ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ స్కీమ్‌ పొడిగింపు! | Govt may extend interest equalisation scheme | Sakshi
Sakshi News home page

ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ స్కీమ్‌ పొడిగింపు!

Published Sat, May 2 2020 5:47 AM | Last Updated on Sat, May 2 2020 5:47 AM

Govt may extend interest equalisation scheme - Sakshi

న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ పథకాన్ని (ఈక్వలైజేషన్‌ స్కీమ్‌) కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలున్నాయి. ఎగుమతుల రంగానికి సంబంధించిన ఈ పథకం 2015, ఏప్రిల్‌లో మొదలైంది. ఎంపిక చేసిన వస్తువులకు సంబంధించిన రుణాలపై 3–5 శాతం సబ్సిడీనిచ్చే ఈ స్కీమ్‌ ఈ ఏడాది మార్చి 31న ముగిసింది. కరోనా వైరస్‌ కల్లోలంతో కుదేలైన ఎగుమతుల రంగాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా ఈ స్కీమ్‌ను పొడిగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన వెబినార్‌లో విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్‌ జనరల్‌ అమిత్‌ యాదవ్‌ మాట్లాడారు. రానున్న వారాల్లో ఈ స్కీమ్‌ పొడిగింపునకు సంబంధించి శుభవార్త వింటారనిపేర్కొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement