subsidi
-
టమాటా లీలలు... అన్ని ఇన్ని కావయా...
పుణే: విపరీతంగా పెరిగిపోయిన టమాటా ధరలతో సామాన్య వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. మహారాష్ట్రలో పుణే జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం టమాటాలతో కేవలం ఒక నెల వ్యవధిలో ఏకంగా రూ.3 కోట్లు ఆర్జించాడు. ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. పుణే జిల్లాలో జున్నార్ తహసీల్ పరిధిలోని పాచ్గఢ్ గ్రామంలో రైతు ఈశ్వర్ గాయ్కర్(36) చాలా ఏళ్లుగా టమాటా పంట సాగు చేస్తున్నాడు. ఇన్నాళ్లూ నష్టాలే చవిచూశాడు. ఈ ఏడాది మే నెలలో సరైన ధర లేక టమాటాలను వృధాగా పారబోశాడు. ఇప్పుడు ధరలు పెరగడంతో ఈశ్వర్ పంట పండింది. అతడి శ్రమ ఫలించింది. జూన్ 11 నుంచి జూలై 18 మధ్య 3,60,000 కిలోల టమాటాలను సమీపంలోని నారాయణగావ్ మార్కెట్లో విక్రయించాడు. రూ.3 కోట్ల ఆదాయం కళ్లజూశాడు. తన పొలంలో మరో 80,000 కిలోల పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని, మరో రూ.50 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఈశ్వర్ చెప్పాడు. టమాటా పంట సాగు, రవాణాకు రూ.40 లక్షలు ఖర్చయినట్లు తెలిపాడు. తనకు 18 ఎకరాల భూమి ఉందని, అందులో 12 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నానని వెల్లడించాడు. జూన్ 11న కిలోకు రూ.38 చొప్పున, జూలై 18న కిలోకు రూ.110 చొప్పున ధర పలికిందని ఆనందం వ్యక్తం చేశాడు. టమాటా సాగుదారులకు ఇది మంచి కాలమని, కానీ, ఒక రైతుగా ఎన్నో గడ్డు రోజులు కూడా చూశానని అన్నాడు. టమాటాలకు కిలోకు రూ.రెండున్నర సైతం రాని రోజులు ఉన్నాయని వివరించారు. టమాటాల సాగు వల్ల 2021లో తనకు దాదాపు రూ.16 లక్షల నష్టం వచ్చిందని, 2022లో మాత్రం స్వల్పంగా లాభపడ్డానని చెప్పాడు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రకు చెందిన మరో రైతు రాజు మహాలే టమాటాల సాగుతో ఈ సీజన్లో రూ.20 లక్షలు సంపాదించాడు. అలా అయితే కిలో టమాటాలు ఫ్రీ ఛండీగఢ్ ఆటోవాలా వినూత్న ఆఫర్ తన ఆటో ఎక్కితే కిలో టమాటాలు ఫ్రీగా ఇస్తానంటూ చండీగఢ్‌లో అరుణ్ అనే ఓ ఆటో డ్రైవర్ ఆఫర్ ప్రకటించాడు. అయితే కనీసం ఐదుసార్లు తన ఆటో ఎక్కిన వారికే ఆఫర్ వర్తిస్తుందంటూ తిరకాసు పెట్టాడు! మనవాడిది ముందునుంచీ సేవా గుణమే. 12 ఏళ్లుగా సైనికులను ఫ్రీగా ఆటో ఎక్కించుకుంటున్నాడు. అంతేకాదు, గర్భిణులను ఉచితంగా ఆస్పత్రికి కూడా చేరేస్తుంటాడు. ‘‘ఆటోయే నా జీవనాధారం. కాబట్టి టమాటాల హవాను ఇలా అదనపు ఆదాయ మార్గంగా మార్చుకోవాలని వినూత్న ఆలోచన చేశానంతే. అయితే మన సైనిక వీరులకు, కాబోయే తల్లులకు చేసే సేవలోనే నాకు అమితమైన తృప్తి దొరుకుతుంది’’ అని చెబుతాడు అరుణ్. అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో చండీగఢ్‌లో జరగబోయే క్రికెట్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే వరుసగా ఐదు రోజుల పాటు అందరికీ తన ఆటోలో ఉచిత ప్రయాణమేనని ప్రకటించేశాడు అరుణ్! కిలో.70కే సబ్సిడీ టమాటా: కేంద్రం టమాటాలను ఇప్పటికే కిలో కేవలం రూ.80కి విక్రయిస్తున్న కేంద్రం, తాజాగా సబ్సిడీని మరో 10 రూపాయలు తగ్గించింది. గురువారం నుంచి రూ.70కే కిలో టమాటాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. టమాటాల రేటు కొంతకాలంగా చుక్కలనంటుతున్న నేపథ్యంలో ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగా పలు ఇతర కీలక నగరాల్లోనూ వాటిని సబ్సిడీపై కేంద్రం అందుబాటులోకి తేవడం తెలిసిందే. -
ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ స్కీమ్ పొడిగింపు!
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ పథకాన్ని (ఈక్వలైజేషన్ స్కీమ్) కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలున్నాయి. ఎగుమతుల రంగానికి సంబంధించిన ఈ పథకం 2015, ఏప్రిల్‌లో మొదలైంది. ఎంపిక చేసిన వస్తువులకు సంబంధించిన రుణాలపై 3–5 శాతం సబ్సిడీనిచ్చే ఈ స్కీమ్ ఈ ఏడాది మార్చి 31న ముగిసింది. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఎగుమతుల రంగాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా ఈ స్కీమ్‌ను పొడిగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన వెబినార్‌లో విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ అమిత్ యాదవ్ మాట్లాడారు. రానున్న వారాల్లో ఈ స్కీమ్ పొడిగింపునకు సంబంధించి శుభవార్త వింటారనిపేర్కొన్నారు -
సబ్సిడీ గొర్రెలేవి..?
జనగామ అర్బన్: జిల్లాలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. డీడీలు తీసి గొర్లకాపరులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. 10,954 యూనిట్లకు గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1,407 యూనిట్లకు మాత్రమే ఇచ్చారు. మొదటి విడతలోనూ 313 యూనిట్లకు ఇప్పటి వరకు సబ్సిడీ అందలేదు. జనగామ జిల్లాలో 21,704 గొర్రెల యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వం మొదటి విడతలో 10,750 యూనిట్లను ఎంపిక చేసింది. 10,437 మందికి 21 గొర్రెల చొప్పున పంపిణీ చేశారు. ఇంకా 313 యూనిట్లకు సబ్సిడీ ఇప్పటి వరకు అందలేదు. రెండో విడతలో 10,954 యూనిట్లకు గొర్రెలు ఇవ్వాల్సి ఉంది. వీరంతా డీడీలు తీసి గొర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 1,407 యూనిట్లకు ఇచ్చారు. 9547 యూనిట్లకు ఇవ్వాల్సి ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 55 మందికి, దేవరుప్పులలో 11 మందికి పంíపిణీ చేయగా నర్మెట, తరిగొప్పుల మండలాల్లో ఒక్కరికీ పంపిణీ చేయకపోవడం గమనార్హం. మొదటి విడతకే మోక్షంలేదు.. జిల్లాలో మొదటి విడతలో పూర్తిస్థాయిలో గొర్లను పంపిణీ చేయలేదు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో 4,325 యూనిట్లుకు 4,236 యూనిట్లు, పాలకుర్తిలో 2,525 యూనిట్లుకు 2,451 యునిట్లు పంపిణీ చేశారు. రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాల్లో అత్యధికంగా 36 యూనిట్ల సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉంది. మొదటి విడతలోనే పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. విడుదల కాని బడ్జెట్.. మొదటి విడతలో సబ్సిడీ గొర్రెల పధకానికి రూ.100 కోట్లు కేటాయించి విడుదల చేసిన ప్రభుత్వం రెండో విడతలో దాదాపు 14 కోట్లు మాత్రమే కేటాయించినట్లు సమాచారం. దీంతో నిధులు కేటాయించిన మేరకు అధికారులు పట్టణంలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కూడా పంపిణీకి అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. బడ్జెట్ విడుదలైతే పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అందని ఇన్సూరెన్స్.. జిల్లావ్యాప్తంగా వివిధ కారణాలతో ఇప్పటి వరకు 400లకు పైగా సబ్సిడీ గొర్లు మృత్యువాత పడ్డాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే ఇన్సూరెన్స్ మంజూరైంది. మిగతా వాటికి మంజూరు కాలేదు. మంజూరైన డబ్బులను కూడా ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. సబ్సిడీ గొర్రెలను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్న గొర్లు కూడా మాయమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చొరవ చూపాలి.. సబ్సిడీ గొర్రెల మంజూరులో అధికారులు చొరవ చూపాలి. రెండో విడతకు సంబంధించి బ్యాంకులో డీడీ తీసి దాదాపు ఆరునెలలు గడిపోయింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులైన వారికి న్యాయం చేయాలి. – కూకట్ల చంద్రయ్య, గానుగుపహాడ్ లబ్ధిదారులకే డబ్బులు అందజేయాలి.. ప్రభుత్వం అందించే సబ్సిడీని లబ్ధిదారులకు నేరుగా అందజేయాలి. ప్రభుత్వం అందజేసే గొర్రెలకు ఇన్సూరెన్స్ రావడం లేదు. దీంతో లబ్ధిదారులకు నష్టం కలుగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – జాయ మల్లేషం, జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు విడతల వారీగా అందజేస్తున్నాం.. ప్రభుత్వం విడుదల చేస్తున్న బడ్జెట్‌కు అనుగుణంగా అర్హులైన యూనిట్లను మంజూరు చేస్తున్నాం. కొంతకాలంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల అందజేయలేకపోయాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు, ఉన్నతాధికారులు సూచనల మేరకు అందజేస్తాం.– భిక్షపతి, జనగామ జిల్లా వెటర్నరీ అధికారి -
వ్యవసాయ ఎగుమతుల పెంపుపై దృష్టి
న్యూఢిల్లీ: వ్యవసాయ ఎగుమతుల పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో రాష్ట్రాలకు రవాణా సబ్బిడీని అందించాలని యోచిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఈ విషయం తెలిపారు. అంతకుముందు వాణిజ్యం, అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం జరిగింది. కర్ణాటక, పంజాబ్, తమిళనాడుసహా పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ ఎగుమతుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించినట్లు ప్రభు తెలిపారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రుణ సంబంధ సమస్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఫైనాన్స్ వ్యవహారాల కార్యదర్శి ఈ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తారని పేర్కొన్నారు. ఎగుమతుల రంగానికి రుణాన్ని ప్రాధాన్యతాపరమైనదిగా పరిగణించాలని డిమాండ్ ఉంది. అంతర్జాతీయ చట్టాలను ఏ విధంగానూ ఉల్లంఘించకుండా, ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు నెరపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భారత్–చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2018–19 ఏప్రిల్–అక్టోబర్ మధ్య భారత్ వ్యవసాయ ఎగుమతుల విలువ 48 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 43.11 బిలియన్ డాలర్లు. -
లేని వాహనానికి వేతనం కట్
సాక్షి, పెద్దపల్లి: ఎవరైనా వాయిదా పద్దతిన వాహనాలు కొనుగోలు చేస్తే.. తీసుకున్న నెల నుంచి చెల్లింపులు మొదలవుతాయి. ఇది సాధారణం. కానీ అసలు వాహనమే లేకుండా నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల విచిత్ర వ్యవహారం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకొంది. ప్రభు త్వం రాయితీపై ఇస్తున్న ద్విచక్రవాహనాలు పొందకుండానే, 3 నెలలుగా ఏఎన్ఎంల జీతం నుంచి వాయిదాలు కట్ అవడం చర్చనీయాంశమైంది. రాయితీపై ద్విచక్రవాహనాలు: పల్లెల్లో వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏఎన్ఎంలకు రాయితీతో కూడిన, సులభ వాయిదా పద్ధతిలో చెల్లించేలా ద్విచక్రవాహన సౌకర్యం కల్పించాలని గతంలో నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న ఏఎన్ఎంలకు రూ.15 వేలు సబ్సిడీ ఇస్తారు. మిగతా మొత్తాన్ని సంబంధిత ఏఎన్ఎంల జీతం నుంచి సులభ వాయిదా పద్దతిలో నెలవారీగా కట్ చేసుకుంటారు. మూడు నెలలుగా జీతంలో కోత పెద్దపల్లి జిల్లాలో ఏఎన్ఎంలను ఎంపిక చేసినా.. ఇప్పటి వరకు ద్విచక్రవాహనాల పంపిణీ మొదలు కాలేదు. ద్విచక్రవాహనాలను ఇవ్వకున్నా ఎంపికైన ఏఎన్ఎంల జీతం నుంచి మాత్రం ఇన్స్టాల్మెంట్ పేరిట కట్ చేస్తున్నారు. గత మే నుంచి జూలై వర కు 3 నెలలు జిల్లాలోని ఏఎన్ఎంల జీతాల నుంచి కోత విధించారు. ఇన్‌స్టాల్‌మెంట్‌ను మినహాయిం చుకొని ఏఎన్ఎంల జీతాలు బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏఎన్ఎంలు, రెండో ఏఎన్ఎంలు 148 మంది ద్విచక్రవాహనాలకు దర ఖాస్తు చేసుకొన్నారు. ఇందులో మొదటి దశలో 86 మందికి ద్విచక్రవాహనాలు మంజూరయ్యాయి. ప్రభుత్వ పరంగా మంజూరైన సబ్సీడీ రూ.10 వేలు కూడా ఆయా షోరూంల్లో చెల్లించారు. బ్యాంక్ ప్రక్రియనూ పూర్తి చేసుకొన్నారు. దీంతో వీళ్లకు వాహనాలు అందకపోయినా, నెలవారీ ఇన్స్టాల్మెంట్ మాత్రం కోతపడుతోంది. నాలుగు రోజుల్లో పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలందించేందుకు ఏఎన్ఎం, రెండో ఏఎన్ ఎంలకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. 3 మాసాల క్రితమే ఆ వాహనాలు షోరూంకు సైతం చేరుకున్నాయి. మరో 4 రోజుల్లో ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేశారు. ఇన్స్టాల్మెంట్ కట్ అవుతున్నది వాస్తవమే, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తా. - ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో, పెద్దపల్లి -
పెట్టుబడి రాయితీపై కోటి ఆశలు
► ఏటా లబ్ధిదారుల ఎంపికలో విపక్ష ► సాంకేతిక కారణాలు కొంత అడ్డంకి ► మంజూరైనా అందని సబ్సిడీ కరువు సీమలో ఏ కాస్త సాయమందినా రైతుకు ఎంతో ఊరట. వరుసగా పంటలను కోల్పోయి పెట్టుబడికి పైసాలేనివారికి ఇది భరోసా. అయితే ఏటా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ప్రకటిస్తున్నా కంటితుడుపుగానే ఉంటోంది. కొండంత నష్టపోతే పిసరంత సహాయం అందుతోంది. అది కూడా సాంకేతిక కారణాలతో కొందరికి రెండేళ్లుగా అందడం లేదు. మరో పక్క అధికార పార్టీ తమ అనుయాయులకే ఇందులో అగ్రాసనమేస్తోందన్న అపప్రథ బలంగా ఉంది. ఈనేపథ్యంలో బుధవారం నుంచి విడుదల కానున్న పెట్టుబడి రాయితీపై మరోసారి అన్నదాత ఆశగా ఎదురుచూస్తున్నాడు. చిత్తూరు (కలెక్టరేట్): వేరుశనగ పంట కోల్పోయిన తమకు ప్రభుత్వమిచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈ సారైనా సక్రమంగా అందుతుందా అని రైతులు సందేహిస్తున్నారు. రెండేళ్లుగా సబ్సిడీ నిధులు అధికార పార్టీకి చెందిన వారికే దక్కాయని ఆవేదన చెందుతున్నారు. తాజాగా రూ. 163 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని బుధవారం నుంచి అందించనున్నట్లు సర్కారు ప్రకటించింది. రైతులు ఏటా ఖరీఫ్‌లో వర్షాధార పంటగా వేరుశనగ సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావంతో ఏ ఏడాదికాయేడాది పంటను నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నష్టపరిహారం కింద రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందిస్తోంది. 2014లో 83 వేల హెక్టార్లలో వేరుశనగ పంట నష్టపోయినట్లు గుర్తించారు. రూ.90 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించారు. 2015లో 80 వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు గుర్తించి రూ. 128 కోట్లు విడుదల చేశారు. మంజూరైందంతా రైతులకు చేరడం లేదు. 2014లో రూ.79 కోట్లు, 2015కు సంబంధించి ఇప్పటి వరకు రూ.110 కోట్లు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమయింది. మిగిలిన నిధులు చేరలేదు. ఆన్లైన్లో సాంకేతిక లోపాల వల్ల రైతులు నష్టపోయారు. దీనికితోడు రెండేళ్లుగా చాలా మంది అర్హులైన లబ్ధిదారులకు ఈ సాయం అందలేదనే విమర్శలున్నాయి. అధికార పార్టీకి అనుకూలమైన వారికి మాత్రమే రెవెన్యూ సిబ్బంది ఇన్పుట్ సబ్సిడీ వర్తించేలా లెక్కలు వేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై పలుమార్లు ప్రజా వాణిలో కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నాలు చేసినా ఫలితం లేకపోయింది. జిల్లాకు రూ. 163 కోట్లు మంజూరు గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లా రైతులు 1.21 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచే తీవ్ర వర్షాభావం నెలకొనడంతో పంట పూర్తిగా చేజారింది. లక్ష హెక్టార్లలో పంటను రైతులు నష్ఠపోయారని వ్యవసాయశాఖ అధికారులు నివేదికల్లో తేల్చారు. ఈమేరకు ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదించారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ దఫా రూ.163 కోట్లు కేటాయించినట్లు సమాచారం. బుధవారం నుంచి ఈనిధులను రైతుల ఖాతాల్లో జమచేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ దఫా అయినా అర్హులైనవారికి ఇన్పుట్ సబ్సిడీ అందించాలని రైతాంగం ఎదురుచూస్తోంది.