‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు గడువు పెంపు | Telangana Inter Advanced Supplementary Fee Extends | Sakshi
Sakshi News home page

‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు గడువు పెంపు

Published Tue, Apr 30 2019 1:47 AM | Last Updated on Tue, Apr 30 2019 1:47 AM

Telangana Inter Advanced Supplementary Fee Extends - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌ బోర్డు పొడిగించింది. వచ్చే నెల 2వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 29తో ఫీజు గడువు ముగుస్తుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న వినతులను పరిశీలించిన బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తల్లిదండ్రులు సకాలంలో ఫీజు చెల్లించాలని, ఆ మొత్తాన్ని సంబంధిత ప్రిన్సిపాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా పేమెంట్‌ చేయాలని స్పష్టం చేసింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement