udan scheme
-
ఉడాన్ స్కీము మరో పదేళ్లు పొడిగింపు!
న్యూఢిల్లీ: ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ స్కీము ఉడాన్‌ను మరో పదేళ్ల పాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే, సీప్లేన్ కార్యకలాపాల కోసం ఆపరేటర్లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కల్పించే యోచన ఉన్నట్లు వివరించారు.2017లో ప్రారంభమైన ఉడాన్ స్కీము రెండేళ్లలో ముగియనుండగా దాన్ని అవసరమైతే మరింత మెరుగుపర్చి, పొడిగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా విమానాలు, హెలికాప్టర్లు, సీప్లేన్లను డిజైన్ చేసి, తయారు చేసేలా కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించనున్నట్లు మంత్రి చెప్పారు.సీప్లేన్ కార్యకలాపాలపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అక్టోబర్‌లో విజయవాడ నుంచి సీప్లేన్ల డెమో ఫ్లయిట్ల నిర్వహణ ఉంటుందని చెప్పారు. -
అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం..
సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ఉడాన్ యోజన(ఉడే దేశ్కా అమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా విమానయాన కంపెనీలకు కొన్ని రాయితీలు ఇస్తోంది. కేంద్రం ఇచ్చే రాయితీ గడువు ముగిసిన తర్వాత కొన్ని సర్వీసులు ఆగిపోయాయనే వాదనలు ఉన్నాయి. కొన్ని అంతకు ముందు నిలిచిపోయినట్లు తెలిసింది. అయితే తాజాగా కేంద్రం రూట్లను తగ్గించి విమానాలు నడుపుతున్నారని పలువురు భావిస్తున్నారు. దాంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా పార్టీల నేతలు వాటిపై ఎలాంటి ప్రశ్నలు అడగడంలేదు. అయితే తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్యసింథియా స్పందించారు. ఇప్పటికే కోటి 30 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారని తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా ప్రభుత్వం కేటాయించిన రూట్లలో మూడేళ్ల కన్సెషన్ గడువు ముగిసింది. దాంతో కేవలం 7 శాతం (54 రూట్లు) మాత్రమే కార్యకలాపాలు సాగుతున్నట్లుగా కాగ్ నివేదిక వెల్లడిస్తోంది. మిగిలిన రూట్లు కన్సెషన్ గడువు వరకు కూడా ఎందుకు మనుగడ సాగించలేకపోయాయి’ అంటూ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ‘ఉడాన్ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. దేశ వ్యాప్తంగా 76 ఎయిర్‌పోర్టులు ఉడాన్ యోజనలో భాగంగా ఉన్నాయి. ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) వల్ల ఇప్పటి వరకు 2 కోట్ల 75 లక్షల విమాన ప్రయాణాలు జరిగాయి. విమానయాన ప్రయాణానికి దూరంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేయబడ్డాయి. ఈ రాష్ట్రాల్లో కొత్తగా 9 ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం జరిగింది. అందులో 6 ఎయిర్‌పోర్ట్‌లు కేవలం ఉడాన్ యోజన కిందే ఏర్పాటయ్యాయి. ఈ పథకం కింద ఆయా రూట్లలో విమానాలు నడిపే సంస్థలకు మూడేళ్లపాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను చెల్లించాలని ప్రతిపాదించాం. దాంతో ఈ పథకం ద్వారా మొదట్లో వేయి రూట్లను లక్ష్యంగా చేసుకున్నాం. ఇందులో 74 రూట్లలో మూడేళ్ళ కాల వ్యవధి తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే మూడేళ్ల తర్వాత గిట్టుబాటు కాని రూట్ల స్థానాల్లో కొత్త రూట్లను గుర్తిస్తున్నాం. ప్రజలు విమాన ప్రయాణానికి అలవాటు పడుతున్న కొద్దీ ఈ రూట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. 1920లో కోటి 44 లక్షలు ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి 42 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం’అని మంత్రి వివరించారు. దేశంలో ఇటీవల నెలకొన్న ప్రత్యేకపరిస్థితుల వల్ల గరిష్ఠంగా ఒకరోజు 4 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. కొవిడ్‌కు ముందు 2019 లెక్కల ప్రకారం దేశీయంగా నడిచే విమానాల్లో వారానికి దాదాపు 90 వేల మంది ప్రయాణించారని సమాచారం. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. ఏపీలో గతంలో మొత్తం 4 రౌండ్ల బిడ్డింగ్ తర్వాత 40 ఉడాన్ రూట్లను గుర్తించారు. ఉడాన్ రూట్లలో భాగంగా కడప, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, ప్రకాశం బ్యారేజి (సీ ప్లేన్) నుంచి విమాన సర్వీసులకు అనుమతులు మంజూరయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పాటు బెలగాం, కొల్హాపూర్, హుబ్లి, జగ్దల్పూర్, కలబురిగి (గుల్బర్గా), కలైకుండ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపేలా ఆమోదం తెలిపారు. -
విమానంలో వేములవాడ, కొండగట్టు వెళ్దామా!
సాక్షి, కరీంనగర్: ఉత్తర తెలంగాణ పర్యాటకం ఇకపై పరుగులు పెట్టనుంది. దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలిపే ఉడాన్ పథకం కింద పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, వరంగల్‌లోని మామూనూరు ఎయిర్‌పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 27న ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా బసంత్‌నగర్, మామూనూరు విమానాశ్రయాలను ఉడాన్ 5.0 తుదిజాబితాలో చేర్చింది. ఈ విమానాశ్రయాల సేవలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, మేడారం జాతరలకు దేశంలోని నలుమూలల నుంచి సందర్శకులు ఇక విమానాల్లోనూ రావచ్చు. ఏంటీ ఉడాన్ పథకం! ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్.. దీన్నే సంక్షిప్తంగా ఉడాన్ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు, చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, ఢిల్లీతో కలిపేందుకు వినియోగంలో లేని ఎయిర్‌పోర్టులను ఈ పథకం కింద అభివృద్ధి చేయాలని కేంద్రం 2016 ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మామూనూరు, బసంత్నగర్ల్లో విమాన సేవలు అందుబాటులోకి వస్తే, ఉత్తర తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుంది. బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టు పునః ప్రారంభమైతే.. దీనికి 40–50 కి.మీ. వ్యాసార్థంలో ఉన్న రామగిరి ఖిల్లా, వేములవాడ, రామగుండం, సింగరేణి గనులు, కొండగట్టు, ధర్మపురి, ఆదిలాబాద్ వన్యప్రాణి ప్రాంతాలు, నిజామాబాద్‌లోని ప్రాజెక్టుల సందర్శన సులభతరం కానుంది. వాస్తవానికి ఈ రెండు విమానాశ్రయాలు రెండు దశాబ్దాల క్రితం వరకు సేవలందించాయి. మామూనూరు విమానాశ్రయం 1930లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ స్థానిక ఖాజీపేట పేపర్ పరిశ్రమ, ఆజాంమిల్స్ ఉత్పత్తులను షోలాపూర్‌తోపాటు, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు, పారిశ్రామిక కనెక్టివిటీ పెంచే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. 1981 వరకు ఈ విమానాశ్రయం సేవలు అందించింది. 1980వ దశకంలో స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తన రాకపోకలకు అనువుగా బసంత్‌నగర్ విమానాశ్రయాన్ని నిర్మించారు. 294 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయంలో ‘వాయుదూత్’ఎయిర్‌లైన్స్ (21 సీట్ల సామర్ధ్యం) చిన్న విమానాలు మాత్రమే ఇక్కడికి రాకపోకలు సాగించేవి. 2009 అక్టోబర్‌లో ఈ ఎయిర్‌పోర్టును రామగుండం ఎయిర్‌పోర్టుతో 500 ఎకరాల విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలని తయారు చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. -
త్వరలో హైదరాబాద్‌కు మరో విమాన సర్వీసు
శంషాబాద్: ఉడాన్ పథకంలో భాగంగా ఫ్లైబిగ్ ఎయిర్‌లైన్స్ సంస్థ హైదరాబాద్‌కు సర్వీసులను ప్రారంభించనుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి మహారాష్ట్ర గొండియా మీదుగా హైదరాబాద్‌కు ఈ నెల 13 నుంచి సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాన నగరాలతో పాటు టైర్–2, టైర్–3 నగరాలను అనుసంధానించడంలో భాగంగా సర్వీసులను విస్తరిస్తున్నట్లు సంస్థ సీఎండీ సంజయ్ మాండవియా తెలిపారు. మే 2వ వారంలో ఈశాన్య రాష్ట్రాల్లో సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. ప్రసుతం దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఎనిమిది గమ్యస్థానాలకు 20 సర్వీసులు కొనసాగుతున్నాయన్నారు. చదవండి: జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా.. మీరే మాకు స్పూర్తి! -
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్‌లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్‌కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్‌పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
‘ఆకాశ’ .. మాస్టర్ మైండ్స్ వీరే
ముంబై: ఇండియాలో విమానయానం సామాన్యులకు ఎప్పుడు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. గతంలో తక్కువ ధరలకే ఎయిర్ డెక్కన్ వచ్చినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోయింది. తాజాగా తక్కువ ధరకే విమాన సర్వీసులు అందిస్తామంటూ ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆకాశ విమానయాన సంస్థ నెలకొల్పారు. ఆకాశ ఆకాశ పేరుతో రాబోయే కొద్ది రోజుల్లోనే ఎయిర్ సర్వీసులు ప్రారంభించేందుకు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రెడీ అయ్యారు. మార్కెట్ నిపుణుడైన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు ఎయిర్‌లైన్స్‌లో ఉన్న అనుభవం ఎంత ? అయన ఈ రంగంలోకి అడుగు పెట్టేందుకు అండగా నిలబడింది ఎవరు? తనకు అందుబాటులో ఉండే ధరలతోనే కామన్ మ్యాన్ ఆకాశయనం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. అయితే ఆకాశ స్థాపన వెనుక మార్కెట్ బిగ్బుల్ రాకేశ్‌తో ఎయిల్లైన్స్లో అపాన అనుభవం ఉన్న మాస్టర్ మైండ్స్ ఉన్నాయి. వీరిద్దరే స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు సంపాదించి మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరుపడిన రాకేశ్ఝున్ఝున్వాలాకి ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీలో పట్టులేదు. కానీ ఆ రంగంలో అపార అనుభవం ఉన్న వినయ్ దుబే, ఆదిత్యాఘోష్లు రాకేశ్‌కు కుడిఎడమలుగా నిలబడ్డారు. వారిద్దరే రెక్కలుగా మారి రాకేశ్ చేత ఆకాశయానం చేయిస్తున్నారు. వినయ్‌దుబే ఆకాశ ఎయిర్వేస్ ఆలోచన పురుడుపోసుకోవడానికి ప్రధాన కారణం జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దుబే. ఎయిర్ ఇండియాకు పోటీగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ సీఈవోగా వినయ్ దుబే పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాతో కలిసి ఆకాశకు బీజం వేశారు. ఆకాశలో వినయ్ దుబేకి 15 శాతం వాటా ఉంది. ఆదిత్యా ఘోష్ చౌక విమాన సర్రీసులు అందించిన గో ఎయిర్‌లో 2008లో ఆదిత్య ఘోష్ చేరారు. అప్పటి నుంచి 2018లో కంపెనీని వీడేవరకు వివిధ హోదాల్లో రకరకాల స్కీమ్‌లు అమలు చేస్తూ గో ఎయిర్ అభివృద్దికి తోడ్పడ్డారు. ఇప్పుడు 160 విమానాలతో దేశంలోనే ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీగా గో ఎయిర్ కొనసాగుతోంది. ఈయన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో 10 శాతం వాటాను కలిగి ఉన్నారు. ర్యాన్ఎయిర్ తరహాలో ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలకే విమానయానం అందిస్తామని ఆకాశ హామీ ఇస్తోంది. ఆగష్టు చివరి నాటికి ప్రభుత్వం నుంచి అనుమతలు వచ్చే అవకాశం ఉంది. యూరప్‌కి చెందిన ‘ర్యాన్ఎయిర్’ తరహాలో ఆకాశ ఎయిర్‌లైన్స్ సర్వీసెస్ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉదాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తోంది, కొత్తగా అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో ఎయిర్‌లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి,. ఈ నేపథ్యంలో 70 ఫ్లైట్లలతో ఆకాశ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. -
గగనయానం దిశగా తెలంగాణ
రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని దాదాపు నాలుగేళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆరు విమానాశ్రయాల నిర్మాణం సాధ్యాసాధ్యాల పరిశీలనలో భాగంగా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సాంకేతిక విభాగం బృందాలు పలు దఫాలుగా ఆయా ప్రాంతాలు సందర్శించి సానుకూల నివేదికను అందించాయి. ఏడాదిగా అంచనా వ్యయం, కావాల్సిన భూముల వివరాలను తేల్చేందుకు చేస్తున్న కరసత్తును కొలిక్కి తెచ్చిన సాంకేతిక విభాగం.. ఈ మేరకు నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారుపై భారమే.. చిన్న పట్టణాల ప్రజలకు విమానయాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఉడాన్ పథకాన్ని తెరపైకి తెచ్చింది. తొలుత కొన్ని పట్టణాలలో నిర్మించే విమానాశ్రయాల ఖర్చులో కొంత భరించేందుకు కూడా సానుకూలత వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత నిర్మాణ వ్యయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే వదిలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి తాజా అంచనా ప్రకారం భారీ వ్యయమే కానుంది. ఇక భూసేకరణకు అంతకంటే ఎక్కువ ఖర్చు కానుంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఎయిర్‌పోర్ట్స్ అథా రిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. టెక్నో ఎకనమిక్ ఫీజబిలిటీ రిపోర్టులో భాగంగా, తాజాగా విమానాశ్రయాలకు కావాల్సిన భూమి, అంచనా వ్యయంతో కూడిన తుది నివేదికను ఖరారు చేసింది. రెండురోజుల క్రితం ఆ వివరాలను తెలం గాణ ప్రభుత్వాని కి అందజేసింది. ఈ ఆరు విమానాశ్రయాల ఏర్పా టు సాధ్యమేనని సంస్థ టెక్నికల్ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించగా, తాజా నివేదిక నేపథ్యంలో.. తుది అనుమతులకు సంబంధిం చిన సర్వే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నివేదిక ఆధారంగా చేయాల్సిన ఖర్చు, సమీకరించాల్సిన భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని పౌర విమానయాన శాఖకు అంగీకారం తెలిపితే, తుది అనుమతులకు సంబంధించిన సర్వే పనులు మొదలవుతాయి. ప్రతిపాదిత విమానాశ్రయాల్లో వేటికి తుది అనుమతులు ఇవ్వాలన్న విషయం ఆ సర్వేతో ఖరారవుతుంది. ఆ వెంటనే పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమవుతుంది. ఎక్కడెక్కడ? నిజాం హయాంలో సేవలందించిన వరంగల్ శివారులోని మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని దాదాపు 15 ఏళ్లుగా ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. ఇప్పుడు ఆ విమానాశ్రయంతో పాటు మరో ఐదు చోట్ల కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. మామునూరుతో పాటు ఆదిలాబాద్‌లో, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఉన్న పాతకాలం నాటి శిథిలమైన ఎయిర్‌స్ట్రిప్స్‌ను పునరుద్ధరించాలని, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రల వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఆరు విమానాశ్రయాల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై కన్సల్టెన్సీ సేవలు అందించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కోరగా అంగీకరించింది. ఈ మేరకు సానుకూల నివేదిక ఇచ్చిన సంస్థ సాంకేతిక విభాగం.. తాజాగా అంచనా వ్యయం, కావాల్సిన భూముల వివరాలతో నివేదికను రాష్ట్రానికి అందించింది. ఫేజ్–1, 2 నివేదికలో ఫేజ్–1, ఫేజ్–2 పేరుతో సంస్థ వివరాలు పొందుపరిచింది. 40–50 సీట్ల సామర్ధ్యం ఉండే చిన్న విమానాల కోసం ఫేజ్–1 ప్రణాళిక రూపొందించింది. ఇవి పూర్తిగా డొమెస్టిక్ (దేశీయ) విమానాశ్రయాలుగా మాత్రమే ఉంటాయి. ఇతర వసతులు కూడా సాధారణంగా ఉంటాయి. వీటి వ్యయం కొంత తక్కువగా ఉంటుంది. భూమి అవసరం కూడా కొంత తక్కువే. ఇక అంతర్జాతీయ విమానాలు, బోయింగ్ విమానాల కోసం అదనపు హంగులతో నిర్మించే విమానాశ్రయాల కోసం ఫేజ్–2 ప్రణాళిక రూపొందించింది. వీటి వ్యయం కాస్త ఎక్కువ. భూమి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఖర్చు తగ్గింపుపై త్వరలో భేటీ ఇంత భారాన్ని భరించటం కష్టమైన విషయమే కావటంతో ఖర్చును ఎంతమేర తగ్గించాలనే విషయంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో చర్చించనుంది. విమానాశ్రయానికి కావాల్సిన వసతులు, భద్రత ప్రమాణాల ప్రకారం అంచనా వ్యయం రూపొందుతుంది. ఇందులో భద్రత ప్రమాణాలకు చేయాల్సిన ఖర్చు విషయంలో రాజీ ఉండదు. వసతుల పరంగా అయ్యే వ్యయంలోనే కొంత కోతపెట్టి ఖర్చును తగ్గించవచ్చు. భవిష్యత్తులో వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఎక్కువ భూమిని సేకరించటం సహజం. దాన్ని ఇప్పుడు భారీగా తగ్గించటం ద్వారా భూసేకరణ వ్యయాన్ని కొంత అదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయమే రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో చర్చించనుంది. ఇక వరంగల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున అక్కడ ఫేజ్–2 ప్రకారం విమానాశ్రయాన్ని నిర్మించి, మిగతా చోట్ల ఫేజ్–1 ప్రమాణాల ప్రకారం తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం ఉంది. అలాగే ఒకేసారి ఆరుచోట్ల కాకుండా తొలుత ఒకటి, రెండు చేపట్టి.. మిగతావి దశలవారీగా చేపట్టే అవకాశం కూడా ఉంది. విమానాశ్రయానికి 150 కి.మీ. లోపు మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదనే ఒప్పందం జీఎంఆర్ ఎయిర్‌పోర్టు–రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉంది. అందువల్ల మమహబూబ్‌నగర్ విమానాశ్రయం విషయంలో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై జీఎంఆర్ సంస్థతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్ సేవలు..!
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని సర్దార్ పటేల్ ఐక్యతా శిల్పం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 14 వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది. వాటర్ ఏరోడ్రోమ్ అంటే ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం. ఇది నీటిపై ఎయిర్‌పోర్టు లాంటిదే. ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సీ ప్లేన్ సేవలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సర్కారు నిర్ణయానికి వచ్చింది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్)–ఉడాన్ పథకంలో కొత్త ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని యోచిస్తోంది. సీ ప్లేన్ సేవలపై హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టాలని ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన శాఖ కోరాయి. అలాగే నదుల్లో కాంక్రీట్ జెట్టీల(వాటర్ ఏరోడ్రోమ్) నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు నౌకాయాన శాఖ వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ సీ ప్లేన్ సేవలకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు నౌకాయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్లో నర్మదా నదిలో, సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో ఏరోడ్రోమ్‌ల నిర్మాణాన్ని ఐడబ్ల్యూఏఐ రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ఐక్యతా శిల్పం నుంచి సబర్మతి రివర్‌ఫ్రంట్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోదీ కేవలం 40 నిమిషాల్లోనే ఈ రెండు ప్రాంతాల మధ్య సీ ప్లేన్‌లో ప్రయాణించారు. -
బెంగళూరు నుంచి బీదర్‌కు ట్రూజెట్ సర్వీసులు
బెంగళూరు: ఉడాన్ నెట్వర్క్ సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్ టర్బో మేఘా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్ కొత్తగా ఈశాన్య కర్ణాటకలోని బీదర్ నుంచి విమాన సేవలు ప్రారంభించింది. బీదర్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య శుక్రవారం నుంచి ప్రతీ రోజు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఇవాళ బెంగళూరు విమానాశ్రయంలో ఈ సర్వీసు ప్రారంభించారు. బెంగళూరులో ట్రూజెట్ సర్వీసు ప్రారంభించిన అనంతరం అదే విమానంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు బీదర్ వరకు ప్రయాణించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెంగళూరు విమానాశ్రయం నుంచి బీదర్‌కు కేవలం గంటా 40 నిమిషాల్లోనే చేరుకున్నామని, సాధారణంగా బెంగళూరు నుంచి బస్సులో బీదర్‌కు చేరుకోవాలంటే 12 గంటల ప్రయాణం అవుతుందన్నారు. ట్రూజెట్ విమాన సర్వీసుల వల్ల ప్రయాణ దూరం భారం తగ్గిందని విమాన సర్వీసుల పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు ఇక ట్రూజెట్ నెట్‌వర్క్‌లో బీదర్ 24వ స్టేషన్ కాబోతోంది. ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్)- ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్ (ఉడాన్), సామాన్య మానవులు కూడా విమానాల్లో ప్రయాణించాలన్న ప్రధానమంతి ప్రయత్నాల్లో భాగంగా ట్రూజెట్ విమానాల్లో 65 శాతానికి పైగా ప్రాంతీయ విమానాశ్రయాలకు అనుసంధానమై ఉన్నాయి. ఆర్సీఎస్ I, II, III కింద తనకు అప్పగించిన మార్గాల్లో పూర్తిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ట్రూజెట్. ఈ సందర్భంగా టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ ‘మా మొదటి ప్రయాణాన్ని జూలై 12, 2015న మొదలపెట్టిన నాటి నుంచి మేము చాలా దూరం ప్రయాణించాం. భారత్‌లోని ప్రథమశ్రేణి నగరాల నుంచి సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలన్న జాతి ఆకాంక్షలను మేము నెరవేర్చుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందించడం ద్వారా ఆ ప్రాంతాల్లో వ్యాపారానికి, పర్యటక అభివృద్ధికి మేము దోహదపడుతున్నాం. విమాన అనుసంధానం అన్నది ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడమే కాకుండా ఉపాధి కల్పనకు సహకరిస్తుంది’ అని అన్నారు. సీఈఓ కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, ప్రాంతీయ విమాన అనుసంధానంలో బలమైన శక్తిగా ట్రూజెట్ నిలుస్తుంది. నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలో మా నెట్‌వర్క్‌ను 24స్టేషన్లకు విస్తరించగలిగాం. దేశంలో ఆర్థికశక్తులుగా ఎదుగుతున్న ప్రాంతాల్లో బలమైన ప్రాంతీయ విమానయాన సంస్థగా ఎదిగేందుకు సుస్థిర అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించామన్నారు. కాగా బెంగళూరు-బీదర్ బెంగళూరు మధ్య కొత్త సర్వీసు ప్రారంభించిన సందర్భంగా ట్రూజెట్ నాలుగు రోజుల పాటు టికెట్ బేస్ ధరను రూ.699 గా అందిస్తోంది. -
పది విమానాలతో ట్రుజెట్ విస్తరణ
హైదరాబాద్: దేశవ్యాప్తంగా విమానయాన సేవలు విస్తరిస్తున్న టర్బో మేఘ ఎయిర్వేస్కు చెందిన విమానయాన సంస్థ ‘ట్రూజెట్’ ఈ ఏడాది చివరి నాటికి తన విమానాల సంఖ్యను చేయనుంది. అయిదు నుంచి ఆ సంఖ్యను 10కి పెంచుకుని మరిన్ని సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన ప్రాంతీయ విమాన సర్వీసు సంస్థ ట్రుజెట్ క్రమంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు అనతికాలంలో విస్తరించింది. 2015 జూలైలో కార్యకలాపాలు ప్రారంభించిన ట్రూజెట్ దేశవ్యాప్తంగా 20 కేంద్రాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. ఓవైపు ప్రాంతీయ విమాన సర్వీసులు ఆర్థిక సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మూతపడుతుంటే ఎంఇఐఎల్ ఏర్పాటు చేసిన ట్రుజెట్ మాత్రం తన సేవలను, వ్యాపారాన్ని క్రమంగా విస్తరిస్తూ పటిష్టపడటమే కాకుండా లాభాల బాటలోకి అడుగుపెట్టింది. ప్రధానంగా ‘ఉడాన్’ పథకం కింద సేవలను నిర్వర్తిస్తూ 2019 డిసెంబరు నాటికి 5 ఏటీఆర్-72 విమానాల నుంచి 10 ఏటీఆర్-72 విమానాలను పెంచుకునే విధంగా ఏర్పాట్లు, ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఎంఇఐఎల్ డైరెక్టర్ ప్రదీప్ తెలిపారు. ట్రుజెట్ ‘ఉడాన్’ రూట్లలో 73 శాతం సామర్ధ్యంతో సమర్ధంగా సేవలను అందిస్తోంది. ఈ పథకం కింద సేవలను అందించే అతిపెద్ద విమానయాన సంస్థగా ట్రుజెట్ పేరు సంపాదించుకుంది. గ్రామీణ, మధ్యతరగతి ప్రజలకు కూడా దేశంలో విమాన సేవలు అందుబాటులోకి తేవాలనే ప్రధానమంత్రి ఉద్దేశంలో భాగంగా ప్రారంభించిన ‘ఉడాన్’ పథకం కింద తొలుత దక్షిణ భారతదేశంలో సేవలు ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా సేవలను విస్తరిస్తోంది. ఈ నాలుగేళ్ల ప్రస్థానంలో... నాలుగేళ్ల క్రితం అంటే 2015 జులై నెలలో టర్బోమేఘా ఏవియేషన్ లిమిటెడ్ తన విమాన సేవల బ్రాండ్ ట్రుజెట్ పేరుతో తన సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్, అహ్మదాబాద్ కేంద్రాలుగా దేశంలో 20కి పైగా పట్టణాలకు వారానికి 300 విమాన సర్వీసులను అందిస్తున్నది. ముంబయ్, చెన్నయ్, బెంగళూరు, గోవా, ఔరంగాబాద్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప, సేలం, విద్యానగర్, మైసూర్, నాందేడ్, పోర్బందర్, నాసిక్, కాండ్లా, జైసల్మీర్, ఇండోర్ నగరాలకు తన విమానాలను నడుపుతున్నది. ప్రస్తుతం ట్రుజెట్ చేతిలో ఎటిఆర్ 72 రకం విమానాలు 5 వున్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో 700కు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఉడాన్ 1, ఉడాన్ 2 పథకంలో పేర్కొన్న అన్ని ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించిన ఏకైక సంస్థ ట్రుజెట్. ఉడాన్ 3 పథకంలో పేర్కొన్న ప్రాంతాలకు కూడా తన సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నది. గత నాలుగేళ్లలో దాదాపు 2 మిలియన్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి పలు అవార్డులను, ప్రశంసలను అందుకుంది. దేశంలో 20 నగరాలకు సేవల విస్తరణ గడచిన ఏడాది కాలంలో అహ్మదాబాద్‌ను ట్రుజెట్ రెండవ కేంద్రంగా చేసుకుని తన సిబ్బందిని 700కు పైగా పెంచుకుంది. త్వరలో మరో బేస్ కేంద్రాన్ని ట్రుజెట్ ఏర్పాటు చేయనుంది. అంతేకాక ప్రస్తుతం వున్న అయిదు విమానాలతో దేశంలోని 20 గమ్యస్థానాలకు సేవలను నిర్వహిస్తోంది. దీర్ఘకాలిక ప్రణాళికతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ట్రుజెట్ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందుకోసం తక్కువ ధరకు టికెట్లు అందించడం, ముందుగానే సీట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం, బోర్డింగ్ పాస్ లో వ్యాపార ప్రకటనలు ముద్రించడం వంటి చర్యలను చేపట్టింది. దేశీయ విమానయాన సేవలు అందిస్తున్న ట్రుజెట్ అంతర్జాతీయ విమానయానం చేసే ప్రయాణికులకు సైతం ఉపయోగపడేలా వారికి కనెక్టివిటీ కల్పించేందుకు గానూ పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుందని ట్రూజెట్ సీఎఫ్ఓ విశ్వనాధ్ చెప్పారు. సామాజిక సేవలో కూడా.. కేరళలో వరదలు సంభవించినప్పుడు బాధితులకు తన వంతు సేవగా పలు ప్రాంతాల నుండి కేరళకు ఆహారం, మందు, మంచినీరు, దుస్తులు తన విమానాలల్లో ఉచితంగా రవాణా చేసిన ఏకైక విమానయాన సంస్థగా నిలిచింది. ‘వింగ్స్ ఆఫ్ హోప్’ కార్యక్రమంలో గ్రామీణ బాలలకు ఉచితంగా విమాన ప్రయాణాన్ని అందించింది. ట్రుజెట్ నాల్గవ వార్షికోత్సవ సందర్భంగా తలసీమియా బాధితులకు సంస్థ సిబ్బంది 100 మంది జులై 5న రక్తదానం నిర్వహించారు. అదే సమయంలో విమాన ప్రయాణం అంటే తెలియని పేద వృద్ధ మహిళలను 45 మందిని నాందేడ్‌కు ఉచితంగా తమ విమానంలో తీసుకువెళ్లి వెనక్కి తీసుకువచ్చారు. అదే విధంగా అనాధ పిల్లలను బళ్లారి, కడప తదితర ప్రాంతాలకు విమానంలో ఉచితంగా తీసుకువెళ్లడంతో పాటు అనేక ఉచిత, చైతన్య అవగాహన కార్యక్రమాలను ట్రుజెట్ నిర్వహించింది. లాభాలతో, విజయవంతంగా : కేవీ ప్రదీప్ ఎంఇఐఎల్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లుగా ట్రుజెట్ ప్రాంతీయ విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ప్రాంతీయ సేవల విభాగంలో తమతోపాటుగా ప్రారంభమైన విమానసేవల కంపెనీల్లో ట్రుజెట్ ఒక్కటే విజయపథంలో సాగుతోందన్నారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ‘ఉడాన్’ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు విమాన సేవలు అందించడం తమకు మంచి అవకాశమని పేర్కొన్నారు. -
ఇక రూ. 2500కే బ్యాంకాక్ వెళ్లొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకం కింద చిన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ గమ్యస్ధానాలకు అనుసంధించాలని యోచిస్తోంది. ఈ పథకం కింద అంతర్జాతీయ గమ్యస్ధానాలకు రూ. 2500 కంటే తక్కువ చార్జీలతోనే చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశ ప్రజల్లో ఎక్కువ మందికి విమానాయానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం ద్వారా చిన్న నగరాలనూ దేశంలోని పలు ప్రధాన నగరాలకు కనెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ రూట్లనూ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉడాన్ మూడవ దశలో ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పథకం కింద అసోంలోని విమానాశ్రయాలు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, నేపాల్‌లోని ఖట్మాండులతో కనెక్ట్ కానున్నాయి. ఇదే తరహాలో బిహార్ ఎయిర్‌పోర్ట్‌లను నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లోని ఎయిర్‌పోర్ట్‌లకు నేరుగా అనుసంధానించనున్నారు. అసోం ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సమ్మతించగా, స్పైస్‌జెట్ సహా పలు విమానయాన సంస్థలు బ్యాంకాక్ వంటి ప్రముఖ గమ్యస్ధానాలకు విమాన సర్వీసులను చేపట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. ప్రభుత్వం తన ప్రణాళికలతో ముందుకు వెళితే త్వరలోనే రూ. 2500తో అంతర్జాతీయ విమాన టికెట్లను ఆఫర్ చేస్తూ పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన చేస్తుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉడాన్ మూడవ దశకు ఇటీవల ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించగా 111 రూట్ల కోసం 15 ఎయిర్లైన్ల నుంచి బిడ్లను పొందింది. -
మూడో విడత ఉడాన్ రూట్ల వేలం
ముంబై: చిన్న పట్టణాలకు చౌక విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఉడాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడతలో రూట్ల వేలానికి బిడ్లను ఆహ్వానించింది. ప్రాథమిక బిడ్లను డిసెంబర్ 10లోగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు సమర్పించాల్సి ఉంటుంది. రూట్లను దక్కించుకున్న ఎయిర్‌లైన్స్ పేర్లను జనవరి 7 లోగా ప్రకటించడం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలని భావిస్తున్న బిడ్డర్ల కోసం నవంబర్ 6న ప్రి–బిడ్ సమావేశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్సీఎస్ పోర్టల్‌లో ఉంచారు. ప్రధానంగా పర్యాటక ఆకర్షణ ఉండే ప్రాంతాలపై ఈ విడతలో దృష్టి సారిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పధీ తెలిపారు. 2016 మార్చిలో ప్రకటించిన ఉడాన్ స్కీమును ఏఏఐ అమలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో రూట్లను వేలం వేసినా, ఇప్పటికీ ఆశించినంత స్థాయిలో కనీసం సగం రూట్లలో కూడా సర్వీసులు అందుబాటులోకి రాలేదని విమర్శలు ఉన్నాయి. ఈ స్కీము కింద గంట ప్రయాణ దూరాలకు గరిష్టంగా రూ. 2,500 చార్జీ ఉంటుంది. -
రూ.1,177కే విమాన టిక్కెట్
న్యూఢిల్లీ : ఉడాన్ స్కీమ్ కింద జెట్ ఎయిర్వేస్ కంపెనీ విమాన టిక్కెట్లను చౌక ధరలో అందిస్తోంది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో విమాన టిక్కెట్లను రూ.1,177కే అందించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్, విమానాలను ఇతర పెద్ద గమ్యస్థానాలతో పాటు ప్రాంతీయ ప్రాంతాలకు కనెక్ట్ చేస్తోంది. తాజాగా లాంచ్ చేసిన మార్గాలను జెట్ ఎయిర్వేస్ ప్రభుత్వ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ లేదా ఆర్సీఎస్ కింద ప్రారంభించింది. సాధారణ వ్యక్తులకు కూడా విమాన ప్రయాణాన్ని చౌక ధరకు అందించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉడాన్-ఆర్సీఎస్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఆర్సీఎస్ రూట్లలో తన నెట్‌వర్క్‌పై పలు ఇతర మార్గాలతో అలహాబాద్‌ను కనెక్ట్ చేస్తోందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. కొత్త విమానాలను అలహాబాద్ నుంచి ముంబైకు టూ-వే కనెక్షన్లలో వయా నాగ్‌పూర్, ఇండోర్, లక్నో మార్గాల ద్వారా ఆఫర్ చేయనున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా టూ-వే కనెక్షన్లలోనే వయా ఇండోర్, పాట్నా ద్వారా అలహాబాద్ నుంచి బెంగళూరుకు విమానాలను ఆఫర్ చేస్తోంది. వయా ఇండోర్ మార్గాన అలహాబాద్ నుంచి పుణేను కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా సందర్శకులకు కల్పిస్తోంది. అదేవిధంగా వయా లక్నో రూట్లో అలహాబాద్ నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణే, జైపూర్, అబుదాబిలకు విమానాలను జెట్ ఎయిర్వేస్ కనెక్ట్ చేస్తోంది. -
ఇక ఉడాన్ ఇంటర్నేషనల్
సాక్షి, హైదరాబాద్: చౌక ధరకే విమాన సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ఉడాన్ పథకం దేశీయంగా విజయవంతం కావడంతో దీన్ని అంతర్జాతీయ సేవలకు కూడా విస్తరించ నున్నామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న ముడి చమురు ధర పరిశ్రమను దెబ్బతీసిందన్నారు. దీంతో గత మూడేళ్ల కాలంలో భారత్‌లో విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 20 శాతం చొప్పున పెరుగుతున్నాఈ ఏడాది వృద్ధి 17.5 శాతానికి పరిమితం కానుందన్నారు. ముడి చమురు బ్యారెల్ ఇంధన ధర 80 డాలర్ల కంటే తక్కువగా ఉంటే వచ్చే 20 ఏళ్లలో యేటా విమానయాన రంగం 15 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘వింగ్స్ ఇండియా 2018' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్లోబల్ గా మూడవ అతిపెద్ద ఏవియేషన్ హబ్ గా ఇండియా ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న ఇంధన ఛార్జీల వల్ల విమానయాన కంపెనీలు భారంగా ఉన్నప్పటికీ..టికెట్ల ధరలు తగ్గిస్తేనే సమాన్యుని విమాన ప్రయాణ కల నెరవేరుతుందన్నారు. ప్రాంతీయంగా విమాన సేవలు అందించే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీంలో గత రెండేళ్లలో 56 నూతన విమానాశ్రయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇండియాలో 395 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా. ప్రస్తుతం వీటి సంఖ్య 900 ఎయిర్ క్రాఫ్ట్స్ చేరుకుందని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక అరవయేళ్ళలో 75 ఎయిర్ పోర్టులు డెవలప్ చేశాం..ప్రతీ ప్రధాన పట్టణానికి ఎయిర్ కనెక్టివిటీ ఉంది..ఉడాన్ పథకం ద్వారా 51 ఎయిర్ పోర్టులను డెవలప్ చేస్తున్నాం..అందులో ఇప్పటికే 18 ఎయిర్ పోర్టులు తమ ఆపరేషన్స్ ప్రారంభించాయని ఆయన తెలిపారు. ఈ పథకం అమలు చేయడం వల్ల వచ్చే 6-8 నెలల్లో మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చే వీలు ఉందున్నారు. వచ్చే నాలుగేళ్లలో వంద పట్టణాలను కనెక్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.వచ్చే నాలుగేళ్లలో వ్యాపారాన్ని భారీగా విస్తరించేందుకు, విమానాశ్రయాలను ఆధునీకీకరణకు రూ.18వేల కోట్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు చౌబే ప్రకటించారు. అలాగే ఎయిర్పోర్ట్ అఫ్ ఇండియాయాక్ట్ (ఏఏఐ)లో మార్పులు తెస్తామని చౌబే ప్రకటించారు. ఏఏఐ సవరణ బిల్లుపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోగానీ, ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం త్వరలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉడాన్ ఇంటర్నేషనల్ పథకంలో అంతర్జాతీయ రూట్లలో సేవలు అందించడానికి తాము మార్గనిర్దేశనం, బిడ్డింగ్ వ్యవహారాలు మాత్రమే చేయనున్నామని, అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చు కోవాలన్నారు. ఇప్పటికే దీనిపై అసోం ప్రభుత్వం ఆసక్తిని చూపినట్టు తెలిపారు. దాదాపు మూడేళ్లపాటు 100కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందుకువచ్చినట్టు చౌబే వివరించారు. మిగతా రాష్ట్రాలు ఇంకా స్పందించాల్సి ఉందన్నారు. -
గాల్లో దూసుకెళ్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: ‘స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్లలో దేశంలోని 75 ఎయిర్ పోర్టులు డెవలప్ చేశాం. ప్రతీ ప్రధాన పట్టణానికి ఎయిర్ కనెక్టివిటీ ఉంద’ ని సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ నారాయణ్ చౌబే అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ప్రారంభమైన ఏవియేషన్ షో లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రతి ఏడాది 26 శాతం వృద్ధితో దూసుకెళ్తోందని తెలిపారు. సివిల్ ఏవియేషన్‌లో ఈ ఏడాది 17.5 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం మన దేశంలో 395 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉండేవి.. ప్రస్తుతం వాటి సంఖ్య 900కి చేరిందన్నారు. ఉడాన్ పథకంలో భాగంగా 51 ఎయిర్ పోర్టులను డెవలప్ చేస్తున్నామని అన్నారు.వీటిలో18 ఎయిర్ పోర్టులు ఇప్పటికే తమ ఆపరేషన్స్ ప్రారంభించాయని వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలోమరో వంద పట్టణాలకు ఎయిర్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇంధన ధరలు స్థిరంగా ఉంటే వచ్చే 20 ఏళ్లలో 15 శాతం వృద్ధితో ఏవియేషన్ ఇండస్ట్రీ పరుగులు పెడుతుందని ఆకాక్షించారు. కేంద్రం ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లో మార్పులు తెచ్చే అవకాశం ఉందన్నారు. టికెట్ ధరలు తగ్గిస్తేనే సామాన్యుడు విమాన ప్రయాణం చేయగలడని స్పష్టం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల విమానయాన కంపెనీలు భారాన్ని మోస్తున్నాయని.. జీఎస్టీ లోకి విమానయాన సర్వీసులను తీసుకురావడం వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ వృద్ధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా భారత ఏవియేషన్ రంగం ప్రపంచ వ్యాప్తంగా మూడవ స్థానంలో ఉండటం గమనార్హం. -
వచ్చే నెల నుంచి ’ఉడాన్’ విమాన సేవలు: స్పైస్‌జెట్
ముంబై: ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ స్కీము కింద వచ్చే నెలలో విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వెల్ల డించింది. ముందుగా ముంబై నుంచి పోర్బందర్, కాండ్లాకు రోజు రెండు డైరెక్ట్ ఫ్లయిట్స్ నడపనున్నట్లు వివరించింది. జులై 10 నుంచి 78 సీటింగ్ సామర్థ్యం గల బొంబార్డియర్ క్యూ400 విమానాలను ఈ రెండు కొత్త రూట్లలో సర్వీసులకు ఉపయోగించనున్నట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. ముంబై–పోర్బందర్ రూట్లో ఆర్సీఎస్ సీట్ల టికెట్ ధర రూ. 2,250 (అన్ని చార్జీలు కలిపి) గాను, ముంబై–కాండ్లా రూట్లో రూ. 2,500గాను ఉంటుంది. చిన్న పట్టణాలకూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆర్సీఎస్ కింద టర్బో మేఘా తదితర అయిదు ఎయిర్‌లైన్స్‌కి కేంద్రం ఈ ఏడాది మార్చిలో 128 ప్రాంతీయ రూట్లను కేటాయించింది. -
విమాన ప్రయాణికులకు శుభవార్త
-
విమాన ప్రయాణికులకు శుభవార్త
స్వదేశీ విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఉడాన్ పథకం ప్రారంభమైంది. గంటలోపు ప్రయాణాలలో విమానంలోని సగం సీట్లకు రూ. 2,500 మాత్రమే వసూలు చేయాలన్న నిబంధన అమలులోకి వచ్చింది. వినియోగదారుల ధరల సూచికి అనుగుణంగా విమాన టికెట్ల ధరలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. ప్రధాన రూట్లలో ప్రతి డిపార్చర్ మీద చిన్నమొత్తంలో లెవీ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం విమానయాన సంస్థలు అంత తేలిగ్గా జీర్ణించుకునే పరిస్థితి లేదు. దానివల్ల విమానచార్జీలు పెంచాల్సి ఉంటుందని అంటున్నాయి. అయితే లెవీ ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదు. రాబోయే రోజుల్లో దీన్ని నిర్ణయిస్తారు. ప్రపంచంలోనే ఇలాంటి పథకం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ - దేశంలో సామాన్యులు కూడా విమానం ఎక్కాలి౦ అనే పథకాన్ని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. విమానంలో కనీసం సగం సీట్లకు బిడ్డింగ్ వేయడంతో పాటు మిగిలిన వాటి ధరలు మార్కెట్ ఆధారంగా ఉండాలన్నది ఈ పథకం ఉద్దేశం. త్వరలోనే హెలికాప్టర్ సేవలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఈ పథకంలోని మొదటి విమానం జనవరిలో టేకాఫ్ తీసుకుంటుందని అంటున్నారు. ఈ పథకం గురించి చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తున్నట్లు పౌర విమానయాన వాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. ఇప్పటివరకు విమానాలు అసలు నడపని లేదా తక్కువగా నడుపుతున్న నగరాలకు కూడా విమానాలు పంపాలన్నది తమ ఉద్దేశమన్నారు. 476-500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే విమానాల్లో సగం సీట్ల గరిష్ఠ ధరను రూ. 2,500గా ఉంచుతామని చెప్పారు. హెలికాప్టర్లలో అరగంట ప్రయాణానికి రూ. 2,500, గంట ప్రయాణానికి రూ. 5వేల చొప్పున గరిష్ఠ ధరలుంటాయి.