న్యూఢిల్లీ: ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ స్కీము ఉడాన్‌ను మరో పదేళ్ల పాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే, సీప్లేన్ కార్యకలాపాల కోసం ఆపరేటర్లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కల్పించే యోచన ఉన్నట్లు వివరించారు.
2017లో ప్రారంభమైన ఉడాన్ స్కీము రెండేళ్లలో ముగియనుండగా దాన్ని అవసరమైతే మరింత మెరుగుపర్చి, పొడిగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా విమానాలు, హెలికాప్టర్లు, సీప్లేన్లను డిజైన్ చేసి, తయారు చేసేలా కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించనున్నట్లు మంత్రి చెప్పారు.
సీప్లేన్ కార్యకలాపాలపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అక్టోబర్‌లో విజయవాడ నుంచి సీప్లేన్ల డెమో ఫ్లయిట్ల నిర్వహణ ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment