుసుకునే వీలుంది. 2005కంటే ముందునాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే ఆయా బ్యాంకుల్లో ఇచ్చేసి వినియోగదారులు మార్చుకోవాలని ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించినా కొన్ని కారణాలవల్ల గడువును రెండుసార్లు పొడిగించారు. జూన్ 30లోగా రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించాలని చెప్పారు. దీంతో గడువు దగ్గరికొచ్చింది. కొన్ని అంశాల్లో ఇబ్బందులు తలెత్తడంతోపాటు నకిలీ నోట్లు కూడా చెలామణి అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా గత నోట్లను తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. వాస్తవానికి, నల్లధనం బయటకు రప్పించాలనే ఉద్దేశంతో కూడా దీనిని ప్రధానంగా తెరముందుకు తీసుకొచ్చారు. -
ఓర్వలేక విమర్శలు.. ఏపీలో బీజేపీని విస్తరింపజేస్తాం
గుంటూరుటౌన్: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు చెప్పారు. బుధవారం గుంటూరు బ్రాడీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలన ఎలాంటి మచ్చలేకుండా దిగ్విజయంగా ఏడాదికాలం పూర్తిచేసుకుందన్నారు. గత పదేళ్ల కాంగ్రెస్ కాలంలో సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆర్థికాభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ , ఏపీ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అంకిత భావంతో సహకరిస్తుందని చెప్పారు. ఏపీలో ఐఐఎమ్, ఎయిమ్స్‌లాంటి జాతీయ సంస్థల ఏర్పాటుతోపాటు.. రాజధాని నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. బీజేపీ చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయని చెప్పారు. గతంలో మూడు లక్షలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని, ఏపీ, తెలంగాణ కంటే మహారాష్ర్టలో ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ తమ కాలంలో ఆత్మహత్యలు జరిగితే ఇప్పుడు పరామర్శలు చేటయం విడ్డూరంగా ఉందని, ఆయన పశ్చాతాప యాత్రలు చేయాలని సూచించారు. -
ఎడ్‌సెట్ ప్రవేశాలకు రేపటి వరకు గడువు
సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్-2014 ప్రవే శాల గడువును శుక్రవారం వరకు పొడిగించినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణల్లోని బీఈడీ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు విద్యార్థులను శుక్రవారం వరకు చేర్చుకోవాలని సూచించారు. తొలుత దీనికి ఈ నెల 5 వరకు గడువు విధించారు. అయితే, అభ్యర్థుల విజ్ఞాపనల మేరకు 7వ తేదీ వరకు అవకాశం కల్పించారు. -
5 ఏళ్లకు రీషెడ్యూల్ చేయండి!
-
మే నెలాఖరు వరకు పీఆర్సీ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది నియమించిన పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గడువును మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీకి సాధారణంగా ఆరు నెలలే గడువు ఇస్తారు. కానీ ఈ పీఆర్సీకి ఏడాది గడువు ఇచ్చారు. 2013 మార్చి 13న పి.కె.అగర్వా ల్ పీఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. పీఆర్సీ గడువు ఈ ఏడాది మార్చి 13తో ముగిసింది. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేపట్టడం.. తదితర కారణాల వల్ల కసరత్తు పూర్తి చేయలేకపోయామని, మరో 3 నెలలు గడువు పెంచాలని అగర్వాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. సానుకూలంగా స్పం దించిన ప్రభుత్వం.. మే 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు, వ్యక్తిగత కార్యదర్శులకు ప్రతులు పంపించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. కానీ వాటిల్లో సీఎం ప్రస్తావన లేదు. ముఖ్యమంత్రి లేకుండా ఉపముఖ్యమంత్రి, మంత్రులు ఎలా ఉంటారనే విషయాన్ని పట్టించుకోలేదు. పీఆర్సీ, -
పీఆర్సీ గడువు పొడిగింపు!
ఒకటి..రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశం సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) గడువును మరో 3 నెలలు పొడిగించాలన్న ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడతాయని అధికారవర్గాల సమాచారం. పి.కె.అగర్వాల్ నేతృత్వంలోని పదో పీఆర్సీకి ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. కమిషన్‌కు సకాలంలో సిబ్బందిని ఇవ్వకపోవడం, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేయడం ఫలితంగా గడువులోగా నివేదికను పూర్తి చేయలేకపోయింది. ‘‘ఉద్యోగుల సమ్మె వల్ల 2 నెలలు పని సాగలేదు. కమిషన్‌కు దాదాపు 1200 వినతులు, ప్రతి పాదనలు అందాయి. పూర్తి స్థాయి కసరత్తు డిసెంబర్ రెండోవారంలోనే మొదలైంది. ఉద్యోగ సంఘాలతో 800కుపైగా సమావేశాలు నిర్వహించాం. నివేదిక రూపకల్పనలో భాగంగా సుదీర్ఘ కసరత్తు చేయాల్సి వచ్చింది. గడువు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. గడువు పొడిగింపు ఫైలు గవర్నర్ నుంచి ఇంకా కమిషన్‌కు చేరలేదు’’ అని పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ ‘సాక్షి’కి చెప్పారు. -
వయోపరిమితి పెంపు రెండేళ్లే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఐదేళ్లు పెంచాలని నిరుద్యోగుల డిమాండ్‌ను పక్కనబెట్టి రెండేళ్ల పెంపునకే సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. 2011లో గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు పెంచాలని కోరినా ప్రభుత్వం రెండేళ్లకే పరిమితం చేసింది. 2012లో గ్రూపు-1, గ్రూపు-2 వంటి కీలక నోటిఫికేషన్లు ఇవ్వలేదు. జారీ చేసిన కొన్నింటికి వయోపరిమితి పెంపును విస్మరించింది. 2012 డిసెంబరులో ఉద్యోగ పరీక్షల వార్షిక కేలండర్‌కు, గ్రూపు-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూపు-1లో విలీనం (గ్రూపు-1బీగా) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2013లో నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 36 ఏళ్లు చేస్తూ (రెండేళ్లు పెంచుతూ) ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ 65 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వీఆర్ఏ మినహా మరే నోటిఫికేషన్ జారీ కాలేదు. డిసెంబరు 31తో ఆ ఉత్తర్వుల గడువు ముగిసిపోయింది. ప్రస్తుతం గ్రూపు-1, జోనల్ వ్యవస్థ కలిగిన పోస్టులు మినహా మిగతా పోస్టుల భర్తీ కోసం నియామక సంస్థలు ఇండెంట్లు తెప్పిస్తున్నాయి. ప్రభుత్వం రెండేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపునకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.